సీడీఎస్ పరీక్ష వివరాలను తెలపండి?
ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన వివరాలను తెలపండి?
- సంధ్య, వరంగల్.
ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించడానికి రెండు మార్గా లు.. ఒకటి ఆర్మ్డ్ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ చేయడం, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఆధారంగా ఆర్మీలో డాక్టర్‌గా చేరడం. ఆర్మీలో డాక్టర్‌గా సేవలు అందించడానికి వేదికగా నిలుస్తోంది ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్(ఏఎఫ్ఎంసీ)-పుణే. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంబీబీఎస్ చేయడం ద్వారా ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఎంబీబీఎస్‌లో ప్రవేశం కోసం ఏఎఫ్ఎంసీ జాతీయ స్థాయి లో ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తుంది.
ఏఎఫ్ఎంసీలో ప్రవేశానికి ప్రతి ఏటా ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఏటా 130 మంది విద్యార్థులను చేర్చుకుంటారు. ఎంట్రెన్స్ టెస్ట్ 200 ప్రశ్నలకు, 200 మార్కులకు ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ఇందుకోసం 2 గంటల సమయం కేటాయిస్తారు. బయాలజీ (బోటనీ, జువాలజీలను కలిపి), ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 50 ప్రశ్నల చొప్పున వస్తాయి. ఇంటెలిజెన్స్, లాజికల్ రీజనింగ్‌లపై 25 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్‌లపై 25 ప్రశ్నలుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో ఉత్తీర్ణులకు తర్వాతి దశల్లో ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఉంటుంది. వీటి ఆధారంగా సీటు ఖరారు చేస్తారు.
సంబంధిత నోటిఫికేషన్ జనవరి/ఫిబ్రవరిలలో వెలువడుతుంది. పరీక్ష మే నెలలో ఉంటుంది.
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్(ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో) ఉత్తీర్ణత. భారతీయులై ఉండాలి. అవివాహితులు మాత్రమే అర్హులు. మెడికల్‌గా ఫిట్‌గా ఉండాలి.
కనీస వయసు: 17 సంవత్సరాలు, గరిష్ట వయసు: 22 సంవత్సరాలు మించకూడదు.
ఏఎఫ్ఎంసీ కాకుండా.. ఆర్మీ నేరుగా విడుదల చేసే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ కాప్స్‌ను రిక్రూట్ చేసుకుంటుంది. ఈ విధంగా కూడా ఆర్మీలో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. సంబంధిత నోటిఫికేషన్ల కోసం ఎంప్లాయ్మెంట్ న్యూస్ లేదా ఆర్మీ వెబ్సైట్ చూడొచ్చు.
వివరాలకు: htpp://afmc.nic.in,
htpp://indianarmy.nic.in
సీడీఎస్ పరీక్ష వివరాలను తెలపండి?
-సుశాంత్, హైదరాబాద్.
ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్.. త్రివిధ దశాల్లో కెరీర్ ప్రారంభంలోనే కమిషన్డ్ ర్యాంక్ ఆఫీసర్‌గా అడుగుపెట్టేందుకు అవకాశం కల్పిస్తుంది.. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ). యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే ఈ పరీక్ష ద్వారా మిలటరీ, ఎయిర్‌ఫోర్స్, నేవల్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీల్లో ప్రవేశం లభిస్తుంది. అర్హత: ఇండియన్ మిలటరీ అకాడెమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడెమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ. నావల్ అకాడెమీకి ఇంజనీరింగ్ డిగ్రీ. ఎయిర్‌ఫోర్స్ అకాడెమీకి ఏదైనా డిగ్రీ (ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్,ఫిజిక్స్ చదివి ఉండాలి). సీడీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. ఆ తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ, పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా ఎంపికైన వారికి ముందుగా త్రివిధ దళాలకు చెందిన ట్రైనింగ్ అకాడెమీల్లో శిక్షణనిస్తారు. ఆర్మీ కోసం ఇండియన్ మిలిటరీ అకాడెమీ (డెహ్రాడూన్), నేవీ కోసం ఇండియన్ నేవల్ అకాడెమీ (కేరళ), ఎయిర్ ఫోర్స్ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీకి చెందిన వివిధ ప్రాంతాల్లో., పురుషులు, మహిళల షార్ట్ సర్వీస్ కమిషన్ కోసం ఆఫీ సర్స్ ట్రైనింగ్ అకాడెమీ (చెన్నై)లలో శిక్షణనిస్తారు. శిక్షణ పూర్తయ్యాక ఆయా దళాల్లో కమిషన్డ్ ర్యాంక్ అధికారి హోదాలో నియామకం ఖరారు చేస్తారు.
సీడీఎస్ రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. మిలటరీ, నేవల్, ఎయిర్ ఫోర్స్ అకాడెమీ ఔత్సాహికులకు ఒక విధంగా.. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (ఓటీఏ) ఔత్సాహికులకు మరో విధంగా ఉంటుంది. మిలటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ రాత పరీక్షలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అంశాల నుంచి..ఓటీఏ పరీక్షలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షల్లో ఆయా సబ్జెక్టు ల్లో పదో తరగతి స్థాయిలోనే ప్రశ్నలడుగుతారు. సీడీఎస్ఈ నోటిఫికేషన్ ప్రతి ఏడాది సాధారణంగా రెండు సార్లు ఆగస్ట్, మార్చి నెలలో వెలువడుతుంది. ఆగస్ట్ నోటిఫికేషన్‌కు ఫిబ్రవరిలో, మార్చి నోటిఫికేషన్‌కు ఆగస్ట్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు.
వివరాలకు: www.upsc.gov.in
ఎంబీఏ (మీడియా మేనేజ్మెంట్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -పూజిత, జడ్చర్ల.
మీడియూ రంగంలో రిపోర్టింగ్, ఎడిటింగ్ వంటి ఫ్రంట్-ఎండ్ ఆపరేషన్స్‌తోపాటు సర్క్యులేషన్, షెడ్యూలింగ్, యూడ్ సేల్స్, బ్రాండ్ మేనేజ్మెంట్, మీడియా ప్లానింగ్ వంటి వాటికి సంబంధించిన ప్రొఫెషనల్స్ కోసం అన్వేషణ సాగుతోంది. అలాంటి ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దే కోర్సే ‘మీడియూ మేనేజ్మెంట్’. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి సాధారణంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, రేడియో, ఇంటర్నెట్, వెబ్సైట్లను నిర్వహించే సంస్థలు, పబ్లికేషన్స్ సంస్థలు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలలో ఉపాధి అవకాశాలుంటాయి. సాధారణంగా వీరి ప్రారంభ వేతనం నెలకు రూ.15,000-30,000 మధ్య ఉంటుంది.
ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు:
} పద్మావతి వుహిళా విశ్వవిద్యాలయుం- తిరుపతి.
వెబ్సైట్: www.spmvv.ac.in/
ఏషియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్- నోయిడా. వెబ్సైట్: ఠీఠీఠీ.్చ్చజ్ట.ఛిౌఝ
దేవి అహల్య విశ్వవిద్యాలయ - ఇండోర్
వెబ్సైట్: www.emcdavv.edu.in
ఇన్స్టిట్యూట్ ఫర్ మీడియా మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్ స్టడీస్ - న్యూఢిల్లీ
వెబ్సైట్: www.imcsindia.com
మణిపాల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ - బెంగళూరు.
వెబ్సైట్: www.manipal.edu
అమిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్-నోయిడా
వెబ్సైట్: www.am-ity.edu
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ వర్సిటీ- న్యూఢిల్లీ.
వెబ్సైట్: www.ignou.ac.in