Artificial heart
-
అద్భుతం: ఆర్టిఫిషల్ గుండెతో చిన్నారికి ప్రాణదానం
రోమ్: ఓ పసివాడు గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. అంత చిన్న గుండెకు సర్జరీ చేయడానికి డాక్టర్లకు కూడా చేతులు రావడం లేదు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాల మీదకు వస్తుంది. అయినా సరే చరిత్రలో ఎన్నో అద్భుత విజయాల్ని సువార్ణక్షరాలతో లిఖించిన డాక్టర్లు ఆ చిన్ని గుండెకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. ఇటలీకి చెందిన 16 నెలల బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతని తల్లిదండ్రులు చిన్నారిని రోమ్ నగరానికి చెందిన బాంబినో గెసు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన కార్డియాలజిస్ట్ ఆంటోనియో అమెడియో ఆ చిన్నారి గుండెకు సంబంధించిన కండరాల సమస్యతో బాధపడుతున్నాడని తెలిపారు. గుండె మార్పిడి చేయాలి. లేదంటే చిన్నారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అన్నారు. అలా జరగాలంటే ముందుగా హార్ట్ డోనర్ కావాలి. కానీ సర్జన్ ఆంటోనియో హార్ట్ డోనర్ లేకుండా చిన్నారి ప్రాణాల్ని కాపాడారు. ఎలాగంటారా? 11 గ్రాముల ఆర్టిఫిషియల్ గుండెతో చిన్నారి ప్రాణాలు నిలిపారు. అమెరికాకు చెందిన డాక్టర్ రాబర్ట్ జార్విక్ టైటానియం పంప్‌తో 11 గ్రాములు బరువు ఉండే కృత్తిమ గుండెను తయారు చేశారు. ఈ గుండె నిమిషానికి 1.5 లీటర్ల రక్తాన్ని పంపిణీ చేస్తుంది. అయితే రాబర్ట్ జార్విక్ టైటానియం పంప్‌తో తయారు చేసిన కృత్తిమ గుండెను అప్పటికే జంతువులపై పరీక్షించి విజయం సాధించారు. అయితే ఇటలీలో ఉన్న డాక్టర్ ఆంటోనియా అమెడియో.. అమెరికాకు చెందిన రాబర్ట్ జార్విక్ తయారు చేసిన కృత్తిమ గుండెను 16 నెలల బాబుకు అమర్చాలని అనుకున్నారు. అందుకోసం ముందుగా ఇటలీ ఆరోగ్య శాఖ నుంచి, అమెరికన్ డాక్టర్ ఆంటోనియా అమెడియో నుంచి పర్మీషన్ తీసుకోవాలి. అలా అన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి మే 24, 2012లో 16 నెలల బాబుకు కృత్తిమ గుండెను అమర్చారు. 13 రోజుల తరువాత డోనర్ సాయం వల్ల ఆ ఆర్టిఫిషియల్ గుండెను తొలగించి సాధారణ గుండెను అమర్చి 16 నెలల బాబు ప్రాణాలు కాపాడగలిగారు. డాక్టర్లు చేసిన కృషిని ప్రజలు ప్రశంసిస్తున్నారు. -
గుండెను బ్యాగులో పెట్టుకొని తిరుగుతోంది!
లండన్: సాధారణంగా మీరేప్పుడైనా బయటకు వెళ్తే.. బ్యాగులో ఏం పెట్టుకుంటారు? మహా అయితే.. ఏ చిన్నవస్తువులో లేదా ల్యాప్‌టాప్‌లో ఉంటాయి. అయితే, యూకేకు చెందిన ఈ మహిళ మాత్రం బయటకు వెళ్లినా.. ఇంట్లో ఉన్నా ఆమెతో ఒక బ్యాగు, దానిలో ఆమె గుండె ఉంటుంది. ఏంటీ నమ్మట్లేదా.. అయితే చదివేయండి. ఆ మహిళ పేరు సెల్వా హుస్సెన్. ఆమె 2017లో కారు నడుపుతూ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు గుండె ఫెయిలయ్యిందని, వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ కావాలని సూచించారు. అప్పుడు సెల్వాను హుటాహుటీనా హేర్ఫీల్డ్ గుండె ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు నాలుగు రోజులపాటు చికిత్స అందించారు. అప్పటికి ఆమె శ్వాసతీసుకోలేక పోయింది. ఇక చేసేదేమిలేక , కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆమెకు కృత్రిమ గుండెను అమర్చారు. ఇది పనిచేయడానికి ప్రత్యేక కంట్రోల్ యూనిట్‌ను ఆమె వెనుక ఏర్పాటు చేశారు. అంతే కాకుండా, మరో యూనిట్‌ను ఆమె వెనుక బ్యాగ్‌లో కూడా అమర్చారు. ఇవి రెండు కూడా ఆమె గుండె సమర్థవంతంగా పనిచేయాడానికి ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా, మొదటి యూనిట్ పనిచేయకపోతే.. రెండో యూనిట్ దాని స్థానంలో పనిచేస్తుంది. ఆమె బయటకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఒకరి తోడుండాల్సిందే. ఈ కృత్రిమ గుండె ఆమె శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతోంది. ఆమె కడుపు నుంచి ప్రత్యేక పైపులు.. బ్యాక్‌ప్యాక్‌లోని మొదటి యూనిట్‌కు, రెండో యూనిట్‌కు కలుపబడి ఉన్నాయి. దీనితో శరీరంలోనికి రక్తం పంపింగ్ చేయబడుతుంది. చాలా కొద్ది మందికి మాత్రమే ఇలాంటి వ్యాధి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. దీన్ని వైద్యపరిభాషలో కార్డియోమయోపతి అంటారని తెలిపారు. కాగా, ఈ కృత్రిమ గుండె ఖరీదు 86 వేల పౌండ్లు (భారత కరెన్సీలో రూ.88.72 లక్షలు). దీన్ని ఓ అమెరికాకు చెందిన సంస్థ తయారు చేసింది. ఈ గుండెను అమర్చేందుకు హేర్ఫీల్డ్ ఆసుపత్రి వైద్యులు దాదాపు 6 గంటలపాటు శ్రమించారు. -
వచ్చేస్తోంది 3 డి గుండె!
త్రీడీ ప్రింటింగ్... గోడ గడియారం మొదలుకొని జెట్ ఇంజిన్ విడిభాగాల వరకూ దేన్నైనా కళ్లముందు ఇట్టే తయారు చేసివ్వగల ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఇంకో ఘనతను సాధించింది. కార్నెగీ మెలన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని త్వరలోనే మనిషి గుండె కూడా ఈ పద్ధతిలో తయారు కానుంది! గుండెతోపాటు అనేక ఇతర అవయవాలకు ఆధారమైన కొలేజన్ను త్రీడీ టెక్నాలజీ ద్వారా ముద్రించేందుకు కార్నెగీ మెలన్ వర్సిటీ శాస్త్రవే త్తలు సరికొత్త పద్ధతిని ఆవిష్కరించారు. ఫలితంగా గుండెలోని భాగాలతోపాటు పూర్తిస్థాయిలో పనిచేసే గుండెను కూడా ముద్రించేందుకు వీలు ఏర్పడింది. ‘ఫ్రెష్’తో సాధ్యమైందిలా... ఇల్లు కట్టేందుకు ఇటుకలు ఎంత అవసరమో.. కాంక్రీట్ స్తంభాలు కూడా అంతే అవసరం అన్నది మనకు తెలుసు. ఇటుకలు మన శరీర కణాలైతే.. ఆ కణాలన్నింటినీ ఒక ఆకారంలో పట్టి ఉంచేందుకు ఉపయోగపడే ఒక ప్రొటీన్... కొలేజన్. ఇది జీవ రసాయన సమాచార ప్రసారానికి, తద్వారా కణాలు పనిచేసేందుకూ ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ ప్రొటీన్ల మధ్య ఆయా కణాలు వృద్ధి చెందడం ద్వారా అవయవాలు తయారవుతాయన్నమాట. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రొటీన్ నిర్మాణానికి ఇప్పటివరకూ జరిగినవి విఫల ప్రయత్నాలే. ఫ్రీఫామ్ రివర్సిబుల్ ఎంబెడ్డింగ్ ఆఫ్ సస్పెండెడ్ హైడ్రోజెల్స్ (ఫ్రెష్) అనే సరికొత్త పద్ధతిని ఉపయోగించడం ద్వారా శాస్త్రవేత్తలు తాజాగా ఈ పరిమితులన్నింటినీ అధిగమించగలిగారు. లక్షల గుండెలు అవసరం.. ప్రపంచవ్యాప్తంగా గుండె మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వారు కొన్ని లక్షల మంది ఉన్నట్లు అంచనా. అవయవ దాతల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కృత్రిమ గుండె తయారీ అవసరం పెరిగిపోతోంది. ఫ్రెష్ పద్ధతి ద్వారా కణాలు, కొలేజన్ సాయంతో గుండె కవాటాలు, అచ్చం గుండె మాదిరిగానే కొట్టుకునే జఠరికలను కూడా తయారు చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఆడమ్ ఫైన్‌బర్గ్ తెలిపారు. ఎమ్మారై స్కాన్ల ద్వారా రోగుల గుండె నిర్మాణ వివరాలు సేకరించి అచ్చంగా అలాగే ఉండే కృత్రిమ గుండెలను తయారు చేయవచ్చునని చెప్పారు. కొలేజన్ ద్రవ రూపంలో ఉండటం వల్ల దాన్ని త్రీడీ ప్రింటింగ్‌లో ఉపయోగించుకోవడం ఒక సవాలుగా మారిందని... ఉపయోగించిన వెంటనే ఆకారం మారిపోవడం దీనికి కారణమని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న మరో శాస్త్రవేత్త ఆండ్రూ హడ్సన్ చెప్పారు. ఫ్రెష్ పద్ధతిలో కొలేజన్ను హైడ్రోజెల్ పదార్థంలో పొరలు పొరలుగా అమరుస్తామని ఫలితంగా కొంత సమయం తరువాత గట్టిపడి తన ఆకారాన్ని నిలుపుకునేందుకు అవకాశం ఏర్పడిందని ఆయన వివరించారు. నిర్మాణం పూర్తయిన తరువాత హైడ్రోజెల్‌ను సులువుగా తొలగించవచ్చునని చెప్పారు. మానవ అవయవాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు ఈ కొలేజన్ నిర్మాణాలు ఎంతో కీలకమని అన్నారు. కొలేజన్తోపాటు ఫిబ్రిన్, అల్గినైట్, హైలోరోనిక్ యాసిడ్ వంటి ఇతర పదార్థాలను ఫ్రెష్ పద్ధతిలో ఉపయోగించవచ్చు. అన్నింటి కంటే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ పద్ధతికి సంబంధించిన వివరాలన్నీ అందరికీ అందుబాటులో ఉండటం. తద్వారా విద్యార్థులు మొదలుకొని శాస్త్రవేత్తల వరకూ ఎవరైనా ఈ రంగంలో ప్రయోగాలు చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అయితే పూర్తిస్థాయి కృత్రిమ అవయవాలు అందుబాటులోకి వచ్చేందుకు మరిన్ని పరిశోధనల అవసరముందని, ఇందుకు కొంత సమయం పట్టవచ్చునని ఫైన్‌బర్గ్ చెప్పారు. -
కృత్రిమ గుండె రెడీ!
హమ్మయ్యా... ఎట్టకేలకు మనిషికి గుండె అందుబాటులోకి రానుంది.. వ్యాధి లేదా పోటు వంటి కారణాలతో గుండె బాగా బలహీనపడితే ఇప్పటివరకూ కృత్రిమ గుండెను వాడేవారు గానీ.. అదంతా తాత్కాలికమే. అవయవ దానం ద్వారా ఇంకో గుండె దొరికేంత వరకూ రోగిని బతికేలా చేస్తుంది ఈ గుండె. అయితే ఒరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకనుంది. డాక్టర్ రిచర్డ్ వాంప్లర్ అనే శాస్త్రవేత్త 2014 నుంచి ఈ కృత్రిమ గుండెను అభివృద్ధి చేస్తున్నారు. మిగిలిన కృత్రిమ గుండెల మాదిరిగా ఇందులో బోలెడన్ని భాగాలు ఉండవు. కచ్చితంగా చెప్పాలంటే ఒకే ఒక్క కదిలే భాగం ఉంటుంది. అలాగే మనిషి గుండెలో మాదిరిగా కవాటాలు లేకుండానే దీన్ని తయారుచేశారు. టైటానియం గొట్టం... అందులో అటుఇటు కదిలే గొట్టం లాంటి నిర్మాణం. ఇదీ ఒరెగాన్ గుండె స్థూల నిర్మాణం. కదిలే గొట్టం గుండె దిగువ భాగంలో ఉండే రెండు కవాటాల మాదిరిగా పనిచేస్తుందన్నమాట. రోగి తనతోపాటు మోసుకెళ్లే బ్యాటరీ ద్వారా శక్తితో పనిచేస్తుంది ఇది. ఆవులు, గొర్రెల్లో ఈ కృత్రిమ గుండెను ఇప్పటికీ విజయవంతంగా పరీక్షించారు. మూడు నెలలపాటు పనిచేయించిన తరవాత మానవులపై ప్రయోగాలు చేస్తామని ఒరెగాన్ యూనివర్శిటీ అంటోంది. -
లబ్‌డబ్ ‘త్రీడీ’గుండె!
ఫొటోలో ఉన్నది ఆకారంలో మాత్రమే గుండె కాదు.. లబ్‌డబ్ అంటూ కొట్టుకుంటుంది కూడా.జ్యూరిచ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సిలికోన్ పదార్థాన్ని ఉపయోగించి త్రీడీ ప్రింటర్ ద్వారా దీన్ని ముద్రించారు. దీనిలోపల కూడా మనిషి గుండె మాదిరిగానే కవాటాలు ఉంటాయి. తగిన ఒత్తిడి కలిగిస్తే కవాటాల్లోని ద్రవాన్ని బలంగా బయటకు పంపుతాయి కూడా. అన్నీ బాగున్నాయిగానీ.. ప్రస్తుతానికి దీంట్లో ఒక చిక్కుంది. ఈ కృత్రిమ గుండె మూడు వేల సార్లు మాత్రమే కొట్టుకోగలదు. అంటే.. 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకే గుండెకు బదులుగా వాడుకోవచ్చన్నమాట. అయితే దీన్ని మరింత అభివృద్ధి చేస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో గుండెలా పనిచేసేందుకు ఉపయోగించే హార్ట్–లంగ్ యంత్రాన్ని ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. ఇది భారీసైజులో ఉండటం.. ఆసుపత్రుల్లో మాత్రమే ఉపయోగించుకునే వీలు ఉండటం వల్ల హార్ట్ లంగ్ యంత్రాలకు మెరుగైన ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఇక ఇక్కడా... కృత్రిమ గుండె
హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చిన కిమ్స్ పరికరం ఖరీదు రూ.60 లక్షలు హైదరాబాద్: గుండె మార్పిడి శస్త్రచికిత్స కోసం ఎదురు చూస్తున్న బాధితులకు శుభవార్త. ఇక నుంచి బ్రెయిన్‌డెడ్ బాధితుని నుంచి సేకరించే సహజమైన గుండె కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం కృత్రిమ గుండెను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఢిల్లీ, చెన్నైలో మాత్రమే ఈ తరహా వైద్యసేవలు అందుబాటులో ఉండగా, తాజాగా హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చింది. వైద్య పరిభాషలో హార్ట్‌వేర్ వెంట్రికులర్ అసిస్ట్ డివైజ్ (హెచ్వీఏడీ)గా చెప్పుకునే 160 గ్రాముల బరువున్న ఈ కృత్రిమ గుండెను ప్రపంచ హృద్రోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కిమ్స్ యాజమాన్యం సోమవారం ఆస్పత్రిలో ఆవిష్కరించింది. గోల్ఫ్ బంతి సైజులో ఉన్న ఈ పరికరాన్ని రోగి ఛాతిలోపల ఉన్న గుండెకు కింది భాగంలో అమర్చుతారు. లెఫ్ట్ వెంట్రికల్ (ఎల్వీఏడీ) ఫెయిల్యూరైతే గుండె ఎడమ భాగానికి సపోర్టుగా, రైట్ వెంట్రికల్ (ఆర్వీఏడీ) పనిచేయకపోతే కుడి భాగానికి సపోర్టుగా, రెండు వెంట్రికల్స్ విఫలమైతే రెండి ంటికీ సపోర్టుగా దీన్ని అమర్చుతారు. టైటానియంతో తయారు చేసిన ఈ గుండె నిమిషానికి పది లీటర్ల రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. గుండె కింది భాగంలో అమర్చిన ఈ పరికరాన్ని ఛాతీ బయట ఉన్న బ్యాటరీ కంట్రోలర్‌కు అనుసంధానిస్తారు. చిన్న కేబుల్ ద్వారా ఇది ఆపరేట్ అవుతుంది. ఆరు గంటలకోసారి బ్యాటరీ మార్చుకోవాలి. దీని ఖరీదు రూ.60 లక్షలు. శస్త్రచికిత్స, వైద్యుడి ఫీజు, ఆస్పత్రి ఖర్చు అన్నీ కలిపి రూ.80-90 లక్షలవుతుంది. కిమ్స్ ఎండీ, ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ, దేశంలో ఇప్పటి వరకు ఐదుగురు హృద్రోగులకు మాత్రమే ఈ పరికరాన్ని అమర్చారని, దీంతో వారి జీవితకాలం మెరుగుపడిందన్నారు. ప్రముఖ గుండెమార్పిడి నిపుణుడు డాక్టర్ ప్రవీణ్ నందగిరి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఏటా 20 మిలియన్ల మంది హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడుతుండగా, 7.25 మిలియన్ల మంది మరణిస్తున్నారని చెప్పారు. వీరికి గుండె మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే పరిష్కారమన్నారు. అవసరమైన సమయంలో సహజమైన గుండె దొరక్క రోగులు చనిపోతున్నారని, సహ జ గుండెకు ప్రత్యామ్నాయంగా ఈ పరికరాన్ని అమర్చి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. -
అందుబాటులోకి రానున్న కృత్రిమ హృదయం!
వయసు పెరుగుతూ పోతూ ఉన్న కొద్దీ... చాలామందికి తమ గుండె గురించే దిగులు. గుండె బలహీనమవుతుంటుంది. గుండె లయతప్పుతుంటుంది. గుండెపోటు వస్తుంది. ఇలాంటి ఎన్నెన్నో సమస్యలతో గుండె సతమతమవుతుంది. మరింకేదైనా అవయవానికి ఏదో కాస్త సుస్తీ చేస్తే పర్లేదేమో! కానీ... గుండెతో వచ్చిన ఇబ్బందల్లా... దానికి ఏ చిన్న సమస్య వచ్చినా శరీరమంతటికీ అవసరమైన ఆహారం, ఆక్సిజన్ ఆగిపోయి మరణానికే దారితీస్తుంది. అదీ సమస్య. మీరూ మీ గుండె గురించి ఇలాంటి చింతల్లో ఉన్నారా? నా గుండెకు కూడా లయతప్పడం, హార్ట్ ఫెయిల్యుర్ అవ్వడం, గుండెపోటు రావడం జరిగితే ఎలా అనుకుంటున్నారా? మీకో శుభవార్త! అత్యంత శుభప్రదమైన, అందమైన భవిష్యత్ దర్శనం ఇది. భవిష్యత్తులో గుండెకు సంబంధించిన ఎలాంటి జబ్బులు వచ్చినా... కొన్ని ఉపకరణాలూ, ఒక రకంగా చెప్పాలంటే కృత్రిమ గుండె వంటి పరికరాలతో ఎలాంటి అంతరాయమూ లేకుండా గుండెను ఎప్పటిలాగే పనిచేయించవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ 60 నుంచి 80 ఏళ్ల మధ్యవారిలో చాలామంది గుండె సమస్యలతోనే ఆసుపత్రుల్లో చేరుతుంటారు. హార్ట్ ఫెయిల్యూర్స్‌తో చాలామంది మరణిస్తుంటారు. అన్ని రకాల క్యాన్సర్లతో మృత్యువు బారిన పడేవారికంటే గుండె సమస్యతో చనిపోయేవారే ఎక్కువ. కానీ భవిష్యత్తులో ఈ పరిస్థితి తారుమారవుతుందంటూ ఇప్పుడు భరోసా ఇవ్వగలుగుతున్నారు డాక్టర్లు. గుండెకు సంబంధించిన సమస్యలను తెలుసుకునే మందుగా ‘హార్ట్ ఫెయిల్యూర్’ అనే పదాన్ని సరిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే అది హార్ట్ ఎటాక్ కాదు. గుండెకు సంబంధించిన కండరాలు కాస్త కాస్త బలహీనమయిపోతూ, తమ విధులను నిర్వర్తించడంలో సమర్థతను కోల్పోవడాన్నీ హార్ట్ ఫెయిల్యూర్‌గా పేర్కొనవచ్చు. హార్ట్ ఫెయిల్యూర్లో గుండెకు ఆక్సీజన్, పోషకాలు తక్కువగా అందే కరోనరీ ఆర్టరీ డిసీజ్ (సీఏడీ) ఉండవచ్చు, లేదా ఇన్ఫెక్షన్లు రావడం, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల గుండె కండరం బలహీనమైపోయిన ‘కార్డియోమయోపతి’ అనే కండిషన్ కావచ్చు, లేదా అందరూ తీవ్రంగా భావించే గుండెపోటు కూడా కావచ్చు. కానీ చాలామంది హార్ట్ ఫెయిల్యూర్ అనగానే దాన్ని హార్ట్ అటాక్ (గుండెపోటు)గానే భావిస్తుంటారు. ఈ హార్ట్ ఫెయిల్యూర్‌కు సంబంధించిన సమస్యలను ‘కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్’ (సీహెచ్ఎఫ్)గా పేర్కొనవచ్చు. ‘న్యూయార్క్ హార్ట్ అసోసియేషన్’ (ఎన్వెహైచ్ఏ) ప్రకారం తీవ్రతల ఆధారంగా నాలుగు రకాల హార్ట్ ఫెయిల్యూర్స్ ఉంటాయి అవి... క్లాస్ - 1 (మైల్డ్): ఇందులో శారీరక శ్రమ వల్ల దేహానికి ఇబ్బందేమీ ఉండదు. అయితే తీవ్రంగా పనిచేసినప్పుడు అలసట, గుండెదడ, ఆయాసం ఉంటాయి. ఇవి మామూలు/సాధారణ ప్రజలతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. క్లాస్ - 2 (మైల్డ్): శారీరక శ్రమలో మామూలు కంటే అలసట ఎక్కువ. కాస్త విశ్రాంతి తీసుకుంటే మళ్లీ మామూలైపోతారు. గుండెదడ, ఆయాసం ఉంటాయి. క్లాస్ - 3 (ఒక మోస్తరు): ఇందులో కొద్దిపాటి శ్రమకే తీవ్రంగా అలసిపోతారు. విశ్రాంతి తీసుకుంటుంటేనే సౌకర్యంగా ఉంటారు. గుండెదడ, ఆయాసం తరచూ కనిపిస్తాయి. క్లాస్ - 1 (తీవ్రమైన సమస్య): ఏమాత్రం శ్రమను భరించలేదు. కొద్దిగా కదిలితేనే తీవ్రమైన ఇబ్బందులూ ఆయాసం. ఒక్కోసారి చాలాసేపటి విశ్రాంతి తర్వాత కూడా మామూలుగా కాలేరు. గుండెదడ, ఆయాసం నిత్యం ఉంటాయి. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ (సీహెచ్ఎఫ్) మొదటి, రెండో దశలో పేషెంట్ ఉన్నప్పుడు మందులతోనే వారి పరిస్థితిని నయం చేయవచ్చు. ఇప్పటికే ఈ తరహా మందులు వాడుతున్నారు. ఒకవేళ వారి పరిస్థితి ముదిరి మూడు లేదా నాలుగో దశలో ఉంటే మాత్రం మందులతో పాటు భవిష్యత్తులో కొన్ని ఉపకరణాలతో వారి సమస్యలను దూరం చేయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే గతంలో చేయిదాటిపోయినాయి అనుకున్న కేసులను సైతం భవిష్యత్తులో ‘కృత్రిమ గుండె’ వంటి ఉపకరణాలతో పేషెంట్ ఎప్పటికీ గుండెపోటుతో మాత్రం మరణించకుండా కాపాడుకునే మంచి రోజులు ముందున్నాయి. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్‌కు వాడే ఉపకరణాలు ఒకవేళ గుండె పూర్తిగా ఫెయిల్ అయి తన బాధ్యతలను నిర్వహించలేని పరిస్థితులు ఏర్పడితే అప్పుడు కొన్ని ఉపకరణాలతో గుండెజబ్బులు ఉన్నవారు మళ్లీ యథావిధిగా సాధారణ జీవితం గడపవచ్చు. అలా గడపడానికి ఉపయోగపడే ఉపకరణమే వెంట్రిక్యులార్ అసిస్ట్ డివైజ్ (వీఏడీ). ఈ ‘వీఏడి’ దాదాపుగా కృత్రిమ గుండె అనుకోవచ్చు. వీఏడీ అంటే...? ఇది ఒక మెకానికల్ పంపు వంటి సాధనం. గుండెలోని కింది గదులు (వెంట్రికల్స్) బలహీనం అయినప్పుడు అక్కడి నుంచి రక్తం వేగంగా పంప్ అయ్యేలా ఈ సాధనం ఉపయోగపడుతుంది. ఇప్పుడు పూర్తిగా విఫలమైన గుండెను తొలగించి దాని స్థానంలో దాత నుంచి స్వీకరించే కొత్తగుండెను అమర్చడం అన్నది తక్షణం చేయాల్సిన పని. కానీ ‘వీఏడీ’ సహాయంతో కొత్త గుండె అమర్చడానికి కొంత సమయాన్నీ తీసుకోవడం వీఏడీ ద్వారా ఒనగూరే మరో సౌకర్యం. అందుకే దీన్ని ‘బ్రిడ్జ్ టు ట్రాన్స్‌ప్లాంట్’గా వ్యవహరిస్తారు. ఇక కొందరికి అసలు కొత్త గుండే దొరికే పరిస్థితే లేకపోతే దీన్నే శాశ్వత కృత్రిమ గుండెగా కూడా వాడుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో దీన్ని ‘డెస్టినేషన్ థెరపీ’గా వ్యవహరిస్తారు. అంటే భవిష్యత్తులో గుండెపోటు వచ్చిందటే అది తప్పకుండా మరణమే అనే పరిస్థితి ఉండదు. జీవితానికి ఇంకా చాలా అవకాశం ఉంటుందనే అంశం... ఇప్పుడు నట్లమబ్బుల్లో కనిపించే మెరుపులాంటి ఆశారేఖ. ఏయే భాగాలు ఫెయిలైతే ఏయే రకాల వీఏడీలు... గుండెలోని ఎడమవైపు కింది గది విఫలం అయితే దీనికోసం ‘ఎల్వీఏడీ’ని, కుడివైపు కింది గది విఫలమైతే ‘ఆర్వీఏడీ’ని, ఇక రెండు గదులూ పనిచేయకపోతే ‘బైవీఏడీ’ అనే సాధనాలను వాడతారు. వీఏడీలోని వివిధ భాగాలూ... అవి చేసే పనులు : A. ఔట్ ఫ్లో ట్యూబ్: దీన్ని గుండె నుంచి శరీర భాగాలకు మంచి రక్తాన్ని తీసుకుపోయే ప్రధాన ధమనికి అమరుస్తారు. B. ఇన్‌ఫ్లో ట్యూబ్: దీన్నే కాండ్యూయిట్ అని కూడా అంటారు. దీన్ని గుండె ఎడమవైపు కిందిగదికి అమర్చుతారు. C. పవర్ సోర్స్: ఇది వీఏడీ ఉపకరణం పనిచేయడానికి అవసరమైన శక్తివనరును అందించే బ్యాటరీ. D.పంప్ యూనిట్: ఇది రక్తం పంప్ అయ్యేందుకు ఉపయోగపడే భాగం. E. డ్రైవ్‌లైన్: ఇది వీఏడీ ఉపకరణం దగ్గర మొదలై మన చర్మం నుంచి మన శరీరం బయటకు వచ్చే సాధనం. ఇది కొన్ని విద్యుత్కేబుళ్లను కలిగి ఉండి ఈ సాధనాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. F. ఎక్స్టర్నల్ కంట్రోలర్: ఇది శరీరం బయట ఉండే సాధనం. దీనికి వైర్లను కనెక్ట్ చేయడం ద్వారా వీఏడీ ఉపకరణం నడిచేందుకు అవసరమైన శక్తిని పంపడం లేదా బ్యాటరీతో అనుసంధానం వంటివి చేయడానికి పనికి వస్తుంది. ఇది ఒక కంప్యూటర్‌తో అనుసంధానమై వీఏడీ పనితీరు సక్రమంగా జరిగేలా నియంత్రిస్తుంటుంది. ఇది వీఏడీ పనితీరును ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉండటమే కాకుండా, ఈ వీఏడీ పనితీరు వ్యవస్థలో ఏదైనా లోపం వస్తే హెచ్చరికలూ పంపుతుంది. టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ (టీఏహెచ్) పైన పేర్కొన్న వీఏడీ అన్నదే దాదాపు కృత్రిమ గుండెలా పనిచేసే సాధనమైతే... ఇక పూర్తిగా కృత్రిమగుండె అనదగ్గ మరో పరికరమే టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ (టీఏహెచ్). ఇప్పుడు గుండెజబ్బులు వాటి నివారణ, చికిత్స విషయంలో జరుగుతున్న పరిశోధనల వేగాన్ని అంచనా వేసుకుని భవిష్యత్ దర్శనం చేస్తే ఒకనాటికి గుండెజబ్బుల విషయంలో గుండెపోటు కారణంగానో లేదా గుండె పనితీరు లోపం వల్లనో సంభవించే మరణాలు దాదాపుగా ఉండకపోవచ్చు. కారణం... టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ (టీఏహెచ్). జార్విక్-7 అని కూడా పిలిచే దీన్ని మొదటిసారిగా బ్యార్నీ క్లార్క్ అనే 61 ఏళ్ల డెంటిస్ట్‌కు అమర్చి చూశారు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు లభ్యమవుతున్న టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్స్ బాగా పనిచేస్తున్నాయి. మరింత సమర్థమైనవి వస్తాయి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
కోటిన్నర పెడితే కొత్త గుండె
-
‘కృత్రిమ గుండె’ సక్సెస్
ప్రపంచంలోనే తొలిసారి... పారిస్ వైద్య నిపుణుల ఘనత గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక వ్యక్తికి పారిస్ వైద్యులు విజయవంతంగా కృత్రిమ గుండెను అమర్చారు. ఇలాంటి శస్త్రచికిత్స జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి. పారిస్‌లోని జార్జెస్ పాంపిడోవు ఆస్పత్రిలో బుధవారం ఈ చరిత్రాత్మకమైన శస్త్రచికిత్స జరిగింది. రోగి స్పృహలోకి వచ్చి, చికిత్సకు భేషుగ్గా స్పందిస్తున్నట్లు వైద్య నిపుణులు ప్రకటించారు. ఫ్రాన్స్ ఆరోగ్య, సామాజిక వ్యవహారాల మంత్రి మారిసోల్ టౌరేనె, కృత్రిమ గుండెను తయారుచేసిన బయో మెడికల్ సంస్థ ‘కార్మాట్’ సహ వ్యవస్థాపకుడైన శస్త్రచికిత్స నిపుణుడు అలైన్ కార్పెంటీర్, ‘కార్మాట్’ అధినేత మార్సెలో కాన్విటీ శనివారం జార్జెస్ పాంపిడోవు ఆస్పత్రిలో ఏర్పాటైన మీడియా సమావేశంలో ఈ శస్త్రచికిత్స వివరాలను వెల్లడించారు. తొలి కృత్రిమ గుండె అమర్చే శస్త్రచికిత్స విజయవంతం కావడంపై కాన్విటీ హర్షం వ్యక్తం చేశారు. సాధారణ గుండె కంటే కృత్రిమ గుండె మూడురెట్లు ఎక్కువ బరువు ఉంటుందని, ఐదేళ్ల వరకు ఇది ఎలాంటి ఢోకా లేకుండా పనిచేస్తుందని ఆయన తెలిపారు. గుండె మార్పిడి శస్త్రచికిత్సల్లో కృత్రిమ పరికరాలను తాత్కాలికంగా ఉపయోగిస్తుంటారని, అయితే, తాము కొత్తగా రూపొం దించిన కృత్రిమ గుండెను అసలు గుండె స్థానంలో పూర్తిస్థాయిలో అమర్చవచ్చని వివరించారు. దాతలు అందుబాటులో లేకపోవడం వల్ల ఏటా వేలాది మంది మరణిస్తున్నారని, అలాంటి వారి ప్రాణాలను నిలపడంలో ఈ కృత్రిమ గుండె ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కృత్రిమ గుండెకు ఎయిర్‌బస్ పేరెంట్ కంపెనీ ‘ఈఏడీఎస్’ ఇంజనీర్ల బృందం రూపకల్పన చేసింది. దీని ధర దాదాపు 1.50 లక్షల పౌండ్లు (రూ.1.50 కోట్లు) వరకు ఉంటుంది. వెలుపల ధరించే లీథియం అయాన్ బ్యాటరీల ద్వారా ఈ కృత్రిమ గుండె పనిచేస్తుంది. రక్త ప్రసరణకు ఉపయోగపడే దీని లోపలి భాగాలను కృత్రిమ పదార్థాలతో కాకుండా, జంతు కణజాలంతో రూపొందించారు.