రోమ్: ఓ పసివాడు గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. అంత చిన్న గుండెకు సర్జరీ చేయడానికి డాక్టర్లకు కూడా చేతులు రావడం లేదు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాల మీదకు వస్తుంది. అయినా సరే చరిత్రలో ఎన్నో అద్భుత విజయాల్ని సువార్ణక్షరాలతో లిఖించిన డాక్టర్లు ఆ చిన్ని గుండెకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు.
ఇటలీకి చెందిన 16 నెలల బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతని తల్లిదండ్రులు చిన్నారిని రోమ్ నగరానికి చెందిన బాంబినో గెసు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన కార్డియాలజిస్ట్ ఆంటోనియో అమెడియో ఆ చిన్నారి గుండెకు సంబంధించిన కండరాల సమస్యతో బాధపడుతున్నాడని తెలిపారు. గుండె మార్పిడి చేయాలి. లేదంటే చిన్నారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అన్నారు. అలా జరగాలంటే ముందుగా హార్ట్ డోనర్ కావాలి. కానీ సర్జన్ ఆంటోనియో హార్ట్ డోనర్ లేకుండా చిన్నారి ప్రాణాల్ని కాపాడారు. ఎలాగంటారా? 11 గ్రాముల ఆర్టిఫిషియల్ గుండెతో చిన్నారి ప్రాణాలు నిలిపారు.
అమెరికాకు చెందిన డాక్టర్ రాబర్ట్ జార్విక్ టైటానియం పంప్తో 11 గ్రాములు బరువు ఉండే కృత్తిమ గుండెను తయారు చేశారు. ఈ గుండె నిమిషానికి 1.5 లీటర్ల రక్తాన్ని పంపిణీ చేస్తుంది. అయితే రాబర్ట్ జార్విక్ టైటానియం పంప్‌తో తయారు చేసిన కృత్తిమ గుండెను అప్పటికే జంతువులపై పరీక్షించి విజయం సాధించారు.
అయితే ఇటలీలో ఉన్న డాక్టర్ ఆంటోనియా అమెడియో.. అమెరికాకు చెందిన రాబర్ట్ జార్విక్ తయారు చేసిన కృత్తిమ గుండెను 16 నెలల బాబుకు అమర్చాలని అనుకున్నారు. అందుకోసం ముందుగా ఇటలీ ఆరోగ్య శాఖ నుంచి, అమెరికన్ డాక్టర్ ఆంటోనియా అమెడియో నుంచి పర్మీషన్ తీసుకోవాలి. అలా అన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి మే 24, 2012లో 16 నెలల బాబుకు కృత్తిమ గుండెను అమర్చారు. 13 రోజుల తరువాత డోనర్ సాయం వల్ల ఆ ఆర్టిఫిషియల్ గుండెను తొలగించి సాధారణ గుండెను అమర్చి 16 నెలల బాబు ప్రాణాలు కాపాడగలిగారు. డాక్టర్లు చేసిన కృషిని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment