cardiologists
-
విమానంలో చిన్నారికి గుండెపోటు.. ప్రాణం పోసిన ఎయిమ్స్ డాక్టర్లు
న్యూఢిల్లీ: ప్రాణం పోయడంలో దేవుడి తర్వాత దేవుడిగా డాక్టర్లనే కొలుస్తూ ఉంటారు. ఈ మాటను నిజం చేస్తూ ఎయిమ్స్ డాక్టర్లు రెండేళ్ల చిన్నారికి ఊపిరి పోశారు. బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో రెండేళ్ల చిన్నారికి గుండెపోటు రావడంతో అదే విమానంలో ఉన్న ఐదుగురు ఎయిమ్స్ డాక్టర్లు అత్యవసర ట్రీట్మెంట్ నిర్వహించి బిడ్డ ప్రాణాలు కాపాడారు. బెంగుళూరు నుంచి ఢిల్లీ పయనమైన విస్తార విమానం UK -814లో రెండేళ్ల చిన్నారికి ఉన్నట్టుండి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి కొద్దిసేపటిలోనే పల్స్ ఆగిపోయింది. బిడ్డ చర్మం నీలిరంగులోకి మారిపోయి శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. దీంతో విమానాన్ని నాగ్‌పూర్‌కు మళ్లిస్తున్నట్లు సిబ్బంది అత్యవసర ప్రకటన చేసింది. విషయం తెలుసుకున్న అదే విమానంలో ప్రయాణిస్తున్న ఎయిమ్స్ డాక్టర్లు వెంటనే అప్రమత్తమై బాలికకు సీపీఆర్ నిర్వహించారు. విమానం నాగ్‌పూర్‌కు చేరేవరకు బిడ్డ ప్రాణాలను అదిమి పట్టుకున్నారు. ఎలాగోలా ఐవీ క్యానులాను అమర్చగలిగారు. బిడ్డ యధాతథంగా ఊపిరి తీసుకునేంతవరకు ఎయిమ్స్ డాక్టర్లు చాలా శ్రమించారు. చిన్నారిని నాగ్‌పూర్‌కు తరలించిన తర్వాత సర్జరీ నిర్వహించగా ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు అక్కడి వైద్యులు. అత్యవసర పరిస్థితుల్లో చిన్నారికి ఇంట్రా కార్డియాక్ రిపేర్ చేసి ప్రాణాలు కాపాడిన ఎయిమ్స్ వైద్యులు డా.నవదీప్ కౌర్, డా.దమన్‌దీప్, డా.రిషబ్ జైన్, డా.ఒయిషికా, డా.అవిచల తక్షక్లను అభినందిస్తూ ఢిల్లీ ఎయిమ్స్ ఎక్స్(ఒకపుడు ట్విట్టర్)లో వారికి అభినందనలు తెలుపుతూ చిన్నారితో సహా డాక్టర్ల ఫోటోలను షేర్ చేసింది. #Always available #AIIMSParivar While returning from ISVIR- on board Bangalore to Delhi flight today evening, in Vistara Airline flight UK-814- A distress call was announced It was a 2 year old cyanotic female child who was operated outside for intracardiac repair , was… pic.twitter.com/crDwb1MsFM — AIIMS, New Delhi (@aiims_newdelhi) August 27, 2023 ఇది కూడా చదవండి: రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నాడని.. 27 ఏళ్ల కుమారుని హత్య! -
చిన్నవయసులోనే గుండెపోట్లు.. కారణాలేంటి..? జాగ్రత్తలేంటి..?
►సంజామల మండలం ముచ్చలపురి గ్రామానికి చెందిన కాశీంబీ(55) గత నెల 24వ తేదీన పూడికతీత పనులు చేస్తూ గుండెపోటుకు గురై మరణించింది. ►ఓర్వకల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న విశ్వప్రసాద్(46) గుండెపోటుకు గురై గత నెల 21వ తేదీన ప్రాణాలొదిలాడు. ►పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం గ్రామానికి చెందిన అబ్దుల్ అనీఫ్(23) అనే యువకుడు గత నెల 22న హార్ట్‌స్ట్రోక్‌తో మృతి చెందాడు. ►ఇటీవలే కర్నూలు కొత్తబస్టాండ్ ప్రాంతంలో ఎరువుల వ్యాపారం చేస్తున్న 40 ఏళ్ల యువకుడు గుండెపోటుకు గురై హఠాన్మరణం పొందారు. వీరే కాదు ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒకచోట పట్టుమని 50 ఏళ్లు కూడా నిండని వారు అధికంగా గుండెపోటుకు గురై మరణిస్తున్నారు. ఒకప్పుడు హృద్రోగ సమస్యలు 70 ఏళ్లు పైబడిన వారికి వచ్చేవి. ఇప్పుడు పాతికేళ్ల యువకులను సైతం ఈ సమస్య వేధిస్తోంది. ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్, బేకరీల్లో లభించే తినుబండారాలు, వారంలో నాలుగైదుసార్లు చికెన్, మటన్ లాగించేయడం, ఒకేచోట కూర్చుని పనిచేయడం, వ్యాయామం లేని జీవితాన్ని గడపడం, మానసిక ఒత్తిడి తదితర కారణాలతో నేటి యువతరం గుండె బలహీనమైపోతోంది. కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో 20 ఏళ్ల క్రితం ఒకరు మాత్రమే కార్డియాలజిస్టు ఉండేవారు. అప్పట్లో గుండె సమస్యలకు సైతం జనరల్ ఫిజీషియన్లు చికిత్స చేసేవారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనూ పాతికేళ్ల క్రితం జనరల్ ఫిజీషియన్లే గుండె జబ్బుల విభాగాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కార్డియాలజిస్టు రావడంతో దాదాపు 15 ఏళ్ల పాటు ఆయన ఒక్కరే విభాగాన్ని పర్యవేక్షించారు. మధ్యలో ఒకరిద్దరు కార్డియాలజిస్టులు, సీనియర్ రెసిడెంట్లు వచ్చినా కొన్నాళ్లకే వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐదుగురు కార్డియాలజిస్టులు ఈ విభాగంలో వైద్యసేవలు అందిస్తున్నారు. ఇందులో ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఓపీ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఓపీకి 200 నుంచి 250 మంది చికిత్స కోసం వస్తుండగా, ఇన్ పేషంట్లుగా నెలకు 350 నుంచి 400 మంది వరకు చేరి చికిత్స పొందుతున్నారు. రోజూ 400కి పైగా ఈసీజీ, 40 నుంచి 50 వరకు 2డీ ఎకో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 11వేల దాకా యాంజియోగ్రామ్‌లు, 2వేలకు పైగా స్టెంట్స్, 60 పేస్మేకర్లు వేశారు. దీంతో పాటు కార్డియోథొరాసిక్ విభాగంలో సైతం గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలు కార్పొరేట్ స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ విభాగంలో ఇప్పటి వరకు 480కి పైగా ఆపరేషన్లు నిర్వహించారు. గుండె పోటు వచ్చిన వారికి సత్వర వైద్యం అందించేందుకు కర్నూలు పెద్దాసుపత్రితో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు ప్రైవేటు ఆసుపత్రులు ఏర్పాటయ్యాయి. గుండెపోటుకు కారణాలు ►మానసిక ఒత్తిడి, జీవనశైలిలో మార్పులు ►చిన్న వయస్సులోనే ఊబకాయంతో పాటు బీపీ, షుగర్లు రావడం ►ఈ జబ్బులు వచ్చినా వాటిని నియంత్రణలో ఉంచుకోకపోవడం ►ఒకేచోట గంటలకొద్దీ సమయం కూర్చుని పనిచేయడం ►ధూమ, మద్యపానాలతో మరింత చేటు ►విపరీతంగా ఫాస్ట్‌ఫుడ్, మాంసాహారం తినడం ►రాత్రివేళల్లో తగినంత నిద్రలేకపోవడం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ►బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఊబకాయం తగ్గించుకోవాలి. ►రోజూ తగినంత వ్యాయామం చేయాలి. ►ధూమ, మద్యపానాలు మానేయాలి. ►ఒత్తిడి లేని జీవితం కోసం ప్రణాళికతో రోజును ప్రారంభించాలి. ►స్థూలకాయాన్ని తగ్గించుకోవాలి. ►అధిక కొవ్వు, నూనెలు, ఉప్పు, చక్కెరలకు దూరంగా ఉండాలి. ►రాత్రి త్వరగా నిద్రపోవాలి. తగినంత నిద్రతో గుండెకు అదనపు శక్తి. యువతలో హృద్రోగ సమస్యలు పెరిగాయి ఇటీవల కాలంలో 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు సైతం గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి పలు రకాల మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమితో పాటు దురలవాట్లు, నియంత్రణలేని ఆహారం, కుటుంబ సమస్యలు, వాతావరణ కాలుష్యం కారణాలుగా భావిస్తున్నాము. జీవనశైలిలో మార్పులు తెచ్చుకుని రోజూ తగినంత వ్యాయామం చేయడం, పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం మేలు. బీపీ, షుగర్లు ఉంటే వాటిని నియంత్రించుకోవాలి. –డాక్టర్ చైతన్యకుమార్, కార్డియాలజిస్టు, కర్నూలు ఉద్గీత ధ్యాన యోగ ఉపకరిస్తుంది గుండెపోటు ప్రధానంగా మానసిక ఒత్తిడి అధికం కావడం, నిద్రలేకపోవడంతో వస్తోంది. దీనికితోడు శరీరం సైతం అంతరశుద్ధి లేకపోవడం వల్ల లోపల వాయువులు ఏర్పడి గుండెపై ఒత్తిడి పెరుగుతోంది. ఇందుకు గాను ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే లీటర్ నీటిని తాగి శరీరాన్ని అంతరశుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ఉద్గీత ధ్యానయోగ(గట్టిగా ఓంకారం పలకడం)ను 20 సార్లు చేయాలి. –జి. మురళీకృష్ణ, యోగామాస్టర్, కర్నూలు -
జిమ్ చేయడమే పునీత్ కు శాపమా ?
-
అద్భుతం: ఆర్టిఫిషల్ గుండెతో చిన్నారికి ప్రాణదానం
రోమ్: ఓ పసివాడు గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. అంత చిన్న గుండెకు సర్జరీ చేయడానికి డాక్టర్లకు కూడా చేతులు రావడం లేదు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాల మీదకు వస్తుంది. అయినా సరే చరిత్రలో ఎన్నో అద్భుత విజయాల్ని సువార్ణక్షరాలతో లిఖించిన డాక్టర్లు ఆ చిన్ని గుండెకు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడారు. ఇటలీకి చెందిన 16 నెలల బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతని తల్లిదండ్రులు చిన్నారిని రోమ్ నగరానికి చెందిన బాంబినో గెసు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన కార్డియాలజిస్ట్ ఆంటోనియో అమెడియో ఆ చిన్నారి గుండెకు సంబంధించిన కండరాల సమస్యతో బాధపడుతున్నాడని తెలిపారు. గుండె మార్పిడి చేయాలి. లేదంటే చిన్నారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అన్నారు. అలా జరగాలంటే ముందుగా హార్ట్ డోనర్ కావాలి. కానీ సర్జన్ ఆంటోనియో హార్ట్ డోనర్ లేకుండా చిన్నారి ప్రాణాల్ని కాపాడారు. ఎలాగంటారా? 11 గ్రాముల ఆర్టిఫిషియల్ గుండెతో చిన్నారి ప్రాణాలు నిలిపారు. అమెరికాకు చెందిన డాక్టర్ రాబర్ట్ జార్విక్ టైటానియం పంప్‌తో 11 గ్రాములు బరువు ఉండే కృత్తిమ గుండెను తయారు చేశారు. ఈ గుండె నిమిషానికి 1.5 లీటర్ల రక్తాన్ని పంపిణీ చేస్తుంది. అయితే రాబర్ట్ జార్విక్ టైటానియం పంప్‌తో తయారు చేసిన కృత్తిమ గుండెను అప్పటికే జంతువులపై పరీక్షించి విజయం సాధించారు. అయితే ఇటలీలో ఉన్న డాక్టర్ ఆంటోనియా అమెడియో.. అమెరికాకు చెందిన రాబర్ట్ జార్విక్ తయారు చేసిన కృత్తిమ గుండెను 16 నెలల బాబుకు అమర్చాలని అనుకున్నారు. అందుకోసం ముందుగా ఇటలీ ఆరోగ్య శాఖ నుంచి, అమెరికన్ డాక్టర్ ఆంటోనియా అమెడియో నుంచి పర్మీషన్ తీసుకోవాలి. అలా అన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి మే 24, 2012లో 16 నెలల బాబుకు కృత్తిమ గుండెను అమర్చారు. 13 రోజుల తరువాత డోనర్ సాయం వల్ల ఆ ఆర్టిఫిషియల్ గుండెను తొలగించి సాధారణ గుండెను అమర్చి 16 నెలల బాబు ప్రాణాలు కాపాడగలిగారు. డాక్టర్లు చేసిన కృషిని ప్రజలు ప్రశంసిస్తున్నారు. -
భారత్‌లో 'స్టెంట్లు' వేయడం ఓ పెద్ద మాయ
న్యూఢిల్లీ: భారత దేశంలో జోరుగా సాగుతున్న ‘స్టెంట్ల’ వ్యాపారాన్ని తరచి చూస్తే ఆరోగ్యమైన గుండె కూడా ఆందోళనకు గురికావాల్సిందే. దేశంలో ఇప్పటి వరకు వేసిన ప్రతి మూడు స్టెంట్లలో కచ్చితంగా ఒక్క స్టంట్ అనవసరంగా వేసిందేనని ప్రముఖ కార్డియోలజిస్ట్లే అనుమానిస్తున్నారు. అసలు స్టెంట్ వేయడమే అవసరంలేని వారికి కూడా స్టెంట్ వేసి పంపుతున్నారు. ఏడాదికి ఏకంగా 25 వేల ఆంజియోప్లాస్టీలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు నేడు దేశంలో ఎన్నో ఉన్నాయి. ఈ లెక్కన ఏడాదికి కోట్ల స్టెంట్లు అనవసరంగానే వేస్తున్నట్లు లెక్క. వైద్య చికిత్సపై భారత్ కంటే ఎక్కువ పర్యవేక్షణ ఉండే అమెరికాలో 2007లో స్టెంట్ల చికిత్సపై ఆడిటింగ్ చేయగా సగానికి సగం స్టెంట్లు అనవసరంగా వేసినవేనని తేలింది. అప్పుడు అక్కడి ప్రభుత్వం వందలాది మంది డాక్టర్లను జైళ్లకు పంపడమే కాకుండా ఆస్పత్రులకు లక్షలాది డాలర్ల జరిమానాను విధించింది. వెంటనే స్టెంట్ల విషయంలో పాటించాల్సిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. మళ్లీ 2009లో స్టెంట్ల చికిత్సను ఆడిటింగ్ చేయగా అంతకుముందు అవసరం లేకున్నా స్టెంట్లు వేయడం 50 శాతం ఉండగా, అది 25 శాతానికి పడిపోయింది. అప్పుడు కూడా ఆస్పత్రులకు భారీ జరిమానాలు విధించడంతోపాటు అందుకు బాధ్యులైన వైద్యులను జైళ్లకు పంపించారు. ఫలితంగా అనవసరంగా స్టెంట్లు వేయడం 2014 నాటికి 13 శాతానికి పడిపోయింది. కేసుల పరంగా చూస్తే 21వేల నుంచి ఎనిమిది వేలకు పడిపోయింది. భారత్ దేశంలో వైద్య చికిత్సలను ఆడిటింగ్ చేసే పద్ధతే కాదు, కనీసం ప్రైవేటు ఆస్పత్రులను క్రమబద్ధీకరించే వ్యవస్థ కూడా లేదు. భారత్‌లో కూడా స్టెంట్ల చికిత్సను ఆడిటింగ్ చేసే వ్యవస్థను తీసుకరావాలని, అంతకంటే ముందుగా ప్రభుత్వం మార్గదర్శక సూత్రాలను తీసుకరావాలని ‘ఫార్టీస్ ఎస్కార్ట్ ఆర్ట్ ఇనిస్టిట్యూట్’ కార్డియాలోజి విభాగం అధిపతి డాక్టర్ టీఎస్ క్లేర్ అభిప్రాయపడ్డారు. దీనికి మరో వ్యవస్థ ఏమీ అవసరం లేదని, భారత కార్డియాలోజి సొసైటీయే మార్గదర్శకాలను విడుదల చేసి, ఎప్పటికప్పుడు అదే ఆడిటింగ్ చేస్తే ఈ అనవసరంగా వేసే స్టెంట్లను అరికట్టవచ్చని ‘నారాయణ హెల్త్’ చైర్మన్ డాక్టర్ దేవి శెట్టి అభిప్రాయపడ్డారు. -
భారత సంతతి వైద్యుడికి వైట్‌హౌజ్ ఫెలోషిప్
వాషింగ్టన్: అమెరికాలో ప్రతిష్టాత్మక వైట్‌హౌజ్ ఫెలోషిప్‌కు భార త సంతతి కార్డియాలజిస్ట్ కపిల్ పరేఖ్ ఎంపికయ్యారు. ఈ ఏడాది పరేఖ్తోసహా మొత్తం 11 మంది ఈ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. ‘హెల్త్ ఫర్ అమెరికా’ అనే స్వచ్ఛంద సంస్థ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన పరేఖ్ జాన్ హాప్కిన్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. యువత కొత్త తరం నాయకులుగా రూపుదిద్దుకునేందుకు పరేఖ్ కృషి చేస్తున్నారు.