కిడ్నాపర్లకే కుర్రాడి మస్కా
భువనగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా భువనగిరిలో బుధవారం ఉదయం కిడ్నాప్‌కు గురైన బాలుడు కిడ్నాపర్ల చెర నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. స్థానిక అర్బన్ కాలనీకి చెందిన శ్రీనివాస్ కొడుకు అరుణ్‌సాయి(12) దేదిప్య ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం స్నేహితులతో కలిసి ఇంటి ముందు ఆడుకుంటుండగా.. గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసి వ్యానులో తీసుకెళ్లారు.
వ్యాన్ రాయగిరి వద్దకు చేరుకోగానే చెడిపోవడంతో..అదును చూసి కిడ్నాపర్ల కళ్లుకప్పి కారులో నుంచి అరుణ్ సాయి బయటకు దూకి తప్పించుకున్నాడు. రాయగిరి గ్రామంలోకి వెళ్లి ఓ వ్యక్తి సాయంతో తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. దీంతో తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని బాలుడిని తీసుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.