Ashok Kumar Gupta
-
గృహోపకరణాల మార్కెట్లోకి రాక్వెల్
♦ 2016లో మార్కెట్లోకి రిఫ్రిజిరేటర్ ♦ రాక్వెల్ ఎండీ అశోక్ కుమార్ గుప్తా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వాణిజ్య అవసరాలకు కూలర్లు, ఫ్రీజర్లను తయారు చేస్తున్న హైదరాబాద్‌కు చెందిన రాక్వెల్ ఇండస్ట్రీస్ గృహోపకరణాల వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఇళ్లలో వినియోగించే రిఫ్రిజిరేటర్ల తయారీలోకి అడుగుపెట్టాలని ఈ సంస్థ నిర్ణయించింది. 2016లో రిఫ్రిజిరేటర్‌ను మార్కెట్లోకి తీసుకు వస్తామని రాక్వెల్ ఎండీ అశోక్ కుమార్ గుప్తా సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘శీతలీకరణ ఉపకరణాల తయారీలో దేశంలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాం. కోకకోలా, రిలయన్స్, అమూల్, మదర్ డెయిరీ, కేఎంఎఫ్, క్రీమ్‌బెల్, దిన్షాస్ వంటి ప్రముఖ సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయి. ఇప్పుడు ఇదే అనుభవంతో గృహ విభాగంలో విజయవంతం అవుతాం’ అని పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ వాటర్ కూలర్లను సైతం తయారు చేస్తోంది. పాడి రైతుల కోసం తక్కువ ధరలో మిల్క్ చిల్లర్‌ను3 నెలల్లో ప్రవేశపెట్టనుంది. 2018 నాటికి తొలి స్థానం.. వాణిజ్య శీతలీకరణ ఉపకరణాల మార్కెట్లో 2018 నాటికి తొలి స్థానం లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. పరిశ్రమ పరిమాణం ప్రస్తుతం 25 శాతం వృద్ధితో ఏటా 5 లక్షల యూనిట్లుందని తెలిపారు. కంపెనీ ఏటా 60,000 యూనిట్లు విక్రయిస్తోందని అన్నారు.ఇక ఇప్పటికే పరిశోధన, అభివృద్ధికి రూ.3 కోట్లు వెచ్చించామని వివరించారు. సంస్థ విద్యుత్ ఖర్చులేని సోలార్‌తో (సౌర శక్తి) పనిచేసే కూలర్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. -
సౌర శక్తితో పనిచేసే కూలర్
♦ అందిస్తున్న రాక్వెల్ ♦ త్వరలో మిల్క్ చిల్లర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శీతలీకరణ ఉపకరణాల తయారీలో ఉన్న రాక్వెల్ ఇండస్ట్రీస్ సౌర శక్తితో పనిచేసే కూలర్‌ను రూపొందించింది. కోకకోలా కోసం కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది. విద్యుత్ సరఫరా సక్రమంగా లేని ప్రాంతాల్లోని మహిళలను వ్యాపారులుగా మలిచేందుకు శీతల పానీయాల విక్రయ సంస్థ కోకకోలా చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా కూలర్లు సరఫరా చేస్తుంది. కోకకోలా ఒక్కో కూలర్‌కు తమకు రూ.35 వేలు చెల్లిస్తుందని రాక్వెల్ ఎండీ అశోక్ కుమార్ గుప్తా బుధవారం తెలిపారు. ఇది పూర్తిగా సౌర శక్తితో పనిచేస్తుందని అన్నారు. మేడ్చల్ వద్ద కంపెనీ ఇటీవల కొత్తగా స్థాపించిన ఫ్యాక్టరీ ఐజీబీసీ ప్లాటినం రేటింగ్ పొందిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. జర్మనీ కంపెనీ ఆర్డరు మేరకు సోలార్ ఫ్రీజర్‌ను సైతం రూపొందించామని వెల్లడించారు. భారత్‌లో సోలార్ ఆధారిత ఫ్రీజర్లు, కూలర్లను తయారు చేస్తున్న ఏకైక కంపెనీ తమదేనని గుర్తుచేశారు. మిల్క్ చిల్లర్ సైతం: పాడి రైతుల కోసం తక్కువ ధరలో మిల్క్ చిల్లర్‌ను మూడు నెలల్లో ప్రవేశపెడుతున్నట్టు అశోక్ కుమార్ గుప్తా చెప్పారు. పితికిన పాలను చల్లబర్చడానికి ఇవి ఉపయోగపడతాయని వివరించారు. రాక్వెల్కు మేడ్చల్ వద్ద ఇప్పటికే ఒక ప్లాంటు ఉంది. షిఫ్ట్‌కు 350 యూనిట్లు ఫ్రీజర్లు, కూలర్లు తయారు చేస్తున్నారు. కొత్త ప్లాంటును రూ.28 కోట్లతో నెలకొల్పారు. ఇక్కడ షిఫ్ట్‌కు 500 యూనిట్లు రూపొందిస్తున్నారు. ఏటా 60,000 యూనిట్లు విక్రయిస్తోంది. 2014-15లో రూ.85 కోట్ల ఆదాయం ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.150 కోట్లు ఆశిస్తోంది. ఉపకరణాలను విక్రయించేందుకు 1,000 మంది ఫ్రాంచైజీలను నియమించాలన్నది కంపెనీ ప్రణాళిక.