Ashwani Kumar
-
రూపాయి పతనం ఎగుమతులకు ఊతమే కానీ...
న్యూఢిల్లీ: రూపాయి బలహీనపడటమనేది దేశీ ఎగుమతులకు ఊతమిచ్చేదే అయినప్పటికీ వాస్తవ పరిస్థితులు సంక్లిష్టంగా ఉంటాయని ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ అశ్వని కుమార్ వ్యాఖ్యానించారు. చాలా మటుకు భారతీయ ఎగుమతిదారులు.. ముడివస్తువులు, విడిభాగాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారని ఆయన చెప్పారు. రూపాయి గణనీయంగా పడిపోతే ముడివస్తువుల వ్యయాలు పెరిగిపోయి సదరు ఎగుమతిదారులపై భారం పడుతుందని పేర్కొన్నారు. ఫలితంగా కరెన్సీ క్షీణత ప్రయోజనాలు పెద్దగా లభించవని వివరించారు. ‘బలహీన రూపాయి ప్రభావమనేది ఎగుమతిదారులందరిపైనా ఒకే తరహాలో ఉండదు. ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తూ పతనానికి మూలకారణాలను సరిదిద్దడానికి వ్యూహాత్మకమైన, బహుముఖ విధానం అవసరమవుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు రూపాయి రెండు శాతమే క్షీణించినా, పోటీ దేశాల కరెన్సీలు అంతకన్నా ఎక్కువగా 3–5 శాతం పడిపోతే, గ్లోబల్ మార్కెట్లలో భారత ఎగుమతిదారులు పోటీపడే పరిస్థితి ఉండదని కుమార్ తెలిపారు. రూపాయి పతనం వల్ల ముడి వస్తువుల ధరలు, కరెన్సీ మారకం రేటులో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, విదేశీ రుణాల భారం మొదలైనవన్నీ కూడా పెరిగిపోతాయని ఆయన చెప్పారు.ఆర్బీఐ జోక్యం ఎగుమతులకు ప్రతికూలండాలరు బలోపేతం అవుతుండటం వల్ల ఇతర కరెన్సీల్లాగే రూపాయి కూడా పతనమవుతోంది. ఇలాంటప్పుడు రూపాయి మాత్రమే హఠాత్తుగా పతనమైతేనో లేక తీవ్ర ఒడిదుడుకులకు లోనైతేనో తప్ప దాన్ని బలోపేతం చేసేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోవడం శ్రేయస్కరం కాదు. ఒకవేళ జోక్యం చేసుకుంటే భారతీయ ఎగుమతిదార్లకు ప్రతికూలమవుతుంది. – రఘురామ్ రాజన్, మాజీ గవర్నర్, ఆర్బీఐ రూపాయి అధిక స్థాయిలో ఉందిరూపాయి విలువ ప్రస్తుతం అధిక స్థాయిలో ఉండటంతో అంతర్జాతీయంగా మన ఎగుమతి సంస్థలు పోటీపడటంపై ప్రతికూల ప్రభావం ఉంటోంది. కాబట్టి ఆర్థిక ఫండమెంటల్స్‌కి తగ్గ స్థాయికి రూపాయిని చేరుకోనివ్వాలి. రూపాయి క్షీణతను కొనసాగనివ్వడం వల్ల ఎగుమతులకు, అలాగే వృద్ధి సాధనకు సహాయకరంగా ఉంటుంది. – దువ్వూరి సుబ్బారావు, మాజీ గవర్నర్, ఆర్బీఐ -
మాజీ గవర్నర్ ఆత్మహత్య
సిమ్లా : సీబీఐ మాజీ డైరెక్టర్, నాగాలాంగ్ మాజీ గవర్నర్ అశ్వనీకుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సిమ్లాలోని తన ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు సిమ్లా ఎస్పీ మెహిత్ చావ్లా వెల్లడించారు. అశ్వనీకుమార్ 2006 నుంచి 2008 వరకు హిమాచల్ ప్రదేశ్ డీజీపీగా పనిచేశారు. అనంతరం 2008 ఆగస్ట్ నుంచి 2010 నవంబర్ వరకు సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సిఉంది. -
‘టూరింగ్ టాకీస్’ ముచ్చట్లు
సినిమాకు, ప్రేక్షకుల మధ్య ప్రధాన వారధి టూరింగ్ టాకీస్. ఆదిలో సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరచింది, అలరించింది ఈ టూరింగ్ టాకీస్‌లోనే. ఆ తరువాత కాలానుగుణంగా టూరింగ్ టాకీస్ల చోటే పెద్ద పెద్ద సినిమా మాల్స్ నిలిచా యి. ఇందతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పూర్వం రోజుల్ని గుర్తు తెచ్చేలా టూరింగ్ టాకీస్ పేరుతో ఒక చిత్రం తెరకెక్కింది. దీన్ని రూపొం దించింది ఎవరో కాదు. ప్రముఖ దర్శకుడు, ఇళయ దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో పలు విజ యవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఎస్ఏ చం ద్రశేఖర్ తన 69వ చిత్రంగా ఈ టూరింగ్ టాకీస్ రూపొందించాడు. మరో విశేషం ఏమిటంటే తన చిత్రంలో అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో మెరిసిన ఈ దర్శక, నిర్మాత టూరింగ్టాకీస్లో ప్రధాన పాత్రలో నటించారు. ఇది రెండు కథలతో కూడిన ఒక చిత్రం. అంతేకాదు టూరింగ్ టాకీస్ దర్శకుడిగా తన చివరి చిత్రం అని వెల్లడించేశారు. అభి శరవణ్, అశ్వినీకుమార్, సూనులక్ష్మి, గాయత్రి మొదలగు వారు యువ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఆర్‌కెవి స్టూడియోలో జరిగింది. కాగా రెండు కథలలో ఒక చిత్రం తెరకెక్కించిన ఎస్ఏ చంద్రశేఖర్ ఇదే వేదికపై ఆదివారం జరిగిన తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన సభ్యుల బృందానికి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను దర్శకుడిగా చాలా చిత్రాలు చేశానన్నారు. అయితే ఇప్పటికీ ప్రతి చిత్రాన్ని తొలి చిత్రంగానే భావిస్తూ పనిచేస్తానన్నారు. అయినా తాను సాధించిందేమీ లేదన్నారు. విజయ్ను హీరోగా చేయమని చాలామంది చుట్టూ తిరిగా తన కొడుకు విజయ్ నటించాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు తాను ఎంతైన ఖర్చు పెడుతానని చిత్రం చేయమని చాలామంది దర్శకులను అడిగానన్నారు. అయితే ఎవ్వరూ చేయడానికి ముందుకు రాకపోవడంతో తానే ఎందుకు దర్శక, నిర్మాతగా చేయరాదనే ఆలోచన రావడంతో విజయ్ హీరోగా చిత్రం చేశానని తెలిపా రు. ఆ తరువాత అతను నటుడిగా ఏ స్థాయికి ఎదిగారో తెలిసిందేనని అన్నారు. ఇక టూరింగ్ టాకీస్ గురించి చెప్పాలంటే తన జీవితంలో గుర్తుండిపోయే చిత్రం చేయాలన్న ఆలోచనకు ప్రతిరూపం ఈ చిత్రం అని తెలిపారు. దర్శకుడిగా ఇదే తన చివరి చిత్రం అన్నమాట నిజమేనని అయితే ఇంతకుముందు చట్టం ఒరు ఇరుట్టరై చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ అంటూ పలుభాషలలో తెరకెక్కించానని అదే విధంగా ఈ టూరింగ్ టాకీస్‌ను కూడా పలు భాషలలో రూపొందించనున్నట్లు ఎస్ఏ చంద్రశేఖర్ వెల్లడించారు. -
జెలియాంగ్కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ
నాగాలాండ్ కొత్త ముఖ్యమంత్రిగా నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) నేత టీఆర్ జెలియాంగ్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. నాగాలాండ్ రాజధాని కోహిమాలోని రాజభవన్లో జెలియాంగ్ చేత ఆ రాష్ట్ర గవర్నర్ అశ్వనీ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. జెలియాంగ్తోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇప్పటి వరకు నాగాలాంగ్ ముఖ్యమంత్రిగా ఉన్న నైపూ రియో సీఎం పదవికి, శాసనసభా స్థానానికి శుక్రవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన నైపూ రియో 4 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే జెలియాంగ్కు భారతదేశానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.