సినిమాకు, ప్రేక్షకుల మధ్య ప్రధాన వారధి టూరింగ్ టాకీస్. ఆదిలో సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరచింది, అలరించింది ఈ టూరింగ్ టాకీస్‌లోనే. ఆ తరువాత కాలానుగుణంగా టూరింగ్ టాకీస్‌ల చోటే పెద్ద పెద్ద సినిమా మాల్స్ నిలిచా యి. ఇందతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పూర్వం రోజుల్ని గుర్తు తెచ్చేలా టూరింగ్ టాకీస్ పేరుతో ఒక చిత్రం తెరకెక్కింది. దీన్ని రూపొం దించింది ఎవరో కాదు. ప్రముఖ దర్శకుడు, ఇళయ దళపతి విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో పలు విజ యవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఎస్‌ఏ చం ద్రశేఖర్ తన 69వ చిత్రంగా ఈ టూరింగ్ టాకీస్ రూపొందించాడు. మరో విశేషం ఏమిటంటే తన చిత్రంలో అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో మెరిసిన ఈ దర్శక, నిర్మాత టూరింగ్‌టాకీస్‌లో ప్రధాన పాత్రలో నటించారు.
ఇది రెండు కథలతో కూడిన ఒక చిత్రం. అంతేకాదు టూరింగ్ టాకీస్ దర్శకుడిగా తన చివరి చిత్రం అని వెల్లడించేశారు. అభి శరవణ్, అశ్వినీకుమార్, సూనులక్ష్మి, గాయత్రి మొదలగు వారు యువ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఆర్‌కెవి స్టూడియోలో జరిగింది. కాగా రెండు కథలలో ఒక చిత్రం తెరకెక్కించిన ఎస్‌ఏ చంద్రశేఖర్ ఇదే వేదికపై ఆదివారం జరిగిన తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన సభ్యుల బృందానికి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్‌ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను దర్శకుడిగా చాలా చిత్రాలు చేశానన్నారు. అయితే ఇప్పటికీ ప్రతి చిత్రాన్ని తొలి చిత్రంగానే భావిస్తూ పనిచేస్తానన్నారు. అయినా తాను సాధించిందేమీ లేదన్నారు.
విజయ్‌ను హీరోగా చేయమని చాలామంది చుట్టూ తిరిగా
తన కొడుకు విజయ్ నటించాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు తాను ఎంతైన ఖర్చు పెడుతానని చిత్రం చేయమని చాలామంది దర్శకులను అడిగానన్నారు. అయితే ఎవ్వరూ చేయడానికి ముందుకు రాకపోవడంతో తానే ఎందుకు దర్శక, నిర్మాతగా చేయరాదనే ఆలోచన రావడంతో విజయ్ హీరోగా చిత్రం చేశానని తెలిపా రు. ఆ తరువాత అతను నటుడిగా ఏ స్థాయికి ఎదిగారో తెలిసిందేనని అన్నారు. ఇక టూరింగ్ టాకీస్ గురించి చెప్పాలంటే తన జీవితంలో గుర్తుండిపోయే చిత్రం చేయాలన్న ఆలోచనకు ప్రతిరూపం ఈ చిత్రం అని తెలిపారు. దర్శకుడిగా ఇదే తన చివరి చిత్రం అన్నమాట నిజమేనని అయితే ఇంతకుముందు చట్టం ఒరు ఇరుట్టరై చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ అంటూ పలుభాషలలో తెరకెక్కించానని అదే విధంగా ఈ టూరింగ్ టాకీస్‌ను కూడా పలు భాషలలో రూపొందించనున్నట్లు ఎస్‌ఏ చంద్రశేఖర్ వెల్లడించారు.
‘టూరింగ్ టాకీస్’ ముచ్చట్లు
Published Tue, Jan 27 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM
Advertisement
Advertisement