Touring Talkies
-
రొమాంటిక్ టాకీస్
విజయ్ పెద్దిరెడ్డి హీరోగా ‘బిగ్‌బాస్’ ఫేమ్ భానుశ్రీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టూరింగ్ టాకీస్’. రంగనాధ్ ముత్యాల దర్శకత్వంలో ప్రేమ్ నాధ్ ముత్యాల నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘‘ఇదొక వెరైటీ రొమాంటిక్ ఎంటర్టైనర్. మా సినిమాను వేసవిలో విడుదల చేసేలా ప్లా¯Œ చేస్తున్నాం’’ అన్నారు దర్శకుడు రంగనాధ్. ఈ సినిమాకు ఉమ మహేష్బెరి స్వరకర్త. -
జయమ్ము నిశ్చయమ్మురా...!
పాటతత్వం నేను పదేళ్ల వయసులో ఉన్నప్పుడు టూరింగ్ టాకీస్ నుంచి లీలగా ‘జయమ్ము నిశ్చయమ్మురా...’ పాట విన్నప్పుడు ఎందుకో తెలియని ఉత్సాహం, ఓ బలం ఏర్పడేవి. 1971లో ఇండియా-పాకిస్థాన్ యుద్ధం సమయంలో సరిహద్దులో సైనికుడిగా పనిచేశాను. విచారం ఆవహించినప్పుడు ఈ పాటనే మననం చేసుకునేవాణ్ని. మహానటుడు నందమూరి తారకరామారావు నటించిన ‘శభాష్ రాముడు’ సినిమాలోని ఈ పాటను కొసరాజు రాఘవయ్య చౌదరిగారు రాస్తే, ఘంటసాల స్వరపరచి స్వయంగా ఆలపించారు. ఈ కథలోని మలుపులు... పాత్రలకు ఎదురయ్యే హఠాత్పరిణామాలు... ఇవన్నీ పాటను ప్రతిసారీ గుర్తు చేస్తూ ఉంటాయి. ఎక్కడో మనలో దాగున్న నిరుత్సాహాన్ని పోగొట్టి, ఉత్సాహాన్ని ఉరకలెత్తించే ఈ సినిమా కోసం ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రాశారు కొసరాజుగారు. ఇది ఒక్క వ్యక్తికే పరిమితమైన పాట కాదు... ఓ సమాజం ఎలా ఉండాలో చెబుతుంది. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా హఠాత్తుగా పోటెత్తిన గోదావరి ఆ ఊరిని ఉక్కిరిబిక్కిరి చేసింది. జమీందారుగా బతికిన రాముడి జీవితం తలకిందులైపోయింది. సిరిసంపదలన్నీ ప్రకృతి విలయానికి కొట్టుకుపోయాయి. తానొక్కడే కాదు.. భార్య, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురు, చదువుకుంటున్న తమ్ముడు... ఇలా అతని మీద ఆధారపడిన వాళ్లు ఉన్నారు. దాంతో పొట్ట చేతపట్టుకుని కుటుంబంతో సహా పట్నానికి వలస వచ్చిన రాముడి (ఎన్టీఆర్) కథే ‘శభాష్ రాముడు’. బాగా బతికిన కుటుంబం చితికిపోయి, సర్వం కోల్పోయిన అనాథలా మహానగరంలో ఒంటరిగా బతుకీడుస్తుంది. ఉద్యోగంలో ఆత్మాభిమానాన్ని తాక ట్టుపెట్టలేని పరిస్థితుల్లో రిక్షా నడిపి డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. ఏనాటికైనా స్వార్థమూ నశించి తీరునూ ఏ రోజుకైనా సత్యమే జయించి తీరును... బతకడం ఎలాగైనా బతకొచ్చు, కానీ నీతిగా, నిజాయతీగా జీవితాంతం తాము నమ్మిన వాటి కోసం కట్టుబడే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఇందులో కథానాయకుడి పాత్ర కూడా అంతే. తాను నమ్మిన నీతి కోసం ధైర్యంగా పోరాడతాడు. తన కోసం తాను ఆలోచించని మనిషి. అందుకే కుటుంబం కోసం పగలూ రాత్రి, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతాడు. తమ్ముణ్ని బాగా చదివించాలని డబ్బులు కూడబెడుతూ ఉంటాడు. అనుకోని ప్రమాదంలో హీరోకు బుల్లెట్ గాయమవుతుంది. రిక్షా నడపలేడు. కనీసం రెండు నెలల పాటు ఇంటికే పరిమితం కావాలి. దాంతో అతని తమ్ముడు మాత్రం అన్నయ్య తాత్కాలికంగా వదిలేసిన బతుకుబండిని చదువుకుంటూనే లాగటానికి సిద్ధపడతాడు. ఈ లోకమందు సోమరులై ఉండకూడదు పవిత్రమైన ఆశయాలు మరువకూడదు మనిషి అన్నాక ఏదో పని చేసుకుని బతకాలి. అంతేగానీ ఏ మాత్రం బాధ్యత లేకుండా తిరగడం తప్పు అని ఇందులోని ఎన్టీఆర్ పాత్ర చెప్పకనే చెబుతుంది. ఇటువంటి సిచ్యుయేషన్లు వస్తే మామూలుగా ఎవరైనా హీరోను పొగుడుతూ పాట రాయొచ్చు. ఈ పాటతో సమాజం మొత్తాన్ని ప్రభావితం చేయొచ్చనే ఉద్దేశంతో కొసరాజుగారు ఈ పాట రాశారు. గృహాన్ని స్వర్గసీమగా చేయుము దేవా బ్రోవుము దేవా కుటుంబమొక్క త్రాటిపైన నిలుపుము దేవా నడుపుము దేవా బీదసాదనాదరించు బుద్ధి నొసగి శక్తి నొసగుమా ఈ కథలో రాముడికి బుల్లెట్ గాయమైతే, అతని భార్య కూడా కష్టాల్లో ఉన్న సంసారాన్ని ఈదడానికి పనిమనిషిగా మారడానికి సిద్ధమవుతుంది. రాముడికి ఇది ఏ మాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే అతనికి చదువంటే ఇష్టం. కష్టపడి చదివి తమ్ముడు పోలీసాఫీసర్ కావడమే అతని కోరిక. ఎందుకంటే తనలాంటి పేదలపై పోలీసులు చూపిస్తున్న అధికార జులుంను అతనైనా పోగొట్టాలి. జయమ్ము నిస్వరించుగాక పోరిగెల్వవోయ్ స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్ యుద్ధంలో దెబ్బలు తప్పవు.... జీవితం అన్నాక కష్టాలు తప్పవు. మరణించేంత వరకూ గెలుపు కోసం ఓ సైనికుడిగా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒక తుపాకి మనిషి చేతిలో ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో... ఈ పాట మన గుండెలో ఉంటే అంతే మానసిక స్థైర్యం కలుగుతుంది. ఏదో తెలియని బలం. నా కెరీర్లో స్ఫూర్తి రగిలించే పాటలు ఎన్నో రాశాను. కానీ నాలో గెలవాలన్న తపన కలిగించే పాట మాత్రం ఈ ఒక్క పాటే. దీని స్ఫూర్తితోనే విజయశాంతి హీరోయిన్గా నటించిన ‘ఆశయం’ సినిమాలో ‘విరిసే ఉదయం’ పాట రాశాను. ‘జయమ్ము నిశ్చయమ్ము’లోని ప్రతి లైన్ ఇప్పటికీ గుర్తుందంటే కొసరాజుగారి రచనా శైలి అంత అద్భుతంగా ఉంది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 57 ఏళ్లు. ఇంకో వందేళ్లయినా ఈ పాట ఇంకా బతికే ఉంటుంది. -
‘టూరింగ్ టాకీస్’ ముచ్చట్లు
సినిమాకు, ప్రేక్షకుల మధ్య ప్రధాన వారధి టూరింగ్ టాకీస్. ఆదిలో సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరచింది, అలరించింది ఈ టూరింగ్ టాకీస్‌లోనే. ఆ తరువాత కాలానుగుణంగా టూరింగ్ టాకీస్ల చోటే పెద్ద పెద్ద సినిమా మాల్స్ నిలిచా యి. ఇందతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పూర్వం రోజుల్ని గుర్తు తెచ్చేలా టూరింగ్ టాకీస్ పేరుతో ఒక చిత్రం తెరకెక్కింది. దీన్ని రూపొం దించింది ఎవరో కాదు. ప్రముఖ దర్శకుడు, ఇళయ దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్. తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో పలు విజ యవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఎస్ఏ చం ద్రశేఖర్ తన 69వ చిత్రంగా ఈ టూరింగ్ టాకీస్ రూపొందించాడు. మరో విశేషం ఏమిటంటే తన చిత్రంలో అప్పుడప్పుడు అతిథి పాత్రల్లో మెరిసిన ఈ దర్శక, నిర్మాత టూరింగ్టాకీస్లో ప్రధాన పాత్రలో నటించారు. ఇది రెండు కథలతో కూడిన ఒక చిత్రం. అంతేకాదు టూరింగ్ టాకీస్ దర్శకుడిగా తన చివరి చిత్రం అని వెల్లడించేశారు. అభి శరవణ్, అశ్వినీకుమార్, సూనులక్ష్మి, గాయత్రి మొదలగు వారు యువ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం స్థానిక వడపళనిలోని ఆర్‌కెవి స్టూడియోలో జరిగింది. కాగా రెండు కథలలో ఒక చిత్రం తెరకెక్కించిన ఎస్ఏ చంద్రశేఖర్ ఇదే వేదికపై ఆదివారం జరిగిన తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన సభ్యుల బృందానికి అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను దర్శకుడిగా చాలా చిత్రాలు చేశానన్నారు. అయితే ఇప్పటికీ ప్రతి చిత్రాన్ని తొలి చిత్రంగానే భావిస్తూ పనిచేస్తానన్నారు. అయినా తాను సాధించిందేమీ లేదన్నారు. విజయ్ను హీరోగా చేయమని చాలామంది చుట్టూ తిరిగా తన కొడుకు విజయ్ నటించాలనే కోరికను వ్యక్తం చేసినప్పుడు తాను ఎంతైన ఖర్చు పెడుతానని చిత్రం చేయమని చాలామంది దర్శకులను అడిగానన్నారు. అయితే ఎవ్వరూ చేయడానికి ముందుకు రాకపోవడంతో తానే ఎందుకు దర్శక, నిర్మాతగా చేయరాదనే ఆలోచన రావడంతో విజయ్ హీరోగా చిత్రం చేశానని తెలిపా రు. ఆ తరువాత అతను నటుడిగా ఏ స్థాయికి ఎదిగారో తెలిసిందేనని అన్నారు. ఇక టూరింగ్ టాకీస్ గురించి చెప్పాలంటే తన జీవితంలో గుర్తుండిపోయే చిత్రం చేయాలన్న ఆలోచనకు ప్రతిరూపం ఈ చిత్రం అని తెలిపారు. దర్శకుడిగా ఇదే తన చివరి చిత్రం అన్నమాట నిజమేనని అయితే ఇంతకుముందు చట్టం ఒరు ఇరుట్టరై చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ అంటూ పలుభాషలలో తెరకెక్కించానని అదే విధంగా ఈ టూరింగ్ టాకీస్‌ను కూడా పలు భాషలలో రూపొందించనున్నట్లు ఎస్ఏ చంద్రశేఖర్ వెల్లడించారు. -
పూరి టూరింగ్ టాకీస్‌లో హార్ట్ ఎటాక్
చిన్నప్పుడు చూసిన కొన్ని సంఘటనలు, వాడిన వస్తువులు, మంచి అనుభూతి ఇచ్చిన ప్రదేశాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. అలా పూరి జగన్నాథ్‌కి గుర్తున్న వాటిలో ఓ థియేటర్ ఉంది. దాని పేరు ‘టూరింగ్ టాకీస్’. పూరి చిన్నప్పుడు వాళ్లకున్న సొంత థియేటర్ ఇది. అందులో సినిమాలు చూసేవాణ్ణని ఆయన పేర్కొన్నారు. అందుకే ఆల్రెడీ తనకు వైష్ణో ఫిలిం అకాడమీ బేనర్ ఉన్నప్పటికీ, ఇప్పుడు టూరింగ్ టాకీస్ పేరు మీద మరో బేనర్ ప్రారంభించారు పూరి జగన్నాథ్. ఈ సంస్థపై తొలి ప్రయత్నంగా స్వీయదర్శకత్వంలో ‘హార్ట్ ఎటాక్’ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నారు. నితిన్, అదాశర్మ జంటగా రూపొందనున్న ఈ చిత్రం ఈ నెల 30న ప్రారంభం కానుంది. ఇందులో నితిన్ కొత్త లుక్‌లో కనిపిస్తారట. దానికోసం ఇటీవల డిజైనర్ నీరజ కోన ఆధ్వర్యంలో కాస్ట్యూమ్స్ ట్రైల్ కూడా జరిగిందని సమాచారం.