Asokgajapatiraju
-
నాడు టీడీపీ ట్రస్టు బోర్డుగా మన్సాస్!
సాక్షి, అమరావతి: సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్మన్‌గా ఉండే హక్కు మహిళలకు లేదంటూ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు వాదించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును దేస్థానం ట్రస్టు బోర్డు, మన్సాన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఇటీవల ప్రమాణం స్వీకారం చేసి.. తనకు ఇంతటి బృహత్తర బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ పరిణామాలపై అశోక్ గజపతి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సంచయితకు కీలక బాధ్యతలు అప్పగించడాన్ని సహించలేకపోతున్న ఆయనకు గతంలో జరిగిన పరిణామాలు గుర్తుకురావడం లేదా అంటూ పలువురు విమర్శిస్తున్నారు. (సంచలనమైన సీఎం జగన్ నిర్ణయం ) కాగా 2016 ఏప్రిల్‌లో మాన్సాస్ వ్యవహారం టీడీపీ చేతిలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం మాజీ కులపతి ఐవీ రావులను ట్రస్టు సభ్యులుగా నియమిస్తూ అప్పటి ప్రభుత్వం 2016 ఏప్రిల్ 7న జీవో 139 జారీ చేసింది. ఆ తర్వాత 2017 ఏప్రిల్ 27న వారిద్దరిన్నీ కొనసాగిస్తూనే... జీవో నంబర్ 155 ద్వారా అశోక్‌గజపతి కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా బోర్డు సభ్యురాలిగా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. అయితే అప్పుడు పూసపాటి వారసురాలైన ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయితను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తమ ఇష్టానుసారం వ్యవహరించారు. ఈ క్రమంలో సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచ మాల భూ సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేసిన ప్రభుత్వం... తాజాగా ట్రస్టు చైర్‌పర్సన్‌గా సంచయితను నియమించింది. అదే విధంగా... అశోక్ గజతిరాజు కుమార్తె అదితి విజయలక్ష్మిని కూడా సభ్యురాలిని చేసి.. ఆమెతో పాటు మొత్తంగా ఇదే కుటుంబానికి చెందిన ముగ్గురికి మాన్సాస్ ట్రస్టుబోర్డులో స్థానం కల్పించింది. -
జూన్ చివరికి స్వచ్ఛభారత్‌పై తుది నివేదిక
సబ్ కమిటీ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ అభియాన్‌పై తుది నివేదికను జూన్ చివరి నాటికి కేంద్రానికి అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం, సబ్ కమిటీ కన్వీనర్ చంద్రబాబు చెప్పారు. నీతి ఆయోగ్‌లో గురువారం స్వచ్ఛభారత్ అభియాన్ సబ్ కమిటీ సమావేశం చైర్మన్ చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్ర, మిజోరం, సిక్కిం, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఏర్పాటైన సబ్ కమిటీ తొలి సమావేశంలో సీఎంలు చంద్రబాబు, మనోహర్‌లాల్ ఖట్టర్ (హరియాణా), సిద్దరామయ్య (కర్ణాటక) హాజరయ్యారు. సమావేశానికి వస్తున్నట్టుగా సమాచారం ఇచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనివార్యకారణాల వల్ల గైర్హాజరయ్యారు. ఏపీ మంత్రి పి.నారాయణ, రాష్ట్రాల మంత్రులు దినేశ్ అగర్వాల్ (ఉత్తరాఖండ్), ఆసిం అహ్మద్ ఖాన్ (ఢిల్లీ), రంజిత్ పాటిల్ (మహారాష్ట్ర) లతో పాటు అధికారులు హాజరయ్యారు. భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛభారత్ విధి విధానాలు, ప్రభుత్వ మార్గదర్శకాలపై చర్చించామన్నారు. దేశ, విదేశాల్లో ఉన్న ఉత్తమ విధానాలపై అధ్యయనం చేయడం కోసం వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశామన్నారు. నీతి ఆయోగ్ సీఈఓ సమన్వయకర్తగా ఉంటారని, తొమ్మిది రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు వర్కింగ్ గ్రూప్‌లో సభ్యులుగా ఉంటారని, వారు ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేస్తారని చెప్పారు. రెండో సమావేశం ఈ నెల 15న చండీగఢ్‌లో ఉంటుందని, మూడో సమావేశాన్ని దక్షిణాదిన నిర్వహిస్తామని వెల్లడించారు. కేంద్ర మంత్రులతో భేటీలు: కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడులతో చంద్ర బాబు భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై ప్రస్తావించారు.అనంతరం టీడీపీపీ కార్యాలయంలో మంత్రులు సుజనా చౌదరి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావులతో కలిసి టీడీపీ, బీజేపీ ఎంపీలతో సమావేశమై రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పార్లమెంటు ప్రాంగణంలో బాబు మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం భూసేకరణపై వెల్లువెత్తుతున్న విమర్శలపై అడగ్గా.. రాష్ట్రాభివృద్ధికోసమే భూసేకరణ చేస్తున్నామని, భూమిలేకుండా అభివృద్ధి జరగదన్నారు. రాహుల్‌గాంధీ ఏపీ పర్యటనపై అడగ్గా.. ఆయన పర్యటనతో ఏపీకి ఒరిగేదేమీలేదని ఎద్దేవా చేశారు. జిందాల్ విద్యుత్ ప్లాంట్‌ను సందర్శన ఢిల్లీ పారిశ్రామిక ప్రాంతం ఓఖ్లా, తిమార్‌పుర్‌లోని చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న జిందాల్ విద్యుత్ ప్లాంట్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. నేడు తూర్పుగోదావరికి చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు నాయుడు మేడే రోజున తూర్పుగోదావరి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9.20 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. జిల్లాలో ఏర్పాటుచేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. -
మన ఊసేలేదు!
నిన్న రైల్వే బడ్జెట్.. నేడు కేంద్ర సాధారణ బడ్జెట్.. దేనిలోనూ జిల్లాకు తగిన ప్రాధాన్యత దక్కలేదు. రైల్వే బడ్జెట్లో గుర్తింపు లభించకపోయినా సాధారణ బడ్జెట్లో పెద్దపీట వేసేలా గులాబీ నేతలు లాబీయింగ్ చేస్తారని అందరూ ఆశించారు. కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్‌గజపతి రాజు ఉండటంతో గన్నవరం విమనాశ్రయ అభివృద్ధికి నిధులు మంజూరుచేయిస్తారని భావించారు. కానీ మరోసారి జిల్లాకు మొండిచెయ్యే చూపారు. సాక్షి, విజయవాడ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పడుతుందని, కేంద్ర బడ్జెట్లో భారీ ప్రాజెక్టులు ప్రకటిస్తారని ఆశించగా... జిల్లాకు మొండి చెయ్యి చూపించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర విభజన బిల్లులో ప్రస్తావించిన ఐఐటీ, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం తదితర అంశాలనే బడ్జెట్లో కూడా పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. భారీ ప్రాజెక్టులను సాధించడంలో జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. పోర్టుల ఊసే లేదు! ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయం, బందరు పోర్టుల అభివృద్ధి చేయాలంటే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఎయిర్‌పోర్టు విస్తరణ, బందరు పోర్టు నిర్మాణానికి భూసేకరణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎన్టీఏ భాగస్వామి అయిన టీడీపీ ఎలాగైనా కేంద్ర బడ్జెట్ ద్వారా వీటిని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుందని అందరూ భావించారు. రాష్ట్రానికి చెందిన అశోక్‌గజపతిరాజు కేంద్ర పౌరవిమానశాఖ మంత్రిగా ఉండటంతో కనీసం ఎయిర్‌పోర్టుకు అయినా మహర్దశ పడుతుందని ఆశించారు. కానీ ఇందుకు విరుద్ధంగా బడ్జెట్లో వీటి ఊసే లేకపోవడంతో ఈ పోర్టుల అభివృద్ధి ఏ మేరకు జరుగుతాయనేది అనుమానమే. ధరల స్థిరీకరణ నిధులపై ఆగ్రహం.. ధరల స్థిరీకరణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులపై విపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధికి రూ.500కోట్లు కేటాయించడమంటే సగటున ఒక్కో మనిషికి రూ.5లు కేటాయించినట్లు. తలకు రూ.5 చొప్పున కేటాయించి ధరలను ఏ విధంగా స్థిరీకరిస్తారని వామపక్షనేతలు ప్రశ్నిస్తున్నారు. పెట్రోలియం సబ్సిడీని 22,054 కోట్లకు కుదించడం వలన పెట్రో ఉత్పత్తుల ధరల రాబోయే ఏడాది కాలంలో పెంచేందుకే మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అర్థమవుతోందని, పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఈ ప్రభుత్వం ఏమీ ఆదుకుంటుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్ను మినహాయింపుపైనా అసంతృప్తి ఆదాయపు పన్ను పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.2.50లక్షలకు మాత్రమే పెంచటం మధ్య తరగతి ఉద్యోగులను నిరాశను మిగిల్చింది. కొద్దిరోజులుగా ఐటీ పరిమితిని రూ.4లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచవచ్చనే ప్రచారం జరిగింది. దీంతో తమకు మేలు జరుగుతుందని ఆశించిన జిల్లాలోని ఉద్యోగులకు నిరాశే మిగిలింది. వ్యవసాయ రంగం పట్ల కూడా మోడీ ప్రభుత్వం చిన్న చూపు చూసిందని, రైతులకు కంటి తుడుపుగా కొన్ని పథకాలు ప్రకటించిందని వాటి వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని రైతు నాయకులు మండిపడుతున్నారు. -
కింగ్‌ఫిషర్ వల్లే చెడ్డపేరు
కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు విజయనగరం: కింగ్‌ఫిషర్ సంస్థ వల్లే విమానయాన రంగానికి చెడ్డపేరు వచ్చిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు చెప్పారు. విజయనగరంలో ఆదివారం జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కింగ్‌ఫిషర్ సంస్థ పన్నులు కట్టకపోవడం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం వల్ల విమానయాన రంగానికి చెడ్డపేరు వచ్చిందని పేర్కొన్నారు. సీమాంధ్ర లో విమానయాన అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తామన్నారు. ఉన్న విమానాశ్రాయాల అభివృద్ధికి కృషిచేస్తామని, పాతవి తొలగించే ఆలోచన లేదని చెప్పారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సౌకర్యాలు పెంచుతామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యే క హోదా కల్పించాలని కోరుతున్నామన్నారు. యూపీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామన్నారని, దాన్ని 15 ఏళ్లకు పొడిగించాలని తమపార్టీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. బంధుప్రీతిపై మంత్రి గరం! న్యూఢిల్లీ: విమానయూన రంగంలో.. ఆ రంగానికి చెందిన పలువురు అధికారుల బంధువుల ఉద్యోగితపై మంత్రి అశోక్ గజపతిరాజు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ మేరకు డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, ఎరుుర్ ఇండియూ, భారత విమానాశ్రయూల సంస్థ (ఏఏఐ) పవన్ హన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్, విమానాశ్రయూల ఆర్థిక నియంత్రణ సంస్థ (ఏఈఆర్ఏ), ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బంధువుల వివరాలను తెలియజేయూల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది.