asramam
-
ఆ..శ్రమ పడాల్సిందేనా..
శ్రీకాకుళం , సీతంపేట: గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నాసిరక భోజనమే అందుతోంది. రుచీపచీ లేని కూరలు, రసంతో తినలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రధానంగా చాలీచాలనీ వంట సిబ్బందితో వండి పెట్టడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ఈ పోస్టుల భర్తీలో మీనమేశాలు లెక్కించడంతో తప్పడం లేదు. జిల్లాలోని 47 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 5,176 వేల మంది బాలురు, 5,188 మంది బాలికలు చదువుతున్నారు. మొత్తం 11 వేల మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 16 పోస్టుమెట్రిక్ వసతిగృహాల్లో 4 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికి మూడు పూటలా భోజనం వండి పెట్టాల్సి ఉంది. ఇందుకుగాను మొత్తం 203 మంది అవసరం కాగా, 113 మంది మాత్రమే ఉన్నారు. 90 పోస్టుల వరకు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. వంటమనుషులు 29, సహాయకులు 33, వాచ్మెన్లు 28, ఆఫీస్ సభార్డినేట్లు 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా వంటశాలలు సైతం 15 పాఠశాలల వరకు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పరిస్థితి... స్థానిక ఆశ్రమ పాఠశాలల వసతి గృహాలతోపాటు మారుమూల గ్రామాల్లోని వసతి గృహాల్లోనూ ఇబ్బందులు తప్పడంలేదు. సీతంపేట బాలికల గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో 650 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి వండి వడ్డించడానికి ఇద్దరు వంటమనుషులు, మరో ఇద్దరు సహాయకులు, నైట్‌వాచ్‌వుమెన్ ఉండాలి. ఒక వాచ్మెన్, కుక్ మాత్రమే ఉన్నారు. పూతికవలసలో 500ల మందికి పైగా విద్యార్థులు ఉండగా ఒక వంట మనిషే ఉన్నారు. పొల్ల ఆశ్రమ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ఇంతవరకు నైట్‌వాచ్‌మెన్ లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే శంబాం, హడ్డుబంగి, చిన్నబగ్గ తదితర ఆశ్రమ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నిలిచిన పోస్టుల భర్తీ.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో గిరిజన విద్యకు కల్పిస్తున్న మౌలిక వసతులకు పొంతన లేకుండా పోయింది. మూడేళ్ల క్రితం ఖాళీ పోస్టులను ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేయడానికి చర్యలు తీసుకున్నప్పటకీ పైరవీలు చోటు చేసుకోవడంతో మధ్యలో నిలుపుదల చేశారు. పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాల పరిస్థితి మరీ దారుణం. అక్కడ పోస్టులే మంజూరు కాకపోవడం గమనార్హం. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో వసతిగృహ సంక్షేమాధికారులు సొంత డబ్బులు వెచ్చించి ప్రయివేటుగా వంటమనుషులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ విద్యాసంవత్సరం కూడా వచ్చే నెల 23వ తేదీతో ముగియనుంది. అప్పటివరకూ వీరితోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఏమన్నారంటే... ఈ విషయమై గిరిజన సంక్షేమశాఖ డీడీ భవానీశంకర్ వద్ద ప్రస్తావించగా వంటమనుషులు, సహాయకులు, ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ఐటీడీఏ పీవో ద్వారా ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. వాటి భర్తీకి అనుమతిరావాల్సి ఉందన్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు లేవు ప్రభుత్వ మొద్దునిద్రతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మారుమూల ప్రాంతాల్లో వంటవారితోపాటు వంట పాకల సమస్య ఉంది. అది కూడా పరిష్కరించాల్సి ఉంది. ఇప్పట్లో ఇవి పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు.– ఎం కనకారావు,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు -
గురుకుల పాఠశాల విద్యార్థినికి గర్భం.. ఆలస్యంగా వెలుగులోకి
ప్రకాశం, పుల్లలచెరువు: పుల్లలచెరువు మండలంలోని గారపెంట గిరిజన గూడెంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి బాలిక గర్భం దాల్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఉలిక్కిపడ్డ ఆ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు బాలికకు గర్భం వచ్చిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేయగా బుధవారం వై పాలెంలోని సహాయ గిరిజన సంక్షేమాధికారి దస్తగిరి సదరు బాలిక తల్లిదండ్రులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి తల్లిదండ్రులు, గూడెం పెద్దలను పిలిపించి పాఠశాల సిబ్బంది సమక్షంలో సుదీర్ఘ విచారణ చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థినికి ఇదే గూడెంకు చెందిన యాకసిరి చిరంజీవి అనే యువకుడితో కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తమ విచారణలో తెలసిందన్నారు. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా బాలిక పాఠశాలకు రాకపోవడంతో సిబ్బంది ఆ విద్యార్థిని ఇంటికి వెళ్లి కారణాలు అడిగారు. తమ కుమార్తె గర్భం దాల్సిన విషయం తెలిసిందని, దానిపై తమ కుల పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగిందందని తల్లిదండ్రులు చెప్పారన్నారు. మైనారిటీ తీరగానే కట్టుబాట్లు ప్రకారం వివాహం జరిగేలా కులపెద్దల పంచాయతీ చేశారని చెప్తున్నారు. ఈ విషయంలో పాఠశాల సిబ్బందికి ఎటువంటి సంబంధం లేదని, మా బిడ్డను పదో తరగతి పరీక్షల కోసమే పాఠశాలకు పంపుతున్నట్లుగా తల్లిదండ్రులు చెప్పినట్లు దస్తగిరి తెలిపారు. గూడెం పెద్దలు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ఇచ్చిన పూర్తి విచారణ నివేదికల వివరాలను జిల్లా అధికారులకు తెలియచేసి, వారి ఆదేశాలను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఆజాగ్రత్తగా ఉండే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ విషయంపై పాఠశాల సిబ్బందిని వివరణ కోరగా 2016లో జరిగిన ఘటన తర్వాత పాఠశాలలో రాత్రివేళ బాలికలు ఎవరినీ ఉండనీయకుండా తల్లిదండ్రుల అనుమతితో ఇంటికి పంపిస్తున్నామన్నారు. ఈ విషయం అధికారులకు కూడా తెలిపినట్లుగా చెప్పారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, సిబ్బంది వెళ్లి గూడెంలోని పాఠశాల సిబ్బందిని, బాలిక, యువకుడి తల్లిదండ్రులను విచారించి నివేదికను అధికారులకు తెలియచేస్తామన్నారు. -
నిత్యానంద నుంచి నా భార్యను విడిపించండి
టీ.నగర్: నిత్యానంద ఆశ్రమం నుంచి తన భార్యను విడిపించాలని భర్త కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశాడు. రాశిపురం తాలూకా పట్టణం మునియప్పపాళయం ప్రాంతానికి చెందిన రైతు రామస్వామి. ఇతని భార్య అత్తాయి (50). రామస్వామి తన భార్య నిత్యానంద ఆశ్రమంలో ఉన్నారని, ఆమెను విడిపించాలని నామక్కల్ జిల్లా కలెక్టర్‌కు ఒక పిటిషన్ అందజేశారు. అందులో.. తన భార్య అత్తాయి, కుమారుడు పళనిస్వామి కొన్ని నెలల కిందట బెంగళూరులోని నిత్యానంద మఠానికి ధ్యానం చేసేందుకు వెళ్లారని, తర్వాత వారు తిరిగి రాలేదని తెలిపారు. దీనిపై నామక్కల్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు బెంగళూరుకు వెళ్లి తన కుమారుడు పళనిస్వామిని విడిపించి తనకు అప్పగించినట్లు తెలిపారు. అయితే అత్తాయి రాలేదని, ఆమె గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు. తన భార్య పేరిట వడుకం ఇండియన్ బ్యాంకులో రూ.5లక్షలు, ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.5లక్షలు, నగల రుణం రూ.30 వేలు, బయటి వ్యక్తుల రుణాలు రూ.11 లక్షల వరకు ఉన్నాయని, ఈ నగదును ధ్యాన తరగతులకు ఖర్చు చేసినట్లు తెలిపారు. బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి నగదు చెల్లించాలని కోరుతున్నారని, ఎనిమిది నెలలుగా మానసిక క్షభకు గురవుతున్నట్లు తెలిపారు. తనకు ఆత్మహత్య తప్ప గత్యంతరం లేదని, తన భార్యను నిత్యానంద ఆశ్రమం నుంచి విడిపించాలని కోరారు. -
సారే మహాన్ సే ఇచ్ఛ
సినిమాల్లో బ్రహ్మాజీ ఓ ఆవేశపరుడు.. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్.. సిద్ధాంతాల కోసం పోరాడే జర్నలిస్ట్.. నమ్మిన బంటు.. హాస్యాన్ని కూడా పండించగల నటుడు. మేకప్ తీసేస్తే.. బ్రహ్మాజీ ఒక కామన్ సిటిజన్ మాత్రమే కాదు.. బుద్ధిజంతో తనను తాను మరింత ఉన్నతంగా మలుచుకుంటున్నాడు. ఈ ప్రయత్నంలోనే బ్రహ్మాజీకి ఇచ్ఛతో దోస్తీ కుదిరింది. అక్కడి పసిమనసులతో ఆప్యాయత పెరిగింది. ఇంతకీ బ్రహ్మాజీ తన ఇచ్ఛ ఎలా నెరవేర్చుకుంటున్నాడో ఆయన మాటల్లోనే.. ప్రజెంటేషన్: భువనేశ్వరి స్పందించే గుణముంటే.. సమాజానికి ఏదో రకంగా ఉపయోగపడతామని మధు టుగ్నైడ్ని చూస్తే అనిపిస్తుంటుంది. ఎంచక్కా భర్త భారత నేవీలో కమాండర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. కొడుకు ఎమ్ టీవీలో ఉద్యోగి. ఏ బాధలు, బాధ్యతలూ లేవు. హాయిగా విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో అనాథపిల్లలు.. అదీ ఆరోగ్యంగా లేని పిల్లల సంరక్షణ బాధ్యత తీసుకుంది. నా భార్య శాశ్వత బెస్ట్ ఫ్రెండ్ మధు. ఓసారి శాశ్వతతో కలసి మధు స్థాపించిన ఇచ్ఛా ఆశ్రమానికి వెళ్లాను. జస్ట్ విజిటింగ్ కోసం వెళ్లినవాణ్ని.. రోజు గడిచినా అక్కడ నుంచి కదల్లేకపోయాను. బుద్ధిజంలో చేరాక.. ‘ఇచ్ఛ' అంటే కోరికని అర్థం. తన కోరిక మేరకు మధు స్థాపించిన ఆశ్రమం వెనుకున్న ఆశయం.. సాయపడాలన్న కోరిక తీర్చుకోవడమే. మధుకి సేవ చేయాలన్నది చిన్ననాటి నుంచి ఉన్న కోరిక. భర్త ఉద్యోగం మేరకు వైజాగ్‌లో స్థిరపడ్డారు. ఇక మా శాశ్వత, మధులది పదిహేనేళ్ల స్నేహం. మేం బుద్ధిస్టుల అసోసియేషన్ సోకా గక్కాయ్ ఇంటర్నేషనల్‌లో సభ్యులం. ఈ అసోసియేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామందిని కలిసే అవకాశం దొరికింది. ఇదే క్రమంలో సేవాభావం ఉన్న వ్యక్తులను కలిశాను. బుద్ధిజంలో చేరాక నా జీవితంలో చాలా మార్పు చూశాను. మధుతో స్నేహం కూడా సోకా గక్కాయ్ పుణ్యమే. కొడుక్కి ఉద్యోగం వచ్చి ఢిల్లీకి వెళ్లిపోయిన తర్వాత మధు మనసు సేవపైకి మళ్లింది. వైజాగ్‌లోని అనాథపిల్లలుండే శిశువిహార్‌కి వెళ్లినపుడు అక్కడ ఇద్దరు పిల్లలు ఆమె చెయ్యిపట్టుకుని వదల్లేదట. అంతే.. తన ‘ఇచ్ఛ' తీర్చుకునే సమయం వచ్చిందనుకుంది. వైజాగ్‌కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న అచ్యుతాపురం మండలం కొండకర్ల గ్రామం దగ్గర ‘ఇచ్ఛ’ ఆశ్రమం నెలకొల్పింది. ఆ పిల్లల ప్రత్యేకత... గత ఏడాది నేను, నా భార్య మొదటిసారి ‘ఇచ్ఛ' ఆశ్రమానికి వెళ్లాము. పచ్చని చెట్ల మధ్య చెక్కతో నిర్మించిన ఆశ్రమంలోకి అడుగుపెట్టగానే చాలా ప్రశాంతంగా తోచింది. ఆశ్రమంలో కనిపించిన అమాయక పసి హృదయాలు మరింత ప్రశాంతతను పంచాయి. నేను వెళ్లినపుడు ఓ పదిమంది పిల్లలున్నారు. అందరూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నవారే. కొందరు మానసిక వికలాంగులు, ఇంకొందరు శారీరక వికలాంగులు. ఒకమ్మాయి అయితే తలను నిలబెట్టలేదు, నిలబడలేదు, నడవలేదు, కూర్చోలేదు. ఏడాది వయసుంది. కానీ చూడ్డానికి ఎంత ముద్దుగా ఉందో! ఆ అమ్మాయిని ఎత్తుకున్నంతసేపు నా మనసు ఎంత తేలికగా అనిపించిందో. నాకు ఆ భగవంతుడ్ని పూజించిన భావన కలిగింది. నా చుట్టూ చేరిన పిల్లల్లో.. అమాయకంగా కొందరు, ఆయోమయంగా ఇంకొందరు నవ్వుతుంటే.. అర్థంకానట్టు నన్ను చూస్తుంటే నా మనసు తరుక్కుపోయింది. ఎందుకంటే వారికి అన్నం పెట్టగలం, వైద్యం చేయించగలం కానీ మనలాంటి జీవితాన్ని మాత్రం ఇవ్వలేం కదా అనిపించింది. నేనే బ్రాండ్ అంబాసిడర్‌ని... ఏదో ఫ్రెండ్ సేవను చూడ్డానికి వెళ్లాం. కానీ అక్కడికి వెళ్లాక నా మనసులో బోలెడన్నీ ఆశయాలు పుట్టేశాయి. నేను ఊహించినదానికంటే నా మనసు ఎక్కువగానే స్పందించింది. ‘ఇచ్ఛ’కి నాలుగు రూపాయల ఆర్థికసాయం చేసి ఊరుకుంటే సరిపోదు. ఇంకా ఏదో చేయాలనిపిచింది. నా భార్య శాశ్వత మాత్రం ఏడాదిలో వీలైనన్నిసార్లు ఆ ఆశ్రమానికి వెళ్లి ఆ పిల్లలకు సేవ చేయాలనుకుంది. మరి నేను.. అని అలోచించుకుంటే ‘ఇచ్ఛ’కి కావాల్సిన ప్రచారం చేయాలనుకున్నాను. సేవాప్రచారం కూడా సేవే కదా అనుకున్నాను. ఇండస్ట్రీలో నాకున్న స్నేహితులందరికీ మధు చేస్తున్న సేవ గురించి చెప్పి వీలైనంత ఎక్కువ మొత్తంలో ఆర్థికసాయం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఐ లవ్ మధు మధు ఆశ్రమంలో ఉన్న పిల్లలంతా రకరకాల వ్యాధులతో ఇబ్బందిపడుతున్నారు. వారికి ఆమె ఇంతన్నం పెట్టి ఊరుకోవట్లేదు. అవసరమైన వైద్యం నుంచి ఫిజియోథెరపీ వరకూ ఏదీ కూడా కాంప్రమైజ్ కాకుండా చేస్తోంది. మేం ఒకరోజంతా ఉన్నామక్కడ. మధు చేస్తున్న సేవ నన్ను, బ్రహ్మాజీని బాగా కదిలించింది. మాకు వీలైనంత సాయం చేయడానికి ముందుకొచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై ఫ్రెండ్. - శాశ్వత వారి రాకతో.. బ్రహ్మాజీ, శాశ్వత వాళ్లిద్దరూ నా ఆశ్రమానికి రావడం మొదలుపెట్టాక మా చట్టుపక్కల ప్రజల నుంచి మంచి స్పందన రావడం మొద లైంది. నటుడిగా బ్రహ్మాజీకున్న పేరు నా ఆశ్రమం మనుగడకు చాలా ఉపయోగపడుతోంది. - మధు