Assailant
-
కెనడా పార్లమెంట్‌కు తాళాలు.. ఎన్నికల వేళ అసలేం జరుగుతోంది?
కెనడా పార్లమెంటు భవనంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో తాత్కాలికంగా మూసివేసినట్లు ఒట్టావా పోలీసులు వెల్లడించారు. అక్రమంగా పార్లమెంట్ హిల్‌లోని ఈస్ట్ బ్లాక్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి రాత్రంతా లోపలే ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, దుండగుడి వద్ద ఆయుధాలు ఉన్నాయా లేదా అనే దానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు.శనివారం రాత్రి ఓ వ్యక్తి పార్లమెంట్ భవనంలోకి అక్రమంగా చొరబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భవనం చుట్టూ పోలీసులను మోహరించారు. బ్యాంక్ స్ట్రీట్ నుండి సస్సెక్స్ డ్రైవ్ వరకు వెల్లింగ్టన్ స్ట్రీట్‌లోని అన్ని రోడ్లను మూసివేశారు. పెద్ద సంఖ్యల్లో పోలీసులు మోహరించారు. తూర్పు బ్లాక్‌లో ఉన్న సిబ్బంది మొత్తం ఒకే గదిలోకి చేరుకొని తాళాలు వేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. సహకరించిన ప్రజలకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.కాగా, కెనడాలో అక్టోబర్ 27న జరగాల్సిన ఎన్నికలను ఆరు నెలలకు ముందుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ పార్లమెంటును రద్దు చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ భవనంలోకి దుండగుడు ప్రవేశించడంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అపహరించడానికి దుండగుడు ప్రయత్నించి ఉంటాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. -
స్వాతి కేసు ఏమైంది?
ఏళ్లు గడుస్తున్నా వీడని చిన్నారి హత్య కేసు మిస్టరీ కుమార్తెను గుర్తు చేసుకొని రోదిస్తున్న కన్నవారు నరసన్నపేట : అది ఆగస్టు 20.. 2011వ సంవత్సరం.. ఎప్పటిలాగానే చిట్టి స్వాతి పాఠశాలకు వెళ్లింది. అయితే తిరిగి ఇంటికి చేరలేదు. గుర్తు తెలియని దుండగుడు ఆ చిన్నారిని గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. హత్యోదంతం తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది గుర్తించేలోపే పాఠశాల ఆవరణలోనే ప్రాణాలను విడిచింది. ఈ దారుణం తెలుసుకొని నరసన్నపేటతోపాటు జిల్లా మొత్తం నిర్గాంతపోయింది. అయ్యో ఎంత పని చేశాడు.. అభం సుభం తెలియని బాలికను పొట్టన పెట్టుకున్నాడే అని ప్రజలు కంట తడి పెట్టారు. తన కుమార్తె తిరిగి రాని లోకాలకు వెళ్లిందని స్వాతిని అల్లారు ముద్దుగా చూసుకొనే తల్లిదండ్రులు రోదించారు. అప్పట్లో ఈ హత్య కేసు సంచలనమైంది. అప్పటికి స్వాతి నరసన్నపేటలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతూ అక్కడికి సమీపంలోని భవానీపురంలో కుటుంబ సభ్యులతో ఉండేది. బాలిక తల్లి పాఠశాల సమీపంలోనే కూరగాయల షాపులో పని చేస్తుండేది. సంఘటన ఎలా జరిగిందంటే.. మధ్యాహ్న భోజనం పాఠశాలలోనే చేసిన స్వాతి మరో రెండు గంటల్లో ఇంటికి వెల్తుందనగా ఈ దారుణ సంఘటనలో ప్రాణాలు కోల్పోయింది. మధ్యాహ్నం 3.30 గంటల సమయం అవుతుంది. తోటి పిల్లలతో ఆటాడుకుంటుండగా గోడ దూకి వచ్చిన ఒక అగంతుకుడు (ఉన్మాది) అమాంతంగా స్వాతిని ఒడిసి పట్టుకొని గొంతుపై కత్తితో కోసి అంతే వేగంగా గోడ దూకి పరారయ్యాడు. రక్తం మడుగులో ఉన్న స్వాతి అక్కడిక్కడే ప్రాణాలు వదిలింది. చురుగ్గా దర్యాప్తు వెంటనే తేరుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికి సీఐగా మూర్తి, ఎస్ఐగా తిరుపతిరావులు ఉండేవారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తిరుపతిరావు ఇచ్చిన ఫఇర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 302 కింద క్రైమ్ నంబరు 108-11గా కేసు నమోదు చేశారు. సంఘటనపై పూర్తిగా పరిశీలించడంతోపాటు.. అన్ని కోణా ల్లో దర్యాప్తు చేశారు. చివరికి ఒక ఉన్మాది ఈ హత్యకు పాల్పడ్డట్టు నిర్ధారణకు వచ్చారు. అంతే ఆ తరువాత ఇప్పటి వరకూ దీనిపై కనీస పురోగతి లేదు. స్వాతి తల్లిదండ్రులు ఇప్పటికీ కుమార్తెను తలుచుకొని రోదిస్తున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలిక ఉన్మాది చేతిలో హత్యకు గురైన సంఘటనను ఇప్పటికీ నరసన్నపేట పట్టణ వాసులు మరిచిపోలేక పోతున్నారు. కొలిక్కి రాని కేసుస్వాతి హత్య కేసు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. నిందితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేసినప్పటికీ ఆచూకీ లభించలేదు. సుమారు ఏడాది పాటు దర్యాపు చేసిన పోలీసులు ఆ తరువాత నిలిపి వేశారు. బాధగా ఉంది అల్లారు ముద్దుగా పెంచుకున్న స్వాతిని మరచిపోలేకపోతున్నాం. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా తలచుకొని బాధపడుతున్నాను. పోలీసులు కూడా ఏమీ తేల్చలేక పోయారు. బాధిగా ఉంది. నాకుమార్తె బతికిఉంటే ఎంతో సందడిగా ఉండేది. - లక్ష్మి, స్వాతి తల్లి -
జ్యోతి కాదు..అపరకాళిక
కత్తితో దాడికి యత్నించిన దుండగుడిపై తిరగబడిన యువతి కళ్యాణదుర్గం : దుండగుడు కత్తితో దాడి చేసినా ఆ యువతి వెరవలేదు. భయపడలేదు. అందరి ఆడపిల్లల్లా దౌర్జన్యానికి తలొగ్గలేదు. ఎవరో వచ్చి కాపాడుతారని ఎదురు చూడలేదు. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించింది. చాకచక్యంగా దుండగుడి చేతిలోని కత్తి లాక్కొని అపరకాళికగా మారింది. దీంతో దుండగుడు కాళ్లకు పనిచెప్పాల్సి వచ్చింది. కళ్యాణదుర్గంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని దొడ్డగట్టరోడ్డులో నాగరాజు, లక్ష్మిదేవి దంపతులు నివాసం ఉంటున్నారు. నాగరాజు పాల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి కుమార్తె జ్యోతి డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న జ్యోతి.. దొడ్డగట్ట రోడ్డులోని పూర్ణానంద స్వామి ఆశ్రమం వద్దకు రోజు పాలు ఇచ్చి ఇంటికి వచ్చేది. రోజువారి తరహాలోనే శనివారం సాయంత్రం ఆశ్రమంలో పాలు ఇచ్చి బయల్దేరింది. ఇంటి సమీపంలోనే గుర్తు తెలియని యువకుడు ముఖానికి ఖర్చీఫ్ కట్టుకుని కత్తితో దాడికి ప్రయత్నించాడు. ప్రతిఘటించిన జ్యోతి..ఆ వ్యక్తిని ఒక చేత్తో గొంతుపట్టుకుని మరో చేతితో కత్తి గుంజుకుంది. దీంతో దుండగుడు జ్యోతి నుంచి తప్పించుకొని పక్కనే ఉన్న కంపచెట్లలోకి పరుగులు తీశాడు. అనంతరం జ్యోతి టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.