The assault
-
అధికార జులుం
పులివెందుల టీడీపీ నేత సతీష్‌రెడ్డి నాలుగురోజులుగా పదేపదే రచ్చకైనా.. చర్చకైనా సిద్ధమేనంటూ చేస్తున్న సవాల్ వెనుక మర్మం ఏమిటో ఆదివారం బట్టబయలైంది. పులివెందులలో టీడీపీ హయాంలో ఏమీ అభివృద్ధి జరగకపోయినా సవాల్‌కు పూనుకోవడం వెనుక కేవలం రచ్చ చేయాలనే వ్యూహం కనిపిస్తోంది. జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలో పులివెందుల అనగానే వైఎస్సార్ అభివృద్ధి గురించి ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. అలాంటి గడ్డపై అధికారాన్ని అడ్డం పెట్టుకుని జలుం ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది. పులివెందుల/రూరల్/టౌన్ : పులివెందుల టీడీపీ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలకు పొలీసులు ఒత్తాసు పలకడంతో పులివెందులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం పులివెందులలో సాయంత్రం 4గంటలకు పూలంగళ్ల సర్కిల్లో టీడీపీ నాయకులు పులివెందుల అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసరడం.. ఇందుకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చర్చకు సిద్ధమని ప్రతి సవాల్ విసరడం తెలిసిందే. చర్చకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పార్టీ నేతలు సిద్ధమయ్యారు. అయితే ఉదయం నుంచి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. ఉదయం 10గంటల సమయంలో పెద్ద ఎత్తున పోలీసు అధికారులు అవినాష్‌రెడ్డి ఇంటి వద్దకు చేరుకుని ఆయనను హౌస్ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. దీనికి ఎంపీ ససేమిరా ఒప్పుకోలేదు. చర్చకు సవాల్ విసిరింది టీడీపీ నాయకులైతే సవాల్‌ను స్వీకరించామని.. మమ్ములను నిలువరించడం మంచి పద్ధతి కా>దన్నారు. అనంతరం ఆయన స్వగృహం నుంచి స్థానిక పాత ఎమ్మెల్యే ఆఫీసుకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు తరలి వచ్చారు. అక్కడికి కూడా పులివెందుల ఏఎస్పీ కృష్ణారావు ఇతర పోలీసు అధికారులు చేరుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ సమయంలో అక్కడ దాదాపు గంటసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలను బలవంతంగా పోలీసులు పోలీసు వ్యానులో ఎక్కించడం జరిగింది. ఈ సమయంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీ డౌన్ డౌన్.. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పోలీసులు వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఎంపీని వాహనం నుంచి కిందికి దించక తప్పలేదు. దీంతో మళ్లీ కార్యకర్తల నడుమ పాత ఎమ్మెల్యే ఆఫీసుకు చేరుకున్నారు. అనంతరం ఎంపీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త సంయమనం పాటించి లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కల్గకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. సాయంత్రం 4గంటలకు టీటీపీ నాయకులు పూలంగళ్ల సర్కిల్ వస్తే తనను పంపించడానికి పోలీసులు ఒప్పుకోవడం జరిగిందన్నారు. కావున ఇందుకు ప్రతి కార్యకర్త సహకరించాలని కోరారు. గాలిలోకి భాష్పవాయువు ప్రయోగం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భాష్ప వాయువును ప్రయోగించారు. అయితే ఇందుకు ఏమాత్రం ప్రయోజనం లేకపోవడవంతో యథావిధిగా పోలీసులు పది రౌండ్లు కాల్పులు కాల్చుతూ భాష్పవాయువు ప్రయోగించారు. రాళ్ల దాడులలో ట్రాఫిక్ ఎస్ఐ చిరంజీవి తలకు గాయాలయ్యాయి. దాడుల నేపథ్యంలో పూలంగళ్ల సర్కిల్ శాంతి భద్రతలను కాపాడే సమయంలో ఇరు వర్గాల దాడులలో తలకు బలంగా గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించారు. తలలో 5కుట్లు పడ్డాయి. ఎస్పీ రావడంతో అదుపులో శాంతిభద్రతలు: పులివెందులకు ఎస్పీ బాబుజీ అట్టాడ రాగానే ప్రత్యేక పొలీసు దళంతో గుంపులను చెదరగొట్టారు. దీంతో ప్రజలు గుంపులుగా లేకుండాపోయారు. దీంతో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి. అనంతరం ఎస్పీ వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకుని చర్చకు అనుకూల వాతావరణం తాను కల్పిస్తానని టీడీపీ నాయకులతో మాట్లాడి కడపలో ప్రశాంతంగా చర్చ వేదికను ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో ఎంపీ అక్కడ నుంచి వెనుతిరిగారు. పులివెందుల పూల అంగళ్ల వద్ద రచ్చకైనా...చర్చకైనా అంటూ ప్రచారంతో రెచ్చగొట్టిన టీడీపీ నేతలు ఏదో ఒక రకంగా తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం సాయంత్రం టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వైఎస్సార్ సీపీపై విమర్శలు చేశారు. పులివెందులలో అలజడులకు వైఎస్సార్ సీపీనే కారణమని నిందించారు. అంతేకాకుండా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిలపై కూడా విమర్శలు గుప్పించారు. పోలీసుల దాడిలో వైఎస్సార్సీపీ నాయకులకు గాయాలు పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు.తెలుగుదేశం పార్టీ నాయకులు యథేచ్చగా రోడ్డుపై చేరుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లు విసిరి హల్చల్ చేస్తుంటే వారిని నిలువరించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద ఉన్న కార్యకర్తలపై పోలీసులు యథేచ్చగా లాఠీఛార్జి చేశారు. ఈ లాఠీఛార్జిలో వైఎస్సార్సీపీ నాయకులు వరప్రసాద్, ప్రతాప్, చెన్నకేశవులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల జూలం నశించాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీడీపీ నాయకులకు ఒత్తాసు పలికిన పోలీసులు పోలీసుల అదుపులో ఉదయం నుంచి ఉన్న టీడీపీ నాయకులను సాయంత్రం 3గంటల ప్రాంతంలో వదిలేయడంతో వారు పూలంగళ్ల సర్కిల్‌కు చేరుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలంగళ్ల సర్కిల్‌కు చేరుకున్నారనే విషయం తెలియగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సర్కిల్‌కు వెళ్లడానికి ముందుకు కదిలారు. అయితే చాగలేటి టెక్స్టైల్స్ సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డగించారు. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చగొడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లు విసిరి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ప్రతిఘటించి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులపై ఎదురు దాడికి దిగారు -
దౌర్జన్యకాండ
- ఆలూరులో మితిమీరిన టీడీపీ నేతల ఆగడాలు - మాటవినని అధికారులపై వేధింపులు - పోలీసుల అండతో సామాన్యులపైనా జులుం - తాజాగా ఒకరైతు ఆత్మహత్యాయత్నం - సూసైడ్ లేఖలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేరు ఆలూరు రూరల్: అధికారంలో ఉన్నామని, తమను ఎవరూ ఏమీ చేసుకోలేరనే ధైర్యంతో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. అధికారులను వేధించడమే కాకుండా సామాన్యులపై కూడా తమ ప్రతాపం చూపుతున్నారు. ఆలూరు నియోజకవర్గంలో వీరి ఆగడాలు మితిమీరి పోయాయి. ఇటీవల ఓ రైతు ఆత్మహత్యకు యత్నించి..ఇందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ వీరభద్రగౌడ్, ఆయన సోదరుడు కుమార్‌గౌడ్, హాలహర్వి ఎస్ఐ కృష్ణమూర్తి కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. పోలీసుల అండతో టీడీపీ నేతలు ఎలా దౌర్జన్యం చేస్తున్నారో ఈ ఘటన ఓ ఉదాహరణ. జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆలూరు. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. వీరందరూ ఎన్నికల్లో తమకు నచ్చిన నేతలకు ఓట్లు వేస్తున్నారు. ఆ తర్వాత ఎవరి పనులు వారివే. అయితే ఇటీవల హాలహర్వి మండలం మాచనూరులో మొహర్రం ముగింపు వేడుకల్లో సొంత బంధువులు వర్గాలుగా విడిపోయి చిన్న ఘర్షణకు దిగారు. గతంలో తమపార్టీకి ఓట్లు వేయలేదన్న అక్కసుతో ఆ ఘర్షణకు టీడీపీ నేతలు రాజకీయ రంగు పూశారు. హాలహర్వి ఎస్ఐతో మాచనూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులకు మీసాలు గీకి, గుండు కొట్టించారు. ఈ ఘటన మరవక ముందే మరో ఘటన అదే మండలంలో చోటు చేసుకుంది. కుర్లేహళ్లి గ్రామంలో రైతు శంబులింగ గ్రామంలోని వీరభద్రస్వామి మాన్యంభూమి (సర్వేనం. 50/బీ, 2.43 ఎకరాలు)ని గత కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఆ భూమి అదే గ్రామంలో వీరభద్రస్వామి ఆలయ పూజారి ఉమాపతి స్వామికి ఇప్పించాలని టీడీపీ నేతలు ఎండోమెంట్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. జీవనోపాధి కోల్పోతానని శంబులింగ పదేపదే టీడీపీ నేతలను కోరినా పట్టించుకోలేదు. దీంతో శంబులింగ కోర్టుకు వెళ్లాడు. దీనిని జీర్ణియించుకోలేని అధికార పార్టీ నేతలు హాలహర్వి ఎస్ఐ కృష్ణమూర్తిని వాడుకున్నారు. ఆయన రైతును ఇబ్బందులకు గురిచేశాడు. దీంతో రైతు శంబులింగ పురుగుమందు తాగాడు. అంతకముందు తన చావుకు ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి వీరభద్రగౌడ్, ఆయన సోదరుడు కుమార్‌గౌడ్, హాలహర్వి ఎస్ఐ కృష్ణమూర్తి కారణమని సూసైడ్ నోట్ రాశాడు. ప్రస్తుతం ఆయన చావుబతుకుల మధ్య కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తహసీల్దార్లపై వేధింపులు.. గతంలో ఆలూరులో పనిచేసిన తహశీల్దార్ అన్వర్ఉసేన్పై ఒత్తిడి తీసుకొచ్చి.. వివాదంలో ఉన్న భూమికి పాసు పుస్తకాలు ఇప్పించారు. కోర్టు వివాదంలో ఉన్న భూమికి పాసు పుస్తకాలు ఎలా ఇచ్చారని బాధితుడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో వీఆర్వో, జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్అవగా..తహసీల్దార్ కర్నూలు కలెక్టర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లిపోయారు. గతంలో ఆస్పరి తహసీల్దార్‌గా పనిచేసిన ఆంజనేయులు కర్నూలు ఎంపీ బుట్టా రేణుకమ్మతో కలిసి హలిగేర గ్రామంలో రైతు ఓబయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లాడు. ఆ విషయాన్ని జీర్ణియించుకోలేని అధికార పార్టీ నేతలు తహసీల్దార్ తమ మాట వినడంలేదని వేధింపులకు గురిచేసి.. 15 రోజుల్లోనే బదిలీ చేయించారు. ఇసుక మాఫియా వారిదే.. నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు..ఇసుక మాఫియా నడుపుతున్నారు. హొళగుంద, హాలహర్వి, ఆస్పరి మండలాల్లో ఉన్న పెద్ద వాగులు, వంకలు హంద్రీ తీరాల నుంచి ఇసుకను అక్రమంగా తమ అనుచరుల ద్వారా తరలిస్తున్నారు. ఆస్పరి, ఆలూరు మండలాల్లో ఏర్పాటవుతున్న గాలిమరల (పవన విద్యుత్) కాంట్రాక్టర్లకు ఇసుకను అక్రమంగా రవాణా చేయిస్తున్నారు. వీరి వ్యవహార శైలిపై సొంత పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఇస్తారా.. చస్తారా?
ట్రస్టు మాటున మాజీమంత్రి ఆక్రమణలు రైతుల భూముల చుట్టూ ప్రహరీ నిర్మాణం అడ్డుకున్న వారిపై దౌర్జన్యం చేశారంటూ పోలీసు కేసులు రైతులను భూముల్లోకి వెళ్లకుండా సెక్యూరిటీ ఓ మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామిక వేత్త కుటుంబ సభ్యులు రైతులను బెదిరించి వందలాది ఎకరాల భూములను లాక్కుంటున్నారు. ఎక్కువ మాట్లాడితే సొంత భూముల్లోకి రైతులనే వెళ్లనివ్వకుండా చేస్తున్నారు. కాలువలను సైతం ఆక్రమించి ప్రహరీని ఏర్పాటు చేయడంతో పాటు సెక్యూరిటీ గార్డులను నియమిస్తున్నారు. రెవెన్యూ అధికారులతో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి/తిరుపతిరూరల్: ట్రస్టు పేరుతో రైతుల భూములు ఆక్రమించుకోవడం అధికారపార్టీ నేతలకు పరిపాటిగా మారింది. తవణంపల్లి మండలం దిగువమాఘంలో ఓ ట్రస్ట్ పేరుతో దాదాపు రెండు వందల ఎకరాల్లో విద్యాసంస్థల ఏర్పాటు కోసం స్థలాన్ని సేకరించారు. అందుకోసం రైతుల నుంచి భూములను కొనుగోలు చేస్తున్నారు. దాదాపు 180 ఎకరాలకు పైగా ఇప్పటికే స్వాధీనం చే సుకున్నారు. ఎదురుతిరిగినరైతులు మూడు నాలుగు తరాలుగా కుటుంబానికి ఆసరాగా ఉన్న భూములను ఇస్తే తమకు జీవనం పోతుందని కొందరు రైతులు ట్రస్ట్‌కు భూములను ఇచ్చేందుకు నిరాకరించారు. ట్రస్ట్ కొనుగోలుచేసిన భూముల మధ్యలో దాదాపు 20 ఎకరాలు రైతుల ఆధీనంలోనే ఉన్నాయి. తమకు ప్రత్యామ్నాయ భూమిని చూపిస్తేనే భూమిని ఇస్తామని అన్నదాతలు ట్రస్ట్ నిర్వాహకులకు తేల్చి చెప్పారు. అమ్మని భూముల చుట్టూ ప్రహరీ చుట్టూ భూములను కొనుగోలుచేసిన ట్రస్ట్ నిర్వాహకులు దాదాపు 10 అడుగుల ఎత్తులో ప్రహరీని నిర్మిస్తున్నారు. తమకు భూములు ఉన్నాయని వాటిలోకి వెళ్లేందుకు దారి కూడా వదలకుండా గోడ కట్టడంతో రైతులు ఆందోళన చేశారు. మధ్యలో వస్తున్న కాలువలను సైతం ఆక్రమించి ప్రహరీని నిర్మించారని వాపోతున్నారు. అడ్డుకున్న వారిపై కేసులు తమ భూముల్లోకి వెళ్లకుండా కాలువలను సైతం ఆక్రమించి ప్రహరీని నిర్మించడంపై సదరు నేతలను రైతులు అడ్డుకున్నారు.కొందరు ప్రహరీ రాళ్లను తొలగించారు. దీంతో తమ భూముల్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి, తమ ఆస్తులను నాశనం చేస్తున్నారని ట్రస్ట్ ప్రతినిధులు రైతులపై కేసులు నమోదు చేయించి అరెస్ట్ చేయించారు.