assebmly elections
-
గెలుపే లక్ష్యంగా వ్యూహం @ 2024
-
కరెంటు ఇచ్చే మొనగాడు కేసీఆర్ ఒక్కరే
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు నిరంతరంగా ఇవ్వగలిగే ఏకైక మొనగాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రమే నని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు అన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న తెలంగాణకు వచ్చి తమ రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని కర్ణాటక డిప్యూ టీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించడాన్ని ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో బీజేపీ నేతలు దరువు ఎల్లన్న, పడకంటి రమాదేవి సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని నాయకులతో ప్రచారం చేయలేక బయటి రాష్ట్రాల నుంచి నేతలతో కాంగ్రెస్, బీజేపీ ప్రచారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ పదేళ్ల పాలనలో పబ్లిక్ సరీ్వస్ కమిషన్ ద్వారా 24వేల ప్రభుత్వ ఉద్యో గాల భర్తీ జరగ్గా.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తొమ్మిదేళ్ల లో లక్షా 30వేల ఉద్యోగాల భర్తీ జరిగిందని చెప్పా రు. మరో 90వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు. ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందు కు కాంగ్రెస్ నేతలు కోర్టుకు వెళ్లారని, బీజేపీ నేతలు పేపర్ లీకేజీలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఒకవైపు, కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండ గా, మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే ఉ ద్యోగాల భర్తీ ఎక్కువ సంఖ్యలో జరిగిందని వివరించారు. దళితబంధు పథకం ద్వారా మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి దళితులు చేరుతున్నారని, ఉపాధి కల్పనలో యువత కొత్తతరం ఆలోచనలు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. విపక్షాలది పైశాచిక ఆనందం కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలతో విపక్ష నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపైనా విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రాజెక్టు మరమ్మతు భారం ప్రజలపై పడకుండా సంబంధిత నిర్మాణ సంస్థ ద్వారానే చేయిస్తామన్నారు. జాతీయ పారీ్టలైన కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న మోసాలను గ్రహించిన నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు, కవులు, కళాకారులు, గాయకులు, ఉద్యోగ సంఘాల నేతలకు బీఆర్ఎస్ రాజకీయ అవకాశాలను కల్పించిందన్నారు. అనేక మంది ఉద్యమకారులు ప్రస్తుతం వివిధ పదవుల్లో ఉన్నారని, దరువు ఎల్లన్నకు కూడా పారీ్టలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థి నేతలకు రాజకీయ అవకాశాలు ఇవ్వకుండా కాంగ్రెస్, బీజేపీ వాడుకుని వదిలేస్తున్నాయని దరువు ఎల్లన్న విమర్శించారు. చివరి నిషంలో పార్టీలోకి డబ్బు సంచులతో వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో కార్పొరేషన్ల చైర్మన్లు రాజీవ్ సాగర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, విద్యార్థి నాయకుడు తుంగ బాలు, మిట్టపల్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు కాంగ్రెస్ రెండో జాబితాకు ‘సీఈసీ ఆమోదం’!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠకు తెరలేపిన కాంగ్రెస్ పార్టీ తుది జాబితాపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో బుధ వారం జరగనున్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశంలో తెలంగాణ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సిద్ధం చేసిన జాబితాకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదముద్ర వేయనుంది. ఇప్పటికే పొత్తులు సహా తుది జాబితాపై ఏఐసీసీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. సీఈసీ సమావేశంలో వామపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయంలోనూ ఒక స్పష్టత రానుంది. ఇప్పటివరకు కొన్ని స్థానాల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇద్దరిద్దరి పేర్ల ను స్క్రీనింగ్ కమిటీ ప్రతిపాదించింది. ఇప్పటికే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల తర్వాత మిగతా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ శని, ఆది వారాల్లో ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ నివాసంతోపాటు కాంగ్రెస్ వార్ రూంలో తెలంగాణ నేతల సమావేశమైనా పోటీ ఎక్కువగా ఉన్న స్థానాలపై ఏకాభిప్రాయం రాలేదు. సీనియర్ నాయకులు పోటీకి సిద్ధమైన చోట అంతర్గత పోటీ ఉన్నందున స్క్రీనింగ్ కమిటీలో మరోసారి ఈ స్థానాల్లో పోటీకి సంబంధించి సమీక్ష జరిగింది. కమ్యూనిస్టు పార్టీలు అడుగుతున్న స్థానాల్లో పోటీకి కాంగ్రెస్ అభ్యర్థులు సిద్ధంగా ఉండటంతో ఏ స్థానాలు కేటాయించాలన్న అంశంపై కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమ య్యాయని సమాచారం. కాగా, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన తుది నిర్ణయాన్ని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి స్క్రీనింగ్ కమిటీ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో బుధవారం జరుగ నున్న సీఈసీ సమావేశం కీలకంగా మారింది. -
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు.. 48 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది అధికార బీజేపీ. మొత్తం 60 స్థానాలకు 48 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసి జాబితా విడుదల చేసింది. మిగతా 12 స్థానాల్లో పోటీ చేసే వారి పేర్లను త్వరలోనే ప్రకటించనుంది. సీఎం మాణిక్ సాహా మరోసారి టౌన్ బోర్డోవలి నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారు. కేంద్రమంత్రి ప్రతిమ భౌమిక్ ధన్‌పుర్ స్థానం నుంచి బరిలోకి దిగుతారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ భట్టాచార్జీ బనమాలిపుర్ నుంచి పోటీ చేస్తారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైన మరునాడే త్రిపుర అభ్యర్థుల జాబితా విడుదల కావడం గమనార్హం. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 16న జరగనున్నాయి. మార్చి 2న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. జనవరి 18నే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 21న ప్రారంభమైంది. జనవరి 30న ముగుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 2వరకు గడువు ఉంది. చదవండి: బోర్డర్లో రెచ్చిపోతున్న చైనా.. నివేదికలో పలు సంచలన అంశాలు -
ఎన్నికల తేదీలను ప్రకటించనున్న ఈసీ
-
దూసుకెళ్లిన బీజేపీ.. ప్రచారానికి రాని సోనియా!
ఒకనాటి కాంగ్రెస్ కంచుకోట హరియాణా, మహారాష్ట్రలలో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు ప్రధాని మోదీ శ్రమిస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ ప్రచారపర్వంలో చాలా వెనుకబడింది. ఓ పక్క దేశ పాలనా బాధ్యతల్లో తలమునకలైన మోదీ మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం అలుపెరగకుండా శ్రమించారు. రెండు రాష్ట్రాల్లో గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నా బీజేపీ చీఫ్ అమిత్‌షా, మోదీ ఇద్దరూ తమ అభ్యర్థుల గెలుపుకోసం ఏ చిన్న అవకాశాన్నీ విడిచిపెట్టలేదు. రెండు రాష్ట్రాల్లో కలిపి మోదీ మొత్తం 25 భారీ బహిరంగ సభల్లో పాల్గొనడమే అందుకు నిదర్శనం. ఈ రెండు రాష్ట్రాల ప్రచారంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పొచ్చు. గాంధీ కుటుంబం ఎదుర్కొంటోన్న అంతర్గత సంక్షోభానికి, పార్టీని పీడిస్తోన్న ఓటమి భయానికీ కాంగ్రెస్ ప్రచారసరళి అద్దం పడుతోందంటున్నారు నిపుణులు. మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ప్రచార అంకం ముగిసింది. ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన బీజేపీ రెండు రాష్ట్రాల్లో అధికారపీఠం ఎక్కాలని చూస్తోంది. కాంగ్రెస్ మాత్రం హరియాణా, మహారాష్ట్ర ప్రచారంలో వెనకబడింది. సోనియా అసలు ప్రచారంలోనే పాల్గొనకపోతే, రాహుల్ నామమాత్రంగా పాల్గొన్నారు. సోనియా భయపడ్డారా? సోనియా గాంధీ ఈనెల 18న హరియాణాలో ఒక సభలో పాల్గొనాల్సి ఉండగా అనివార్యకారణాలతో సభకు రాలేదు. సోనియాకు వైరల్ జ్వరం వచ్చినందుకే రాలేదని రాహుల్ వివరణ ఇచ్చుకున్నారు. అయితే జ్వరం సంగతి పక్కన పెడితే బహిరంగసభకు సోనియా దూరంగా ఉండడానికి ఏఐసీసీ అనేక కారణాలను పేర్కొంది. అవినీతి ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఉందని కొందరి వాదన. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరపరాజయంతోపాటు ప్రజామోదం పెద్దగా లేకపోవడం, ఓటమి భయం, పార్టీలో అంతర్గత కలహాలు.. ఆ పార్టీ ప్రచారానికి బ్రేకులు వేసినట్టు పార్టీ వర్గాలు తమ అభిప్రాయం వ్యక్తం చేశాయి. స్థానిక నేతలు ఎక్కడ? కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కెప్టెన్ అమరీందర్ సింగ్, అశోక్ గెహ్లోత్, కమల్‌నాథ్ లాంటి హేమాహేమీలు సైతం ఈ రాష్ట్రాల్లో కనీసం ఒక్కటంటే ఒక్క బహిరంగ సభను నిర్వహించలేదని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన ప్రియాంకా గాంధీ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రచారంలో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం రెండు రాష్ట్రాల ఎన్నికల్లో నామమాత్రంగా పాల్గొనడానికి స్థానిక నేతలే కారణమని భావిస్తున్నారు. ఢిల్లీ నేతలకంటే స్థానిక నేతలకే ఎన్నికల ప్రచారంలో అధిక ప్రాధాన్యతనివ్వాలని స్థానికనేతలు.. పార్టీ అధిష్టానానికి సూచించిన నేపథ్యంలోనే పెద్దలు ప్రచారంలో వెనకడుగువేసినట్టు తెలుస్తోంది. రాహుల్ రాష్ట్రంలో పర్యటించిన నేపథ్యంలో గాంధీ కుటుంబం ప్రచారంలో వెనుకబడిందన్న ప్రశ్నేలేదని పార్టీ సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. కాగా, పోలింగ్ రేపు జరగనుంది. మోదీ 25 రాహుల్ 7 ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ 25 ర్యాలీల్లో పాల్గొని ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని తిరిగి చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా మాత్రం ఒక్కటంటే ఒక్క బహిరంగ సభలో కూడా పాల్గొనకపోవడం ఎన్నికల్లో ఆ పార్టీ ఉదాసీనతకు అద్దంపడుతోంది. బీజేపీకే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ బీజేపీ జాతీయ నాయకులు, ప్రధాని మోదీ రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. రాహుల్ గాంధీ హరియాణాలో రెండు, మహారాష్ట్రలో ఐదు మొత్తంగా ఏడు బహిరంగ సభల్లో మాత్రమే పాల్గొన్నారు. -
సైకిల్ డీలా... ఫ్యాన్ గిరా గిరా!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాతీర్పు ఎలా ఉండబోతుందనే విషయం ఎగ్జిట్ పోల్స్‌తో స్పష్టమైపోయింది. దేశ వ్యాప్తంగా ఎన్నికల సమరం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. 6 గంటలు దాటగానే టీవీలు, సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా ఎగ్జిట్ పోల్స్ ప్రత్యక్షమయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికలు తొలి విడతలోనే నిర్వహించడంతో ఫలితాల వెల్లడికి సుదీర్ఘ సమయం పట్టింది. గత నెల 11న పోలింగ్ పూర్తి కాగా.. అప్పటి నుంచి నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎట్టకేలకు దేశమంతటా పోలింగ్ ముగియడంతో.. ఇక మరో మూడు రోజుల్లో చేపట్టనున్న కౌంటింగ్ అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతలో ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ దాదాపుగా వైఎస్సార్సీపీకి పట్టం కట్టాయి. మొదటి నుంచీ రాష్ట్రంలో ఫ్యాన్ ప్రభంజనం సృష్టించబోతుందనే విషయం తెలిసిపోయింది. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో జిల్లాలోని టీడీపీ నేతల్లో గుబులు మొదలవగా.. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఎగ్జిట్ పోల్స్‌ను నిశితంగా పరిశీలిస్తే.. జిల్లాలో వైఎస్సార్సీపీ 10 నుంచి 12 స్థానాల్లో విజయదుందుబి మోగించబోతుందనే విషయం అర్థమవుతోంది. అదేవిధంగా రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా ఆ పార్టీ విజయం ఖాయమైందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ అత్యంత బలంగా ఉన్న తాడిపత్రి, రాప్తాడు, పెనుకొండ తదితర నియోజకవర్గాల్లోనూ ఈ దఫా ఫలితాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నాయనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. ఈ ఎన్నికల్లో అవినీతి ఆరోపణలు, ఫ్యాక్షన్.. నేరచరితులకే టీడీపీ అధికంగా సీట్లు కేటాయించింది. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ విద్యావంతులను కొత్తగా బరిలో నిలిపింది. బీసీలకూ ప్రాధాన్యత కల్పించింది. ఈ కోవలోనే సామాన్య సీఐ స్థాయి అధికారి గోరంట్ల మాధవ్, గ్రూప్–1 అధికారి తలారి రంగయ్యలు పార్లమెంట్ బరిలో నిలిచారు. అలాగే మాజీ ఐపీఎస్ అధికారి మహ్మద్ ఇక్బాల్ హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఈ పరిణామాలన్నీ ఓటర్లను ఆలోచింపజేశాయి. ముఖ్యంగా కురుబ, బోయ ఓటర్లతో పాటు బీసీలు ఆ పార్టీకి అండగా నిలిచినట్లు ఎగ్జిట్ పోల్స్ చెప్పకనే చెబుతున్నాయి. 2014తో పాటు 2019లోనూ జిల్లాలో టీడీపీ ఒక్క మైనార్టీ అభ్యర్థికి కూడా టిక్కెట్ కేటాయించలేకపోయింది. కాగా ఈ రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించింది. ఫలితంగా మైనార్టీ ఓటర్లు వైఎస్సార్సీపీకి అండగా నిలిచినట్లు స్పష్టమవుతోంది. కంచుకోటకు బీటలే.. గత ఎన్నికల్లో రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే అభివృద్ధిని పూర్తిగా విస్మరించడం, టీడీపీ ఎమ్మెల్యేలు ఆర్థికంగా ఎదగడం మినహా ప్రజా సంక్షేమాన్ని విస్మరించడంతో ప్రజలు మార్పును కోరుకున్నారనే విషయం ఎగ్జిట్ పోల్స్‌ను బట్టి తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోగా.. ఈ సారి ఫలితం ఏకపక్షంగా ఉండబోతుందనే విషయం అర్థమైపోయింది. దాదాపు 10 నుంచి 12 స్థానాల్లో వైఎస్సార్సీపీకి గెలవబోతుందనే విషయం తెలిసి టీడీపీ నేతలు డీలాపడ్డారు. ఈ పరిణామం ఫలితాలకు మూడు రోజుల ముందుగానే వైఎస్సార్సీపీ శ్రేణుల్లో విజయోత్సాహం నింపుతోంది. స్వయంకృతాపరాధమే.. టీడీపీ శ్రేణులను మొదటి నుంచీ ఓటమి భయం వెంటాడుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తుండటం, వ్యక్తిగతంగా ఎదిగేందుకు మాత్రమే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఆస్తులు కూడబెట్టుకునే విషయంలోనే తలమునకలు కావడం ఆ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఇదే సమయంలో అంతర్గత కుమ్ములాటలు నేతల మధ్య సమన్వయాన్ని దెబ్బతీసింది. మొత్తంగా స్వయంకృతాపరాధమే తమ పార్టీ కొంప ముంచనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశ్వసనీయత కోల్పోతున్న లగడపాటి ఎగ్జిట్ పోల్స్ అన్నీ వైఎస్సార్సీపీకి పట్టం కడితే.. ఒక్క లగడపాటి మాత్రమే టీడీపీకి కొమ్ము కాయడంతో ప్రజల్లో ఆయన సర్వేకు విశ్వసనీయత లేకుండా పోతోంది. గత తెలంగాణ ఎన్నికల్లో కూడా దాదాపు అన్ని సర్వేలు టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందనే తేల్చి చెప్పగా.. లగడపాటి మాత్రమే కాంగ్రెస్ వస్తుందనే జోస్యం చెప్పారు. తీరా ఫలితాల ప్రకటన తర్వాత పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఆయనకు భంగపాటు తప్పదనే చర్చ జరుగుతోంది. బెట్టింగ్ రాయుళ్లలో వణుకు ఎగ్జిట్ పోల్స్ వెలువడగానే బెట్టింగ్‌రాయుళ్లలో వణుకు మొదలైంది. వాస్తవానికి పోలింగ్ పూర్తయినప్పటి నుంచి వైఎస్సార్సీపీ అధికారం చేపట్టబోతుందనే విషయం తేటతెల్లమైంది. జిల్లాలోనూ టీడీపీ ముఖ్య నేతలకు సైతం ఓటమి తప్పదని పోలింగ్ సరళిని బట్టి అర్థమైపోయింది. అయినప్పటికీ తమ అదృష్టం పరీక్షించుకునేందుకు బెట్టింగ్‌రాయుళ్లు హాట్ సీట్లపై బెట్టింగ్‌కు సిద్ధపడ్డారు. అయితే ఈ పందెం 1:2 స్థాయిలో సాగింది. అంటే.. వైఎస్సార్సీపీ తరపున బెట్టింగ్ వేసే వ్యక్తి రూ.2వేలు పెడితే.. టీడీపీ తరఫున బెట్టింగ్ కట్టే వ్యక్తి రూ.1000 ఇస్తారు. రాప్తాడు, ధర్మవరం, రాయదుర్గం, అనంతపురం తదితర నియోజకవర్గాలపై బెట్టింగ్ అధికంగా సాగింది. తాజా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు పునరాలోచనలో పడ్డారు. -
మా సంస్కరణలకు ప్రజామోదం
న్యూఢిల్లీ: అధికార దాహంతో కాంగ్రెస్ గుజరాత్లో కులతత్వాన్ని వ్యాప్తి చేయాలనుకుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన సంస్కరణలకు ప్రజామోదం ఉందనడానికి తాజా ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మోదీ కార్యకర్తలను ఉద్దేశించి సోమవారం ప్రసంగించారు. గత కొన్నాళ్లుగా గుజరాత్లో కులాల ఆధారంగా ఉద్యమాలు జరుగుతున్న వేళ... ఆ రాష్ట్రంలో సామాజిక సామరస్యం విలసిల్లాలనీ, అన్ని వర్గాల ప్రజలు గొడవల్లేకుండా ప్రశాంతంగా జీవించాలని మోదీ ఆకాంక్షించారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టాక అభివృద్ధికి అవసరమైన వాతావరణాన్ని నెలకొల్పామనీ, దానిని ఎవరూ పాడు చేయకూడదని ఆయన కోరారు. బీజేపీ గుజరాత్లో వరసగా ఆరోసారి గెలిచినా ఈసారి గత రెండు దశాబ్దాల్లోనే అత్యల్ప స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో... ఈ ఎన్నికలు ప్రత్యేకమైనవని అన్నారు. తాను ప్రధాన మంత్రి అయ్యాక రాష్ట్రంలో తమ పార్టీ నాయకత్వాన్ని భ్రష్టు పట్టించేందుకు ప్రయత్నాలు జరిగాయని మోదీ ఆరోపించారు. బీజేపీని ఓడించేందుకు విశ్వప్రయత్నాలు జరిగాయనీ, అన్ని రకాల కుట్రలను పన్నారని మోదీ దుయ్యబట్టారు. 30 ఏళ్ల క్రితం రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలించిన రోజుల్లో కులతత్వం అనే విషం బాగా ఎక్కిందనీ, బీజేపీ ప్రభుత్వాలు, నేతలు దానిని నిర్మూలించేందుకు పనిచేశారని మోదీ అన్నారు. ఇప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా దేశం మంచి గుర్తింపు పొందాలంటే అభివృద్ధిలో కొత్త శిఖరాలను అందుకోవాల్సి ఉందనీ, ప్రజల సమస్యలకు అదే పరిష్కారమని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోనూ తప్పుడు పనులకు వ్యతిరేకంగా, అభివృద్ధికి అనుకూలంగానే ప్రజలు ఓటేశారని మోదీ పేర్కొన్నారు. తన ప్రసంగం చివర్లో మోదీ ‘ఎవరు గెలుస్తారు’ అని ప్రశ్నించగా అభివృద్ధి గెలుస్తుంది అని కార్యకర్తలంతా ముక్తకంఠంతో జవాబిచ్చారు. -
ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ, కాంగ్రెస్ గల్లంతు
- రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం: ఎమ్మెల్యే మేకపాటి జలదంకి, న్యూస్‌లైన్: ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ, కాంగ్రెస్ గల్లంతు కావడం తథ్యమని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని అన్నవరం, తిమ్మసముద్రం, కేశవరం, చింతలపాళెం, గట్టుపల్లి, 9వ మైలు, చిన్నక్రాక, నాగిరెడ్డిపాళెం, కోదండరామాపురం తదితర గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మేకపాటి మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే అందరం వైఎస్సార్సీపీని గెలిపించుకోవాలన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చి ఆల్‌ఫ్రీ అనే మాయమాటలు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు కుమ్మక్కై ఆ ప్రభుత్వాన్ని కాపాడారని విమర్శించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారని ధ్వజమెత్తారు. మహానేత వైఎస్సార్ పార్టీలకు అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో కొలువయ్యారన్నారు. వైఎస్సార్ సువర్ణయుగం జగన్‌తోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. జగన్ సీఎం అయితే వృద్ధులు, వికలాంగులు, రైతులు, మహిళల జీవితాలు మారుతాయన్నారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా తన సోదరుడు రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి, రావిప్రసాద్, ఎస్వీ శేషారెడ్డి, మేకల మహేశ్వరావు, లేటి సుధీర్, గద్దె బ్రహ్మయ్య, గొట్టిపాటి ప్రసాద్‌నాయుడు, ఇస్కామదన్ మోహన్‌రెడ్డి, వాకా మాధవరెడ్డి, గంగపట్ల మాలకొండయ్య, గుర్రం జగ్గయ్య, పులి మాల్యాద్రి, యడ్ల మాల్యాద్రిరెడ్డి, వట్టికాల బాలయ్య, బీవీ కృష్ణారెడ్డి, వాకా పద్మనాభరెడ్డి పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణ మాతోనే సాధ్యం: కవిత
నిజామాబాద్, న్యూస్‌లైన్: బంగారు తెలంగాణ టీఆర్ఎస్ తోనే సాధ్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఇందూరు నగర జయభేరిలో ఆమె మాట్లాడారు. 14 ఏళ్ల నుంచి తెలంగాణ కోసం పోరాడి రాష్ట్ర ఏర్పాటును సాధించిన కేసీఆర్‌కు సమస్యలను పరిష్కరించడం ఇబ్బంది కాదని చెప్పారు. టీఆర్ఎస్కు అధికారం ఇస్తే 2.75లక్షలతో రెండు గదులతో సొంత ఇల్లు, వృద్ధులకు రూ.1000, వికలాంగులకు రూ. 1500 పింఛను ఇస్తామని కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం, బంగారు తెలంగాణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా ఆంధ్ర పాలకులు దోచుకున్నారని విమర్శించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు వలస పాలకుల పాలనలో తీవ్ర విఘాతం కలిగిందని, వాటిని సరి చేసుకోవాల్సి ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆంధ్ర ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందేనని ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అన్నారు. -
ప్రజాతీర్పు ఓ వైపే ఉంటుంది:న్యూస్ఎక్స్ ఛానల్ ఇంటర్వ్యూలో జగన్
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ఎన్ని పార్టీలు అనుకూలంగా ఓట్లు వేసినా ప్రథమ ముద్దాయి మాత్రం కాంగ్రెస్సే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. న్యూస్ఎక్స్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ విభజనకు పూనుకోకపోయి ఉంటే సీమాంధ్రకు ఇప్పుడున్న విపత్కర పరిస్థితులు వచ్చేవి కావన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా 42 ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా రాదని భయపడ్డ కాంగ్రెస్ తెలంగాణలోని 17 సీట్లన్నా వస్తాయన్న దురాశతో రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆయన హిట్లర్‌తో పోల్చారు. స్వర్గీయ వైఎస్ఆర్ బతికి ఉంటే రాష్ట్రం ముక్కలయ్యేది కాదన్నారు. న్యూస్ఎక్స్ ఛానల్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ: న్యూస్ఎక్స్: జగన్ గారు మిమ్మల్ని కాబోయే సీఎంగా చూడొచ్చా? వైఎస్ జగన్: దేవుడి దయ ఉంటే అవుతాను. ఏపీ చరిత్ర చూస్తే సీమాంధ్రలో తమిళనాడు తరహాలో స్వింగ్ ఉంటుంది. ప్రజా తీర్పు ఓవైపు పూర్తిగా మొగ్గుచూపుతుంది. 175లో ఓకే పార్టీకి వందకు పైగా సీట్లు వస్తాయి. ఈసారి దేవుడి దయవల్ల ఎన్నికల్లో స్వీప్ చేస్తాం. న్యూస్ఎక్స్: ఏపీలో కాంగ్రెస్‌ను మీ నాన్న తన చేతుల్లో నిర్మించారు. అయినా సోనియాగాంధీ కుటుంబం మిమ్మల్ని మొసం చేసిందని భావిస్తున్నారా? వైఎస్ జగన్: వ్యక్తిగతంగా ఒకరిపై కక్ష కట్టడం నా లక్షణం కాదు. ప్రతీ రోజు బైబిల్ చదువుతా. బైబిల్ చదివే నిద్రపోతా. నా తప్పులతో పాటు మిగతా వారి తప్పుల్నికూడా మన్నించమని వేడుకుంటా. కాని రాష్ట్రం విషయంలో వారు క్షమించరాని నేరం చేశారు. ఓట్లు, సీట్ల కోసం ఐదు కోట్ల మంది సీమాంధ్రులకు తీరని అన్యాయం చేశారు. న్యూస్ఎక్స్: మీరు సోనియాను హిట్లర్ అని ఎందుకు అన్నారు ? వైఎస్ జగన్: ఆరేళ్ల పిల్లవాడిని అడిగినా ఇదే అంటారు. ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా, అసెంబ్లీ తీర్మానాన్ని పట్టించుకోకుండా, పార్లమెంట్ ప్రసారాలు నిలిపేసి, 17 మంది సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసి మరీ రాష్ట్రాని విభజించారు. విభజన జరిగిన తీరు చూసి ఎవరైనా సోనియాను హిట్లరే అని అంటారు. న్యూస్ఎక్స్: రాహుల్ గాంధీది మీ జనరేషనే కదా, ఆయన కూడా మిమ్మల్ని నిరాశపరిచారా ? వైఎస్ జగన్: రాహుల్‌కు నాకు వ్యక్తిగతంగా అంత సంబంధం లేదు. కాబట్టి నిరాశ చెందలేదు. కాని రాష్ట్రాన్ని మాత్రం తీవ్రంగా నిరాశపర్చారు. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా 42 సీట్లలో ఒక్క సీటు కూడా రాదని రాష్ట్రాన్ని విభజించారు. తెలంగాణలో అయినా 17 సీట్లు వస్తాయని రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. ఈ తీరు నన్ను చాలా బాధించింది. న్యూస్ఎక్స్: బీజేపీ కూడా రాష్ట్రవిభజనకు ఓటు వేసింది కదా. మరి వాళ్లతో కలిసి పనిచేస్తారా? వైఎస్ జగన్: బీజేపీనే ఎందుకు తప్పుపట్టాలి . మా టీడీపీనే ఓటేసింది. చాలా పార్టీలు కూడా ఓటేశాయి. కాని మొదటి ముద్దాయి మాత్రం కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ విభజనకు పూనుకోకపోయి ఉంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చేవే కావు. న్యూస్ఎక్స్: మీ నాన్న బతికే ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? వైఎస్ జగన్: మా నాన్నే ఉంటే ఈ విపత్కర పరిస్థితులు వచ్చేవే కావు. కాంగ్రెస్‌కు సీట్లు కావాలి. మా నాన్నకు ఆ సత్తా ఉంది. కాబట్టి హైకమాండ్ ఖచ్చితంగా నాన్న మాటకు విలువ ఇచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేది. న్యూస్ఎక్స్: నీళ్లను కిందికి వదలం అని కేసీఆర్ ప్రకటించారు. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు? వైఎస్ జగన్: ఈ రకమైన ప్రమాదాల ఉంటాయని ఎన్నో సార్లు హెచ్చరించాను. చివరకు అదే జరుగుతోంది. పై వాళ్లు ఎంత ఇస్తే అంత సీమాంధ్ర సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కాని మేం పోరాడుతాం. అంత తేలిగ్గా వదలం. న్యూస్ఎక్స్: ఎన్నికల్లో మీకెన్ని సీట్లు వస్తాయి? వైఎస్ జగన్: క్లీన్ స్వీప్ అయితే చేస్తాం. అయితే ఎన్ని సీట్లు వస్తాయో త్వరలో మీరే చూస్తారు. న్యూస్ఎక్స్: టీడీపీ పోటీ ఇస్తుందా. వైఎస్ జగన్: కాంగ్రెస్, టీడీపీలు తుడిచిపెట్టుకుపోయాయి. న్యూస్ఎక్స్: ఎన్డీయే వైపు చూస్తారా. టీడీపీ కూడా అటు వైపే ఉంది కదా. వైఎస్ జగన్: టీడీపీ వెళ్తుందా లేదా అన్నది నాకు ముఖ్యం కాదు. కాని ఎన్నికల తర్వాత మాత్రం నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతాను. కొత్త రాజధానికి ఎంత డబ్బు ఇస్తారు?. రెవెన్యూ గ్యాప్‌ని భర్తీ చేసే విషయంలో ప్రాక్టికల్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.