సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు నిరంతరంగా ఇవ్వగలిగే ఏకైక మొనగాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మాత్రమే నని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు అన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న తెలంగాణకు వచ్చి తమ రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని కర్ణాటక డిప్యూ టీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించడాన్ని ఎద్దేవా చేశారు.
తెలంగాణ భవన్‌లో బీజేపీ నేతలు దరువు ఎల్లన్న, పడకంటి రమాదేవి సోమవారం బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని నాయకులతో ప్రచారం చేయలేక బయటి రాష్ట్రాల నుంచి నేతలతో కాంగ్రెస్, బీజేపీ ప్రచారం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ పదేళ్ల పాలనలో పబ్లిక్ సరీ్వస్ కమిషన్ ద్వారా 24వేల ప్రభుత్వ ఉద్యో గాల భర్తీ జరగ్గా.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తొమ్మిదేళ్ల లో లక్షా 30వేల ఉద్యోగాల భర్తీ జరిగిందని చెప్పా రు. మరో 90వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉందన్నారు.
ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందు కు కాంగ్రెస్ నేతలు కోర్టుకు వెళ్లారని, బీజేపీ నేతలు పేపర్ లీకేజీలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఒకవైపు, కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండ గా, మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే ఉ ద్యోగాల భర్తీ ఎక్కువ సంఖ్యలో జరిగిందని వివరించారు. దళితబంధు పథకం ద్వారా మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి దళితులు చేరుతున్నారని, ఉపాధి కల్పనలో యువత కొత్తతరం ఆలోచనలు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
విపక్షాలది పైశాచిక ఆనందం
కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలతో విపక్ష నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనపైనా విమర్శలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రాజెక్టు మరమ్మతు భారం ప్రజలపై పడకుండా సంబంధిత నిర్మాణ సంస్థ ద్వారానే చేయిస్తామన్నారు. జాతీయ పారీ్టలైన కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న మోసాలను గ్రహించిన నేతలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు, కవులు, కళాకారులు, గాయకులు, ఉద్యోగ సంఘాల నేతలకు బీఆర్‌ఎస్ రాజకీయ అవకాశాలను కల్పించిందన్నారు. అనేక మంది ఉద్యమకారులు ప్రస్తుతం వివిధ పదవుల్లో ఉన్నారని, దరువు ఎల్లన్నకు కూడా పారీ్టలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం ఉద్యమించిన విద్యార్థి నేతలకు రాజకీయ అవకాశాలు ఇవ్వకుండా కాంగ్రెస్, బీజేపీ వాడుకుని వదిలేస్తున్నాయని దరువు ఎల్లన్న విమర్శించారు.
చివరి నిషంలో పార్టీలోకి డబ్బు సంచులతో వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో కార్పొరేషన్ల చైర్మన్లు రాజీవ్ సాగర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, విద్యార్థి నాయకుడు తుంగ బాలు, మిట్టపల్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment