ప్రజాతీర్పు ఓ వైపే ఉంటుంది:న్యూస్ఎక్స్‌‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో జగన్‌ | News X Channel interview with YS Jagan | Sakshi
Sakshi News home page

ప్రజాతీర్పు ఓ వైపే ఉంటుంది:న్యూస్ఎక్స్‌‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో జగన్‌

Published Sun, Mar 23 2014 6:52 PM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM

ప్రజాతీర్పు ఓ వైపే ఉంటుంది:న్యూస్ఎక్స్‌‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో జగన్‌ - Sakshi

ప్రజాతీర్పు ఓ వైపే ఉంటుంది:న్యూస్ఎక్స్‌‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో జగన్‌

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు ఎన్ని పార్టీలు అనుకూలంగా ఓట్లు వేసినా ప్రథమ ముద్దాయి మాత్రం కాంగ్రెస్సే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. న్యూస్ఎక్స్‌‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్‌ విభజనకు పూనుకోకపోయి ఉంటే సీమాంధ్రకు ఇప్పుడున్న  విపత్కర పరిస్థితులు వచ్చేవి కావన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా 42 ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా రాదని  భయపడ్డ కాంగ్రెస్‌ తెలంగాణలోని  17 సీట్లన్నా వస్తాయన్న దురాశతో రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు  సోనియా గాంధీని ఆయన హిట్లర్‌తో పోల్చారు. స్వర్గీయ వైఎస్‌ఆర్‌ బతికి ఉంటే  రాష్ట్రం ముక్కలయ్యేది కాదన్నారు.

న్యూస్ఎక్స్‌ ఛానల్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ:

న్యూస్ఎక్స్‌: జగన్‌ గారు మిమ్మల్ని కాబోయే సీఎంగా చూడొచ్చా?    
వైఎస్ జగన్: దేవుడి దయ ఉంటే అవుతాను. ఏపీ చరిత్ర చూస్తే సీమాంధ్రలో తమిళనాడు తరహాలో స్వింగ్ ఉంటుంది. ప్రజా తీర్పు ఓవైపు పూర్తిగా మొగ్గుచూపుతుంది. 175లో ఓకే పార్టీకి వందకు పైగా సీట్లు వస్తాయి. ఈసారి దేవుడి దయవల్ల  ఎన్నికల్లో స్వీప్ చేస్తాం.

న్యూస్ఎక్స్‌: ఏపీలో కాంగ్రెస్‌ను మీ నాన్న తన చేతుల్లో నిర్మించారు. అయినా  సోనియాగాంధీ కుటుంబం మిమ్మల్ని మొసం చేసిందని భావిస్తున్నారా?  
వైఎస్ జగన్: వ్యక్తిగతంగా ఒకరిపై కక్ష కట్టడం  నా లక్షణం కాదు.  ప్రతీ రోజు బైబిల్‌ చదువుతా. బైబిల్‌ చదివే నిద్రపోతా. నా తప్పులతో పాటు మిగతా వారి తప్పుల్నికూడా మన్నించమని వేడుకుంటా. కాని రాష్ట్రం విషయంలో వారు  క్షమించరాని నేరం చేశారు.   ఓట్లు, సీట్ల కోసం ఐదు కోట్ల మంది  సీమాంధ్రులకు  తీరని అన్యాయం చేశారు.   

న్యూస్ఎక్స్‌:  మీరు సోనియాను  హిట్లర్‌ అని ఎందుకు అన్నారు ?
వైఎస్ జగన్:  ఆరేళ్ల పిల్లవాడిని అడిగినా ఇదే  అంటారు.  ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా,  అసెంబ్లీ తీర్మానాన్ని పట్టించుకోకుండా,  పార్లమెంట్‌ ప్రసారాలు నిలిపేసి,  17 మంది సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేసి మరీ రాష్ట్రాని విభజించారు. విభజన జరిగిన తీరు చూసి ఎవరైనా సోనియాను  హిట్లరే అని అంటారు.

న్యూస్ఎక్స్‌: రాహుల్‌ గాంధీది మీ జనరేషనే కదా, ఆయన కూడా మిమ్మల్ని నిరాశపరిచారా ?  
వైఎస్ జగన్:   రాహుల్కు నాకు వ్యక్తిగతంగా అంత సంబంధం లేదు. కాబట్టి నిరాశ చెందలేదు.  కాని రాష్ట్రాన్ని మాత్రం తీవ్రంగా నిరాశపర్చారు. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా 42 సీట్లలో ఒక్క సీటు కూడా రాదని రాష్ట్రాన్ని విభజించారు.  తెలంగాణలో అయినా  17 సీట్లు వస్తాయని  రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. ఈ తీరు నన్ను చాలా బాధించింది.

న్యూస్ఎక్స్‌:  బీజేపీ కూడా రాష్ట్రవిభజనకు ఓటు వేసింది కదా. మరి వాళ్లతో కలిసి పనిచేస్తారా?
వైఎస్ జగన్:  బీజేపీనే ఎందుకు తప్పుపట్టాలి . మా టీడీపీనే ఓటేసింది.  చాలా పార్టీలు కూడా ఓటేశాయి.  కాని మొదటి ముద్దాయి మాత్రం కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్‌ విభజనకు పూనుకోకపోయి ఉంటే  ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చేవే కావు.

న్యూస్ఎక్స్‌:  మీ నాన్న బతికే ఉంటే  పరిస్థితి ఇలా ఉండేదా?  
వైఎస్ జగన్:  మా నాన్నే ఉంటే ఈ విపత్కర పరిస్థితులు  వచ్చేవే కావు.  కాంగ్రెస్‌కు సీట్లు కావాలి.  మా నాన్నకు ఆ సత్తా ఉంది. కాబట్టి హైకమాండ్ ఖచ్చితంగా నాన్న మాటకు విలువ ఇచ్చి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేది.

న్యూస్ఎక్స్‌:  నీళ్లను కిందికి వదలం అని  కేసీఆర్‌ ప్రకటించారు. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు?
వైఎస్ జగన్: ఈ రకమైన ప్రమాదాల ఉంటాయని   ఎన్నో సార్లు హెచ్చరించాను.  చివరకు అదే జరుగుతోంది. పై వాళ్లు ఎంత ఇస్తే అంత  సీమాంధ్ర సరిపెట్టుకోవాల్సి వస్తుంది. కాని మేం పోరాడుతాం. అంత తేలిగ్గా వదలం.

న్యూస్ఎక్స్‌:  ఎన్నికల్లో మీకెన్ని సీట్లు వస్తాయి?
 వైఎస్ జగన్: క్లీన్‌ స్వీప్ అయితే ‌ చేస్తాం. అయితే ఎన్ని సీట్లు వస్తాయో త్వరలో మీరే చూస్తారు.
 
న్యూస్ఎక్స్‌: టీడీపీ పోటీ ఇస్తుందా.
వైఎస్ జగన్:  కాంగ్రెస్, టీడీపీలు తుడిచిపెట్టుకుపోయాయి.

న్యూస్ఎక్స్‌:  ఎన్డీయే వైపు చూస్తారా. టీడీపీ కూడా అటు వైపే ఉంది కదా.
వైఎస్ జగన్:  టీడీపీ వెళ్తుందా లేదా అన్నది నాకు ముఖ్యం కాదు. కాని ఎన్నికల తర్వాత మాత్రం నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతాను.  కొత్త రాజధానికి ఎంత డబ్బు ఇస్తారు?.  రెవెన్యూ గ్యాప్‌ని భర్తీ చేసే విషయంలో  ప్రాక్టికల్‌గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement