Assembling
-
ఇదే జరిగితే.. జర్మన్ బ్రాండ్ కార్ల ధరలు తగ్గుతాయి
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలోని తన తయారీ కర్మాగారంలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను అసెంబ్లింగ్ చేయాలని యోచిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కొంత తక్కువ ఖర్చుతో కూడుకున్నదయినా.. జీరో ఎమిషన్ మొబిలిటీ సాధ్యమవుతుంది. తద్వారా కార్బన్ ఉద్గారాలు తగ్గుముఖం పడతాయి.మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ విభాగంలో.. దేశీయ విఫణిలో ఈక్యూఎస్ కారును మాత్రమే తయారు చేస్తోంది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీ మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను స్థానీకరించడానికి కావలసిన ఏర్పాట్లను చేయనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సంతోష్ అయ్యర్ పేర్కొన్నారు.భారతదేశంలోని చకన్ ప్లాంట్‌లో కంపెనీ 2022 నుంచి బెంజ్ ఈక్యూఎస్ అసెంబ్లింగ్ ప్రారంభించింది. మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ విభాగంలో ఈక్యూఎస్ మాత్రమే కాకుండా ఈక్యూఏ, ఈక్యూబీ, ఈక్యూఈ వంటివి ఉన్నాయి. అయితే ఇండియాలో ఈక్యూఎస్ అసెంబ్లింగ్ మాత్రమే జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ కార్ల ఉత్పత్తి కూడా మన దేశంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ దేశీయ విఫణిలో తయారవుతోంది, కాబట్టి దీని ధర కొంత తక్కువగా ఉంది. లేకుంటే దీని ధర చాలా ఎక్కువగా ఉండేదని సంతోష్ అయ్యర్ వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ తన ఉత్పత్తులను ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తే ధరలు తగ్గుతాయి.ఇదీ చదవండి: గౌతమ్ అదానీ కొత్త ప్లాన్.. వియత్నాంలో పోర్ట్!ధరల విషయం పక్కన పెడితే.. దేశంలో కాలుష్య భూతం ప్రజలను పట్టిపీడిస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కార్బన్ ఉద్గారాలు భారీగా పెరిగిపోతాయి. ఇది జీవరాశి మనుగడకే ప్రమాద హేతువు అవుతుంది. కాబట్టి కచ్చితంగా పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయాలు పుట్టుకురావాలి. దీనిని దృష్టిలో ఉంచుకునే పలు కంపెనీలు ఇప్పటికే CNG, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. -
శాసనసభ పాత భవనం పునరుద్ధరణ
సాక్షి, హైదరాబాద్: శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్ ఒకే భవన సముదాయంలో ఉండేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం జూబ్లీ హాలులో ఉన్న శాసనమండలిని, పాత భవనంలోకి మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. జూబ్లీహాలును మళ్లీ పునరుద్ధరించి, శాసనసభ, శాసన మండలి, సెంట్రల్ హాలును పాత పద్ధతిలో ఏర్పాటు చేయటంతో పాటు, ఆ ప్రాంగణాన్ని సుందరీకరించటం ద్వారా నగరంలో ఒక ప్రధాన పర్యాటక ప్రాంతంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆర్అండ్ బీ అధికారులతో కలిసి శాసనసభ ప్రాంగణాన్ని పరిశీలించి మార్పుచేర్పులపై చర్చించనున్నారు. సీఎంతో భేటీ అనంతరం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాలుగు రోజుల్లోనే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవటం విశేషం. సెంట్రల్ హాల్‌గా ఏపీ అసెంబ్లీ భవనం గతంలో శాసనసభ, శాసనమండలి ఒకే భవనంలో కొనసాగేవి. ఆ భవనం పాతబడటంతో ప్రస్తుత శాసనసభ కొనసాగుతున్న భవనాన్ని నిర్మించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇదే భవనం కొనసాగింది. పాత భవనంలో శాసనమండలిని నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత పాత భవనంలోని హాలును ఏపీకి కేటాయించారు. అక్కడ శాసనసభ, శాసనమండలి నిర్వహించాల్సి రావటంతో, తెలంగాణ శాసనమండలిని జూబ్లీహాలులోకి మార్చారు. ఇప్పుడు పాత భవనాన్ని పూర్తిగా పునరుద్ధరించనుండటంతో, జూబ్లీ హాలులోని శాసనమండలిని తిరిగి పాత మండలి భవనంలోకే మారుస్తారు. ఏపీకి కేటాయించిన శాసనసభ భవనాన్ని స్వా«దీనం చేసుకుని దాన్ని సెంట్రల్ హాల్‌గా మారుస్తారు. ఇక కొత్త భవనం వెలుపల ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల శాసనసభా పక్ష కార్యాలయాలు, మీడియా సెంటర్ ఉన్న భవనాన్ని తొలగించాలని నిర్ణయించారు. ఆయా కార్యాలయాలను పాత భవనంలో ఏర్పాటు చేస్తారు. భవనం కూల్చిన ప్రాంతంలో పచ్చిక బయళ్లు ఏర్పాటు చేసి పబ్లిక్ గార్డెన్తో అనుసంధానించాలని యోచిస్తున్నారు. గతంలో పబ్లిక్ గార్డెన్‌కు ఎంతో ప్రజాదరణ ఉండేది. సాయంత్రం వేళ ఎంతోమంది సందర్శించి సేద తీరేవారు. తాజాగా మళ్లీ దానికి పర్యాటక కళ తేవాలని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. మహాత్ముడి విగ్రహం ప్రాంతంలో.. శాసనసభ ముందుభాగంలో గతంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహం రోడ్డుపైకి అంతగా కనిపించటం లేదని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. రోడ్డుమీద కంచెను ఏర్పాటు చేయటం కూడా దీనికి కారణమైంది. ఇప్పుడు ఆ కంచెను తొలగించి, వీలైతే గాంధీ విగ్రహాన్ని కాస్త ఎత్తు మీదకు మార్చి, ఆ ప్రదేశాన్ని మరింతగా సుందరీకరించి రోడ్డు మీదుగా వెళ్లేవారిని ఆకట్టుకునేలా చేయాలని నిర్ణయించారు. గతంలో జూబ్లీ హాలు ప్రాంగణం సభలు, సందడిగా ఉండేది. శాసనమండలిగా మారిన తర్వాత కళ తప్పింది. ఇప్పుడు దాన్ని మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయించారు. కొత్త భవనం నిర్మించే యోచన లేనట్టే..? కొత్త సచివాలయం తరహాలో శాసనసభకు కూడా కొత్త భవనాన్ని నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. సచివాలయ భవనానికి పునాది వేసిన రోజునే, ఎర్రమంజిల్ ప్యాలెస్ ప్రాంగణంలో శాసనసభ సముదాయానికి కూడా పునాది వే శారు. కానీ వారసత్వ కట్టడంగా నిలిచిన ఎర్రమంజిల్ ప్యాలెస్‌ను కూల్చాలన్న నిర్ణయంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ అంశం కోర్టు పరిధిలోకి కూడా వెళ్లింది. దీంతో నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పాత భవనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించటంతో, ఇక వేరే ప్రాంతంలో నిర్మాణానికి తెరపడినట్టేనని అంటున్నారు. -
ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా? రఘురామ రాజన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్ఐ ఫెయిల్యూర్ పథకం అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే భారతదేశంలో పెరుగుతున్న మొబైల్ ఫోన్ ఎగుమతులపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా రాజన్ పీఎల్ఐ పథకంలోని లొసుగులను ఎత్తి చూపిన సంగతి గమనార్హం. (CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?) దీనికి సంబంధించి ‘ఇండియా నిజంగా మొబైల్ తయారీ దిగ్గజంగా మారిపోయిందా?’ అనే పేరుతో వెల్లడైన పరిశోధనా నోట్‌ను సోషల్ మీడియాలో పంచుకున్న రఘురామ్ రాజన్ షేర్ చేశారు. దేశంలో నిజమైన తయారీ కంటే దిగుమతి అయిన విడిభాగాల అసెబ్లింగ్ ద్వారా వృద్ధి సాగుతోందని విమర్శించారు. మొబైల్ ఫోన్లపై ప్రత్యేక దృష్టిపెడుతూ దేశీ తయారీ ఉత్పత్తులకు సబ్సిడీ ఇస్తు న్న ఈ స్కీమ్ సమర్థతను ప్రశ్నించారు. భారతదేశంలో ఫోన్‌ను పూర్తి చేయడానికి మాత్రమే సబ్సిడీ ఇస్తోంది తప్ప, భారతదేశంలో తయారీ విలువ జోడింపునకు కాదనీ, ఇదే ఈ పథకంలోని ప్రధాన లోపమన్నారు. (Electric Scooters: ఈరోజే కొంటే రూ.32 వేల వరకు ఆదా! జూన్ 1 తర్వాత పెరగనున్న ధరలు) భారతదేశంలో మొబైల్ ఫోన్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం 2016లో మొత్తం మొబైల్ ఫోన్ దిగుమతిపై సుంకాలను పెంచింది. అలాగే 2020లో మొబైల్ ఫోన్ల స్థానిక ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో భారత ప్రభుత్వం పీఏల్‌ఐ పథకాన్ని ప్రవేశపెట్టింది. 4 శాతం నుండి 6 శాతం వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. ఈ ప్రోత్సాహకం ఐదేళ్లపాటు వర్తిస్తుంది.దేశంలో తయారీ సంస్థల ఏర్పాటు, ఉపాధి కల్పన ఉద్దేశ్యంగా వివిధ రంగాలకు రూ.1.97 లక్షల కోట్ల పీఎల్ఐ స్కీమ్‌లను కేంద్రం గతంలో ప్రకటించింది. ఈ స్కీమ్‌ల అమలుతీరును వివరిస్తూ రాజన్‌తో పాటు మరో ఇరువురు ఆర్థికవేత్తలు రాహుల్ చౌహాన్, రోహిత్ లంబాలు ఈ రీసెర్చ్ నోట్‌ను రూపొందించారు. భారతదేశం నిజంగా మొబైల్ తయారీ దిగ్గజం కాలేదని వీరు వాదించారు. చౌహాన్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లోని ఫామా-మిల్లర్ సెంటర్లో పరిశోధనా నిపుణుడు, లాంబా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. (IPL 2023: ‘మోస్ట్ ఆర్డర్ డిష్’ టైటిల్ ఎవరిదో తెలుసా?) పీఎల్ఐ స్కీంతో పెరిగిన ఎగుమతులు సీఈఏ ప్రకటన ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) గత నెలలో భారతదేశంలో మొబైల్ ఫోన్ ఎగుమతులను ప్రకటించింది. 2022లోని నమోదైన 45,000 కోట్ల నుండి 2023లో 90,000 కోట్లను అధిగమించాయని తెలిపింది. దీనికి పీఎల్ఐ స్కీం ప్రధానమని ప్రకటించింది. కాగా గతంలోనే పథకంలోని లొసుగులను ఎత్తి చూపిన రాజన్ స్మార్ట్ఫోన్ల, ఉత్పత్తి ధరలపై కొన్ని ఉదాహరణలుకూడా ఇచ్చారు. ఏప్రిల్ 2018లో మొబైల్ దిగుమతులపై కస్టమ్ సుంకాలు 20 శాతంగా పెంచారనీ, ఇది తక్షణమే దేశీయ ధరలపెరుగుదలకు దారితీస్తుందని తెలిపారు. తయారీదారులు ఇండియన్ కస్టమర్లపైనే భారాన్ని మోపు తారని కూడా చెప్పారు. ఉదాహరణకు, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్ అమెరికాలో చికాగోలో పన్నులతో సహా రూ. 92,500లోపు అందుబాటులో ఉంటే ఇదే ఫోన్ ఇండియాలో దాదాపు 40 శాతం పెరిగి రూ.1,29,000గా ఉంటుందని లెక్కలు చెప్పిన సంగతి తెలిసిందే. -
ఐఫోన్ లవర్స్‌కు అదిరిపోయే వార్త: అదే నిజమైతే..!
న్యూఢిల్లీ: ఆపిల్ ఐఫోన్ లవర్స్‌కు ఆనందాన్నిచ్చే వార్త ఒకటి మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఐఫోన్ల తయారీకి, అలాగే భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీకి ఒక జాయింట్ వెంచర్‌ను స్థాపించేందుకు టాటాగ్రూప్ భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఆపిల్‌కు తైవాన్ సరఫరాదారుతో టాటా చర్చలు జరుపు తోందని తెలుస్తోంది. సాల్ట్-టు-సాఫ్ట్వేర్ దిగ్గజం టాటాగ్రూపు ఆపిల్ సంస్థకు చెందిన తైవాన్ సరఫరాదారు విస్ట్రన్ కార్పొరేషన్‌తో చర్చలు జరుపుతోంది. ఐఫోన్ల అసెంబ్లింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ తయారీ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇదే వాస్తవమైతే ప్రొడక్ట్ డెవలప్మెంట్, సప్లయ్ చైన్ అండ్ అసెంబుల్ దిగ్గజం విస్ట్రన్‌తో టాటా గ్రూప్ ఒప్పందం కీలకంగా మారనుంది. ఫలితంగా ఐఫోన్లను తయారు చేసే తొలి భారతీయ కంపెనీగా టాటా నిలవనుంది. దీంతో విలాసవంతమైన ఐఫోన్లు, సరసమైన ధరల్లో కస్టమర్లకు అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రానిక్స్, హైటెక్ మాన్యు ఫాక్చరింగ్పై తమ కంపెనీ ప్రధానంగా ఫోకస్ పెట్టినట్లు ఇటీవల టాటాగ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ వ్యాఖ్యలు ఈ అంచనాలను మరింత బలాన్ని ఇస్తున్నాయి భౌగోళిక, రాజకీయ వివాదాలు పెరుగుతున్న సమయంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి హబ్ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు అమెరికాలాంటివి దృష్టిపెట్టనున్నాయి. అలాగే దేశంలో అసెంబ్లింగ్ సంస్థల ఏర్పాటుకు ఇతర ప్రపంచ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్‌కు కూడా ఇది తోడ్పడనుంది. అయితే ఈ వార్తలపై విస్ట్రన్ ప్రతినిధి గానీ, టాటా గ్రూపునుంచి గానీ, ఆపిల్ నుంచిగానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. -
భారత్‌లో ఐఫోన్–12 అసెంబ్లింగ్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఐఫోన్–12 స్మార్ట్‌ఫోన్ అసెంబ్లింగ్‌ను భారత్‌లో మొదలుపెట్టింది. స్థానిక కస్టమర్ల కోసం వీటిని దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఈ సందర్భంగా సంస్థ వెల్లడించింది. ఈ మోడల్‌ను థర్డ్ పార్టీ అయిన ఫాక్స్‌కాన్ రూపొందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే భారత్‌లో ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్–10ఆర్, ఐఫోన్–11 మోడళ్లను ఫాక్స్‌కాన్, విస్ట్రన్ కంపెనీలు అసెంబుల్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2017లో తొలుత ఐఫోన్ ఎస్ఈ మోడల్‌తో భారత్‌లో ఫోన్ల తయారీకి యాపిల్ శ్రీకారం చుట్టింది. భారతదేశాన్ని మొబైల్, విడిభాగాల తయారీకి పెద్ద కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ట్వీట్ చేశారు. పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు దోహదం చేస్తుందని అన్నారు. జోరుమీదున్న అమ్మకాలు.. ఆన్లైన్ స్టోర్ మెరుగైన పనితీరుతో డిసెంబర్ త్రైమాసికంలో భారత్‌లో తమ వ్యాపారం రెండింతలైందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ జనవరిలో వెల్లడించారు. కంపెనీ తన ఉనికిని పెంచుకోవడానికి దేశంలో రిటైల్ ఔట్లెట్లను ఏర్పాటు చేసే పనిలో ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా స్టోర్లు నెలకొల్పాలన్నది సంస్థ లక్ష్యం. కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం 2020 అక్టోబర్–డిసెంబరులో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో దేశంలో ఆరవ స్థానంలో ఉన్న యాపిల్ అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 171 శాతం వృద్ధి సాధించింది. 2019తో పోలిస్తే గత సంవత్సరం 93 శాతం అధికంగా సేల్స్ నమోదు చేసింది. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ 15 లక్షల యూనిట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించింది. సంస్థ ఈ స్థాయి అమ్మకాలు ఒక త్రైమాసికంలో సాధించడం ఇదే తొలిసారి. గతేడాది యాపిల్ టర్నోవర్ 29 శాతం పెరిగి రూ.13,756 కోట్లు నమోదు చేసింది. నికరలాభం రూ.926 కోట్లుగా ఉంది. -
బెంగళూరులో ‘ఐఫోన్’ అసెంబ్లింగ్!
నెల రోజుల్లో ప్రారంభించనున్న యాపిల్ కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే బెంగళూరు: యాపిల్ కంపెనీ నెలరోజుల్లో తన ఐఫోన్లను బెంగళూరు ప్లాంట్‌లో అసెంబ్లింగ్ చేయడాన్ని ఆరంభించనుంది. ఈ ప్లాంట్‌లో యాపిల్ కంపెనీ హై ఎండ్ ఐఫోన్ల అసెంబ్లింగ్‌ను నెలలోపే ప్రారంభిస్తుందన్న విషయాన్ని కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే ధ్రువీకరించారు. ఐఫోన్ల అసెంబ్లింగ్‌లో యాపిల్ కంపెనీకి తైవాన్‌కు చెందిన కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ విస్టర్న్ కార్ప్ తోడ్పాటునందిస్తుందని తెలిపారు. ఇక్కడే ఐఫోన్లను తయారు చేయడం వల్ల భారత్‌లో ఐఫోన్ల ధరలు దిగివస్తాయని, ఫలితంగా వేగంగా వృద్ధి చెందుతున్న భారత మొబైల్ మార్కెట్లో యాపిల్ కంపెనీ మార్కెట్ వాటా పెరగగలదని వ్యాఖ్యానించారు. రాయితీలు ఇవ్వాలి... చైనా, తైవాన్లకు గట్టి పోటీనివ్వడానికి యాపిల్ కంపెనీకే కాకుండా శామ్సంగ్, లెనొవొ తదితర కంపెనీలకు కూడా రాయితీలివ్వాలని ఖర్గే సూచించారు. అన్ని కంపెనీలకు సమాన అవకాశాలు కల్పించేందుకు గాను యాపిల్‌తో సహా పలు కంపెనీలకు నిర్దేశిత గడువు వరకూ కొన్ని సబ్సిడీలను, ప్రోత్సాహకాలను ఇవ్వాలని చెప్పారు. స్థానిక మార్కెట్ నుంచే విడిభాగాలను సమీకరించుకొని, ఫోన్లను పూర్తిగా ఇక్కడే తయారు చేసుకోవడానికి ప్రతి కంపెనీకి పదేళ్ల గడువును ఇవ్వాలన్నారు. స్టార్టప్‌లు భారత చట్టాల ప్రకారమే పనిచేయాల్సి ఉంటుందని ‘స్టేజిల్లా’ స్టార్టప్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఆయన వ్యాఖ్యానించారు. బకాయిలు చెల్లించలేదంటూ చెన్నైకి చెందిన ఒక ప్రకటనల కంపెనీ కేసు దాఖలు చేయడంతో స్టేజిల్లా స్టార్టప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన యోగేంద్ర వాసుపాల్ అరెస్టవడం తెలిసిందే. -
ఫోన్లొచ్చాయ్గా! ఇక టీవీలు!!
చైనా నుంచి.. వెల్లువలా ఎల్ఈడీ టీవీలు పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలదీ ఇదే బాట • 32 అంగుళాల ఎల్ఈడీ టీవీ రూ.9 వేలకే • ధరలో, ఫీచర్లలో దిగ్గజాలకు పెను సవాలు • దేశంలోనే అసెంబ్లింగ్‌కు పలు కంపెనీల కసరత్తు • అమ్మకానికి మాత్రం ఆన్లైన్ మార్గానికే ఓటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : లా ఇకో... మెల్బాన్... నోబుల్... ఇన్ఫోకస్... దైవా... ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా? వినకేం... వీటిలో కొన్ని కంపెనీల మొబైల్స్ చూశాం కదా!! అని కొందరంటే... అరె!! ఏం ఆ మొబైల్స్ వాడుతున్నాం కదా!! అని మరికొందరంటారు. కానీ ఇదేమీ మొబైల్ మాట కాదు. పోటీలు పడే ఫీచర్లతో, ప్రత్యర్థులు అందుకోలేని ధరలతో మార్కెట్‌ను అదరగొడుతున్న టీవీల గురించి. ఎందుకంటే ఈ కంపెనీలన్నీ ఇపుడు టెలివిజన్ రంగంలో హల్చల్ చేస్తున్నాయి. మొబైల్ ఫోన్ల తయారీకి ప్రపంచ హబ్‌గా మారిన చైనాయే... ఇపుడు టీవీలకూ కేంద్రమైంది. అక్కడి నుంచే ఈ కంపెనీలన్నీ తమ తమ బ్రాండ్లతో కళ్లు చెదిరే టీవీలను మార్కెట్లోకి తెస్తున్నాయి మరి. ఒకదాని వెంట ఒకటి.. ఒకప్పుడు టీవీ అనగానే సోనీ, శామ్సంగ్, ఎల్జీ, ప్యానాసోనిక్, హాయర్, ఒనిడా, వీడియోకాన్, హిటాచీ, షార్ప్, తోషిబా వంటి బ్రాండ్లు వినిపించేవి, ఇపుడు మాత్రం వందల బ్రాండ్లు భారత మార్కెట్లో కొలువు తీరాయి. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని కంపెనీలైతే 32 అంగుళాల ఎల్ఈడీ టీవీలను రూ.9 వేల నుంచి విక్రయిస్తున్నాయి. రూ.12 వేలలోపు ధరలో ప్రస్తుతం వివిధ కంపెనీలవి 160 మోడళ్లు అందుబాటులో ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు!! అంతర్జాతీయంగా టాప్ బ్రాండ్స్‌గా ఉన్న కంపెనీలు సైతం ఇండియాలో అతితక్కువ ధరల వ్యూహాన్నే అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు టీసీఎల్ వంటి దిగ్గజం ఏకంగా రూ.32 వేలకే 4కే అల్ట్రా హెచ్డీ టీవీని ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. సాన్సూయి, లా ఇకో, నోబుల్, ఐ గ్రాస్ప్, ఇంటెక్స్ వంటి కంపెనీలు సైతం హై ఎండ్ విభాగంలో పోటీ పడుతున్నాయి. గతంలో కస్టమర్ల మదిని చూరగొన్న బీపీఎల్ సైతం తిరిగి ఇక్కడి మార్కెట్లో ఆన్లైన్ ద్వారా పునఃప్రవేశం చేసింది. కెమెరాల తయారీలో టాప్ బ్రాండ్‌గా ఉన్న ‘కొడాక్’... టీవీ మార్కెట్లో అద ృష్టాన్ని పరీక్షించుకుంటూ పలు మోడళ్లను ప్రవేశపెట్టింది. లా ఇకోతో పాటు ఇన్ఫోకస్, సాన్యో, నోబుల్, లైవ్ తదితర కంపెనీలు పోటాపోటీగా మోడళ్లు తెస్తున్నాయి. షావొమీ టీవీలు త్వరలో రానున్నాయి. ఆన్లైనే అసలైన వేదిక... ఒకప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువుల్ని విక్రయించాలంటే రిటైల్ స్టోర్లకు సరఫరా చేయటం, వారిని ఒప్పించటం పెద్ద తతంగం. కానీ ఆన్లైన్ ఊతంతో పరిస్థితి మారింది. లా ఇకో, ఇన్ఫోకస్, బీపీఎల్, దైవా, కొడాక్ బ్రాండ్లు ఆన్లైన్లోనే లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం టీవీల్లో 20 శాతం అమ్మకాలు ఆన్లైన్ ద్వారా జరుగుతున్నాయి కూడా. ‘‘లాభాలు రావాలంటే ఆన్ లైన్ మార్గమే ఉత్తమం’’ అని దైవా డెరైక్టర్ అర్జున్ బజాజ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. దక్షిణాదిలోనైతే 60 శాతం విక్రయాలు ఆన్లైన్లో జరుగుతున్నాయని గుర్తు చేశారు. ‘ప్యానెళ్ల ధర పెరుగుతోంది. దీంతో ఎల్ఈడీ టీవీల ధర సైతం మున్ముందు పెరుగుతుంది. భవిష్యత్‌లో ఆన్లైన్ విభాగం కీలక పాత్ర పోషిస్తుంది. జీఎస్టీ అమలైతే మార్కెట్ ఒక్కసారిగా మారిపోతుంది’’ అని చెప్పారాయన. చైనాలో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తారు కాబట్టి తయారీ వ్యయం తక్కువ. ఆన్లైన్ విధానంలో మధ్యవర్తులు లేకపోవడంతో విక్రయించే కంపెనీలకు ఖర్చులు భారీగా తగ్గుతాయని మార్కెట్ విశ్లేషకులు బొమ్మారెడ్డి ప్రసాదరెడ్డి తెలిపారు. అందుకే పోటీ ధరల్లో ఉపకరణాలను విక్రయిస్తాయని చెప్పారు. తయారీకి ప్రణాళికలు.. గతేడాది దేశంలో 1.2 కోట్ల యూనిట్ల ఎల్ఈడీ టీవీలు అమ్ముడయ్యాయి. వీటిలో స్మార్ట్ టీవీల వాటా 8-10 శాతం. కంపెనీలు ఇటువైపు రావటానికి కారణమిదే. ఇది చూసి మైక్రోమ్యాక్స్ వంటి కంంపెనీలు స్థానికంగా తయారీ కూడా మొదలెట్టాయి. మొబైల్ ఫోన్ల తరహాలోనే చైనా నుంచి నేరుగా టీవీ సెట్స్‌ను దిగుమతి చేసి ఇక్కడ విక్రయించేవి కొన్నయితే... మరికొన్ని ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తున్నాయి. అమ్మకాల విషయంలో మాత్రం స్మార్ట్‌గా వ్యవహరిస్తూ ఆఫ్‌లైన్‌కు బదులు ఆన్లైన్ మార్గాన్నే ఎంచుకుంటున్నాయి. మైక్రోమ్యాక్స్ రుద్రపూర్ ప్లాంటు పెట్టగా కార్బన్ మొబైల్స్ రూ.150 కోట్లతో నోయిడాలో యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టింది. డిసెంబరుకల్లా స్మార్ట్ టీవీలతో మార్కెట్లోకి రావాలని కంపెనీ యోచిస్తోంది. సెల్కాన్ సైతం తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఏర్పాటు చేస్తున్న ప్లాంట్లలో టీవీలను అసెంబుల్ చేయనుంది. ప్రస్తుతానికి మేడ్చల్ ప్లాంటులో అసెంబ్లింగ్ చేపడుతోంది. దక్షిణాదిన దైవా ప్లాంటు.. దైవా ఇటీవలే 32, 40 అంగుళాల సైజులో మూడు స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ.9,399 నుంచి ప్రారంభం. ఈ ఏడాదే పెద్ద సైజున్న ఎల్ఈడీ టీవీలు, అల్ట్రా హెచ్డీ టీవీలను సైతం ప్రవేశపెట్టనుంది. అంతర్జాతీయ బ్రాండ్లతో పోలిస్తే 50 శాతం తక్కువకే, అవే ఫీచర్లతో టీవీలను విక్రయిస్తామని అర్జున్ బజాజ్ తెలిపారు. దైవాను ప్రమోట్ చేస్తున్న వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ 30కిపైగా ఇతర బ్రాండ్లకు నోయిడాలోని ప్లాంటులో పలు మోడళ్లను తయారు చేస్తోంది. మదర్ బోర్డులను భారత్‌లో తయారు చేస్తున్న రెండు మూడు కంపెనీల్లో ఇదొకటి. దైవా బ్రాండ్‌తో సొంతంగా ఫ్లాట్ ప్యానెళ్ల మార్కెట్లో ప్రవేశించిన ఈ కంపెనీ అమ్మకాలు పెరిగితే దక్షిణాదిన ప్లాంటు పెట్టాలని భావిస్తోంది. సొంత ప్లాంట్లు, సొంత డిజైన్ కేంద్రాలున్న కంపెనీలే పోటీలో నిలదొక్కుకుంటాయని కంపెనీ అంటోంది. తక్కువ మార్జిన్ ఉన్నా ఇటువంటి కంపెనీలు నెట్టుకొస్తాయని చెబుతోంది. -
దేశీయంగా సుజుకీ ‘హయబుసా’ అసెంబ్లింగ్
న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన ప్రీమియం బైక్ ‘హయబుసా’ అసెంబ్లింగ్‌ను హరియాణాలోని గుర్గావ్ ప్లాంటులో ప్రారంభించింది. దీంతో ఇప్పుడు బైక్ రూ.13.57 లక్షలకే వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దిగుమతుల కారణంగా బైక్ ధర ఇదివరకు రూ.15.95 లక్షలుగా ఉండేది. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీవి. కాగా బైక్ ఫీచర్లలో ఎలాంటి మార్పులు ఉండవని కంపెనీ పేర్కొంది.