Assembly Budget
-
Bharath: సంపద సృష్టించడం అంటే ఐదు నెలల్లో 57 వేల కోట్లు అప్పు చేయడమా...?
-
పురపాలకానికి నిధుల వరద
సాక్షి, హైదరాబాద్: పురపాలక శాఖకు బడ్జెట్లో నిధుల వరద పారింది. 2020–21లో ఈ శాఖకు రూ.12,287.29 కోట్లు ఇవ్వగా.. ఈసారి (2021– 22లో) రూ.14,112.24 కోట్లకు పెంచారు. ఇందు లో నిర్వహణ పద్దు కింద కేటాయింపులు రూ.1,261.98 కోట్ల నుంచి రూ.3,978.01 కోట్లకు పెరగగా.. ప్రగతిపద్దు కేటాయింపులు రూ.11,020.31 కోట్ల నుంచి రూ.10,134.23 కోట్లకు తగ్గాయి. హైదరాబాద్ నగరానికి ఈసారి కూడా భారీగా కేటాయింపులు ఉన్నాయి. నిర్వహణ పద్దు కింద జల మండలికి రుణాలను రూ.900 కోట్ల నుంచి రూ.738.52 కోట్లకు తగ్గించారు. అభివృద్ధి పనుల కోసం కొత్తగా రూ.668 కోట్లను కేటాయించారు. కృష్ణా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులో భాగంగా సుంకిశాల ఇంటేక్ నుంచి హైదరాబాద్‌కు నీటి సరఫరా చేసే పనుల కోసం రూ.725 కోట్ల రుణానికి ఓకే చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్లు, ఓఆర్ఆర్ కోసం హెచ్ఎండీఏకు రూ.472 కోట్లు రుణాలుగా కేటాయించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాగా స్మార్ట్‌సిటీలకు రూ.288.60 కోట్లు, అమృ త్ నగరాలకు రూ.203.02 కోట్లు కేటాయించారు. పట్టణాల్లో పనుల కోసం.. రాష్ట్ర పథకాల కింద మూసీ పరీవాహక ప్రాంత అభి వృద్ధికి రూ.200 కోట్లు, టీయూఎఫ్ఐడీసీకి రూ.219.33 కోట్లు, హైదరాబాద్ ప్రజలకు 20వేల లీటర్ల ఉచిత నీటిసరఫరా కోసం జలమండలికి రూ.250 కోట్లు, కొత్త ఎయిర్‌స్ట్రిప్‌లకు రూ.75.47 కోట్లు, వరంగల్ మెట్రో ప్రాజెక్టుకు రూ.150.94 కోట్లు, హైదరాబాద్ అర్బన్ అగ్లోమెరేషన్ పనులకు రూ.1,962.22 కోట్లు కేటాయించారు. యాదాద్రికి రూ.350 కోట్లు గత బడ్జెట్ తరహాలోనే యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ (వైటీడీఏ)కు రూ.350 కోట్లు, వేములవాడ ఆలయాభివృద్ధి సంస్థ (వైటీడీఏ)కు రూ.50 కోట్లు ఇచ్చారు. పదిలక్షలపైన జనాభా గల నగరాలకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల కింద హైదరాబాద్ నగరానికి రూ.318 కోట్లు, ఇతర నగరాలకు రూ.354 కోట్లను ప్రతిపాదించారు. స్వచ్ఛ భారత్‌కు భారీగా.. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద స్వచ్ఛ భారత్‌కు రూ.783.75 కోట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)కు రూ.166.50 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. మున్సిపాలిటీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను రూ.889 కోట్ల నుంచి రూ.672 కోట్లకు తగ్గించారు. పురపాలికలకు ఆరోగ్య రంగం కింద ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లుగా రూ.107.51 కోట్లను కొత్తగా కేటాయించారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వడ్డీలేని రుణాల కింద నిధుల కేటాయింపులను రూ.226.41 కోట్ల నుంచి 566.02 కోట్లకు పెంచారు. -
ట్రాక్టర్లకోసం నేతల తాకిడి
సాక్షి, హైదరాబాద్: ట్రాక్టర్ల కోసం ఎక్కడైనా రైతులు క్యూలు కడుతుంటారు. కానీ, వాటికోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్‌లోని వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు తరలిరావడం విశేషం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో అనేకమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి పోచారం నుంచి పైరవీ లేఖలతో వ్యవసాయ కమిషనర్ జగన్మోహన్ను కలవడానికి వస్తున్నారు. రోజుకు ఐదారుగురు వరకు ప్రజాప్రతినిధులు వస్తున్నట్లు అ«ధికారులు చెబుతున్నారు. కొందరైతే ఫోన్లుచేసి విన్నవిస్తున్నారు. పైగా ఈ నెలాఖరుకు ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ట్రాక్టర్ల కేటాయింపు మరింత ఊపందుకుంది. దీంతో ప్రజాప్రతినిధుల తాకిడి ఎక్కువైంది. ఒకవేళ కమిషనర్ అందుబాటులో లేకుంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లి సిఫార్సు లేఖలను అందజేస్తున్నారు. దీంతో వ్యవసాయాధికారులకు ఇదో పెద్ద పనిగా మారింది. అయితే నిబంధనల ప్రకారం కలెక్టర్లకే వదిలేయకుండా స్పెషల్ రిజర్వు కోటా అంటూ మంత్రి విచక్షణ మేరకు వ్యవసాయ శాఖ కూడా మంజూరు చేసేలా కోటా పెట్టడంతో పైరవీలు జోరందుకున్నాయి. భారీ డిమాండ్‌తో... వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు 95 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీతో యంత్రాలను సరఫరా చేస్తుంది. ఒకేసారి గ్రూపు లేదా వ్యక్తిగతంగా ఇస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ విలువ మార్కెట్లో రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుం ది. సగం అంతకుమించి భారీ సబ్సిడీ ఉండటంతో గ్రామాల్లో డిమాండ్ ఏర్పడింది. రైతులు ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను మండలాల్లో వ్యవసాయాధికారి, ఎండీవో, తహసీల్దార్ల బృందం పరిశీలించి నిబంధనల ప్రకారం ఉన్నవాటిని అర్హతగా గుర్తిస్తారు. అర్హుల జాబితాను జిల్లా వ్యవసాయ శాఖకు పంపిస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా, జిల్లా వ్యవసాయాధికారి, శాస్త్రవేత్తలతో కూడిన కమిటీ ఆ జాబితాలను పరిశీలించి అర్హులైన రైతుల తుది జాబితాను రూపొందిస్తుంది. దాని ప్రకారం రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలి. కానీ ఈ తంతు కేవలం కాగితాలకే పరిమితమైంది. ప్రత్యేక కోటా పెట్టడంతో నిజమైన రైతులకు ట్రాక్టర్లు అందడంలేదన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలే ట్రాక్టర్లను ఎగరేసుకుపోతున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను అడ్డు పెట్టుకొని కొందరు కిందిస్థాయి రాజకీయ నేతలు కమీషన్లు పుచ్చుకొని సబ్సిడీ ట్రాక్టర్లను రైతులకు అమ్మేస్తున్నార న్న విమర్శలున్నాయి. నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న రైతులకు మాత్రం ఎదురుచూపే మిగులుతోంది. -
వందకు పైగా మనవే: కేసీఆర్ జోస్యం
-
వందకు పైగా మనవే
తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ⇒ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ ⇒ 101 నుంచి 106 స్థానాల్లో గెలుస్తాం ⇒ టీఆర్ఎస్ఎల్పీ భేటీలో సీఎం జోస్యం సాక్షి, హైదరాబాద్: ‘‘మళ్లీ మనమే అధికారం లోకి వస్తాం. ఈసారి ఎన్నికల్లో కనీసం 101 నుంచి 106 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తాం. పార్టీ చేయించిన సర్వేలు ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి. ప్రతి ఎమ్మెల్యే జాతకం నా దగ్గరుంది. ఆ వివరాలు ఎవరివి వారికి ఇస్తా. పనితీరు సరిగా లేనివారు కుంగిపోవాల్సిన పనిలేదు. ఇంకొంచెం కష్టపడండి. సర్వేలో మంచి పర్సెంటేజీ వచ్చిన వాళ్లూ పొంగిపోవొద్దు. ఇంకా కష్టపడాలి. ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేనిచోట కూడా పార్టీకి మంచి ఆదరణ ఉంది. అదే మీకు శ్రీరామరక్ష. ఆయా ఎమ్మెల్యేలు బాగా పర్యటించాలి. బహిరంగ సభలు పెట్టండి. నేను హాజరవుతా’’ అంటూ ఎమ్మెల్యేలకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు దిశానిర్దేశం చేశారు. గురువారం తెలంగాణ భవన్లో తన అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శుక్రవారం నుంచి ప్రారంభవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అరగంట పాటు ప్రసంగించారు. సభ్యుల పనితీరు ఎలా ఉండాలో, ఎలా సన్నద్ధమై రావాలో వివరించారు. ఎమ్మెల్యేల పనితీరుపై ఇటీవల తాను చేయించిన సర్వే వివరాలను భేటీలో సీఎం బయట పెట్టారు. అయితే వాటిని అందరి ముందూ కాకుండా, ఒక్కో జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల తో పదేసి నిమిషాల చొప్పున మాట్లాడి వారి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, విపక్షాల పరిస్థితి,ఎమ్మెల్యే పనితీరు గురించి తెలిపారు. సర్వేలో 40 శాతంకన్నా తక్కువ ఫలితం వచ్చినవారు ఇంకా కష్టప డాలన్నారు. విప్‌లూ... మెరుగవ్వండి అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులంతా హుందా గా వ్యవహరించాలని, విపక్షాలను ఎదుర్కొ నేందుకు బాగా తయారై రావాలని సీఎం సూచించారు. ‘‘హాజరు పూర్తి స్థాయిలో ఉం డాలి. మంత్రులు సహా అంతా సభకు కనీసం అరగంట ముందే రావాలి. ప్రధానంగా మంత్రులు ఏ రోజుకారోజు ఎజెండా చూసు కుని సన్నద్ధమవాలి’’ అని సూచించారు. ప్రభుత్వ విప్ల పనితీరు సరిగా లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. సభా సమన్వయం సరిగా చేయలేక పోతున్నారన్నా రు. ఈసారి వారి పనితీరు మెరుగుపడాలని సూచించారు. ప్రభుత్వాన్ని మీరూ ప్రశ్నించండి ప్రజోపయోగమైందని అనుకున్న ప్రతి అంశా న్నీ ప్రభుత్వం దృష్టికి తేవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచించారు. ‘‘కేవలం ప్రతిపక్షాలే ప్రశ్నలేస్తా యని అనుకోవద్దు. అధికార పార్టీ సభ్యులు కూడా గట్టిగానే ప్రశ్నలడగాలి. జీరో అవర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోండి’’ అని సూచించారు.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో టీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ మాట్లా డాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశా నికి ఎంపీలను కూడా ఆహ్వానించినా ఇద్దరే వచ్చారంటూ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశా రు. సమావేశ వివరాలను ఎంపీలకు తెలియజేయాలన్నారు. 15 రోజుల్లో సభ్యత్వం పూర్తి కావాలి పార్టీ సంస్థాగత అంశాలను కూడా సీఎం చర్చించారు. ‘‘పార్టీ సభ్యత్వాలను 15 రోజుల్లో పూర్తి చేయాలి. వారంలో సభ్యత్వా లివ్వడం మొదలుపెట్టాలి. పార్టీ క్రియాశీలక సభ్యులకు ఏప్రిల్ 1 నుంచి బీమా వర్తించేలా సభ్యత్వాలను తక్షణమే పూర్తి చేయండి’’ అని ఆదేశించారు. ఇందులో ఎలాంటి పొడిగింపూ, గ్రేస్ పీరియడూ ఉండవన్నారు. సభ్యత్వ నమోదు పూర్తయ్యాక ఏప్రిల్ 21న పార్టీ ప్లీనరీ నేపథ్యంలో కమిటీల నియామకం పూర్తి చేస్తామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో నియోజకవర్గ ఇన్చార్జులతో భేటీ అవుతా మన్నారు. జిల్లావారీగా ఎమ్మెల్యేలకు సభ్యత్వ పుస్తకాలందజేశారు. సిట్టింగులకు మళ్లీ సీట్లు కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో దాదాపు ఆర్నెల్ల కింద చేయించిన సర్వే, గత జనవరి ఆఖరులో చేయించిన సర్వేల ఫలితాలను ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు సీఎం అందజేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా 100 పై చిలుకు స్థానాల్లో గెలుపు టీఆర్ఎస్దేనని, అంతా మంచిగా పని చేస్తే ప్రతి సిట్టింగ్ సభ్యునికీ మళ్లీ టికెట్ దక్కుతుందని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తవారికీ అవకాశం ఉంటుందన్నారు. జాగ్రత్తగా పని చేయాలని, ఇష్టారాజ్యం కుదరదని సున్నితంగా హెచ్చరించారు. ఇకనుంచి ఎమ్మెల్యేలపై కానీ, మంత్రులపై, ప్రభుత్వంపై గానీ అవినీతి ఆరోపణలొస్తే తీవ్రంగా స్పందించాలని సూచించారు. ‘‘మీపై అవినీతి ఆరోపణలొస్తే కుంగిపోవద్దు. వాటిని నిరూపించాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేయండి. ఎక్కడా వెనక్కి తగ్గొద్దు. ఆరోపణలను ఉపేక్షించొద్దు’’ అని స్పష్టం చేశారు. -
విపక్షం లేక సభ వెలవెల
వైఎస్సార్సీపీ సభ్యుల గైర్హాజరీతో కళతప్పిన అసెంబ్లీ విపక్ష నేత జగన్‌పై విమర్శలే లక్ష్యంగా ప్రసంగాలు సాక్షి, హైదరాబాద్: శాసనసభలో పోటీ లేని ఆట సాగింది. సభ్యుల హడావుడి లేదు. విపక్షాల వాయిదా తీర్మానాలు లేవు. సభలో లేని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలే లక్ష్యంగా అధికార పక్ష సభ్యుల ప్రసంగాలు... అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం కనిపించిన పరిస్థితిదీ.సభలో విపక్ష నేత, ప్రతిపక్ష సభ్యులు లేకపోవడంతో కొందరు అధికార పార్టీ సభ్యులు తమ ప్రభుభక్తిని ఘనంగా చాటుకున్నారు. సీఎం చంద్రబాబును పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రశ్నోత్తరాలు ముగిసే సమయానికి మంత్రులు కాక పట్టుమని పాతికమంది కూడా లేకుండాపోయారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమయ్యే సమయానికైతే శాసనసభ సిబ్బంది, కెమెరామెన్లు, సహాయక సిబ్బంది మినహా 24 మందే సభలో ఉన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డితోపాటు ఆ పార్టీ సభ్యులను మాట్లాడకుండా గొంతు నొక్కినందుకు నిరసనగా వైఎస్సార్ సీపీ శుక్రవారం బడ్జెట్ సమావేశాలకు గైర్హాజరైంది. ప్రశ్నోత్తరాల సమయంలో జవాబులు చెప్పాల్సిన మంత్రులు తప్ప మరెవ్వరూ సభలో కనిపించలేదు. విపక్షం లేకపోవడమే మంచిది: రావెల చెంచులకు ఎస్టీ హోదాపై మాట్లాడిన మంత్రి రావెల కిషోర్‌బాబు విపక్ష నేత జగన్‌పై అక్కసు వెళ్లబోసుకున్నారు. అరాచక ప్రతిపక్షం లేకపోవడం వల్ల సభ సజావుగా సాగుతోందని, సభ్యులు చర్చలో పాల్గొంటూ చక్కని ఆలోచనలు, విశ్లేషణలు చేశారని చెప్పుకొచ్చారు. అర్థవంతమైన ప్రతిపక్షం అవసరమే: స్పీకర్ మంత్రి రావెల కిషోర్‌బాబు వ్యాఖ్యల అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు జోక్యం చేసుకుంటూ ప్రతిపక్షం లేకపోవడం అదృష్టమంటున్నారుగానీ తాను మాత్రం అర్థవంతమైన, సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నానన్నారు. జగన్ సభకు రావాలి: బీజేపీ సభలో ప్రధాన ప్రతిపక్షం లేకపోవడం లోటుగా ఉందని బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు.ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నుంచైనా దయచేసి సభకు రావాలని విజ్ఞప్తి చేశారు. -
‘అనంత’ వేదన పై.. గళం విప్పాలి
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. టీడీపీ అధికారం చేపట్టి తొమ్మిది నెలలైంది. ఆ పార్టీ తరఫున జిల్లా నుంచి 12మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జిల్లా అభివృద్ధి కోసం 19 హామీలను అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి దాకా వాటి అమలు దిశగా అడుగైనా వేయలేదు. హంద్రీ-నీవాను ఏడాదిలో పూర్తి చేస్తామన్న మాటలు నీటి మూటలయ్యాయి. కరువు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రైతుల ఆత్మహత్యలను నివారించడంలోనూ అదే తంతు. మొత్తం మీద కొత్త ప్రభుత్వంపై ‘అనంత’ వాసులు పెట్టుకున్న కోటి ఆశలు అడియాశలయ్యాయి. ఈ క్రమంలో 9నెలల ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గళం విప్పేందుకు సన్నద్ధమయ్యారు. పార్టీలకతీతంగా సమష్టిగా గళం వినిపించకపోతే ఈ బడ్జెట్ సమావేశాల్లోనూ ‘అనంత’కు తీవ్ర అన్యాయం తప్పదు. సాక్షిప్రతినిధి, అనంతపురం : జిల్లాలోని 63 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారంటే కరువు తీవ్రత ఇట్టే తెలుస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం కరువు నివారణ చర్యలు చేపట్టడంలో విఫలమైంది. కరువు పరిస్థితిపై ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి నివేదిక పంపలేదు. కేంద్రబృందం పర్యటించే పరిస్థితులు కూడా కన్పించడం లేదు. కనీసం ఉపాధిహామీ పథకంపై ప్రత్యేక దృష్టి సారించి అందరికీ పనులు కల్పించడంలో కూడా విఫలమైంది. దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 1.27లక్షల కుటుంబాలు కర్నాటకతో పాటు ఇతర ప్రాంతాలకు వలసెళ్లాయి. ఉపాధిహామీ అమలులో నిర్లిప్తత కరువు తీవ్రత ఉన్నా ఉపాధిహామీ పథకాన్ని అమలు చేయడంతో డ్వామా అధికారులు పూర్తి నిర్లప్తత ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో జాబ్కార్టుల లెక్కల ప్రకారం 18.11లక్షల మంది కూలీలు ఉన్నారు. ఇప్పటి దాకా ఒక్కో కుటుంబానికి 49.07రోజులు పని కల్పించారు. వందరోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలు కేవలం 25,337 మాత్రమే ఉన్నాయి. ఈ లెక్కలు చూస్తే చాలు జిల్లాలో రైతులు, రైతు కూలీలు ఎందుకు వలసెళుతున్నారో? ప్రభుత్వం ఏ మేరకు ‘ఉపాధి’ కల్పిస్తోందో ఇట్టే తెలుస్తుంది. పంట నష్టపరిహారం ఏదీ ‘బాబు’ ఈ ఏడాది 5.06 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంటసాగు చేస్తే మొత్తం పంట తుడిచిపెట్టుకుపోయింది. దీనికి 573 కోట్ల రూపాయల ఇన్‌పుట్‌సబ్సిడీ రావాలి. ఇప్పటి వరకూ ప్రభుత్వం పరిహారం ఊసెత్తలేదు. 2013-14కు సంబంధించి 643.37కోట్ల రూపాయల ఇన్‌పుట్‌సబ్సిడీ రావాలి. దీని విడుదలకు చర్యలు తీసుకోలేదు. 2011కు సంబంధించి 28.40కోట్లు, 2012కు సంబంధించి మరో రూ. 3కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటి విడుదలపై కూడా చిత్తశుద్ధి చూపలేదు. అలాగే గతేడాదికి వాతావరణ బీమా రూ.227కోట్ల బ్యాంకులకు చేరింది. రైతులు పాతబకాయిలు చెల్లించాల్సిన నేపథ్యంలో బీమా సొమ్మును వారి ఖాతాల్లోకి జమ చేయలేదు. మూడేళ్లు వరుస కరువులు, ఈ ఏడాది రుణమాఫీ దెబ్బతో ‘అనంత’ రైతులు గుల్లయ్యారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జిల్లాలో 49మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తుంది. హంద్రీ-నీవాపై హామీలు.. నీటి మూటలు హంద్రీ-నీవాకు చంద్రబాబు తన 9ఏళ్ల గత హయాంలో 13కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తే, వైఎస్ 5,600 కోట్ల రూపాయలను విడుదల చేసి 90శాతం పనులను పూర్తి చేశారు. చంద్రబాబు సీఎంగా ఎన్నికైన తర్వాత ‘వ్యవసాయమిషన్’ను ప్రారంభించేందుకు కళ్యాణదుర్గం వచ్చినప్పుడు ఏడాదిలో హంద్రీ-నీవాను పూర్తిచేస్తామని చెప్పారు. కానీ గత బడ్జెట్లో కేవలం వందకోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించారు. ఈక్రమంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హంద్రీ-నీవాను పూర్తి చేయాలని దీక్ష కూడా చేపట్టారు. ఏడాదిలో ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేస్తామని ఇటీవల జిల్లాకు వచ్చిన నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు కూడా ప్రకటించారు. మరి ఈ బడ్జెట్లో ఏ మేరకు నిధులు కేటాయిస్తారో వేచి చూడాలి. 19హామీలలో ఏ ఒక్కటీ నిర్మాణ దశకు చేరలేదు: ‘అనంత’ నుంచి కరువును తరిమికొడతానని, కరువు భయపడేలా అభివృద్ధి చేస్తానని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు బీరాలు పలికారు. జిల్లా అభివృద్ధి కోసం 19 వరాలు ప్రకటించారు. 9నెలల కాలంలో వాటిల్లో ఒక్కటి కూడా నిర్మాణదశకు చేరలేదు. ఇందులో సెంట్రల్ యూనివర్శిటీ, ఏయిమ్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కేంద్రప్రభుత్వ సహకారంతో నిర్మించేవి. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వీటి ప్రస్తావన లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎన్ని హామీలకు చంద్రబాబు తొలవిడత నిధులు విడుదల చేస్తారో చూడాలి. వీటన్నిటిపై ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషాతో పాటు మంత్రులు పల్లెరఘునాథరెడ్డి, పరిటాల సునీత మిగిలిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు గళం విప్పి ప్రాజెక్టులు, నిధులు సాధించుకోవాలి. అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఏ మాత్రం ఏమరపాటు వహించినా జిల్లాకు అన్యాయం చేసిన వారవుతారు. కరువు నివారణ చర్యలు తీసుకోవాలి కరువుతో జిల్లా రైతులు, కూలీలు తీవ్ర వేదన పడుతున్నారు. అయినా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టలేదు. హంద్రీ-నీవాకు బడ్జెట్లో కేటాయింపులు పెంచి ఏడాదిలో పూర్తి చేయాలి. ఇన్‌పుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స్ వెంటనే విడుదల చేయాలి. తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. 9నెలల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు రాబట్టడం, ప్రత్యేక హోదా రప్పించడంలో విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యాన్ని మరొకరిపై నెట్టేసే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. వీటన్నిటిపై అసెంబ్లీలో గళం విప్పుతా. - విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ తాగునీటి సమస్య పరిష్కరించాలి కదిరి నియోజకవర్గంతో పాటు జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఎన్పీకుంట మండలంలో సోలార్‌పవర్ ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న వారిలో పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నవారికి మాత్రమే పరిహారం ఇస్తామంటున్నారు. పాసుపుస్తకాలు లేకుండా సాగులో ఉన్న భూములనూ గుర్తించాలి. గతేడాదికి సంబంధించి రూ.643కోట్ల ఇన్‌పుట్‌సబ్సిడీ, రూ.227 కోట్లు ఇన్సూరెన్స్ రావాలి. వీటిపై అసెంబ్లీలో మాట్లాడుతా. -అత్తార్‌చాంద్‌బాషా, ఎమ్మెల్యే, కదిరి ‘దుర్గం’ చెరువులకు నీరు నింపాలి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎలాంటి సాగునీటి వనరులూ లేవు. హంద్రీనీవా ద్వారా నియోజకవర్గంలోని చెరువులకు నీరు నింపే కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరతా. శ్రీరామరెడ్డి తాగునీటి పథకం మరమ్మతుల కోసం అదనంగా రూ.7 కోట్లు మంజూరయ్యాయి. ఈ పథకం ద్వారా నిరంతరం గ్రామాలకు నీరందించాలని డిమాండ్ చేస్తా. కళ్యాణదుర్గం నియోజకవర్గం జిల్లాలోనే అత్యంత వెనుకబడి ఉంది. ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విన్నవిస్తా. - ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి