Assembly election 2014
-
రానున్నది వైఎస్సార్ సీపీ ప్రభంజనమే
కడియం, న్యూస్‌లైన్ : రానున్నది వైఎస్సార్ సీపీ ప్రభంజనమేనని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు అన్నారు. సోమవారం వీరవరంలో రాజమండ్రి రూరల్ అసెంబ్లీ అభ్యర్థి ఆకుల వీర్రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొడ్డు మాట్లాడుతూ సంక్షేమరాజ్య స్థాపనే జగన్ మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు. వైఎ స్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీలో పలువురి చేరిక వివిధ గ్రామాల నుంచి పలువురు నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. కీలకనేతలు ఆకుల వీర్రాజుకు మద్దతునిచ్చారు. జెడ్పీటీసీ మాజీ సభ్యులు దొంతంశెట్టి వీరభద్రయ్య, బత్తుల రా ము, మాజీ ఎంపీటీసీ సభ్యులు రేమళ్ల ప్రసాద్, లంక కనకారావు, రేమళ్ల పరమేష్, వీరవరం సర్పంచ్ పరమటి భాగ్యవతి, ఉప సర్పంచ్ కొత్తపల్లి లక్ష్మణరావు, దొంతంశెట్టి చినవీర్రాజు, బత్తుల బ్రహ్మయూత్ సభ్యులు, చేనేత సొసైటీ అధ్యక్షుడు కర్రా సూర్యచంద్రరావు, ఆదిమూ లం పెద్దబ్బు, దొంతంశెట్టి ఏకాంబరం, దోర శ్రీనివాసు సహా వందలాది మంది పార్టీలో చేరా రు. వీరిని బొడ్డు, ఆకుల సాదరంగా ఆహ్వానిం చారు. పొట్టిలంకలో సొసైటీ మాజీ అధ్యక్షుడు పాటంశెట్టి సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో వందమంది, మురమండలో పలువురు చేనేత నాయకులు పార్టీలో చేరారు. రావి పాటి రామచంద్రరావు, యాదల సతీష్‌చంద్రస్టాలిన్, గిరజాల బాబు, దాసరి శేషగిరి పాల్గొన్నారు. -
నలుగురూ నాలుగు దారులు
సాక్షి, అనంతపురం : హిందూపురం తెలుగుదేశం పార్టీలో ఉన్న నలుగురు నాయకులు ప్రస్తుతం ఒక్కొక్కరు ఒక్కోదారి వెతుక్కుంటున్నారు. నాయకుల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. బాలక్రిష్ణ సోదరుని కుమారుడు సినీ నటుడు నందమూరి తారకరత్న ప్రచారం కోసం అనుమతి తీసుకోకపోవడం ఇందుకు అద్దం పడుతోంది. మంగళవారం ఉదయమే ఆయన హిందూపురం చేరుకున్నారు. వచ్చీ రాగానే పట్టణంలో రోడ్ షోలో పాల్గొనే విధ ంగా ముందుగానే రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు. అయితే స్థానిక నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత కలహాల కారణంగా ఎవరూ తారకరత్న రోడ్ షోకు పర్మిషన్ తీసుకోలేదు. దీంతో తారకరత్న చేసేదిలేక లాడ్జికే పరిమితం అయ్యారు. ఎన్నికల వేళ ఏమి మాట్లాడాలో ఆయన కూడా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోకుండా నవ్వులపాలయ్యారు. రోడ్ షో నిర్వహించేందుకు అనుమతి తీసుకోక పోవడంతో ఎటూ సమయం దొరికింది కదా అని మీడియాతో మాట్లాడుతూ బాబాయిని సీఎంగా చూడాలన్నదే తన కోరిక అని తన మనసులో మాటను బయటకు వెల్లడించాడు. ఆ వెంటనే తేరుకొని కాదు కాదు ముఖ్యమంత్రి పదవి విషయమై మామ చంద్రబాబు నాయుడు, బాబాయ్ బాలక్రిష్ణలు కూర్చొని మాట్లాడుకుంటారని చెప్పారు. ఇలా ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడటంతో స్థానిక నాయకులు దిక్కులు చూస్తుండిపోయారు. రోడ్‌షోకు పోలీసులు సాయంత్రం అనుమతి ఇవ్వడంతో తారకరత్న రోడ్డుపైకొచ్చారు. అయితే ఆయన రోడ్‌షోలో జనం కంటే పోలీసులే ఎక్కువగా కనిపించారు. పనైపోయింది.. హిందూపురంలో ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే గెలుపుపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనని టీడీపీ నేతల మధ్య చర్చ మొదలైంది. ఇక్కడి గ్రూపు తగాదాల గోల భరించలేక.. బాలక్రిష్ణ నామినేషన్ వేసిన అనంతరం ఇతర జిల్లాలో ప్రచారం కోసమని వెళ్లిపోయారు. అప్పటి నుంచి స్థానిక నేతలు సైతం ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరి విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. ఇదిలా వుండగా చేనేత వర్గానికి చెందిన హిందూపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పను సన్మానం చేస్తామని ముదిరెడ్డిపల్లిలో వున్న చేనేత కుటుంబాలు సోమవారం రాత్రి పిలిపించి మరీ హెచ్చరించారు. గతంలో మంత్రిగా, ఎంపీగా వున్నా చేనేత కార్మికులకు చేసింది శూన్యమని, చేనేత కార్మికులకు దక్కాల్సిన నిధులు చాలా చోట్ల పక్కదారి పట్టినా వాటి గురించి స్పందించలేదని గట్టిగా నిలదీశారు. ఈ హఠాత్పరిణామంతో నిమ్మల కిష్టప్ప షాక్‌కు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు రంగనాయకులు, సీపీ వెంకటరాముడు, సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, అంబికా లక్ష్మినారాయణలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటున్నారు. వీరు దూరంగా ఉండటానికి కారణం వారిలో నెలకొన్న విభేదాలు ఒకటైతే... ప్రజల వద్దకు వెళ్తున్నా స్పందన కన్పించకపోవడంతోనే దూరం దూరంగా ఉంటున్నారనేది మరో కారణం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి తెలుగుదేశం పార్టీలో స్తబ్దత నెలకొనడంతో ఎంతో కొంత చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో తారకరత్న రెండు మూడు రోజులు హిందూపురంలోనే ఉండి ప్రచారం చేయాలని నిర్ణయించారు. అయితే మొదటి రోజే స్థానిక నాయకులు హ్యాండ్ ఇవ్వడంతో ‘అదేంది బాబాయ్.. ఇక్కడ మన పార్టీ వాళ్లు ఇలాగున్నార’ం టూ బాలకృష్ణకు ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేసినట్లు ఓ టీడీపీ నేత వెల్లడించారు. -
సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీకి 112 అసెంబ్లీ సీట్లు: సర్వే
హైదరాబాద్: సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీదే హవా అని 'ఆరా' సర్వే వెల్లడించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 105 నుంచి 112 అసెంబ్లీ సీట్లు వస్తాయని తాజాగా నిర్వహించిన ఆరా సర్వేలో తేలింది. 15 నుంచి18 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని వెల్లడైంది. టీడీపీ-బీజేపీ కూటమికి 55 నుంచి 65 అసెంబ్లీ సీట్లు, 7 నుంచి 10 ఎంపీ సీట్లు వచ్చే అవకాశముందని తెలిపింది. కాంగ్రెస్, ఇండిపెండెంట్లకు 10 నుంచి 15 అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు వచ్చే దక్కే అవకాశముందని సర్వే వెల్లడించింది. తెలంగాణలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశముందని పేర్కొంది. టీఆర్ఎస్కు 52 నుంచి 57 అసెంబ్లీ సీట్లు, 7 నుంచి 9 ఎంపీ సీట్లు వచ్చే అవకాశముంది. కాంగ్రెస్- సీపీఐ కూటమికి 43 నుంచి 45 అసెంబ్లీ సీట్లు, 4 నుంచి 6 ఎంపీ సీట్లు దక్కనున్నాయని తెలిపింది. టీడీపీ- బీజేపీ కూటమికి 12 నుంచి16 అసెంబ్లీ సీట్లు 2 నుంచి 3 ఎంపీ సీట్లు వస్తాయని వెల్లడించింది. వైఎస్ఆర్సీపీకి 3 నుంచి 6 అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు దక్కేఅవకాశముంది. ఎంఐఎంకు 6 నుంచి 7 అసెంబ్లీ సీట్లు, 1 నుంచి 2 ఎంపీ సీట్లు వస్తాయని 'ఆరా' సర్వే వెల్లడించింది. -
జేసీపై ముప్పేట దాడి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా తెలుగుదేశం పార్టీపై ఆధిపత్యం కోసం జేసీ దివాకరరెడ్డి ఆరాటపడుతోన్న తీరుపై ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. అభ్యర్థులను మార్చడం.. ఒకరికి ఇచ్చిన బీ-ఫారంను మరొకరికి ఇవ్వడం.. మిత్రపక్షానికి ఇచ్చిన స్థానంలో అభ్యర్థిని నిలబెట్టడంతో జేసీ వ్యవహరించిన తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకరరెడ్డి సైకిలెక్కిందే తడువు ఆధిపత్య పోరాటానికి తెర తీశారు. తాను పోటీ చేస్తున్న అనంతపురం లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో తాను సూచించిన వారినే బరిలో నిలపాలని బాబుకు దిశానిర్దేశం చేశారు. బీజేపీకి ఒక్క సీటు కేటాయించినా పోటీ చేయనని అల్టిమేటం జారీ చేశారు. జేసీ చెప్పినట్లే బాబు ఆడుతుండడంతో టీడీపీ శ్రేణులు నోరుమెదిపే సాహసం చేయలేదు. గత శుక్రవారం రాత్రి 11.30 గంటలకు అనంతపురం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రముఖ కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబును ఎంపిక చేసినట్లు అధినేత జిల్లా నేతలకు సంకేతాలు పంపారు. బీ-ఫారంను కూడా ఫ్యాక్స్‌లో అమిలినేనికి పంపారు. దీంతో శనివారం ఆర్భాటంగా నామినేషన్ వేయాలని ఆయన తలిచారు. దీన్ని పసిగట్టిన జేసీ దివాకరరెడ్డి.. తనతో సంప్రదించకుండా ఎలా టికెట్ ఇస్తారని బాబును నిలదీసినట్లు సమాచారం. తాను ప్రభాకర్ చౌదరికి మాటిచ్చానని, ఆయనకే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలిసింది. దీంతో అదే రోజు అర్ధరాత్రి దాటాక 1.45 గంటలకు అమిలినేనికి టికెట్ ఇవ్వడం లేదన్న విషయాన్ని ఆయనతో పాటు జిల్లా నేతలకు సమాచారం అందించారు. మరో అరగంటకే అనంతపురం స్థానంలో ప్రభాకర్ చౌదరిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు, జేసీలపై అమిలినేని మండిపడుతూ ఎన్నికల్లో టీడీపీకి దూరంగా ఉండాలని తన అనుచరులకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మండిపడుతోన్న శైలజానాథ్ మాజీ మంత్రి శైలజానాథ్ ‘ఫ్యాన్సీ’ ఆఫర్ ఇచ్చి టీడీపీ టికెట్ కేటాయించాలని సీఎం రమేష్ ద్వారా బాబుతో బేరసారాలు జరిపినా ఫలితం లేకపోయింది. చివరకు పీసీసీ చీఫ్ రఘువీరాను ఆశ్రయించిన ఆయన.. ఆ పార్టీ టికెట్‌పై శింగనమల స్థానానికి ఈనెల 15న నామినేషన్ వేశారు. శింగనమల టీడీపీ అభ్యర్థి బండారు రవికుమార్‌కు ఇచ్చిన టికెట్‌ను ఈనెల 16న చంద్రబాబు వెనక్కి తీసుకున్నారు. కానీ.. బీ-ఫారం మాత్రం బండారు రవికుమార్ వద్దే ఉండిపోయింది. ఇది పసిగట్టిన జేసీ దివాకర్‌రెడ్డి.. తాను కాదన్న శైలజానాథ్‌కే శింగనమల టీడీపీ టికెట్ ఇప్పిస్తానని ఎర వేశారు. శుక్రవారం అర్ధరాత్రి చంద్రబాబుతో మంతనాలు జరిపి శైలజానాథ్‌కే టికెట్ ఖరారు చేయించారు. శనివారం ఉదయం బండారు రవికుమార్ నుంచి సేకరించిన బీ-ఫారంను తన సమీపబంధువైన డీసీసీబీ మాజీ చైర్మన్ తరిమెల కోనారెడ్డి ద్వారా శైలజానాథ్‌కు పంపినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. టీడీపీ టికెట్‌పై శింగనమలలో నామినేషన్ వేసేందుకు శైలజానాథ్ బయలుదేరారన్న సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ శమంతకమణి తన అల్లుడైన పోలీసు ఉన్నతాధికారికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఆ పోలీసు ఉన్నతాధికారి తన మరదలికి టికెట్ ఇచ్చి, బీ-ఫారం పంపి, ఇప్పుడు మళ్లీ శైలజానాథ్‌కు టికెట్ ఎలా ఇస్తారని చంద్రబాబును నిలదీశారు. ఆ పోలీసు ఉన్నతాధికారి శక్తిసామర్థ్యాలు తెలిసిన చంద్రబాబు.. వెనక్కి తగ్గి చివరి నిముషంలో శైలజానాథ్‌కు టికెట్ నిరాకరించారు. శనివారం టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన తనను శమంతకమణి తీవ్రంగా నిందించడంతో శైలజానాథ్ మనస్థాపం చెందారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మరో సెట్ నామినేషన్ వేసి వెనక్కి వచ్చారు. బండారు రవికుమార్ నుంచి సేకరించి శైలజానాథ్‌కు ఇచ్చిన బీ-ఫారంను తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆదివారం ఉదయం జేసీ దివాకర్‌రెడ్డిని చంద్రబాబు ఆదేశించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు ఆదేశాల మేరకు శైలజానాథ్ నుంచి బీ-ఫారం వెనక్కి తీసుకోవడానికి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, తరిమెల కోనారెడ్డి తదితరులు విఫలయత్నం చేశారు. ఆ బీ-ఫారంను చింపివేసినట్లు శైలజానాథ్ చెప్పినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈవిషయం నిజం కాదని తెలియడంతో జేసీ పవన్‌కుమార్ స్వయంగా వెళ్లి బలవంతంగా బీ-ఫాం వెనకు తీసుకెళ్లినట్లు సమాచారం. పెడాకులైన పొత్తు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన గుంతకల్లు అసెంబ్లీ స్థానంలోనూ జేసీ దివాకర్‌రెడ్డి వేలు పెట్టారు. బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేసిన వెంకట్రామయ్య బలహీనమైన అభ్యర్థని.. ఇది అనంతపురం లోక్‌సభపై ప్రభావం చూపుతుందని చంద్రబాబుకు జేసీ వివరించారు. గుంతకల్లు నుంచి టీడీపీ అభ్యర్థిని దింపితే లోక్‌సభపై ఒకింత సానుకూల ప్రభావం ఉంటుందని చెప్పారు. జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు.. శనివారం ఉదయం గుంతకల్లు టీడీపీ అభ్యర్థిగా జితేంద్రగౌడ్‌ను ఎంపిక చేసి.. బీ-ఫారంను ఫ్యాక్స్‌లో పంపారు. అదే బీ-ఫారంతో జితేంద్రగౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారాన్ని వెంకట్రామయ్య నేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. తమకు కేటాయించిన సీట్లలో మీరెలా పోటీచేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబును రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం నిలదీశారు. గుంతకల్లు బరిలో నుంచి టీడీపీ అభ్యర్థిని తప్పించకపోతే.. అనంతపురం జిల్లాలో వివిధ స్థానాల్లో పోటీలో ఉన్న తమ అభ్యర్థులకు బీ-ఫారంలు ఇస్తామని స్పష్టీకరించినట్లు సమాచారం. ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టించింది. బీజేపీ అధిష్టానం వద్ద సాగిలపడి కుదుర్చుకున్న పొత్తు.. జేసీ తీరు వల్ల పెడాకులయ్యే పరిస్థితి ఉత్పన్నమైందని ఆ పార్టీ సీనియర్ నేతల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు టీడీపీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’కి తెలపడం కొసమెరుపు. -
జగన్ ప్రభంజనం
సాక్షి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి జిల్లాకు విచ్చేసిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు నీరాజనం పలికారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఆయన వెంకటగిరి నియోజకవ ర్గంలోని రాపూరుకు వచ్చారు. జిల్లా సరిహద్దు నుంచి ప్రతి చోటా ఆయనకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అభిమాన నేతను పలకరించేందుకు మహిళలు, చిన్నారులు, వృద్ధులు, యువకులు రోడ్లపై బారులుదీరారు. మహిళలు మంగళహారతులిచ్చి ఆశీర్వదించారు. పంగిలి రోడ్డు నుంచి రాపూరు సెంటర్ వరకు జగన్ రోడ్‌షో జనంతో కిక్కిరిసి పోయింది. మిద్దెలు, మేడలపై సైతం జనం కిక్కిరిశారు. సుమారు 50 నిమిషాలపాటు రోడ్‌షో సాగింది. జగన్ ప్రతిచోటా వాహనం నిలిపి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ‘రాబోయే కాలం మనదే, మంచి జరుగుతుంది’ అని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. ‘మా రాజన్న బిడ్డ మీరు.. ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసుకుంటాం’ అంటూ జగన్‌ను జనం ఆశీర్వదించారు. కాబోయే సీఎం జగన్ అనే నినాదాలతో హోరెత్తించారు. వేలాదిగా తరలి వచ్చిన జనంతో రాపూరు కిటకిటలాడింది. రాపూరు కూడలిలో జరిగిన బహిరంగ సభలో జగన్ చేసిన ప్రసంగం జనాన్ని ఆకట్టుకుంది. చంద్రబాబుపై కురిపించిన విమర్శల వర్షం జనంలో ఉత్సాహం నింపింది. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు అన్నీ ఫ్రీగా చేస్తానని చెప్పడమేమిటని జగన్ నిలదీయడంతో ఈలలు, కేకలతో జనం స్పందించారు. బాబు తన పాలనలో రైతులు, వృద్ధులను పట్టించుకోలేదని, పేదల ఆరోగ్యం అసలు ఆయనకు పట్టలేదని జగన్ వివరించారు. చివరిలో జగన్ విలువలు, విశ్వసనీయతకు ఓట్లేస్తారా.. కుళ్లు కుతంత్రాలకు ఓట్లేస్తారా అంటూ ప్రశ్నించడంతో ‘విశ్వసనీయతకే మా ఓట్లు’ అంటూ జనం పెద్ద ఎత్తున స్పం దించారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి నిన్ను సీఎంని చేసుకుంటామం టూ ఉత్సాహంగా ఈలలు, కేకలతో తమ అభిప్రాయం తెలిపారు. తాను సీఎం అయిన మరుక్షణమే రైతుల కోసం రూ. 3వేల కోట్ల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకోసం రూ. 2వేల కోట్ల నిధి ఏర్పాటు చేయడంతోపాటు డ్వాక్రా రుణాల రద్దు, వృద్ధుల పింఛన్ పెంపు, అమ్మఒడి పేరుతో విద్యార్థులను ఉచితంగా చదివించడం తదితర పథకాలపై సంతకాలు చేస్తానని చెప్పారు. తొలిరోజు వెంకటగిరి, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సాగిన జగన్ పర్యటనకు విశేష స్పందన లభించడంతో పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కొమ్మిని ఆశీర్వదించండి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా వెంకటగిరి నుంచి పోటీ చేస్తున్న కొమ్మి లక్ష్మయ్యనాయుడు మంచి వ్యక్తి అని, ఆయన అందరికీ మంచి చేస్తారని విశ్వాసం తనకుందని, భారీ మెజార్టీతో గెలిపించాలని జగన్ కోరారు. వరప్రసాద్‌ను గెలిపించండి... తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్న వరప్రసాద్ మంచి వ్యక్తి అని, ఐఏఎస్ అధికారిగా కూడా పనిచేసిన ఆయన ప్రజలకు మంచి చేస్తారని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగన్ పిలుపునిచ్చారు. ఘనస్వాగతం వైఎస్సార్ జిల్లాలోని చిట్వేలు మీదుగా జిల్లాలోకి ప్రవేశించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. వీరిలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కొమ్మి లక్ష్మయ్యనాయుడు, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, సంజీవయ్య, పాశం సునీల్‌కుమార్, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పాపకన్ను రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఆశీర్వదించండి : కొమ్మి లక్ష్మయ్యనాయుడు వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి కొమ్మి లక్ష్మయ్యనాయుడు కోరారు. రాపూరులో జరిగిన వైఎస్సార్ జనభేరి సభలో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలనే పుత్రప్రేమతోనే సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేసిందన్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు పలికాడని కొమ్మి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఒక్కటే సమైక్య రాష్ట్రం కోసం పోరాడిందన్నారు. రాష్ట్రాభివృద్ధికోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసిందన్నారు. జగన్ సీఎం అయితే ఆ పథకాలు మళ్లీ అమలవుతాయన్నారు. అసంపూర్తిగా ఉన్న ఎస్‌ఎస్‌కెనాల్‌ను పూర్తి చేసుకోవడంతో పాటు వెంకటగిరి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. జగన్ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి: వరప్రసాద్ మహానేత వైఎస్సార్ లాంటి సమర్థుడైన వ్యక్తి సీఎం కావాలంటే జగన్‌ను గెలిపించుకోవాలని తిరుపతి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ పిలుపునిచ్చారు. విభజన పుణ్యమాని రాష్ట్రం ప్రస్తుతం కష్టాల్లో ఉందన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రాన్ని అభివృ ద్ధి చేసుకోవచ్చన్నారు. అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో వైఎస్సార్సీపీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. -
ప్రజలకు అందుబాటులో ఉంటా
గెలిచాక విశాఖ సమస్యలన్నింటిని పరిష్కరిస్తా విజయమ్మకు బ్రహ్మరథం పట్టిన విశాఖ ప్రజలు అడుగడుగునా పూలు, మంగళ హారతులతో స్వాగతం సాక్షి, విశాఖపట్నం: ‘ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజ లందరికి అందుబాటులో ఉంటా. మీ అందరి సమస్యలు పరిష్కరిస్తా. అందమైన విశాఖను మరింత పర్యాటకప్రాంతంగా సుందరంగా తయారు చేసుకుందాం. ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. మళ్లీ సువర్ణయుగం రావాలన్నా, విశాఖ అభివృద్ధి కావాలన్నా జగన్ రావాలి. తప్పకుండా మీరంతా జగన్‌ను ఆశీర్వదించండి’ అని వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. విశాఖ నగరంలో రోడ్‌షోలో భాగంగా ఆమె తూర్పు, ఉత్తరం, దక్షిణం నియోజకవర్గంలో పర్యటించిన ఆమెకు అడుగడుగునా ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు. మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి రోడ్లపై నిరీక్షించారు. మహిళలు హారతులతో ఆహ్వానం పలికి దారిపొడవునా పూలతో స్వాగతం పలికారు. వీరిని ఉద్దేశించి విజయమ్మ ఉత్సాహంగా ప్రసంగించారు. విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ వెంటరాగా ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఓల్డ్ డైరీఫాం జంక్షన్ వద్ద నుంచి విజయమ్మ రోడ్ షో ప్రారంభమైంది. సుమారు పది ప్రాంతాల్లో విజయమ్మ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జగన్ ప్రభుత్వంలో జరిగే సంక్షేమ కార్యక్రమాల్ని వివరించారు. విజయమ్మను చూసేందుకు అపార్ట్మెంట్, ఇళ్లల్లోని నివాసులు రోడ్లపైకి చేరి తమ అభిమాన నాయకురాలిని చూసి ఆనందంతో ఉప్పొంగారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ అభ్యర్థి చొక్కాకుల వెంకటరావుతో కలిసి వివిధ ప్రాంతాల్లో యాత్ర సాగించారు. దక్షిణ నియోజకవర్గం పరిధిలో పార్టీ అభ్యర్థి కోలా గురువులు వెంట రాగా.. రాత్రి 9.15 గంటలకు ద్వారకానగర్ చేరుకున్నారు. విజయమ్మ వెంట పార్టీ నియోజకవర్గ అభ్యర్థులతోపాటు నగర అధ్యక్షుడు మళ్ల విజయ్‌ప్రసాద్ ఆద్యంతం ఉండి, పార్టీ మేనిఫెస్టో కార్యక్రమాల్ని వివరించారు. రోడ్ షోలో పార్టీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. -
మళ్లీ వాళ్లే
* సీనియర్ల ఒత్తిడితో ‘జాక్’కు షాక్.. * 111 మందితో టీ కాంగ్రెస్ జాబితా.. పాతవారికే ప్రాధాన్యం.. * పలువురు సిట్టింగ్‌లకు మొండిచేయి * మైనారిటీలకు 4, బీసీలకు 32, ఓసీలకు 43 * జేఏసీ నేతల పేర్లు మాయం.. వారసులకూ నో.. * శంకర్రావు, సబితా ఇంద్రారెడ్డి, మణెమ్మలకు మొండిచేయి * 8 మందే మహిళా అభ్యర్థులు.. మెదక్ అసెంబ్లీకి విజయశాంతి * ఎమ్మెల్సీలు డీఎస్, షబ్బీర్, భానుప్రసాద్, ప్రేమ్‌సాగర్, నంది ఎల్లయ్య, ఎంపీ వీహెచ్‌లకు టికెట్లు * జైపాల్‌రెడ్డి అనుచరుడికేనారాయణపేట సీటు.. డీకే అరుణ చెప్పిన వ్యక్తికే పాలమూరు టికెట్ * మిగిలిన 8 స్థానాల్లో సీపీఐ పోటీ, అడగకున్నా కోదాడ కేటాయింపు! సాక్షి, న్యూఢిల్లీ / హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల ఒత్తిడికి కాంగ్రెస్ అధిష్టానం తలొగ్గింది. రాత్రికి రాత్రే అభ్యర్థుల జాబితాలో మార్పులు చేసింది. వివాదాల జోలికి పోకుండా ప్రయోగాలను పక్కనబెట్టి పాతవారికే పట్టం కట్టింది. జేఏసీ నేతలకు పెద్ద పీట వేస్తామని చెప్పినా.. చివరకు గెలుపు గుర్రాలకే ప్రాధాన్యతనిచ్చింది. కొత్తగా వచ్చిన వారిని, రాజకీయ వారసులనూ హైకమాండ్ దూరంగా ఉంచింది. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో పొత్తులో భాగంగా సీపీఐకి 8 స్థానాలు వదిలేసి.. మిగిలిన 111 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అధిష్టానం సోమవారం ఒకేసారి అభ్యర్థులను ప్రకటించింది. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ ఈ జాబితాను విడుదల చేశారు. శనివారం రాత్రి అర్ధంతరంగా నిలిపేసిన విలేకరుల సమావేశంలో.. టికెట్ ఖరారైనట్లు వెల్లడించిన జేఏసీ నేతల పేర్లు తాజా జాబితాలో గల్లంతయ్యాయి. కొత్త సీసాలో పాత సారా అన్న చందంగా.. నలుగురు మినహా దాదాపుగా సిట్టింగులందరికీ సీట్లు కేటాయించింది. పలువురు ఎమ్మెల్సీలు, ఓ రాజ్యసభ సభ్యుడికీ అవకాశమిచ్చి విధేయతకు ప్రాధాన్యముంటుందన్న సంకేతాలనూ పంపింది. సీపీఐతో పొత్తులో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి(మహేశ్వరం), రేగా కాంతారావు(పినపాక), బాలూ నాయక్(దేవరకొండ)లకు ఈసారి టికెట్లు దక్కలేదు. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఐదుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన డాక్టర్ పి.శంకర్రావుకు సైతం ఈసారి హైకమాండ్ మొండిచేయి చూపడం విశేషం. కాగా, ముషీరాబాద్ ఎమ్మెల్యే మణెమ్మకూ ఈసారి అవకాశమివ్వలేదు. ఆమె కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి టికెట్ ఆశించినప్పటికీ ఆయనకూ దక్కలేదు. ఇక ఉప్పల్ సిట్టింగ్ అభ్యర్థి రాజిరెడ్డికి బదులు ఆయన తమ్ముడికి టికెట్ ఇచ్చారు. బీసీలకు గతంలోకన్నా రెండెక్కువే తెలంగాణలో టీడీపీ అధికారంలోకొస్తే బీసీ నేతను సీఎంను చేస్తానంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీనిచ్చిన నేపథ్యంలో తామేం తక్కువ కాదంటూ ఆ సామాజిక వర్గానికి కాంగ్రెస్ ప్రాధాన్యతనిచ్చింది. గత ఎన్నికల్లో తెలంగాణలో 30 మంది బీసీలకు టిక్కెట్లు కేటాయించగా, ఈసారి 32 మంది బీసీలకు టికెట్లు(28.8 శాతం సీట్లు) కేటాయించడం ద్వారా వారిని ఆకర్షించే యత్నం చేసింది. అలాగే ఈసారి ఎన్నికల్లో 12 శాతం సీట్లు మైనారిటీలకు ఇవ్వాలన్న డిమాండ్లు వచ్చినప్పటికీ నలుగురికి మాత్రమే చోటు దక్కింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించిన సీట్లుపోగా మిగిలిన 57 స్థానాల్లో 37 మంది రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారున్నారు. తెలంగాణలో అధిక ప్రాబల్యమున్న వెలమ సామాజికవర్గానికి 4 సీట్లు దక్కాయి. ఇక కమ్మ వర్గానికి మిర్యాలగూడ, ఖమ్మం సీట్లను కేటాయించారు. డజనుకుపైగా కొత్త ముఖాలు డజనుకుపైగా స్థానాల్లో కొత్త ముఖాలకు అవకాశం దక్కింది. వీరిలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డికి కల్వకుర్తి, ఎన్ఎస్యూఐ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు భార్గవ దేశ్‌పాండేకు ఆదిలాబాద్, ఉస్మానియా జేఏసీ నేత క్రిశాంక్‌కు కంటోన్మెంట్ సీటిచ్చారు. నిజామాబాద్ అర్బన్ స్థానంలో తన కుమారుడు సంజయ్‌ను లేదా ఆకుల లలితను బరిలో దించేందుకు డీఎస్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ హైకమాండ్ మాత్రం యూత్ కాంగ్రెస్‌లో పనిచేసి ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్ పేరును ఖరారు చే సింది. సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు తనయుడు పువ్వాడ అజయ్‌కుమార్(ఖమ్మం), కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ తనయుడు డాక్టర్ పి.వినయ్‌కుమార్(ముషీరాబాద్) కూడా ఈ జాబితాలో ఉన్నారు. కాగా, మహిళా కాంగ్రెస్ నేతలకు పెద్దగా చోటు దక్కలేదు. మొత్తం జాబితాలో మహిళా నేతలు 8 మంది మాత్రమే ఉండటం విశేషం. అంటే కేవలం 7 % మహిళలకే అవకాశమిచ్చారు. ఎమ్మెల్సీలకూ టికెట్లు కాంగ్రెస్ జాబితాలో పలువురు ఎమ్మెల్సీలకూ సీట్లు దక్కాయి. డి.శ్రీనివాస్, షబ్బీర్‌అలీ, భానుప్రసాద్, ప్రేమ్‌సాగర్ రావు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నారు. డీఎస్‌కు వచ్చే ఏడాది ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి కానుంది. మిగతావారికి ఇంకా సమయమున్నప్పటికీ అవకాశమివ్వడం విశేషం. అలాగే ఇటీవలే ఎమ్మెల్సీగా నామినేట్ అయిన నంది ఎల్లయ్యకు నాగర్‌కర్నూలు ఎంపీ సీటు కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం నలుగురు ఎమ్మెల్సీలకు ఎన్నికల్లో టికెట్లు దక్కినట్లయింది. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుకు మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన్ను అంబర్‌పేట అభ్యర్థిగా ప్రకటించారు. కుటుంబ సభ్యులకు నో ఈసారి ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇప్పించుకునేందుకు టీ-కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హైకమాండ్ పెద్దలు సిట్టింగ్‌లకే ప్రాధాన్యమివ్వడంతో వారసులకు సీట్లు నిరాకరించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తన కోడలు వైశాలికి టికెట్ ఇప్పించుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన భార్య పద్మావతికి కోదాడ టికెట్ ఖాయమని భావించారు. అయితే కోదాడను సీపీఐకి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక సీనియర్ నేత దామోదర రాజనర్సింహ తన సతీమణి పద్మిణికి సంగారెడ్డి టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేశారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికే మళ్లీ టికెట్ వరించింది. అలాగే మాజీ మంత్రులు కె.జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ముఖేష్‌గౌడ్, ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి కూడా తమ వారసులను బరిలోకి దింపాలని టికెట్ ఆశించి భంగపడ్డారు. కుటుంబ సభ్యులకు హైకమాండ్ నో చెప్పడంతో విధిలేక ఆయా నియోజకవర్గాల్లో తమ అనుచరుల పేర్లను ప్రతిపాదించి కొంత వరకు సంతృప్తి చెందారు. మిర్యాలగూడ సీటును తన కుమారుడు రఘువీర్‌కు ఇచ్చేందుకు నిరాకరించడంతో జానారెడ్డి.. తన సని్నిహ తుడు, స్థానికేతరుడైన ఎన్.భాస్కర్‌రావుకు టికెట్ ఇప్పించుకున్నారు. దీంతో అక్కడ సీపీఎం సిట్టింగ్ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి నెత్తిన పాలుపోసినట్లయింది. ఇక తన కొడుకు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ, తనకు మహేశ్వరం లేదా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కావాలని పట్టుబట్టిన సబితకూ అధిష్టానం మొండిచేయి చూపింది. కార్తీక్‌రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చినందున సబితకు ఈసారి అవకాశమివ్వలేదు. ఆమె ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించారు. రాజేంద్రనగర్‌ను జ్ఞానేశ్వర్‌కు కట్టబెట్టారు. కొందరికి మాత్రం ఒకే.. టికెట్లు దక్కిన బంధువుల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్కకు మధిర స్థానం దక్కగా.. ఆయన సోదరుడు మల్లు రవికి జడ్చర్ల స్థానం దక్కింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి భువనగిరి ఎంపీ స్థానం.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్గొండ అసెంబ్లీ టికెట్ దక్కింది. వీరిద్దరూ సిట్టింగులే. ఇక రాంరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సోదరులిద్దరికీ టికెట్లు దక్కాయి. వీరూ సిట్టింగులే. మాజీ మంత్రి రెడ్యానాయక్‌కు, ఆయన కూతురు, మహబూబాబాద్ సిట్టింగ్ కవిత కూ అవకాశమిచ్చారు. సీనియర్లకు వెయిటేజీ.. టికెట్ల ఎంపిక విషయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల మాట కొంత మేరకు చెల్లుబాటైంది. కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలమూరు జిల్లాలో తాను సూచించిన నేతల కే అసెంబ్లీ టికెట్లు వచ్చేలా చూసుకున్నట్లు తెలుస్తోంది. నారాయణపేట విషయానికొస్తే సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌కు ఇవ్వాలని హైకమాండ్ తొలుత భావించినప్పటికీ.. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డికి ఇవ్వాలని మాజీ మంత్రి డీకే అరుణ పట్టుబట్టారు. జైపాల్‌రెడ్డి మాత్రం స్థానిక బీసీ నేత వేమనగిరి కృష్ణకు టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించి పంతం నెగ్గించుకున్నారు. డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌కు మహబూబ్‌నగర్ టౌన్ సీటు దక్కడంలో డీకే అరుణ ప్రయత్నం ఫలించినట్లు సమాచారం. అలాగే కరీంనగర్ జిల్లాలో శ్రీధర్‌బాబు, నల్గొండ జిల్లాలో జానారెడ్డి తమ అనుయాయులకు టికెట్లు ఇప్పించుకోవడంలో సఫలీకృతమయ్యారు. మెదక్ సిట్టింగ్ ఎంపీ విజయశాంతి ఈసారి అసెంబ్లీ బరిలోకి దిగారు. ఆమె కోరిక మేరకు మెదక్ అసెంబ్లీ సీటును కేటాయించారు. దీంతో అక్కడ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ పి.శశిధర్‌రెడ్డికి నిరాశే మిగిలింది. వీరుగాకుండా టికెట్ ఆశించి ఇటీవల పార్టీలో చేరిన పలువురికి భంగపాటు తప్పలేదు. మాజీ ఎమ్మెల్యే ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఇబ్రహీంకు మొండిచేయి చూపారు. మల్కాజ్గిరి టికెట్ ఆశించిన టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సోమవారం దిగ్విజయ్‌ను కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరి క్షణంలో భువనగిరి స్థానం కోసం ప్రయత్నించిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతివిద్యాసాగర్కు మొండిచేయే ఎదురైంది. హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి మహిళా కోటాలో తనకు అవకాశం వస్తుం దని బలంగా నమ్మినప్పటికీ నిరాశే మిగిలింది. ఇక ఓబీసీ సెల్ నేత చిత్తరంజన్‌దాస్, మాజీ మంత్రి చంద్రశేఖర్ కూడా భంగపడ్డారు. జేఏసీ నేతలకు మొండి చేయి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ఉద్యోగ, రాజకీయ, విద్యార్థి జేఏసీ నేతలకు సీట్లు ఇస్తామని ప్రకటించిన హైకమాండ్ చివరకు ఆ విషయాన్నే మరిచినట్లుంది. దాదాపు 8 మంది జేఏసీ నేతలకు జాబితాలో చోటు దక్కుతుందని భావించినప్పటికీ ఓయూ జేఏసీ నేత క్రిశాంక్(కంటోన్మెంట్) మినహా మరెవరికీ అవకాశమివ్వలేదు. గజ్జెల కాంతం, మల్లేపల్లి లక్ష్మయ్య, అద్దంకి దయాకర్, దరువు ఎల్లన్న వంటి నేతలకు టికెట్లు ఖరారైనట్లు ఇప్పటికే సమాచారమిచ్చారు. శనివారం రాత్రి ఏఐసీసీ అధికార ప్రతినిధి సూర్జేవాలా మీడియా సమావేశంలో వారి పేర్లను కూడా చదివి విన్పించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాసూచన మేరకే సీట్లు ఖాయమయ్యాయని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని వదిలి కాంగ్రెస్‌ను తిట్టిన వారికి టికెట్లు ఎలా ఇస్తారంటూ తెలంగాణ సీనియర్లు ఒత్తిడి తేవడంతో హైకమాండ్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. దీంతో రాత్రికి రాత్రే జాబితా మారిపోయింది. దీంతో జేఏసీ నేతలు తీవ్ర అసంతృప్తికిలోనయ్యారు. టికెట్లు ఇస్తామని హామీనిస్తేనే కాంగ్రెస్‌లో చేరామని, ఇప్పుడు అధిష్టానం పెద్దలు తమకు అన్యాయం చేశారని వాపోయారు. తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలి: కొప్పుల ఆవేదన జేఏసీ నేతలకు టికెట్లు ఇస్తున్నట్లు ఏఐసీసీ వేదిక మీదుగా పార్టీ అధికార ప్రతినిధి స్వయంగా ప్రకటించి ఇప్పుడు జాబితాలో వారికి చోటివ్వకపోవడంతో ఏఐసీసీ ఎస్సీసెల్ చైర్మన్ కొప్పుల రాాజు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. వెంటనే ఈ విషయాన్ని ఆయన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఇది దళితులను అవమానించడమేనని, తెలంగాణ సాధనలో క్రియాశీలంగా వ్యవహరించిన ఉద్యమ శక్తులకు ఏం సమాధానం చెబుదామని, వారికి టికెట్లు నిరాకరించడం ద్వారా తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అభ్యర్థులను ప్రకటించని స్థానాలివే..(సీపీఐకి ఇచ్చినట్లుగా భావిస్తున్నవి): 1. కొత్తగూడెం 2. వైరా 3. పినపాక 4. దేవరకొండ 5. మునుగోడు 6. కోదాడ 7. బెల్లంపల్లి 8. మహేశ్వరం. కాంగ్రెస్ తెలంగాణ శాసనసభ అభ్యర్థుల జాబితా ఇదీ.. క్రమ సం. నియోజకవర్గం అభ్యర్థి 1. సిర్పూర్- ప్రేమ్‌సాగర్‌రావు 2. చెన్నూరు(ఎస్సీ)- జి.వినోద్ 3. మంచిర్యాల- అరవింద్‌రెడ్డి గడ్డం 4. ఆసిఫాబాద్(ఎస్టీ)- ఆత్రం సక్కు 5. ఖానాపూర్(ఎస్టీ) - అజ్మీరా హరినాయక్ 6. ఆదిలాబాద్- భార్గవ్ దేశ్‌పాండే 7. బోథ్(ఎస్టీ)- జాదవ్ అనిల్ 8. నిర్మల్- ఎ.మహేశ్వర్‌రెడ్డి 9. ముధోల్- జి.విఠల్‌రెడ్డి 10. ఆర్మూర్ - కె.ఆర్.సురేశ్‌రెడ్డి 11. బోధన్- పి.సుదర్శన్‌రెడ్డి 12. జుక్కల్(ఎస్సీ) - ఎస్.గంగారాం 13. బాన్స్వాడ - కాసుల బాలరాజు 14. ఎల్లారెడ్డి - జాజుల సురేంద్ర 15. కామారెడ్డి - షబ్బీర్ అలీ 16. నిజామాబాద్(అర్బన్)- బి.మహేష్‌కుమార్‌గౌడ్ 17. నిజామాబాద్(రూరల్) - డి.శ్రీనివాస్ 18. బాల్కొండ - ఇ.అనిల్ 19. కోరుట్ల - కొమిరెడ్డి రాములు 20. జగిత్యాల- టి.జీవన్‌రెడ్డి 21. ధర్మపురి(ఎస్సీ)- ఎ.లక్ష్మణ్‌కుమార్ 22. రామగుండం- బాబర్ సలీం పాషా 23. మంథని - డి.శ్రీధర్‌బాబు 24. పెద్దపల్లి- భానుప్రసాద్‌రావు 25. కరీంనగర్ - సి.లక్ష్మీనర్సింహారావు 26. చొప్పదండి- సుద్దాల దేవయ్య 27. వేములవాడ - బొమ్మ వెంకటేశ్వర్లు 28. సిరిసిల్ల- కె.రవీందర్రావు 29. మానకొండూరు- ఆరేపల్లి మోహన్ 30. హుజురాబాద్ - కె.సుదర్శన్‌రెడ్డి 31. హుస్నాబాద్ - అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి 32. సిద్దిపేట - టి.శ్రీనివాస్‌గౌడ్ 33. మెదక్ - విజయశాంతి 34. నారాయణ్‌ఖేడ్- పట్లోళ్ల కిష్టారెడ్డి 35. ఆందోల్(ఎస్సీ) - సి.దామోదర రాజనర్సింహ 36. నర్సాపూర్ - వి.సునీతాలక్ష్మారెడ్డి 37. జహీరాబాద్(ఎస్సీ) - జె.గీతారెడ్డి 38. సంగారెడ్డి - తూర్పు జయప్రకాశ్‌రెడ్డి 39. పటాన్చెరు- టి.నందీశ్వర్‌గౌడ్ 40. దుబ్బాక్ - సి.హెచ్.ముత్యంరెడ్డి 41. గజ్వేల్- టి.నర్సారెడ్డి 42. మేడ్చల్ - కె.లక్ష్మారెడ్డి 43. మల్కాజ్గిరి - నందికంటి శ్రీధర్ 44. కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్ 45. కూకట్పల్లి - నర్సింహయాదవ్ 46. ఉప్పల్ - బి.లక్ష్మారె డ్డి 47. ఇబ్రహీంపట్నం- క్యామ మల్లేష్ 48. ఎల్.బి.నగర్ - డి.సుధీర్‌రెడ్డి 49. రాజేంద్రనగర్ - జ్ఞానేశ్వర్ ముదిరాజ్ 50. శేరిలింగంపల్లి - భిక్షపతియాదవ్ 51. చేవెళ్ల(ఎస్సీ)- కె.యాదయ్య 52. పరిగి - టి.రామ్మోహన్‌రెడ్డి 53. వికారాబాద్(ఎస్సీ) - గడ్డం ప్రసాద్ 54. తాండూరు - నారాయణరావు 55. ముషీరాబాద్ - డాక్టర్ వినయ్‌కుమార్ 56. మలక్‌పేట వి.ఎన్.రెడ్డి 57. అంబర్‌పేట వి.హనుమంతరావు 58. ఖైరతాబాద్ - దానం నాగేందర్ 59. జూబ్లీహిల్స్ - పి.విష్ణువర్ధన్‌రెడ్డి 60. సనత్‌నగర్ - మర్రి శశిధర్‌రెడ్డి 61. నాంపల్లి - ఇ.వినోద్‌కుమార్ 62. కార్వాన్ - రూప్సింగ్ 63. గోషామహల్ - ముఖేష్‌గౌడ్ 64. చార్మినార్ - కె.వెంకటేశ్ 65. చాంద్రాయణగుట్ట - మైనంపాటి అశ్విన్‌రెడ్డి 66. యాఖుత్‌పుర - బి.ఆర్.సదానంద్ ముదిరాజ్ 67. బహదూర్‌పుర - సయ్యద్ అబ్దుల్ సమీ 68. సికింద్రాబాద్ - జయసుధ 69. సికింద్రాబాద్ - కంటోన్మెంట్ (ఎస్సీ) క్రిషాంక్ 70. కొడంగల్- విఠల్‌రావు 71. నారాయణ్‌పేట్ - వామన్గిరి కృష్ణ 72. మహబూబ్‌నగర్ - ఎం.డి.ఒబేదుల్లా కొత్వాల్ 73. జడ్చర్ల- డాక్టర్ మల్లు రవి 74. దేవరకొండ - బి.పవన్‌కుమార్ 75. మక్తల్ - చింతం రామ్మోహన్‌రెడ్డి 76. వనపర్తి - డాక్టర్ జి.చిన్నారెడ్డి 77. గద్వాల్- డి.కె.అరుణ 78. అలంపూర్(ఎస్సీ) - సంపత్‌కుమార్ 79. నాగర్ కర్నూల్ - కె.దామోదర్‌రెడ్డి 80. అచ్చంపేట(ఎస్సీ)- డాక్టర్ వంశీకృష్ణ 81. కల్వకుర్తి - చల్లా వంశీచందర్ రెడ్డి 82. షాద్‌నగర్ - సి.హెచ్.ప్రతాప్‌రెడ్డి 83. కొల్లాపూర్ - హర్షవర్ధన్‌రెడ్డి 84. నాగార్జునసాగర్- కుందూరు జానారెడ్డి 85. మిర్యాలగూడ- ఎన్.భాస్కర్‌రావు 86. హుజూర్నగర్ - ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 87. సూర్యాపేట - రాంరెడ్డి దామోదర్‌రెడ్డి 88. నల్లగొండ- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 89. భువనగిరి - పోతంశెట్టి వెంకటేశ్వర్లు 90. నకిరేకల్(ఎస్సీ) - చిరుమర్తి లింగయ్య 91. తుంగతుర్తి(ఎస్సీ) - గుడిపాటి నర్సయ్య 92. ఆలేరు- బూడిద భిక్షమయ్యగౌడ్ 93. జనగాం - పొన్నాల లక్ష్మయ్య 94. ఘన్పూర్ (స్టేషన్)(ఎస్సీ) - విజయరామారావు 95. పాలకుర్తి - డి.శ్రీనివాసరావు 96. డోర్నకల్(ఎస్టీ) - డి.ఎస్.రెడ్యానాయక్ 97. మహబూబాబాద్(ఎస్టీ)- ఎం.కవిత 98. నర్సంపేట- డి.మాధవరెడ్డి 99. పరకాల - ఇ.వెంకటరామిరెడ్డి 100. వరంగల్ వెస్ట్ - స్వర్ణ 101. వరంగల్ ఈస్ట్ - బసవరాజు సారయ్య 102. వర్ధన్నపేట(ఎస్సీ)- కొండేటి శ్రీధర్ 103. భూపాలపల్లి - గండ్ర వెంకటరమణారెడ్డి 104. ములుగు(ఎస్టీ) - పి.వీరయ్య 105. ఇల్లెందు - కొర్రం కనకయ్య 106. ఖమ్మం- పువ్వాడ అజయ్ 107. పాలేరు - రాంరెడ్డి వెంకటరెడ్డి 108. మధిర(ఎస్సీ)- మల్లు భట్టివిక్రమార్క 109. సత్తుపల్లి(ఎస్సీ) - సంభాని చంద్రశేఖర్ 110. అశ్వారావుపేట(ఎస్టీ)- వగ్గెల మిత్రసేన 111. భద్రాచలం(ఎస్టీ) - కుంజా సత్యవతి -
తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..
-
టీ.కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇదే
సికింద్రాబాద్ - జయసుధ, కంటోన్మెంట్- క్రిశాంక్ మలక్‌పేట్-వి.ఎన్.రెడ్డి, అంబర్పేట్- వి.హన్మంతరావు ఖైరతాబాద్ - డి.నాగేందర్, జూబ్లీహిల్స్ - విష్ణువర్దన్ సనత్‌నగర్ - మర్రిశశిధర్‌రెడ్డి, నాంపల్లి - ఇ.వినోద్ కార్వాన్-రూప్సింగ్, గోషామహల్- ముఖేష్‌గౌడ్ చార్మినార్-వెంకటేష్, చాంద్రాయణగుట్ట-మైనంపాటి అశ్విన్ యాకుత్‌పురా- సదానంద్ ముదిరాజ్ బహుదూర్‌పురా - సయ్యద్ అబ్దుల్ షమీ పటాన్చెరు- నందీశ్వర్‌గౌడ్, దుబ్బాక - ముత్యంరెడ్డి గజ్వేల్- నర్సారెడ్డి, మేడ్చల్-లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి - నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్, కూకట్పల్లి- నర్సింహ యాదవ్, ఉప్పల్- లక్ష్మారెడ్డి ఇబ్రహీంపట్నం - మల్లేష్, ఎల్బీనగర్ - సుధీర్ రెడ్డి రాజేందర్‌నగర్ - కాసాని జ్ఞానేశ్వర్ శేరిలింగంపల్లి - భిక్షపతి యాదవ్ చేవెళ్ల - కె.యాదయ్య, పరిగి- టి.రామ్మోహన్ రెడ్డి వికారాబాద్ - గడ్డం ప్రసాద్‌కుమార్ తాండూరు - నారాయణరావు, ముషీరాబాద్- డా.వినయ్‌కుమార్ సిర్పూర్- ప్రేమ్‌సాగర్ రావు, చెన్నూరు- జి.వినోద్ మంచిర్యాల- అరవింద్ రెడ్డి, ఆసిఫాబాద్- ఆత్రం సక్కు ఖానాపూర్- హరినాయక్, ఆదిలాబాద్-దేశ్‌పాండే బోథ్ - అనిల్, నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి ముథోల్- విఠల్ రెడ్డి, ఆర్మూర్ - సురేష్ రెడ్డి బోథన్ - సుదర్శన్‌రెడ్డి, జూకల్ - గంగారాం బాన్స్వాడ - కె.బాలరాజు, ఎల్లారెడ్డి, సురేంద్ర కామారెడ్డి - షబ్బీర్‌అలీ, నిజామాబాద్ అర్బన్ - మహేష్ నిజామాబాద్ రూరల్- డీఎస్, బాల్కొండ - అనిల్ కోరుట్ల- కె.రాములు, జగిత్యాల-టి.జీవన్‌రెడ్డి ధర్మపురి- లక్ష్మణ్‌కుమార్, రామగుండం - సలీంపాషా మంథని- శ్రీధర్‌బాబు, పెద్దపల్లి - భానుప్రసాద్ రావు కరీంనగర్- లక్ష్మీనర్సింహారావు, చొప్పదండి- సుద్దాలదేవయ్య వేములవాడ- బొమ్మా వెంకటేశ్వర్లు సిరిసిల్ల- కె.రవీందర్రావు, మానకొండూరు- ఆరేపల్లి మోహన్ హుస్నాబాద్- ఎ. ప్రవీణ్‌రెడ్డి సిద్దిపేట - టి.శ్రీనివాస్ గౌడ్ మెదక్ - విజయశాంతి, నారాయణ్‌ఖేడ్- కిష్టారెడ్డి ఆందోల్-దామోదర రాజనర్సింహ నర్సాపూర్ - సునీతా లక్ష్మారెడ్డి నారాయణపేట్ - వామనగిరి కృష్ణ జహీరాబాద్- గీతారెడ్డి, సంగారెడ్డి- టి.జయప్రకాష్‌రెడ్డి కొడంగల్- విఠల్‌రావు, నారాయణ్‌ఖేడ్- వంశీకృష్ణ మహబూబ్‌నగర్- కొత్వాల్ జడ్చర్ల- మల్లురవి, దేవరకద్ర-పవన్‌కుమార్ మక్తల్-చిట్టెం రామ్మెహన్‌రెడ్డి, వనపర్తి-చిన్నారెడ్డి గద్వాల్-డీకే అరుణ, ఆలంపూర్-సంపత్‌కుమార్ నాగర్‌కర్నూల్-కె.దామోదర్‌రెడ్డి, అచ్చంపేట్-వంశీకృష్ణ కల్వకుర్తి-వంశీచందర్‌రెడ్డి, షాద్‌నగర్- ప్రతాపరెడ్డి కొల్లాపూర్-హర్షవర్దన్‌రెడ్డి, నాగార్జునసాగర్- జానా మిర్యాలగూడ్- ఎన్.భాస్కరరావు, హుజూర్నగర్-ఉత్తంకుమార్ సూర్యాపేట-ఆర్.దామోదర్‌రెడ్డి, నల్గొండ- కోమటిరెడ్డి భువనగిరి-పి.వెంకటేశ్వర్లు, నకిరేకల్- చిరుమర్తి లింగయ్య తుంగతుర్తి-నర్సయ్య, ఆలేరు -భిక్షమయ్య జనగాం-పొన్నాల లక్ష్మయ్య, స్టేషన్‌ఘన్‌పూర్-విజయరామారావు పాలకుర్తి- దుగ్యాల శ్రీనివాసరావు, డోర్నకల్-రెడ్యానాయక్ మహబూబాబాద్-ఎం.కవిత, నర్సంపేట్-మాధవరెడ్డి పరకాల-వెంకట్ రాంరెడ్డి, వరంగల్ వెస్ట్ - స్వర్ణ వరంగల్ ఈస్ట్- బస్వరాజు సారయ్య వర్దన్నపేట్ - కొండేటి శ్రీధర్, భూపాలపల్లి- గండ్ర ములుగు- వీరయ్య, ఇల్లెందు - కొర్రం కనకయ్య ఖమ్మం - పువ్వాడ అజయ్, పాలేరు- ఆర్.వెంకటరెడ్డి మథిర- భట్టి విక్రమార్క, సత్తుపల్లి - సంభాని చంద్రశేఖర్ అశ్వారావుపేట - మిత్రసేన, భద్రాచలం - కుంజా సత్యవతి -
ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి
హైదరాబాద్: తెలంగాణలో 111 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌లకు మొండిచేయి చూపారు. సీపీఐతో పొత్తు కారణంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్, పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు టిక్కెట్లు కోల్పోయారు. అనారోగ్యం కారణంగా ముషీరాబాద్ ఎమ్మెల్యే మణెమ్మ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డిలకు టిక్కెట్లు ఇవ్వలేదు. రాజిరెడ్డికి బదులు ఆయన సోదరుడికి ఉప్పల్ టికెట్ ఇచ్చారు. జేఏసీ నేతలకు కాంగ్రెస్ పార్టీ చేయించ్చింది. అద్దంకి దయాకర్, దరువు ఎల్లన్న, గజ్జెలకాంతం పేర్లు ప్రకటించి చివరకు మొండిచేయి చూపింది. బెల్లంపల్లి, మునుగోడు, పినపాక, వైరా, కొత్తగూడెం, కోదాడ, మహేశ్వరం, దేవరకొండ స్థానాలకు సీపీఐకి కేటాయించింది.