కూతురి పెళ్లి బాధ్యతను అప్పుగా చూపిన అభ్యర్థి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లో తన అవివాహిత కుమార్తె పెళ్లి బాధ్యతను అప్పుల జాబితాలో చూపారు! గాందెర్బాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మహమ్మద్ యూసఫ్ భట్ ఈ నిర్వాకం వెలగబెట్టాడు. దీనిపై విమర్శలు రావడంతో స్పందించారు. ‘నా కుమారులు సంపాదిస్తున్నారు కానీ, ఆమె సంపాదించడం లేదు. కుమార్తె పెళ్లి తండ్రి బాధ్యత.
నా కూతురి పెళ్లికి బ్యాంకులో జమచేసిన డబ్బు గురించి అఫిడవిట్లో తెలిపాను’ అ చెప్పారు. తనకు సరిగ్గా చదువు రాకపోవడంతో బాధ్యతకు, అప్పుకు మధ్య తేడాను అర్థం చేసుకోలేకపోయానన్నారు. తనకు రూ.11 లక్షల చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్సీ సీటు కోసం దివంగత నేషనల్ కాన్ఫరెన్స్ నేత హాజీ యూసఫ్కు రూ. 84 లక్షలు ఇచ్చానని తెలిపారు.