assembly elections results
-
హ్యాట్రిక్ పరాజయం.. రాహులో..రాహులా..!
-
హర్యానాలో బీజేపీ విజయభేరి.. కాబోయే సీఎం ఎవరంటే?
-
Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్
-
ఒడిషా తీర్పుపైనా దేశం నజర్
భువనేశ్వర్: నవీన్ పట్నాయక్ రికార్డు అధిగమిస్తారా? పవన్ చామ్లింగ్ మైలురాయి దాటుతారా?. లోక్‌సభ ఫలితాలతో పాటు యావత్ దేశం దృష్టి ఇప్పుడు ఒడిషా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా ఉంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుండగా బీజూ జనతా దళ్(బీజేపీ) విజయం సాధిస్తే నవీన్ చరిత్ర సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మంగళవారం ఓట్ల లెక్కింపు తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్నది తేటతెల్లమవుతుంది. ఒకవేళ బీజేడీకు అనుకూలంగా ఫలితాలు వస్తే జూన్ 9న నవీన్ ఆరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఇది వాస్తవమైతే మరో 70 రోజుల తర్వాత నవీన్ సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డు అధిగమించి చరిత్ర సృష్టిస్తారు. సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ నేత ఆయన చామ్లింగ్ 24 ఏళ్ల 165 రోజులు సీఎంగా విధులు నిర్వహించారు. ఆయన 1994 నుంచి 2019 మే వరకు సేవలందించారు. దీర్ఘకాలం సీఎంలుగా విధులు నిర్వహించిన ముఖ్యమంత్రులు అయిదుగురున్నారు. కాంగ్రెస్‌కు చెందిన వీరభద్రసింగ్ హిమాచల్‌ప్రదేశ్ సీఎంగా 21 సంవత్సరాలు 13 రోజులు విధులు నిర్వహించారు. 1983 నుంచి 2017 వరకు (నాలుగుసార్లు) సేవలందించారు. మిజోరం కాంగ్రెస్ నేత లాల్ థధ్వాల్ 22 ఏళ్ల 60 రోజులు (1986 నుంచి 2018) ఆ రాష్ట్రాన్ని పాలించారు. అరుణాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు గెగాంగ్ అపాంగ్ 22 ఏళ్ల 250 రోజులు (1980 నుంచి 2007) అధికారంలో ఉన్నారు. పశ్చిమబెంగాల్ సీఎంగా సీపీఎంకి చెందిన జ్యోతిబసు 23 సంవత్సరాల 137 రోజులు (1977 నుంచి 2000) ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించారు. నవీన్ అయిదుసార్లు (2000 నుంచి 2024 వరకు) సీఎంగా విధులు నిర్వహించి జ్యోతిబసు రికార్డును అధిగమించారు. ఈసారి (2024 జూన్ 9న) ఆరోసారి ప్రమాణ స్వీకారం చేస్తే పవన్ చామ్లింగ్ రికార్డును అధిగమించి చరిత్రలో నిలిచిపోతారు.బీజేడీ నేతల్లో ఆశాభావం: నవీన్ విధేయులుగా ముద్రపడిన నేతలంతా బీజేడీ అధికారంలోకి వస్తుందని, సీఎంగా నవీన్ ఆరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారన్న ఆశాభావంతో ఉన్నారు. నవీన్‌కు ఆదరణ తగ్గలేదని ఎన్నికల ఫలితాలు రుజువుచేస్తాయని అంటున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల భవిష్యత్ మంగళవారం తేలనుంది. ఎన్నికలకు సంబంధించి వివిధ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సిద్ధమైంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 69 స్ట్రాంగ్ రూముల్లో ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం), వీవీ ప్యాట్లను కట్టుదిట్టంగా భద్రపరిచారు. మూడంచెల భద్రత స్ట్రాంగ్ రూముల చుట్టూ మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూములను సీసీ కెమెరాల నిఘాలో ఉంచారు. వాటి రక్షణ కోసం 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్) మోహరించారు. పోలీసు బృందాలు రాత్రింబవళ్లు పహరా కాస్తున్నాయి. భువనేశ్వర్‌లోని బీజేబీ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు. సీఏపీఎఫ్ మరియు రాష్ట్ర సాయుధ పోలీసులు (ఓఎస్ఏపీ) ఇరువర్గాలు స్ట్రాంగ్‌రూమ్‌కు బాధ్యత వహిస్తారు. ఇదే తరహాలో బరిపద, బరంపురం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్, ఉమా చరణ్ పటా్నయక్ ఇంజినీరింగ్ స్కూల్ ఆవరణలో స్ట్రాంగ్‌రూమ్‌లు ఏర్పాటు చేసి ఈవీఎం, వీవీప్యాట్లను కట్టుదిట్టమైన భద్రతలో ఉంచారు. ఫలితాల తదనంతరంపై నిఘా రాష్ట్రంలో ఫలితాల అనంతరం శాంతిభద్రతల పరిరక్షణపై భారత ఎన్నికల సంఘం ఉద్ఘాటించింది. ఎన్నికల తదనంతర పరిస్థితుల ప్రభావంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఈసీఐ మందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఈనెల 6 వరకు రాష్ట్రంలో 70కి పైగా సీఏపీఎఫ్ కంపెనీలు మోహరించబడతాయి. రాష్ట్రంలోని స్ట్రాంగ్‌రూమ్‌లు మరియు కౌంటింగ్ కేంద్రాలకు రక్షణగా 25 కంపెనీల సీఏపీఎఫ్ కొనసాగించాలని ఈసీఐ నిర్ణయించింది. రాష్ట్రం అంతటా శాంతిభద్రతల పరిస్థితిని నిర్వహించడానికి అదనంగా 70 సీఏపీఎఫ్ కంపెనీలను నియమించాలని నిర్ణయించారు. లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి జయపురం: సార్వత్రిక ఎన్నికల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జయపురం సబ్ డివిజన్ ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ ప్రభాత్ కుమార్ పొరిడ తెలిపారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ సభాగృహంలో విలేకరుల సమావేశం మంగళవారం నిర్వహించారు. జయపురం విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో జయపురం, కోట్పాడ్ అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 20 టేబుల్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అలాగే బ్యాలెట్ పేపర్లు లెక్కించేందుకు 5 టేబుల్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. నవరంగపూర్, కొరాపుట్ లోక్‌సభ స్థానాల్లో అంతర్భాగమైన ఈ రెండు స్థానాల్లో లోక్‌సభ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం 58 మంది సిబ్బందిని, రెండు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 37 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. లెక్కింపు వివరాలు ప్రజలకు తెలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సమావేశంలో జయపురం బీడీవో శక్తి మహాపాత్రో, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి సిద్ధార్థ పటా్నయిక్, జయపురం తహసీల్దార్ డా.మనోలిస ఆచార్య, బొరిగుమ్మ బీడీవో అమృత లాల్ బెహర, కోట్పాడ్ అదనపు తహసీల్దార్ నీలాంబర పూజారి, జయపురం సబ్ డివిజన్ సమాచార ప్రజా సంబంధాల అధికారి యశోద గదబ, జయపురం పట్టణ పోలీసు అధికారి రమణీ రంజన్ దొళాయి, సదర్ పోలీసు అధికారి ఈశ్వర చంద్ర తండి, బీజేడీ ప్రతినిధి సుభాష్ పండ, కాంగ్రెస్ ప్రతినిధి తరణి ప్రసాద్ పాణిగ్రహిలు పాల్గొన్నారు. -
Elections 2023: రిజల్ట్ చూద్దాం.. మజా చేద్దాం!
సినిమా కాదు.. క్రికెట్ మ్యాచ్ అంతకంటే కాదు కానీ, ఈ ఆదివారం సిసలైన మజాను కోట్ల మంది ఆస్వాదించబోతున్నారు ఎలాగంటారా?.. డిసెంబర్ 3.. రాజకీయ పార్టీలకు బిగ్డే చార్ పటాకా బద్ధలయ్యే రోజది మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్.. మూడు రాష్ట్రాల్లో రెండు ప్రధాన పార్టీల హోరాహోరీ పోరుపై నెలకొన్న ఆసక్తి ఇక ఇటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ప్రధాన పార్టీల నడుమ విజయధీమాలతో తెలంగాణ రాజకీయాలను హీటెక్కించిన వేళ.. ఓడేదెవరు? నెగ్గేదెవరనేది పక్కనపెడితే.. ఈ సూపర్ సండే మాంచి కిక్కు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.. రాజస్థాన్ చెరో దఫా ప్రభుత్వాల్ని ఇక్కడ కాంగ్రెస్-బీజేపీలు గత మూడు దశాబ్దాలుగా ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. అయితే.. గత మూడేళ్లుగా నడుస్తున్న గ్రూప్ రాజకీయాల నేపథ్యంలో ఈసారి రాజస్థాన్‌లో ఎవరు సర్కార్‌ను నెలకొల్పుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇప్పుడున్న రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14, 2024తో ముగియనుంది. ఈలోపు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసి అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీకి.. 199 స్థానాలకు(ఒక దగ్గర అభ్యర్థి మరణంతో ఎన్నిక నిలిపివేశారు) నవంబర్ 25వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 75.45% పోలింగ్ నమోదైంది. ప్రభుత్వ ఏర్పాటుకు 101 స్థానాలు రావాల్సి ఉంటుంది. ఐదేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాల ప్రభావం తమను మళ్లీ గెలిపిస్తుందని కాంగ్రెస్.. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో పేరుకుపోవడంతో పాటు తాము ఇచ్చిన ఎన్నికల హామీలకు ప్రజలు పట్టం కడతారని బీజేపీ గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఎగ్జిట్‌పోల్ ఫలితాలు హోరాహోరీ పోటీనే చూపిస్తున్నాయి ఇక్కడ. మధ్యప్రదేశ్ కిందటి ఎన్నికల్లో నెగ్గి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేశామనే సంతోషం కాంగ్రెస్‌కు రెండేళ్లే ఉంది. తిరుగుబావుటా నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిణామాలు.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పుడున్న అసెంబ్లీ గడువు జనవరి 6, 2024తో ముగియనుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. నవంబర్ 17వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తంగా 5.6 కోట్ల ఓటర్లకుగానూ.. 77.15 శాతం నమోదు అయ్యింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి.. ప్రభుత్వ ఏర్పాటుకు 116 సీట్లు రావాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో ఈ ఐదేళ్లలో రెండు ప్రభుత్వాలు వచ్చాయి. గత ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. రెండేళ్లు తిరగకముందే 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కుప్పకూలింది. సరిపడా బలం కమల్‌నాథ్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, కాంగ్రెస్‌లు ధీమాతో ఉన్నాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో సగం బీజేపీకి అనుకూలంగా.. సగం హంగ్ చూపిస్తుండగా.. ఓటర్ పల్స్ ఎలా ఉండనుందా? అనే ఆసక్తి నెలకొంది. ఛత్తీస్‌గఢ్ వరుసగా మూడు పర్యాయాలు(2003 నుంచి 2018 దాకా) సంపూర్ణ పాలన కొనసాగించిన బీజేపీకి చెక్ పెడుతూ కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనే ధీమా కాంగ్రెస్‌లో కనిపిస్తుంటే.. కంచుకోటను చేజిక్కించుకుని తీరతామంటూ బీజేపీ ధీమా కనబరుస్తోంది. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ గడువు జనవరి 3, 2024తో ముగియనుంది. ఈలోపు ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించింది కేంద్ర ఎన్నికల సంఘం. రెండు ఫేజ్‌ల్లో నవంబర్ 7న, నవంబర్ 17న పోలింగ్ నిర్వహించింది ఈసీ. మొత్తం కోటి 63 లక్షల ఓటర్లు ఉండగా.. 76 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 46 రావాలి. రూరల్ డెవలప్మెంట్ అనేది ప్రధాన అస్త్రంగా.. సంక్షేమ పథకాలను కాంగ్రెస్ నమ్ముకుంది. మరో వైపు అవినీతి ఆరోపణలు, మత మార్పిడులు, హామీలు నెరవేర్చకపోవడం వంటి అస్త్రాలను బీజేపీ సంధించింది. మరోవైపు.. అద్భుతం జరిగితేనే బీజేపీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ ఈ సారి అధికారం నిలబెట్టుకున్నా సీట్లు తగ్గే అవకాశముందని, ఇవేవీకావు.. బీజేపీ ఏకపక్షంగా నెగ్గుతుందని ఇలా రకరకాల విశ్లేషణలు నడుస్తున్నాయి అక్కడ. ఈ తరుణంలో.ఎగ్జిట్ పోల్స్ సైతం ఛత్తీస్‌గఢ్‌లో హోరాహోరీ అంచనా వేస్తుండడంతో ఆసక్తి నెలకొంది. తెలంగాణ గత రెండు దఫాలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్.. హ్యాట్రిక్ కొడతామంటోంది. ఈ పదేళ్లలో ఘోరంగా అవినీతి జరిగిందని.. బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో తారాస్థాయికి వెళ్లిందని.. అది తమకు అధికారం కట్టబెడుతుందని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీలు చెప్పుకుంటున్నాయి. సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు.. ఈలోపే ఏకపక్షంగా వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు.. గెలుపుపై ఎవరికి వాళ్లే వ్యక్తం చేస్తున్న ధీమా పరిణామాలు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ను మరిపించడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మూడో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఇప్పుడున్న అసెంబ్లీ కాలపరిమితి జనవరి 16, 2024తో ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 30 తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 3.26 కోట్ల ఓటర్లు ఉండగా.. 70 శాతం పైనే ఓటింగ్ నమోదు అయ్యిందని అంచనా. అంటే.. దాదాపు కోటి మంది దాకా పోలింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీకి 119 స్థానాలు ఉండగా.. అధికారం ఏర్పాటు చేయాలంటే 60 సీట్ల మెజారిటీ అవసరం. పదేళ్ల పాలన ప్రచార అస్త్రంగా బీఆర్ఎస్.. అత్యధిక సీట్లతో, మూడోసారి విజయంతో రికార్డు నెలకొల్పుతామని అంటోంది. ఇక ఈ పాలనలోనే జరగని అవినీతి లేదంటూ బీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారంతో కాంగ్రెస్, బీజేపీలు ప్రజల్లోకి వెళ్లాయి. సర్వేలు ఒకలా.. ఎగ్జిట్‌పోల్స్ మరోలా రావడంతో ఓటర్ పల్స్‌పై గందరగోళమే నెలకొంది. పైగా సాయంత్రం ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడంతో.. తెలంగాణలో ఈసారి ఓటింగ్ గెలుపోటములను ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇస్తారనే తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఆ బెట్టింగ్స్ తారాస్థాయికి చేరాయంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఏమేర ఉత్కంఠ నెలకొందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద.. ఈ ఆదివారం డిసెంబర్ 3న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ.. ఫలితాల వెల్లడి.. నాయకుల గెలుపొటములతో.. పార్టల సంబురాలు-నిరుత్సాహాలతో కోట్ల మందికి(ప్రత్యేకించి ఓటర్లకు..) ఇత్యాది పరిణామాలు మస్త్ మజాను అందించబోతున్నాయి! -
TS Elections Result: చెన్నూర్‌లో నువ్వా? నేనా?
సాక్షి, మంచిర్యాల: హీటెక్కించిన విమర్శలు.. హోరెత్తించేలా ప్రచారాలు.. ఎవరికి వారే ఓటర్లను ప్రసన్నం తంటాలు. కచ్చితంగా తామే గెలుస్తామనే ధీమా. అభివృద్ధి తామే చేశామని.. మరో అవకాశం ఇస్తే ఇంకా చేస్తామని, చేసిందేమీలేదని.. తమకు అధికారం ఇస్తే సిసలైన అభివృద్ధి చూపిస్తామని.. ఇలా హామీల మీద హామీలతో ‘సై’ అంటూ ఎన్నికల సమరంలో దూకారు. మరి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో.. ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారో.. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల జిల్లా పరిధిలోని నియోజకవర్గం. బీఆర్ఎస్ నుంచి యువనేతగా గుర్తింపు ఉన్న బాల్క సుమన్ మరోసారి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ తరఫున సీనియర్ నేత గడ్డం వివేక్ వెంకటస్వామి బరిలో నిలవడం ఇక్కడ తీవ్ర చర్చకు దారి తీసింది. పెద్దపల్లి మాజీ ఎంపీలుగా.. స్థానికతను చూపిస్తూ ప్రచారం చేసుకున్నారు ఇద్దరూ. ఇక బీజేపీ తరఫున దుర్గం అశోక్ పోటీలో నిలిచారు. చెన్నూరులో పురుష ఓటర్లు 91,969.. మహిళా ఓటర్లు 92,141.. ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఏడు.. సర్వీస్ ఎలక్టోర్లు 133.. మొత్తంగా మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,250. చెన్నూర్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 82.57 శాతం ఓటింగ్ రికార్డ్ కాగా.. ఈసారి ఎన్నికల్లో 79.97 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో కోల్‌బెల్ట్ ఏరియా ఓట్లు ఇక్కడ కీలకం కానున్నాయి. -
‘ఎర్ర’కోటలో కాషాయం
న్యూఢిల్లీ: ఈశాన్య భారతంలో బీజేపీ హవా పెరుగుతోంది. శనివారం వెల్లడైన మూడురాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఇప్పటికే అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో అధికారంలో ఉన్న బీజేపీ.. తాజాగా కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టి త్రిపురలో భారీవిజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఒక్క కౌన్సిలర్ కూడా లేని త్రిపురలో 25 ఏళ్ల మాణిక్ ‘సర్కారు’ను గద్దెనుంచి కూలదోసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. ‘శూన్యం నుంచి శిఖరానికి చేరుకున్నాం’ అని ఎన్నికల ఫలితాల అనంతరం మోదీ పేర్కొన్నారు. అటు నాగాలాండ్ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యేలా కమలదళం వ్యూహాలు రచిస్తోంది. మేఘాలయలో హంగ్ ఏర్పడినప్పటికీ.. ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు, మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్.. త్రిపుర, నాగాలాండ్‌లలో ఖాతా తెరవలేదు. ఎలాగైనా ప్రభుత్వంలో.. నాగాలాండ్‌లో బీజేపీ–ఎన్డీపీపీ కూటమి మెజారిటీ సాధించలేకపోయింది. అటు అధికారంలో ఉన్న ఎన్పీఎఫ్కూ స్పష్టమైన మెజారిటీ లేదు. అయినా ఎన్పీపీ, జేడీయూ, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. అటు, బీజేపీ తమతో కలసిరావాలంటూ ఎన్పీఎఫ్ ఆహ్వానం పంపింది. ‘బీజేపీ నేతృత్వంలో ఈశాన్య ప్రజాస్వామ్య కూటమిలో ఎన్పీఎఫ్ భాగస్వామిగానే ఉంది. మాతో కలిసి వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు’ అని సీఎం, ఎన్పీఎఫ్ నేత టీఆర్ జెలియాంగ్ పేర్కొన్నారు. దీంతో నాగాలాండ్‌లో ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకం కానుంది. ఎన్నికల ముందు వరకు ఎన్పీఎఫ్–బీజేపీ అధికారంలో ఉన్నాయి. మేఘాలయ ఎవరిది? మేఘాలయ ప్రజలు ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ ఇవ్వలేదు. 59 సీట్లున్న అసెంబ్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 21 సీట్లలో విజయం సాధించి.. మెజారిటీకి 9 సీట్ల దూరంలో నిలిచింది. బీజేపీ 2 చోట్ల గెలవగా.. నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఏ పార్టీకి మద్దతు రాకపోవటం చిన్న పార్టీల పాత్ర కీలకంగా మారింది. దీంతో పరిస్థితి చేయి దాటకుండా కాంగ్రెస్‌పార్టీ అహ్మద్ పటేల్, కమల్‌నాథ్‌లను రంగంలోకి దించింది. అటు బీజేపీ కూడా ఎన్‌పీపీతో కలిసి సర్కారు ఏర్పాటుకు లోపాయకారిగా సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాలకు బీజేపీ అబ్జర్వర్లను నియమించింది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జువల్ ఓరమ్లను త్రిపురకు, జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్‌లను నాగాలాండ్‌కు, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అల్ఫోన్స్ కన్నథాణంలను మేఘాలయకు పంపింది. 2019 ఎన్నికలకు.. తాజా ఫలితాలు బీజేపీ మరింత విశ్వాసంతో 2019 సార్వత్రిక ఎన్నికలు వెళ్లేందుకు బాటలు వేస్తున్నాయి. అసలు స్థానం లేని ఈశాన్య రాష్ట్రాల్లో మరీ ప్రత్యేకంగా పార్టీ జెండా ఎగరలేని త్రిపురలో అధికారాన్ని సంపాదించటం దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచాయి. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. పశ్చిమబెంగాల్, ఒడిశాలో పార్టీ పట్టును పెంచుకుంటున్న కమలదళం.. దక్షిణాదినుంచి మరిన్ని సీట్లను ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మొత్తంగా 2019లో తిరిగి అధికారాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీల జోరునూ అడ్డుకునేందుకు షా–మోదీ ద్వయం వ్యూహాలు రచిస్తోంది. ఒక్కోరాష్ట్రం కమలమయం 2014కు ముందు దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాలు కేవలం ఏడు మాత్రమే. గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గోవా, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్లు మాత్రమే బీజేపీ ఖాతాలో ఉన్నాయి. కానీ మోదీ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యాక బీజేపీ జోరు పెరిగింది. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, యూపీ, మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టింది. తాజా ఫలితాలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో (కర్ణాటక, పంజాబ్, మిజోరం) మాత్రమే ఉంది. -
తీర్పు నేడే!
తమిళనాడులో కొత్త ప్రభుత్వం వస్తుందా, పాత ప్రభుత్వానికే మరోసారి అవకాశం దొరుకుందా...అనే ప్రశ్న ప్రజల బుర్రలను తొలిచేస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకే అధికారమా లేక డీఎంకే అధ్యక్షులు కరుణానిధికే సీఎం పీఠమా అని రెండు పార్టీల నేతలు టెన్షన్ పడుతున్నారు. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపే నేతలు, ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠకు కారణం. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూసిన ప్రజలు, నేతలకు ఈనెల 16వ తేదీ నాటి పోలింగ్‌తో ఆ ముచ్చట తీరింది. ఈనెల 19వ తేదీన ఓట్ల లెక్కింపు ముగిసి ఫలితాలు ఎలా ఉండబోతాయోనని కార్పొరేట్ కార్యాలయాల నుంచి టీకొట్టు, కిళ్లీ బంకు వరకు చర్చసాగుతోంది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకుగాను తంజావూరు, అరవకురిచ్చి వాయిదాపడడంతో 232 స్థానాల్లో విజేతలు ఎవరు, పరాజితులు ఎవ్వరో గురువారం సాయంత్రానికి తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ తరువాత ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్లు లెక్కించడం ప్రారంభిస్తారు. రాష్ట్రం మొత్తం మీద 68, చెన్నైలో మూడు లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా లెక్కింపు కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మూడు రోజులుగా కుండపోతగా వర్షం పడుతున్నందున అదనపు ఏర్పాట్లు అవసరమైంది. గెలుపునకు ఓటమికి ఓట్ల తేడా స్వల్పంగా ఉన్న పక్షంలో రెండోసారి లెక్కింపు జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజేష్ లఖానీ ప్రకటించారు. ఓట్ల లెక్కింపు కారణంగా టాస్మాక్ దుకాణాలను గురువారం మూసివేయనున్నారు. ఎన్నికలకు వ్యతిరేకంగా పిటిషన్: తిరుప్పూరులో మూడు కంటైనర్లలో రూ.570 కోట్లు స్వాధీనం చేసుకోవడం, ఆ సొమ్ము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదని చెప్పడంపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయని సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. రిజర్వుబ్యాంకు, ఇంటెలిజెన్స్ అధికారులచే విచారణ జరిపి నివేదిక వచ్చే వరకు ఓట్ల లెక్కింపు వాయిదావేయాల్సిందిగా తన పిటిషన్లో ఆయన పేర్కొన్నాడు. పుదుచ్చేరీలో ఐదు చోట్ల లెక్కింపు: పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ స్థానాలకు సైతం గురువారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపును ప్రారంభించనున్నారు. మొత్తం ఐదు చోట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేశారు. -
ఫలితాలపై కోట్లలో బెట్టింగులు
* జగన్ ప్రభుత్వ ఏర్పాటుపైనే భారీ పందేలు * వందపైగా సీట్లొస్తాయని ఒకటికి రెండు రెట్లు * టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కదని బెట్టింగులు సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పందేలు మొదలయ్యాయి. రాష్ర్టవ్యాప్తంగా కోట్ల రూపాయల్లో బెట్టింగులు సాగుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రాలుగా పెద్ద ఎత్తున పందేలు నడుస్తున్నట్లు సమాచారం. ఇక వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ లక్షల్లో బెట్టింగ్‌లు సాగుతున్నాయి. కొన్ని బెట్టింగులు బుకీల ద్వారా సాగుతుండగా, చాలావరకూ స్థానికంగా మధ్యవర్తుల ద్వారానే నడుస్తున్నాయి. బీరు, బిర్యానీ మొదలు కోటి రూపాయల వరకు పందాలు సాగుతున్నాయి. అత్యధికంగా కృష్ణా జిల్లాలో సుమారు వంద కోట్ల రూపాయలకుపైగా లావాదేవీలకు ఒప్పందాలు కుదిరాయి. సీట్ల సంఖ్య, పార్టీలు, నేతలపై బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ► పందెపురాయుళ్లలో అత్యధికులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే దానిపైనే ఎక్కువగా దృష్టి సారించారు. ఒకటికి మూడు చొప్పున పందేలకు సై అంటున్నారు. వైఎస్సార్సీపీకి వందకుపైగా సీట్లు వస్తాయంటూ ఒకటికి రెండు చొప్పున పందెం కాస్తున్నారు. ► కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓడతారా? గెలుస్తారా?, మెజారిటీ 20 వేలలోపు ఉంటుందా? ఎక్కువ ఉంటుందా? అనే దానిపై గుంటూరు, విజయవాడలో పందేలు సాగుతున్నాయి. ► మాచర్లకు చెందిన మూడెకరాల రైతు తన యావదాస్తిని పందెం కాశారు. నూజివీడుకు చెందిన మామిడిరైతు ఐదెకరాల తోటను పందెంలో ఒడ్డారు. ► టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదనే దానిపై పొన్నూరు 15వ వార్డుకు చెందిన ఓ మైనారిటీ నేత రూ. 25వేలు, గుంటూరు సంగడిగుంటకు చెందిన ఓ ముఠామేస్త్రీ ఏకంగా 50 వేలు పందెం కాయడం విశేషం. ► వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఒక వస్త్ర వ్యాపారి వైఎస్సార్ కాంగ్రెస్‌కు వంద సీట్లు వస్తాయంటూ ఒకటికి రెండు చొప్పున రూ. 20 లక్షలు, కడపకు చెందిన ఒక నగల వ్యాపారి ఒకటికి మూడు చొప్పున రూ. 40 లక్షలు పందెం కాశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని విశాఖలో ఓ పారిశ్రామికవేత్త ఒకటికి మూడు చొప్పున రూ. కోటి పందెం కాశారు. -
ఎగ్జిట్ పోల్స్ చెత్త: కాంగ్రెస్
న్యూఢిల్లీ/భోపాల్: లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించనున్నట్లు ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడించడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను చెత్తగా అభివర్ణించింది. వాటి ప్రామాణికతను ప్రశ్నించింది. అయితే కాంగ్రెస్‌లో నిరాశకు ఇది నిదర్శనమని బీజేపీ ఎగతాళి చేసింది.ఎగ్జిట్‌పోల్స్‌లో బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో విజయం సాధిస్తుందని, ఢిల్లీలో ఆధిక్యంలో నిలుస్తుందని పేర్కొనడం తెలిసిందే. ఎగ్జిట్‌పోల్స్ ప్రామాణికతను ఆమోదించేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ తిరస్కరించారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ ఎదుగుదలకు రుజువుగా నిలుస్తాయన్న వాదననూ తోసిపుచ్చారు. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను డస్ట్‌బిన్‌లో పడేయాలని ఆయన వ్యాఖ్యానించారు. కాగా రాహుల్‌గాంధీ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పార్టీ నేతలతో సమావేశమవగా.. రాష్ట్రంలో బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమన్న ఆశాభావం వ్యక్తమైనట్టు పార్టీ ప్రతినిధి భక్తచరణ్‌దాస్ తెలిపారు.