ప్రిన్సిపాల్ కారణంగానే రిషితేశ్వరి ఆత్మహత్య!
ఆర్కిటెక్చర్ కాలేజి ప్రిన్సిపాల్ బాబూరావు విద్యార్థులతో కలిసి తాగారని, ఒక రకంగా ఆయనవల్లే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని నాగార్జున యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రాజు తెలిపారు. ఆయన మంగళవారం నాడు 'సాక్షి'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...
ఆడపిల్లలకు రక్షణ లేదని ఉన్నతాధికారులకు ఇంతకుముందు ఫ్యాకల్టీ అంతా కలిసి ఫిర్యాదు చేశాం. కానీ, మా ఫిర్యాదుల మీద చర్యలు తీసుకున్నట్లు మాకైతే ఎప్పుడూ కనిపించలేదు.
ఫ్రెషర్స్ డే పార్టీలో జరిగిన అవమానాల గురించి కూడా డైరీలో రాసుకుంది కదా.. దాంట్లో చాలా ఉన్నాయి.
ఫ్రెషర్స్ డే పార్టీకి ఒక్క ప్రిన్సిపాల్ బాబూరావు మాత్రమే వెళ్లారు. వేరే ఫ్యాకల్టీ ఎవరూ వెళ్లలేదు
మిగిలిన ఫ్యాకల్టీ కూడా వెళ్లి ఉంటే విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించే ధైర్యం చేసేవాళ్లు కారు
ప్రిన్సిపాల్ తానొక్కరే వెళ్లాలని అనుకోవడం వల్లే ఇలా జరిగింది.
యూనివర్సిటీలో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది.. అక్కడ చేసుకోవచ్చు కానీ అలా చేయలేదు
రోజూ యూనివర్సిటీకి ఆయన ఎలా వచ్చేవారు, ఆరోజు పార్టీకి ఎలా వెళ్లారు?
ఆరోజు వేసుకున్న డ్రస్ ఎలా ఉంది, అసలు ఎందుకు తాగాల్సి వచ్చింది?
రోజూ తాగి వస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నా.. ఫ్రెషర్స్ డే పార్టీ రోజు విద్యార్థులతో కలిసి తాగడం ఎందుకు?
ఆయన మద్యం తాగి వస్తున్నారని మేం లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు చేశాం.
చివరిదశలో.. 2014 మార్చిలో గవర్నర్కు కూడా మెయిల్ పంపించాం.
అప్పట్లో ప్రిన్సిపాల్ చెక్ పవర్ తీసేశారు. కానీ తర్వాత మళ్లీ ఆ చెక్ పవర్ ఇచ్చేశారు
కులం ముసుగులోనే ప్రిన్సిపాల్ ఇలా ఇదంతా చేస్తున్నారు
ఆయన మాట వినడంలేదని నన్ను ఆయన హెచ్చరించారు. మాట వినకపోతే దెబ్బతింటావని అన్నారు
అనధికారికంగా తనకు నచ్చినచోట ఫ్రెషర్స్ డే పార్టీ చేయడమే రిషితేశ్వరి మరణానికి ఒక రకంగా కారణమైంది.
విద్యార్థులు తాగి విచక్షణారహితంగా ప్రవర్తించడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది.
ప్రిన్సిపాల్ చేసే అసభ్య కార్యకలాపాలు యూనివర్సిటీలో అయితే వెంటనే తెలిసిపోతాయి కాబట్టి, దాచేందుకే వేదిక మార్చారు
ఆ విషయాన్ని ఫ్యాకల్టీ ఎవరికీ కనీసం తెలియజెప్పలేదు కూడా.
చాలామంది పిల్లలు ప్రిన్సిపాల్ ప్రవర్తన గురించి మా దగ్గర బాధపడి, ఏడ్చారు.
ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడతారని చెప్పారు. డ్రాయింగ్ వేసుకుంటుంటే వెనక నుంచి చేతులు వేస్తారని బాధపడ్డారు.