assures
-
యుద్ధానికి సిద్ధం.. ప్రతి సైనికుడికి అండగా నిలుస్తా!
-
మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు. సాయం కోసం వచ్చిన వారిని అక్కున చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో నేనున్నాంటూ భరోసా ఇస్తున్నారు. బీసీ సభను ముగించుకుని వెళ్తున్న సమయంలో తమ బిడ్డ చికిత్సకు సాయం కోసం రోడ్డుపై నిల్చున్న వారిని చూసిన సీఎం జగన్.. వెంటనే వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. తమ బిడ్డకు మెదడులో నరం దెబ్బ తినడంతో వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారని తల్లిదండ్రులు వివరించారు. తక్షణమే తమ బిడ్డకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. ఈ సందర్భంగా సీఎంకి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్ -
'నేనున్నాను'.. మీకేం కాదు
సాక్షి ప్రతినిధి, కడప: ఆస్తులమ్ముకున్నా రోగం నయం కాక తల్లడిల్లిపోతున్న రెండు కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. ఎంత ఖర్చు అయినా సరే ప్రభుత్వమే వైద్యం చేయిస్తుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు శనివారం పులివెందులలో ఉన్న సీఎంను ఆ రెండు కుటుంబాలు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నాయి. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామానికి చెందిన కుంచెపు శివకుమార్, వరలక్ష్మి దంపతులు పదేళ్లుగా పులివెందులలో మిషన్ కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి హైందవ్ (8), కుశల్ (5)అనే కుమారులు ఉన్నారు. వీరిద్దరికీ పుట్టినప్పటి నుంచి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ లేదు. వైద్యం కోసం చెన్నై, బెంగళూరు, వేలూరు, హైదరాబాద్ తదితర నగరాల్లోని పలు ఆస్పత్రులకు తిరిగారు. వైద్య ఖర్చుల కోసం ఉన్న ఇంటిని అమ్ముకున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తే ఫలితం ఉంటుందని వైద్యులు సూచించారు. ఇందుకు లక్షల్లో ఖర్చవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేని శివకుమార్ దంపతులు శనివారం పులివెందులకు వచ్చిన ముఖ్యమంత్రిని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సహాయంతో హెలిప్యాడ్‌లో కలిశారు. వారి సమస్యను విన్న ముఖ్యమంత్రి తానున్నానంటూ ధైర్యం చెప్పారు. పిల్లల వైద్యం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కలెక్టర్ వి.విజయరామరాజులకు సూచించారు. వైద్యం కోసం వెళ్లేందుకు ఖర్చుల కింద తక్షణమే రూ.లక్ష మంజూరు చేయాలని ఆదేశించారు. వారికి ఇల్లు కూడా మంజూరు చేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌కు తన భర్త అనారోగ్య సమస్యను వివరిస్తున్న శివజ్యోతి ప్రభుత్వమే వైద్యం చేయిస్తుంది.. అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామానికి చెందిన జగన్మోహన్రెడ్డి అనే పేద రైతు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చూపించారు. చికిత్స కోసం రూ.20 లక్షలకు పైగానే ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఏం చేయాలో దిక్కుతోచని భార్య శివజ్యోతి.. కుమార్తెలు సౌమ్య, హరిప్రియ, యామినితో కలిసి శనివారం పులివెందులకు వచ్చి, సీఎంను కలిసింది. తమ పరిస్థితి వివరించి.. మీరే ఆదుకోవాలని వేడుకుంది. ఆయన వైద్యానికి అయ్యే ఖర్చు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. వారు వైద్యం కోసం వెళ్లేందుకు సత్వరమే రూ.2 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇరు కుటుంబాల వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. వాస్తవానికి ఈ రెండు కుటుంబాల్లోని వారి వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తించదు. ఈ ముగ్గురి చికిత్స కోసం రూ.50 లక్షలకు పైగానే ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా. సీఎం ఆదేశాలతో ఈ మొత్తం డబ్బును ప్రభుత్వమే వెచ్చించనుంది. -
మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, కడప: ఎదుటి వారి కష్టం వినాలే కానీ, వెంటనే స్పందించడంలో తన తర్వాతే ఎవరైనా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకర్‌రెడ్డి దంపతుల మూడున్నరేళ్ల కుమారుడు యుగంధర్‌రెడ్డికి లివర్ దెబ్బతింది. చాలా మంది వైద్యుల వద్దకు తిరిగారు. ఈ క్రమంలో బెంగుళూరులోని సెయింట్ జాన్ ఆస్పత్రికి వెళ్లగా.. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని, పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దివాకర్‌రెడ్డి కుటుంబం అంత పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించలేని పరిస్థితి. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కలిశారు. ఆయన శుక్రవారం వైఎస్సార్ జిల్లా లింగాల మండలం పార్నపల్లెకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు బాధిత కుటుంబాన్ని తీసుకుని వచ్చారు. వీరి కష్టం విన్న సీఎం.. వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. తక్షణమే బాలుడికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజును ఆదేశించారు. దీంతో దివాకర్‌రెడ్డి దంపతులు ఆనంద బాష్పాలతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: టీడీపీ అంతర్గత సర్వే ఏం చెబుతోంది?.. షాక్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమా -
అమానుష ఘటన: బాలుడి చేతిలో డ్రిల్లింగ్ మిషన్ దింపిన టీచర్!
ఇటీవల కాలంతో ఉపాధ్యాయులు చిన్న చిన్న విషయాలకే కాస్త ఫ్రస్టేషన్‌కి గురయ్యి విద్యార్థులకు అత్యంత అమానుషమైన పనిష్మెంట్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక ఉపాధ్యాయుడు కొడవలితో పాఠశాల్లో హల్చల్ చేస్తూ... అందర్నీ భయబ్రాంతులకు గురిచేశాడు. అంతకు ముందు మరొక ప్రబుద్ధుడు స్ప్రుహ తప్పి పడిపోయాలా ఒక విద్యార్థిని కర్రతో దాడి చేసి చంపేశాడు. ఇలాంటి ఉదంతాలను మర్చిపోక మునుపే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఒక విద్యార్థి రెండో ఎక్కం అప్పచెప్ప లేకపోవడంతో డ్రిల్లింగ్ మిషన్‌తో పనిష్మెంట్ ఇచ్చాడు. ఈ ఘటనలో సదరు విద్యార్థికి ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత విద్యార్థి సిసామౌ నివాసి. అతను కాన్పూర్ జిల్లాలోని ప్రేమ్‌నగర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఐతే సదరు విద్యార్థి రెండో ఎక్కం అప్పచెప్ప లేకపోవడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఈ పనిష్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత విద్యార్థిని ఇంటికి పంపించడంతో ఫ్రాథమిక చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుడి నిర్వాకానికి ఆగ్రహం చెందిన బాధితుడు బంధువులు పాఠశాలకు చేరుకుని గొడవ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో సమాచారం అందుకున్న ప్రాథమిక శిక్ష అధికారి, బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కాన్పూర్‌కి చెందిన ప్రాథమిక శిక్షా అధికారి సుజిత్ కుమార్ మాట్లాడుతూ...ఈ మొత్తం ఘటనపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ప్రేమ్ నగర్, శాస్త్రి నగర్‌లోని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారులు దీనిపై విచారణ జరిపి నివేదిక పంపుతారు. ఈ ఘటనలో ఎవరైనా దోషులుగా తేలితే వారు శిక్షార్హమైన చర్యల ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు. (చదవండి: క్షణికావేశంలో కన్న బిడ్డనే కడతేర్చాడు.. ) -
వరద బాధితులందరికీ అండగా ఉంటాం- సీఎం జగన్
-
అండగా ఉంటా.. రూ. కోటి చొప్పున ఆర్థిక సాయం
ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆ మనుషులను వెనక్కి తీసుకురాలేకపోయినా, ఒక మంచి మనసున్న వ్యక్తిగా కచ్చితంగా ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నాను. చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటిస్తున్నాను. కంపెనీ పునఃప్రారంభమైన తర్వాత, లేదంటే వేరొక చోటుకు తరలించిన తర్వాతైనా సరే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌కు అప్పగించాను. సాక్షి, విశాఖపట్నం: విపత్తుతో విషాదంలో ఉన్న బాధిత కుటుంబాలకు ఒక మంచి మనసున్న వ్యక్తిగా అన్ని విధాలా అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఎవరూ ఊహించని విధంగా నష్టపరిహారం ప్రకటించారు. విశాఖపట్నంలోని గోపాలపట్నం సమీపంలోనున్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున గ్యాస్ లీక్ దుర్ఘటన విషయం తెలిసిన వెంటనే ఆయన స్పందించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసి.. మధ్యాహ్నం విశాఖకు చేరుకున్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ప్రమాద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆంధ్రా వైద్య కళాశాలలో అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రమాద బాధిత కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం ప్రకటించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఘటన దురదృష్టకరం ► గురువారం తెల్లవారుజామున జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరం. స్టైరీన్ అనే ఒక హైడ్రోకార్బన్ ముడి సరుకును ఎక్కువ రోజులు నిల్వ చేయడం ఇందుకు కారణమైంది. ఈ గ్యాస్ లీక్ కావడం వల్ల ఐదు గ్రామాలు ప్రభావానికి గురి కావడం బాధాకరమైన అంశం. ► ఎల్జీ అనే ప్రముఖ సంస్థ నిర్వహిస్తున్న కంపెనీలో ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం ఇంకా బాధాకరం. దీనిపై లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని వేస్తున్నాం. పర్యావరణం, అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి, జిల్లా కలెక్టర్, విశాఖ నగర పోలీసు కమిషనర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ► ఈ దుర్ఘటనకు కారణాలేమిటి? ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చేయాలి? అనే అంశాలపై అధ్యయనం చేసి, ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కంపెనీపై తదుపరి చర్యలు ఉంటాయి. చదవండి: విశాఖ విషాదం వెంటిలేటర్ సాయంతో వైద్యం పొందుతున్న వారికి రూ.10 లక్షలు.. రెండు మూడు రోజుల పాటు చికిత్స అవసరమైన వారికి రూ.లక్ష.. ఆసుపత్రుల్లో ప్రాథమిక వైద్యం చేయించుకున్న వారికి రూ.25 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తాం. గ్యాస్ లీక్ వల్ల ఆయా గ్రామాల ప్రజలపై నేరుగా కాకపోయినా, పరోక్షంగా కొద్ది రోజుల పాటు స్ట్రెస్ ఉంటుంది. వెంకటాపురం–1, వెంకటాపురం–2, ఎస్సీ, బీసీ కాలనీ, నందమూరినగర్, పద్మనాభనగర్ గ్రామాల్లోని ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దు. అన్ని రకాలుగా ప్రభుత్వం తోడు, నీడగా ఉంటుంది. ఈ గ్రామాల్లో 15,000 మంది వరకు నివాసం ఉంటారని తెలిసింది. ప్రతి ఒక్కరికీ రూ.10 వేలు ఆర్థిక సాయం చేస్తాం కేజీహెచ్‌లో బాధితులను పరామర్శిస్తున్న సీఎం వైద్యానికి ఒక్క రూపాయి కూడా చెల్లించొద్దు ► బాధితులెవ్వరూ ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యానికి అయ్యే ఖర్చు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యేటప్పుడు పరిహారం మొత్తాన్ని ఇచ్చి, సంతోషంగా ఇంటికి పంపించే ఏర్పాటు చేస్తాం. ► బాధిత గ్రామాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలని ఆదేశిస్తున్నాను. గ్రామాలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న వారి కోసం షెల్టర్లు ఏర్పాటు చేయాలి. మంచి భోజనం పెట్టించాలి. అలారం ఎందుకు మోగలేదు? ► గ్యాస్ లీక్ అయినప్పుడు అందరినీ అప్రమత్తం చేసే అలారం ఎందుకు మోగలేదు? ఇది నన్నెంతో కలతకు గురి చేస్తోంది. ► ఈ విషయం, మిగతా విషయాలపై కమిటీ నివేదిక వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటాం. వేరొక చోటుకు తరలించాల్సిన అవసరం ఉందని కమిటీ చెబితే.. నిర్మొహమాటంగా ఈ పరిశ్రమను తరలించేలా చూస్తాం. ప్రభావిత గ్రామాల్లో కొంత మంది రైతులకు చెందిన పశువులు చనిపోయాయి. వారికి నూరు శాతం నష్ట పరిహారం ఇవ్వడమే కాకుండా అదనంగా రూ.20 వేలు సాయం చేస్తాం. అధికారులకు అభినందనలు ► గ్యాస్ లీక్ దుర్ఘటన తెల్లవారుజామున జరిగిన వెంటనే 4.30 గంటలకే పోలీసులు.. డీసీపీ, 5 గంటలకే జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఘటన స్థలికి వెళ్లారు. బాధితులకు సహాయం అందించే విషయంలో బాగా స్పందించారు. ► వెనువెంటనే అంబులెన్స్‌లు తరలించి, దాదాపు 348 మందిని ఆసుపత్రుల్లో చేర్పించారు. ఆ సమయంలో స్పృహలో లేని వారు సైతం ఆసుపత్రుల్లో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది అందించిన చికిత్సతో వెంటిలేటర్ అవసరం లేకుండా శ్వాస తీసుకునేంతగా కోలుకున్నారు. ఇందుకు కృషి చేసిన వారందరికీ అభినందనలు. చదవండి: యుద్ధ ప్రాతిపదికన స్పందించాం -
వలస కూలీలకు అండగా ఉంటాం
సాక్షి, సిద్దిపేట: వలస కూలీలకు ప్రభుత్వం అండగా ఉంటోందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్, నంగునూరు మండలాల్లో ధాన్యం, శనగల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అనంతరం సిద్దిపేటలో వలస కూలీలకు బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు, ఇతర నిర్మాణ పనులతోపాటు, పరిశ్రమలు, గృహ నిర్మాణాల కోసం కూలీలు మన రాష్ట్రానికి వచ్చారన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 వేలకు పైగా వలస కూలీలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీరందరూ ప్రస్తుతం పనులు లేక, కుటుంబ పోషణ కూడా ఇబ్బందిగా మారిందని అన్నారు. వీరిని ఆదుకునేందుకు ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 చొప్పున నగదు అందజేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు ఇలా ప్రతీ ఒక్కరూ తమ దాతృత్వాన్ని చాటుకుంటూ కూలీలకు సహాయం అందజేస్తున్నారని అన్నారు. ఆహార పదార్థాలతో కూడిన కిట్స్‌ను అందజేసేందుకు వచ్చిన దాతలను మంత్రి అభినందించారు. అసత్యపు ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని మంత్రి ప్రజలను కోరారు. ప్రతీ గింజను కొంటాం గతంలో లేనివిధంగా ఈ ఏడాది గోదావరి, కృష్ణా జలాలు రాష్ట్రంలోని చెరువులకు మళ్లించామని, దీంతో ఎన్నడూ లేని విధంగా రబీ సాగు పెరిగిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ మూలంగా తమ పంటలను ఎలా అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఎవరూ అధైర్య పడొద్దని, రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని మంత్రి భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేవుడి భరోసా
అనగనగా ఓ జ్ఞాని. అతను మంచి జ్ఞానే. ఇలా ఎందుకు చెప్పవలసి వస్తోందంటే ఈ కాలంలో అక్కడక్కడా మనం చూస్తూనే ఉన్నాం. కొందరు నకిలీస్వాములను కూడా. కానీ మన కథలోని జ్ఞాని ఎంతో మంచివారు. ఓ రోజు అతని ఆశ్రమానికి ఓ వ్యక్తి వస్తాడు. జ్ఞానికి నమస్కరించి ఆకలేస్తోందని అంటాడు. అతని వినయానికి జ్ఞాని బోల్తాపడతాడు. ‘‘ఏం దిగులు పడకు. వేళ కాని వేళ వచ్చానని బాధ పడకు. నేనే స్వయంగా నీకు ఏదో ఒకటి చేసి పెడతా’’ అంటూనే ఇచ్చిన మాట ప్రకారం వంటచేసి అతనికి పెట్టి పడుకోమంటాడు. అతను అలాగేనని తృప్తిగా భోంచేసి నిద్రపోతాడు. తెల్లవారి చూసేసరికి ఆ వ్యక్తి కనిపించడు. అతనెప్పుడో పారిపోయి ఉంటాడు. మధ్యాన్నం అవుతుంది. ఇంతలో జ్ఞానికి కబురందుతుంది. నిన్న రాత్రి తన దగ్గర ఆశ్రయం పొందిన వ్యక్తి మంచి వాడు కాడని, దుష్టుడని. అది తెలిసి జ్ఞాని ‘ఛీ నేనెంత పాడు పని చేశానో. ఓ దుష్టుడి మాట నమ్మి వాడికి అన్నం పెట్టి పడుకోనిచ్చాను’ అని ఎంతో బాధ పడతాడు. చివరికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరున్న నదిలో తలస్నానం చేస్తే తప్ప చేసిన పాపం పోదు అని అనుకుంటాడు. నదికి బయలుదేరబోతుంటే ఆకాశం నుంచి ఓ దివ్య రూపమొచ్చి ఆ జ్ఞాని ముందు నిలబడుతుంది. ‘‘ఇదిగో నువ్వేంటో ఒక రోజు రాత్రి అన్నం పెట్టి పడుకోవడానికి చోటిచ్చినందుకే ఇంతగా బాధ పడుతున్నావు. ఏదో తప్పు చేశానని తెగ నలిగిపోతున్నావు. పైగా నదీ స్నానం చేసి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం పోతున్నావు. అదలా ఉంచి నా విషయానికి వస్తాను. నేను దేవుడే కావచ్చు. చెడ్డవారిని శిక్షించి మంచి వారికి అండగా ఉండాలి కదూ. కానీ నేనేం చేస్తున్నాను. దాదాపు యాభై ఏళ్ళుగా వాడికి అన్నపానీయాలు, ఉండేందుకు జాగా కూడా కల్పిస్తూ వస్తున్నాను. మరి నేనేం చేసుకోవాలి నన్ను... ఆలోచించు. నువ్వు కొన్ని గంటల సపర్యలకే ఇంతలా అయిపోతున్నావు. నువ్వేమీ బాధ పడక్కర్లేదు. నీకే పాపం అంటకుండా నేను చూస్తానులే’’ అని నచ్చచెప్తాడు.అప్పటికి జ్ఞాని మనసు శాంతించింది. – యామిజాల జగదీశ్ -
గల్ఫ్ భారత కార్మికులకు మోదీ హామీలు!
దోహాః గల్ఫ్ లోని భారత కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, కావలసిన సహాయం అందిస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఐదు దేశాల పర్యటనకు వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ ఆఫ్ఘనిస్తాన్ అనంతరం గల్ఫ్ దేశాలను సందర్శించారు. పర్యటనలో భాగంగా అక్కడ కార్మికులకోసం ఏర్పాటు చేసిన ఫ్రీ మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి హాజరై, వారినుద్దేశించి మాట్లాడారు. కష్టపడి పనిచేయడంతోపాటు, ఆరోగ్యంపట్ల కూడ తగిన శ్రద్ధ వహించాలని కార్మికులకు సలహా ఇచ్చారు. గల్ఫ్ లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు భారత ప్రధాని నరేంద్రమోదీ హామీలు కురిపించారు. ఇక్కడి కార్మికులకు భారత ప్రభుత్వం అన్నివిధాలుగా సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫండ్ (ఐసీబీఎఫ్), ఇండియన్ డాక్టర్స్ కమ్యూనిటీ (ఐడీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మికుల ఉచిత వైద్య శిబిరానికి హాజరైన ఆయన.. అక్కడకు ప్రకాశవంతమైన పసుపురంగు యూనిఫారాలు ధరించి వచ్చిన కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ''బహుశా నేనెవరో మీకు తెలిసే ఉండొచ్చు... కానీ మిమ్మల్ని కలిసేందుకు భారతదేశంనుంచీ కొందరు రావడం అనేది మీకు మంచి ఫీలింగ్ గా ఉండాలి'' అంటూ నవ్వుతూ మోదీ తన ప్రసంగం కొనసాగించారు. దోహాలో నా మొదటి కార్యక్రమం మిమ్మల్ని కలవడమేనని, మీకు అన్ని విధాలుగా సహకరించేందుకు నావంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇండియన్ బ్లూ కాలర్ కార్మికుల ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన... కార్మికుల ప్రధాన ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నానని, ముఖ్యంగా సరైన కౌన్సిలింగ్ లేకపోవడం, మధుమేహం ప్రధాన సవాళ్ళుగా మారాయని అన్నారు. ప్రసంగం ముగిసిన తర్వాత మోదీ... కార్యక్రమానికి హాజరైన కార్మికులు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళిమరీ ఆప్యాయంగా పలుకరించారు. ఓ కార్మికుడు తన సీటు నుంచీ లేచి, ప్రధానిని కూర్చోమంటూ ఆహ్వానించగా... అతడి భుజంపై తట్టిన ప్రధాని మోదీ.. అతడి పక్కనే కూర్చుని భోజనం చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ లో కూడ మోదీ సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో భారత బ్లూ కాలర్ కార్మికులతో కలసి భోజనం చేశారు. 2008 లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటన అనంతరం కతర్ లో పర్యటించిన రెండో భారత ప్రధాని మోదీనే. కతర్ లో సుమారు 630,000 మంది బహిష్కృత కార్మికులుండగా... అందులో చాలామంది బ్లూకాలర్ కార్మికులే. కార్మికులతో ముచ్చటించిన తర్వాత కతర్ లోని బిజినెస్ లీడర్లతో సైతం భేటీ అయిన ప్రధాని మోదీ.. అనంతరం అక్కడినుంచీ స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికో పర్యటనలను ముగించుకొని భారతదేశానికి తిరిగి వచ్చారు. Shoulder to shoulder with Indian workers abroad. PM @narendramodi interacts with the workers pic.twitter.com/z4GQJLueCX — Vikas Swarup (@MEAIndia) June 4, 2016 -
కాంట్రాక్టు లెక్చరర్లకు న్యాయం చేస్తాం
భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరీ పోస్టుల్లేవని గోడు వెళ్లబోసుకున్న బాధితులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లలో అర్హతలున్న వారందరికీ క్రమబద్ధీకరణ ప్రక్రియలో న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. మంజూరీ పోస్టులు లేక నష్టపోతున్న వారికి తగు న్యాయం చేయాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు సీహెచ్ కనకచంద్రం, ప్రతినిధులు గంగ, ఫర్జానా, స్వర్ణలత తదితరులు బుధవారం సీఎం కేసీఆర్‌ను అధికారిక నివాసంలో కలసి వినతిపత్రం అందజేశారు. గత పాలకులు పోస్టులు మంజూరీ చేయకుండానే 2008-09లో 73 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మంజూరీ చేశారని, మంజూరీ పోస్టుల్లో అప్పటికే పనిచేస్తున్న 632 మందిని ఈ కాలేజీల్లోని అన్శాంక్షన్డ్ పోస్టుల్లోకి బదిలీ చేసి తమకు అన్యాయం చేశారని, దీంతో తాము మంజూరీ పోస్టుల్లో పనిచేస్తున్న జాబితాలో చేరామని, దీని వల్ల రెగ్యులరైజ్ అయ్యేందుకు అనర్హులుగా మారే ప్రమాదం తలెత్తిందని సీఎం కేసీఆర్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ముఖ్యమంత్రి సరైన కసరత్తు చేసి సత్వర న్యాయం జరిగేలా కార్యాచరణ చేపట్టాలని విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు. ఉద్యోగుల నియామకం, నియమ నిబంధనలు, రోస్టర్ పద్ధతి వంటి పలు న్యాయపరమైన అంశాలను అధిగమించే విధంగా మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
రైతుకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తాం
సోలార్ బాధితులకు భరోసా ఇచ్చిన సీపీఎం నేత ప్రకాష్ కారత్ కదిరి: ‘సోలార్ హబ్‌తో భూములు కోల్పోతున్న రైతులకు కాకుండా దొంగలకు పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు సమాధానం చెప్పాలి. ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. రైతుకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తాం’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఎన్పీ కుంట మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ సిటీ భూనిర్వాసితులతో మాట్లాడేందుకు గురువారం ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అనంతరం వందలాది మంది రైతులు, సీపీఎం కార్యకర్తలతో కలిసి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించిన కారత్ను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్పీ కుంటలో రోడ్డుపైనే బైఠాయించడంతో చివరకు కారత్‌తో పాటు నలుగురిని మాత్రం అనుమతించారు.