Astro phanda
-
ఈ రాశి వారికి క్షమాగుణం ఎక్కువ
ఆస్ట్రోఫన్డా రాశులలో కన్యరాశి ఆరోది. ఇది సరి రాశి, వాయుతత్వం, శీతల స్వభావం, సౌమ్య రాశి,శూద్ర జాతి, రంగు ఆకుపచ్చ, శరీరంలో పొట్ట, నడుము, నరాలను ఈ రాశి సూచిస్తుంది. ఇది ద్విస్వభావ రాశి, స్త్రీరాశి, దిశ దక్షిణం. ఇందులో ఉత్తరా ఫల్గుణి 2, 3, 4 పాదాలు, హస్త నాలుగు పాదాలూ, చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. దీని అధిపతి బుధుడు. నివాస స్థానం కేరళ ప్రాంతం. ఇది భారత్, బ్రెజిల్, టర్కీ పరిసర ప్రాంతాలను సూచిస్తుంది. పెసలు, బఠాణీలు, ఆముదం, పత్తి మొదలైన ద్రవ్యాలపై ప్రభావం కలిగి ఉంటుంది. కన్యరాశి వారు మృదు స్వభావులు, కాస్త సిగ్గరులు, మొహమాటస్తులు. శ్రద్ధగా తమ పని తాము చేసుకుపోవడంలో తేనెటీగలను తలపిస్తారు. అడిగినదే తడవుగా ఇతరులకు సాయం చేయడంలోనే ఆనందం వెదుక్కుంటారు. తమ మితిమీరిన పరోపకార ధోరణి గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకుండా, తమదైన ధోరణిలోనే జీవిస్తారు. ప్రణాళికాబద్ధంగా, పూర్తి అంకిత భావంతో కష్టించి పనిచేయడంలో వీరికి సాటివచ్చే వారు అరుదు. ఎంత ఒత్తిడి ఎదురైనా సహనం కోల్పోకుండా ఉండటం వీరి ప్రత్యేకత. మొహమాటం వల్ల తమంతట తామే చొరవ తీసుకుని ఇతరులతో కలుపుగోలుగా ఉండలేరు. ఈ లక్షణం వల్ల తరచు అపార్థాలకు గురవుతారు. అయితే, ఇతరులు చొరవ తీసుకుని, వీరితో స్నేహం చేస్తే మాత్రం వారి పట్ల నమ్మకంగా ఉంటారు. వీరికి క్షమాగుణం కూడా ఎక్కువే. ఇతరులు తమ పట్ల చేసిన చిన్న చిన్న తప్పులను తేలికగా క్షమిస్తారు. చురుకైన మేధాశక్తి వీరి సొంతం. పనిభారం ఎంత ఉన్నా తొందరగా అలసిపోరు. బయటకు నిరాడంబరంగా కనిపించినా, వీరికి విలాసాలపై కూడా మక్కువ ఉంటుంది. తమ కష్టానికి ఆశించిన ఫలితం దక్కకుంటే తొందరగా నిర్వేదానికి లోనవుతారు. మానసికంగా గాయపడినప్పుడు ఇతరులను ఏమీ అనలేక ఆత్మనిందకు పాల్పడతారు. తాము ఉండే చోట అన్నీ పరిశుభ్రంగా, పద్ధతిగా ఉండాలని కోరుకుంటారు. వీరి ధోరణి ఒక్కోసారి సన్నిహితులకు చాదస్తంగా అనిపిస్తుంది. సృజనాత్మకతకు ఆస్కారం ఉండే రచన, నటన, సంగీత, నృత్య కళా రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. అకౌంటింగ్, బ్యాంకింగ్, వైద్యం, సామాజిక సేవ, విదేశీ వ్యవహారాలు వంటి రంగాల్లోనూ తమ ప్రత్యేకత చాటుకుంటారు. వ్యవసాయం, పండ్లతోటల పెంపకం, పశుపోషణ వంటివి వీరికి అనుకూలిస్తాయి. బయటకు ఏదీ చెప్పుకోకుండా లోలోనే కుమిలిపోయే తత్వం వల్ల మానసిక సమస్యలతో, నాడీ సమస్యలతో బాధపడతారు. - పన్యాల జగన్నాథ దాసు -
ఈ రాశి వారు కళాభిమానులు
వృషభం: ఆస్ట్రోఫన్డా రాశులలో రెండోది వృషభం. ఇది సరి రాశి, ముఖాన్ని సూచిస్తుంది. సౌమ్య స్వభావం, స్థిరరాశి, భూతత్వం, స్త్రీ రాశి, వైశ్యజాతి. దీని దిశ దక్షిణం. ఇందులో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం నాలుగు పాదాలూ, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. దీని అధిపతి శుక్రుడు. ఈ రాశి పర్షియా, హాలండ్, రష్యా పరిసర దేశాలను సూచిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన వారు సహజంగా సహనవంతులు. సహనం నశిస్తే మాత్రం వారిని అదుపు చేయడం అంత తేలిక కాదు. కష్టపడి పనిచేసే స్వభావం ఉంటుంది. గొప్ప శారీరక దారుఢ్యం ఉంటుంది. తేలికగా అలసట చెందరు. నిదానంగా పనిచేస్తున్నట్లే కనిపిస్తారు గానీ ప్రణాళిక ప్రకారం అనుకున్న సమయానికే పనులు పూర్తి చేస్తారు. వృథా కాలక్షేపాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. లలిత కళలపై, వస్త్రాలంకరణలు, సుగంధ ద్రవ్యాలపై బాగా మక్కువ కలిగి ఉంటారు. అసాధారణమైన తెలివితేటలు, గొప్ప సంయమనం వీరి సొత్తు. ఆర్థిక వ్యవహారాలను లోపం లేకుండా బాధ్యతాయుతంగా నెరవేర్చడంలో నేర్పరులు. క్లిష్టమైన వ్యవహారాలను సైతం తేలికగా చక్కదిద్దగలరు. దౌత్యం నెరపడంలో సిద్ధహస్తులు. వృషభరాశి వారు విశ్వసనీయులుగా ఉంటారు. అవసరమైతే ఇతరుల భారాన్ని సైతం తామే భరించేందుకు సిద్ధపడతారు. నిర్భీతి, కారుణ్యం, ఓపిక సహజ లక్షణాలుగా గల వృషభరాశి జాతకులు నాయకత్వ పదవుల్లో రాణించగలరు. వాహన, వస్త్ర వ్యాపారాలు, సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు, అలంకరణలు, ప్లాస్టిక్, హోటల్, మద్యం వ్యాపారాలు వీరికి కలసి వస్తాయి. సంగీతం, రంగస్థలం, సినీ రంగాల్లోనూ వృషభరాశి జాతకులు రాణించగలరు. గ్రహగతులు సానుకూలంగా లేకుంటే మాత్రం అసూయతో రగిలిపోతూ ఇతరులను ఇబ్బందిపెడతారు. మార్పును ఒకపట్టాన అంగీకరించలేరు. మొండి వైఖరితో చిక్కుల్లో పడతారు. అంతులేని ఐశ్వర్య లాలసతో సంపాదనే వ్యసనంగా మార్చుకొని ఆరోగ్యాన్ని సైతం నిర్లక్ష్యం చేస్తారు. బద్దకంతో నిర్ణయాలను తీసుకోవడంలో జాప్యం కారణంగా శ్రమకు తగ్గ ఫలితం పొందలేకపోతారు. (వచ్చేవారం మిథునరాశి గురించి...) - పన్యాల జగన్నాథ దాసు -
మేషంలో పుట్టారా? అసహనం ఎక్కువే!
ఆస్ట్రోఫన్డా రాశుల స్వభావం, రాశిచక్రం గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం. రాశిచక్ర ప్రమాణం 360 డిగ్రీలు. ఇందులో పన్నెండు రాశులు ఉంటాయి. ఒక్కో రాశి ప్రమాణం 30 డిగ్రీలు. రాశిచక్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కో నక్షత్రానికి నాలుగేసి పాదాలు ఉంటాయి. అంటే, రాశిచక్రంలోని మొత్తం 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఒక్కో రాశిలో తొమ్మిదేసి నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ లెక్కన ఒక్కో నక్షత్ర ప్రమాణం 13 డిగ్రీల 20 మినిట్స్. ఒక్కో నక్షత్ర పాద ప్రమాణం 3 డిగ్రీల 20 మినిట్స్. రాశిచక్రంలో మొదటిది మేషరాశి. ఇందులో అశ్విని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక ఒకటో పాదం ఉంటాయి. ఇది బేసి రాశి, పురుష రాశి, అగ్నితత్వం, క్షత్రియ వర్ణం, క్రూరస్వభావం కలిగిన చరరాశి. ఈ రాశి చిహ్నం మేక. ఇది వనచరం అంటే, అడవులు, పర్వతప్రాంతాలలో సంచరించేది. ఈ రాశికి అధిపతి కుజుడు. బ్రిటన్, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, సిరియా, పెరూ దేశాలు ఈ రాశి పరిధిలోకి వస్తాయి. ముఖం, మెదడుపై ఈ రాశి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని లోహం బంగారం, రంగు ఎరుపు, ధాన్యం కందులు. చంద్రుడు మేషంలో ఉండగా జన్మించిన వారికి మేషం జన్మరాశి అవుతుంది. మేషరాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు, దూకుడు స్వభావం కలిగి ఉంటారు. స్వేచ్ఛాప్రియులు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిరాశకు లోనికాని ఆశావహ దృక్పథం వీరి సొంతం. వీరికి అసహనం కూడా ఎక్కువే. భావోద్వేగాలను ఏమాత్రం అదుపు చేసుకోలేరు. సవాళ్లను ఎదుర్కోవడంలో ముందంజలో ఉంటారు. త్వరగా మనుషులను ఆకట్టుకోవడంలో మేషరాశి జాతకులకు చాలా నేర్పు ఉంటుంది. తమ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారి పట్ల తేలికగా కినుకబూనుతారు. కొన్నిసార్లు ప్రతీకారేచ్ఛను కూడా పెంచుకుంటారు. ఒక్కోసారి మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా చిక్కుల్లో పడుతుంటారు. జాతకంలో రవి, కుజుడు, చంద్రుడు అనుకూలిస్తే కార్యనిర్వహణ రంగాల్లో చక్కగా రాణిస్తారు. పోలీసు, సైనిక ఉద్యోగాల్లో, న్యాయవాదులుగా, మేనేజర్లుగా, ఇంజనీర్లుగా, శస్త్రవైద్యులుగా ప్రత్యేకతను నిలుపుకుంటారు. లోహాలకు, కలపకు సంబంధించిన వృత్తులు, వ్యాపారాలు, పరిశ్రమలలో కూడా విజయాలు సాధిస్తారు. గ్రహస్థితి ప్రతికూలిస్తే మొండితనం, ఈర్ష్య, స్వార్థం కారణంగా ఇబ్బందులు పడతారు. నోటి దురుసుతనంతో తరచు గొడవలకు దిగుతుంటారు. తేలికగా దుర్వ్యసనాలకు లోనవుతారు. (వృషభరాశి స్వభావం గురించి వచ్చేవారం...) - పన్యాల జగన్నాథ దాసు