Astrological
-
ఈ రాశివారికి వారం ప్రారంభంలో అనారోగ్యం
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతన హోదాలు. కళారంగం వారికి కొంత అనుకూల సమయం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యారాధన మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలపై ఇంట్లో చర్చిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం, పనిభారం నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామధ్యానం మంచిది. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఇంటిలో శుభకార్యాలపై ప్రస్తావన, హడావిడి. కొన్ని వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. పారిశ్రామికరంగం వారికి అన్నింటా విజయవంంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వాహనయోగం. ఒకప్రకటన నిరుద్యోగులకు వరంగా మారనున్నది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. దైవకార్యాలు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. తెలుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. మహాలక్ష్మీ అష్టకమ్ పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఇంటిలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో మీపై గౌరవం పెరుగుతుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం ప్రారంభంలో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. బంధువులతో వివాదాలు తీరతాయి. కొన్ని ఆశయాలు నెరవేరతాయి. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వాహనయోగం. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలు మరింతగా ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో కొన్ని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విశేష యోగదాయకంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటంబసభ్యులతో వివాదాలు. స్వల్ప అనారోగ్యం. పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) చేపట్టిన కొన్ని పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా కొంత ప్రగతి ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు. కళాకారులకు ప్రోత్సాహకరమైన కాలం. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. ఆప్తుల నుంచి ఒత్తిడులు. ఆకుపచ్చ, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత తగ్గవచ్చు. కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనులు సకాలంలో పూర్తి చేసి మీ సత్తా చాటుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకుంటే కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మిత్రులు, బంధువులతో వివాదాలు కొంత పరిష్కరించుకుని, వారిలో సన్నిహితంగా మెలుగుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో అంచనాలకు తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు వివాదాలు, సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. పసుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మానసిక అశాంతి. కుటుంబంలో కొన్ని సమస్యలు. స్వల్ప అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు, సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు. విద్యార్థులకు శ్రమ తప్పదు. ఇంటి నిర్మాణయత్నాలు నత్తనడకన సాగుతాయి. మీ అభిప్రాయాలను కుటుంబంలో వ్యతిరేకిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలకు కొంత నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. వాహనయోగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బం«ధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట చెందుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. వారం చివరిలో ఆరోగ్యం మందగిస్తుంది. సోదరులతో అకారణంగా విభేదాలు. ఎరుపు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. -సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
Daily Horoscope:ఈ రాశివారికి సోదరులతో కలహాలు
శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి బ.ద్వాదశి సా.6.20 వరకు, తదుపరి త్రయోదశి నక్షత్రం ఉత్తరాభాద్ర సా.4.02 వరకు, తదుపరి రేవతి వర్జ్యం తె.4.56 నుంచి 6.39 వరకు (తెల్లవారితే ఆదివారం) దుర్ముహూర్తం ఉ.5.34 నుంచి 7.15 వరకు అమృతఘడియలు... ఉ.10.54 నుంచి 12.34 వరకు. సూర్యోదయం : 5.35 సూర్యాస్తమయం : 6.17 రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు రాశి ఫలాలు మేషం: ముఖ్య కార్యక్రమాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం. కళాకారులకు గందరగోళం. వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. సోదరుల నుంచి సహాయం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ప్రోత్సాహం. మిథునం: ఇంటర్వ్యూలు అందుతాయి. కార్యక్రమాలలో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. కర్కాటకం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయణాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో సామాన్యస్థితి. సోదరులతో కలహాలు. సింహం: బంధువులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత జాగ్రత్త వహించాలి. ఉద్యోగాలలో స్థానచలనం. కన్య: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వస్తులాభాలు. ఆస్తిలాభ సూచనలు. బంధువులను కలుస్తారు. వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో అనుకూలత. తుల: పరపతి పెరుగుతుంది. భూలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు. వృశ్చికం: బంధువిరోధాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని చిక్కులు. పారిశ్రామికవేత్తలు పర్యటనలు వాయిదా వేస్తారు. ధనుస్సు: కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. మకరం: చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఉత్సాహం. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. కుంభం: కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. మీనం: దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆలయాల దర్శనాలు. ఉద్యోగాలలోవిశేష ఆదరణ. -
జ్యోతిషం ఏం చెబుతోంది?
ప్రమాదంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోతుంటారు. అంటే వారందరి ఆయుష్షు అదే రోజు ముగుస్తోందనా? అస్ట్రో‘ఫన్’డా ఉపద్రవాలు సంభవించకముందే పండితులు అప్రమత్తమై, అమాయకుల ప్రాణాలను కాపాడవచ్చు కదా... అనుకుంటారు. కానీ, విధి బలీయమైనది. విధిని తప్పించే శక్తి జ్యోతిషానికి లేదు. జ్యోతిష శాస్త్రాన్ని ఔపోసన పట్టిన పండితులకూ లేదు. ⇒ ఆకాశంలో ఎగురుతున్న విమానం గమ్యం చేరకముందే కుప్పకూలిపోతుంది. అందులో ప్రయాణిస్తున్న వారంతా ఒకేసారి ప్రాణాలు పోగొట్టుకుంటారు. ⇒ ముందస్తు సూచనేదీ లేకుండానే ఎక్కడో ఒకచోట పెనుభూకంపం కుదిపేస్తుంది. పెద్దసంఖ్యలో జనం మరణిస్తారు. మరికొందరు క్షతగాత్రులవుతారు. ⇒ ఇంకెక్కడో ఒకచోట అగ్రరాజ్య సైన్యాలకు, ఉగ్రవాదులకు భీకర పోరాటం జరుగుతుంది. తూటాల వర్షం కురుస్తుంది, బాంబుల మోత మార్మోగుతుంది, భారీ స్థాయిలోనే జనహననం జరుగుతుంది. ఇలాంటి సంఘటనలన్నింటిలోనూ ఏకకాలంలోనే చాలామంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు. ఎందుకలా జరిగి ఉంటుంది? వాళ్లందరికీ ఒక్కసారే ఆయుర్దాయం తీరిపోయి ఉంటుందా? వందలాది మందికి, ఒక్కోసారి వేలాది మందికి సామూహిక మారకం (మరణయోగం) ఏదైనా ఏర్పడి ఉంటుందా? జ్యోతిషాన్ని నమ్మేవాళ్లకు, జ్యోతిషాన్ని నమ్మాలా వద్దా తేల్చుకోలేని సందిగ్ధజీవులకు సహజంగానే సందేహం తలెత్తుతుంది. జననకాల, జనన ప్రదేశాల ఆధారంగా ఎవరి జాతక ఫలితాలు వారివేనని, ఎవరి యోగావయోగాల పర్యవసానాలు వారివేనని పండితులు చెబుతారు కదా, అలాంటప్పుడు వేర్వేరు స్థల, కాలాలలో జన్మించిన వారంతా మూకుమ్మడిగా ఒకేసారి ప్రాణాలు కోల్పోయే సంఘటనలను ఎలా అర్థం చేసుకోవాలి? అందరికీ ఏకకాలంలో మారకం ఏర్పడటం దాదాపు అసాధ్యం. అయితే, ఒకేచోట గుమిగూడిన జనసమూహంలో ఎక్కువమందికి మారక స్థితి ఏర్పడితే, అదే సమూహంలో ఉన్న మిగిలిన వారికి కొంత ఆయుర్దాయం ఉన్నప్పటికీ, వారు కూడా ఆ సమూహంతో పాటు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తప్పదని జ్యోతిషవేత్తలు చెబుతారు. ముందే హెచ్చరించలేరా..? అలాగైతే, జ్యోతిషులెవరైనా ఇలాంటి ఉపద్రవాలు సంభవించక ముందే తగిన హెచ్చరికలు చేసి జనాన్ని అప్రమత్తం చేయవచ్చు కదా, చాలామంది అమాయకులు అపమృత్యువును తప్పించుకోగలుగుతారని చాలామంది అనుకుంటారు. కానీ, విధి బలీయమైనది. విధిని తప్పించే శక్తి జ్యోతిషానికి లేదు. జ్యోతిష శాస్త్రాన్ని ఔపోసన పట్టిన పండితులకూ లేదు. ఇలాంటి సూచనలను ముందుగానే తెలుసుకున్న జ్యోతిషులు మాత్రం అపమృత్యువు నుంచి సురక్షితంగా బయటపడిన ఉదంతాలు లేకపోలేదు. అందుకు సుప్రసిద్ధ ఐరిష్ హస్తసాముద్రికుడు కీరో ఉదంతమే ఉదాహరణ. కీరో ఎలా తప్పించుకున్నాడు..? ఒకసారి రైలులో ప్రయాణిస్తున్న కీరో కాలక్షేపానికి తన బోగీలో ఉన్న తోటి ప్రయాణికుల చేతులు పరిశీలించాడు. వారిలో ఎక్కువ మంది చేతుల్లో ఆయుర్దాయ రేఖ పొట్టిగా కనిపించింది. ప్రమాదాన్ని పసిగట్టిన కీరో, తాను చేరాల్సిన చోటు కాకపోయినా తర్వాతి స్టేషన్లోనే రైలు దిగిపోయాడు. ముందుకు సాగిన ఆ రైలు కొంతదూరం వెళ్లాక ప్రమాదానికి గురైంది. పెద్దసంఖ్యలో ప్రయాణికులు మరణించారు. జ్యోతిష, సాముద్రికాలకు సంబంధించి చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ప్రాచీన విద్యలపై ఆధునిక కోర్సులు.. జ్యోతిషం, హస్తసాముద్రికం, శరీరసాముద్రికం సహా పలు అతీంద్రియ విద్యలు ప్రాచీనకాలం నాటి నుంచే వివిధ ప్రాంతాల్లో వివిధ పద్ధతుల్లో ఉనికిలో ఉన్నాయి. ప్రాక్పశ్చిమ భేదాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా వీటిపై అపార విశ్వాసం గలవారు అసంఖ్యాకంగానే ఉన్నారు. వీటి శాస్త్రీయతను కొట్టిపారేసే హేతువాదులూ ఉన్నారు. జ్యోతిష, సాముద్రికాలను కాలక్షేపంగా పరిగణించేవారు, వీటిని నమ్మాలా, వద్దా తేల్చుకోలేని వారు కూడా ఉన్నారు. ఎవరెలా ఉన్నా, మనదేశంలో పలు విశ్వవిద్యాలయాలు జ్యోతిషాన్ని బోధిస్తున్నాయి. జ్యోతిషం కోర్సులకు ప్రభుత్వ గుర్తింపు కూడా ఉంది. గ్రహ నక్షత్ర గమనాలు, స్థల కాలాల ఆధారంగానే జ్యోతిష శాస్త్రం భవిష్యత్తుపై అంచనాలను చెబుతుంది. భూత వర్తమానాలనూ విశ్లేషిస్తుంది. భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోవాలనే ఆసక్తి మనుషులకు సహజంగానే ఉంటుంది. ఏటా ఉగాది రోజున పంచాంగ శ్రవణాలకు హాజరై వార్షిక గోచార ఫలితాలు తెలుసుకోవడం, పత్రికల్లో, టీవీ చానళ్లలో వచ్చే వారఫలాలు, దినఫలాలను చూడటంతోనే సరిపెట్టుకుంటారు. జ్యోతిషాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నా, చాలామంది దానిని అధ్యయనం చేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే, జ్యోతిష గ్రంథాలు, పంచాంగాలు దాదాపు ఒకే మూసలో ఉంటాయి. వాటిలోని భాష ఒక పట్టాన కొరుకుడు పడదు. పంచాంగాలైన తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు, నవగ్రహాలు, ద్వాదశ రాశులు, వాటిలోని ఇరవై ఏడు నక్షత్రాలు, వాటి లక్షణాలు, ప్రభావాలు, వివిధ యోగాలు, అవయోగాలు, లగ్నం, హోర తదితర కాల విభాగాలు వంటి అంశాలపై ప్రాథమిక సమాచారం ఎక్కడా తేలికగా అర్థమయ్యే రీతిలో కనిపించదు. జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు అందరికీ తేలికగా అర్థమయ్యేలా వివరించడానికి ఓ చిరుప్రయత్నం.. అస్ట్రో‘ఫన్’డా... ఇక నుంచి వారం వారం మీ కోసం... - కీరో, హస్తసాముద్రిక నిపుణుడు