మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతన హోదాలు. కళారంగం వారికి కొంత అనుకూల సమయం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సూర్యారాధన మంచిది.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలపై ఇంట్లో చర్చిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో వివాదాలు సర్దుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం, పనిభారం నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామధ్యానం మంచిది.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఇంటిలో శుభకార్యాలపై ప్రస్తావన, హడావిడి. కొన్ని వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. పారిశ్రామికరంగం వారికి అన్నింటా విజయవంంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. వాహనయోగం. ఒకప్రకటన నిరుద్యోగులకు వరంగా మారనున్నది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. దైవకార్యాలు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి ఇంక్రిమెంట్లు రాగలవు. కళారంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. తెలుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. మహాలక్ష్మీ అష్టకమ్ పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఇంటిలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవమర్యాదలు పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో మీపై గౌరవం పెరుగుతుంది. బంధువులు, మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం ప్రారంభంలో వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. బంధువులతో వివాదాలు తీరతాయి. కొన్ని ఆశయాలు నెరవేరతాయి. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వాహనయోగం. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారాలు మరింతగా ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో కొన్ని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విశేష యోగదాయకంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటంబసభ్యులతో వివాదాలు. స్వల్ప అనారోగ్యం. పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చేపట్టిన కొన్ని పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థికంగా కొంత ప్రగతి ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు కొంత విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు. కళాకారులకు ప్రోత్సాహకరమైన కాలం. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. ఆప్తుల నుంచి ఒత్తిడులు. ఆకుపచ్చ, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత తగ్గవచ్చు. కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు సకాలంలో పూర్తి చేసి మీ సత్తా చాటుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకుంటే కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మిత్రులు, బంధువులతో వివాదాలు కొంత పరిష్కరించుకుని, వారిలో సన్నిహితంగా మెలుగుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలలో అంచనాలకు తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు వివాదాలు, సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. పసుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మానసిక అశాంతి. కుటుంబంలో కొన్ని సమస్యలు. స్వల్ప అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు, సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు. విద్యార్థులకు శ్రమ తప్పదు. ఇంటి నిర్మాణయత్నాలు నత్తనడకన సాగుతాయి. మీ అభిప్రాయాలను కుటుంబంలో వ్యతిరేకిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు. రాజకీయవర్గాలకు కొంత నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. వాహనయోగం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బం«ధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట చెందుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. వారం చివరిలో ఆరోగ్యం మందగిస్తుంది. సోదరులతో అకారణంగా విభేదాలు. ఎరుపు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు
Comments
Please login to add a commentAdd a comment