ఏటీఎం సెంటర్లలో అగ్నిప్రమాదం: రెండు మిషన్లు దగ్ధం
హైదరాబాద్: హైదరాబాద్ శివారులో నాగోల్లోని ఏటీఎం సెంటర్లలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా మంటలు చేలరేగడంతో ఏటీఎం సెంటర్లలో ఉన్న ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులకు సంబంధించిన రెండు ఏటీఎం మిషన్లు పూర్తిగా దగ్ధమైనట్టు సమాచారం. షార్ట్ సర్య్కూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.