ATMS EMPTY
-
బ్యాంకు ఖాతాదారులకు తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : నగదు కోసం ఏటీఎంల చుట్టూ తిరిగి ఉసూరుమనే ఖాతాదారులకు ఆర్బీఐ ఊరట కల్పించింది. రోజుల తరబడి నగదు నింపకుండా ఏటీఎంలను ఖాళీగా ఉంచే బ్యాంకులు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్బీఐ బ్యాంకులకు స్పష్టం చేసింది. మూడు గంటలకు మించి ఏటీఎంలు నగదు లేకుండా ఉండరాదని, అలా ఉంచిన బ్యాంకుల నుంచి జరిమానా వసూలు చేస్తామని, ప్రాంతాన్ని బట్టి జరిమానా విధిస్తామని ఆర్బీఐ పేర్కొంది. చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంల్లో నగదు లేకపోవడంతో గంటల కొద్దీ ఖాతాదారులు వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల ఏటీఎంల్లో రోజుల తరబడి నగదు నింపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటీఎంల్లో నెలకొల్పే సెన్సర్ల ద్వారా వాటిలో ఎంత నగదు ఉందనేది ఆయా బ్యాంక్‌లకు సమాచారం ఉంటుంది. నగదు లేని ఏటీఎంల గురించి పూర్తి సమాచారం ఉన్నా సకాలంలో నగదును నింపేందుకు బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఏటీఎంలు నిత్యం నగదుతో ఖాతాదారులకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. -
నోట్ల కష్టాలపై తీపికబురు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నగదు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ఏటీఎంల వద్ద నగదు లభ్యత క్రమంగా మెరుగవుతున్నదని ఎస్బీఐ పేర్కొంది. గత 24 గంటల్లో నగదు సరఫరా క్రమంగా పుంజుకుందని తెలిపింది. ఏటీఎంల వద్ద నగదు కొరత కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని పీఎన్బీ, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు పేర్కొన్నాయి. గత 24 గంటల్లో ఎస్బీఐ ఏటీఎంల వద్ద నగదు లభ్యత మెరుగైందని, నగదు కొరత నెలకొన్న ప్రాంతాల్లోనూ నగదు సరఫరా పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే నగదు అందుబాటు సాధారణ స్థితికి చేరుకుంటుందని ఎస్బీఐ సీఓఓ నీరజ్ వ్యాస్ చెప్పారు. తమ ఏటీఎంల్లో నగదు లభ్యత పెంచేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు తమ ఏటీఎంల వద్ద నగదు లభ్యత మెరుగ్గా ఉందని, ఎలాంటి సమస్యలూ లేవని ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఇతర బ్యాంకుల ఖాతాదారులు నగదు విత్‌డ్రా కోసం తమ ఏటీఎంలకు రావడంతోనే కొన్నిచోట్ల ఏటీఎంల్లో నగదు కొరత ఏర్పడిందని పేర్కొంది. ఇక కరెన్సీ కొరతను అధిగమించేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని, తగినంత నగదు సరఫరా ఉందని ఆర్బీఐ స్పష్టం చేయగా రూ. 500 నోట్ల ముద్రణను ఐదు రెట్లు పెంచామని కేంద్రం తెలిపింది. -
వెక్కిరిస్తున్న ఏటీఎంలు: మరో మూడు రోజులు ఇంతే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రజలను మళ్లీ కరెన్సీ కష్టాలు పట్టి పీడిస్తున్నాయి. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఏటీఎంలలో నగదు లేక ..పెద్ద నోట్ల రద్దు సమయంలో నెలకొన్న పరిస్థితులు మళ్లీ పునరావృతమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు రాష్ట్రాల్లో 30-40శాతం నగదు కొరత నెలకొనడంపై మండిపడుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల్లో ఏటీఎంలలో నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గత వారం రోజులనుంచి సమస్య మరీ తీవ్రంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ఏ ఏటీఎం వద్ద చూసినా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయని తెలిపారు. నగదుకోసం 10నుంచి 15 ఏటీఎంల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కొరత తాత్కాలికమేననీ, మరో మూడు రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందంటూ చావు కబురు చల్లగా చెప్పుకొచ్చింది ప్రభుత్వం. ఈ కొరత తాత్కాలికమేననీ త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కొద్దిసేపటి క్రితం ట్విటర్లో వెల్లడించారు. దేశంలో కరెన్సీ పరిస్థితిని సమీక్షించామనీ సర్క్యులేషన్లో తగినంత కరెన్సీ ఉందనీ వెల్లడించారు. అలాగే అన్ని బ్యాంకులకు కూడా సరిపడానగదు అందుబాటులో ఉందని పేర్కొన్నారు . కొన్ని ప్రాంతాల్లో 'ఆకస్మిక, అసాధారణ పెరుగుదల' కారణంగా ఏర్పడిన తాత్కాలిక కొరతను త్వరలోనే పరిష్కరిస్తామని ట్వీట్ చేశారు. అటు పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందనీ, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ ఎకానమీ పుంజుకుంటున్న నేపథ్యంలో చేతిలో డబ్బులు ఉంచుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం విశేషం. ఇది ఇలా ఉంటే కొన్ని రాష్ర్టాల్లో నగదు సమస్య వాస్తవమేనని ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఎస్పీ శుక్లా పేర్కొన్నారు. ప్రస్తుతం లక్షా ఇరవై ఐదు వేల కోట్ల కరెన్సీ చలామణిలో ఉందన్నారు. అయితే పలు రాష్ర్టాల్లో నగదు తక్కువగా ఉందనీ అంగీకరించిన ఆయన ప్రభుత్వం నగదు కొరతను తీర్చేందుకు రాష్ర్టాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నగదు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల నుంచి నగదు లేని రాష్ర్టాలకు డబ్బు తరలించేందుకు ఆర్బీఐ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. నగదు కొరత సమస్య మూడు రోజుల్లో తీర్చుతామని శుక్లా స్పష్టం చేశారు. అటు నగదు సంక్షోభంపై సీపీఏం నేత ఏచూరి సీతారాం కూడా ట్విటర్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. Have reviewed the currency situation in the country. Over all there is more than adequate currency in circulation and also available with the Banks. The temporary shortage caused by ‘sudden and unusual increase’ in some areas is being tackled quickly. — Arun Jaitley (@arunjaitley) April 17, 2018 ATMs were empty in November 2016. ATMs are empty now. And the only party flush with cash is the BJP: the people suffer. — Sitaram Yechury (@SitaramYechury) April 17, 2018 -
నోటు మీద కొట్టారు
కొవ్వూరు : రెండు రోజుల నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో ఏటీఎంలలో నగదు నిల్వలు నిండుకున్నాయి. అసలే నోట్లు అవసరమైన మేరకు రాకపోవడంతో ఏటీఎంలలో అరకొరగానే నగదు పెడుతున్నారు. దీంతో శనివారమే జిల్లాలో చాలాచోట్ల ఏటీఎంలు సొమ్ముల్లేక మూతపడ్డాయి.ఆదివారం జిల్లావ్యాప్తంగా దాదాపు ఏటీఎంలన్నీ ఖాళీ కావడంతో జనం నానా అవస్థలు పడ్డారు. రెండు రోజుల వరుస సెలవులు విషయం తెలియకపోవడంతో కొందరు నగదును ముందస్తుగా డ్రా చేసుకోలేకపోయారు. జిల్లాలో సుమారు 700 బ్యాంకులు, 350 ఏటీఎంలు ఉన్నాయి. ఒక్క కొవ్వూరులోనే పదికిపైగా ఏటీఎంలు ఉన్నాయి.ఆదివారం ఒక్క ఏటీఎంలోనూ సొమ్ముల్లేవు. జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, భీమవరం, జంగారెడ్డిగూడెం తదితర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఈరెండు రోజుల్లో రోజుకు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.200 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయినట్టు అంచనా. నేడు హర్తాళ్‌కుSపిలుపు పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం దేశవ్యాప్తంగా వామపక్షాలు హర్తాళ్‌కు పిలుపునిచ్చాయి.దీనికి వైఎస్సాఆర్ సీపీ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించేంత వరకు పాతనోట్లను వినియోగంలో ఉంచాలని, లేదంటే సరిపడినంత చిల్లర నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ చేపట్టిన ఈ హర్తాళ్‌ను విజయవంతం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ సన్నద్ధమవుతున్నాయి. పంట డబ్బుకూ తంటా భీమడోలు : ఈయన పేరు బొబ్బనబోయిన వెంకటేశ్వరరావు. స్వగ్రామం పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురం. వయస్సు 80 ఏళ్లు. వ్యవసాయంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. ఈ ఏడాది తనకున్న రెండెకరాలకు తోడు, మరో రెండెకరాలను కౌలుకు తీసకుని సాగుచేశాడు. దిగుబడి బాగానే వచ్చింది. ధాన్యాన్ని కమీష¯ŒS వ్యాపారికి విక్రయించాడు. అతని వద్ద నుంచి రూ.1.60 లక్షలు రావాలి. ఇంతలో పెద్దనోట్లు రద్దయ్యాయి. దీంతో నగదు ఇవ్వాలంటే ఆధార్, బ్యాంకు పుస్తకాల జిరాక్స్ తేవాలని కమీష¯ŒS వ్యాపారి చెప్పాడు. ఎందుకంటే మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తానన్నాడు. అదీ నెల తర్వాతని చెప్పాడు. దీంతో వెంకటేశ్వరరావు తన వద్ద ఉన్న డొక్కు సైకిల్ వేసుకుని చిరిగిన పంచెతో నాలుగుకిలోమీటర్ల దూరంలోఉన్న పూళ్ల వచ్చాడు. గ్రామంలో జిరాక్స్ యంత్రం లేకపోవడమే దీనికి కారణం. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ధాన్యం డబ్బులు వస్తే పంట కోసిన కూలీలకు, పెట్టుబడి పెట్టిన వారికి డబ్బులు ఇవ్వాలని, వారు మాటిమాటికి ఇంటికి వచ్చి నిద్రపోనివ్వడం లేదని వాపోయాడు. నెల తర్వాత వ్యాపారి డబ్బిస్తే ఎలాగో అర్థం కావడం లేదని, దాళ్వా సాగు పెట్టుబడికి నగదు లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. -
నోటు మీద కొట్టారు
కొవ్వూరు : రెండు రోజుల నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు రావడంతో ఏటీఎంలలో నగదు నిల్వలు నిండుకున్నాయి. అసలే నోట్లు అవసరమైన మేరకు రాకపోవడంతో ఏటీఎంలలో అరకొరగానే నగదు పెడుతున్నారు. దీంతో శనివారమే జిల్లాలో చాలాచోట్ల ఏటీఎంలు సొమ్ముల్లేక మూతపడ్డాయి.ఆదివారం జిల్లావ్యాప్తంగా దాదాపు ఏటీఎంలన్నీ ఖాళీ కావడంతో జనం నానా అవస్థలు పడ్డారు. రెండు రోజుల వరుస సెలవులు విషయం తెలియకపోవడంతో కొందరు నగదును ముందస్తుగా డ్రా చేసుకోలేకపోయారు. జిల్లాలో సుమారు 700 బ్యాంకులు, 350 ఏటీఎంలు ఉన్నాయి. ఒక్క కొవ్వూరులోనే పదికిపైగా ఏటీఎంలు ఉన్నాయి.ఆదివారం ఒక్క ఏటీఎంలోనూ సొమ్ముల్లేవు. జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, భీమవరం, జంగారెడ్డిగూడెం తదితర పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ఈరెండు రోజుల్లో రోజుకు జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.200 కోట్ల మేర లావాదేవీలు నిలిచిపోయినట్టు అంచనా. నేడు హర్తాళ్‌కుSపిలుపు పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం దేశవ్యాప్తంగా వామపక్షాలు హర్తాళ్‌కు పిలుపునిచ్చాయి.దీనికి వైఎస్సాఆర్ సీపీ మద్దతు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపించేంత వరకు పాతనోట్లను వినియోగంలో ఉంచాలని, లేదంటే సరిపడినంత చిల్లర నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ చేపట్టిన ఈ హర్తాళ్‌ను విజయవంతం చేసేందుకు ప్రతిపక్షాలన్నీ సన్నద్ధమవుతున్నాయి. పంట డబ్బుకూ తంటా భీమడోలు : ఈయన పేరు బొబ్బనబోయిన వెంకటేశ్వరరావు. స్వగ్రామం పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురం. వయస్సు 80 ఏళ్లు. వ్యవసాయంలో 60 ఏళ్ల అనుభవం ఉంది. ఈ ఏడాది తనకున్న రెండెకరాలకు తోడు, మరో రెండెకరాలను కౌలుకు తీసకుని సాగుచేశాడు. దిగుబడి బాగానే వచ్చింది. ధాన్యాన్ని కమీష¯ŒS వ్యాపారికి విక్రయించాడు. అతని వద్ద నుంచి రూ.1.60 లక్షలు రావాలి. ఇంతలో పెద్దనోట్లు రద్దయ్యాయి. దీంతో నగదు ఇవ్వాలంటే ఆధార్, బ్యాంకు పుస్తకాల జిరాక్స్ తేవాలని కమీష¯ŒS వ్యాపారి చెప్పాడు. ఎందుకంటే మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేస్తానన్నాడు. అదీ నెల తర్వాతని చెప్పాడు. దీంతో వెంకటేశ్వరరావు తన వద్ద ఉన్న డొక్కు సైకిల్ వేసుకుని చిరిగిన పంచెతో నాలుగుకిలోమీటర్ల దూరంలోఉన్న పూళ్ల వచ్చాడు. గ్రామంలో జిరాక్స్ యంత్రం లేకపోవడమే దీనికి కారణం. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు తన ఆవేదన వ్యక్తం చేశాడు. ధాన్యం డబ్బులు వస్తే పంట కోసిన కూలీలకు, పెట్టుబడి పెట్టిన వారికి డబ్బులు ఇవ్వాలని, వారు మాటిమాటికి ఇంటికి వచ్చి నిద్రపోనివ్వడం లేదని వాపోయాడు. నెల తర్వాత వ్యాపారి డబ్బిస్తే ఎలాగో అర్థం కావడం లేదని, దాళ్వా సాగు పెట్టుబడికి నగదు లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.