ato
-
మెట్రో రైలుకు డ్రైవర్ అక్కర్లేదు!
హైదరాబాద్ : హైదరాబాద్ నగరవాసులకు ఈ వార్త న్యూ ఇయర్ గిప్ట్గా చెప్పుకోవచ్చు. అనేక ప్రత్యేకతలు కలిగిన హైదరాబాద్ మెట్రోరైలు మరో మైలురాయిని అధిగమించింది. ఆటోమేటిక్ ట్రైన్ ఆపరేషన్ (ఏటీఓ) ద్వారా విజయవంతంగా రైలు నడిపి సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఒకప్పుడు ఊహలకు మాత్రమే పరిమితం అయిన డ్రైవర్ రహిత రైలు ఇప్పుడు... నగర వాసులకు అందుబాటులోకి రానుంది. డ్రైవర్‌తో సంబంధం లేకుండా తనంతట తానే పరుగులు తీయటమే కాకుండా అవసరం అయినప్పుడు వేగాన్ని నియంత్రించుకోవటంతో పాటు బ్రేకులు వేసుకోవటం దాని ప్రత్యేకత. ఇక డ్రైవర్ ఏం చేస్తారనే అనుమానం మీకు రావచ్చు... డ్రైవర్ కేవలం రైల్వేస్టేషన్లో ఎక్కి, దిగే ప్రయాణికులను గమనిస్తూ రైలు తలుపులు మూసే బటన్‌ను నొక్కటమే. నాగోల్-మెట్టుగూడ మార్గంలో మెట్రో రైలు ఈ టెస్ట్ రన్‌ను నిర్వహించారు. భారతదేశంలోనే ఈ తరహా టెక్నాలజీని ఉపయోగించటం ఇదే తొలిసారి. ఇందుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాంకేతిక యంత్ర పరికరాలను ఫ్రెంచ్ కంపెనీ అయిన థాలెస్ సంస్థ అందించింది. -
పొగ గుర్తింపు పరికరాలేవీ?
సాక్షి, ముంబై: అంధేరీలో ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) ప్రారంభమై ఏడాది గడిచినా ఇప్పటికీ అగ్నిమాపక నిరోధానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వాహనానికి సంబంధించిన పత్రాలు జాగ్రత్తగా ఉంటాయా? అనే సందేహం స్థానికుల్లో నెలకొంది. ఒకవేళ ఇక్కడ అనుకోకుండా అగ్నిప్రమాదం సంభవిస్తే ఇందులోని పత్రాలు కాలి బూడిదయ్యే ప్రమాదముంది. మంత్రాలయలో భారీ అగ్నిప్రమాదం ఘటన నుంచి ఆర్టీఓ అధికారులు గుణపాఠం నేర్చుకోకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యాలయం వైశాల్యం 75,000 చదరపు అడుగులపైనే. ఈ కార్యాలయానికి ప్రతిరోజూ అనేక పత్రాలు వస్తుంటాయి. అయినప్పటికీ ఇందులో స్మోక్ డిటెక్టర్లు (పొగ గుర్తింపు పరికరాలు) కూడా అందుబాటులో లేకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికితోడు‘ఫైర్ అలారమ్’ వ్యవస్థ కూడా సరిగా లేదు. ఈ కార్యాలయానికి ప్రతిరోజూ డ్రైవింగ్ లెసైన్సు పత్రాలకోసం దరఖాస్తులు వస్తుంటాయి. పొరపాటున అగ్నిప్రమాదం సంభవిస్తే ఈ కాగితాలు మాడిమసైపోతాయంటూ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఈ విషయమై అంధేరీ ఆర్టీవో అధికారి పి.జి.భలేరావ్ స్పందిస్తూ.. తమ వద్ద స్ప్రింక్లర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అయితే సరైన అలారం వ్యవస్థ లేదనే విషయాన్ని ఆయన అంగీకరించారు.