Atomic Energy
-
చైతన్య భారతి: అణుశక్తిమాన్
ఒకసారి ఒక పాత్రికేయుడు, హోమీ భాభాతో ఆయన వివాహం గురించి అడిగారు. అప్పుడు ఆయన, ‘‘నేను సృజనాత్మకతను పెళ్లాడాను’’ అని చెప్పారు. నిపుణులైన వ్యక్తుల చుట్టూ ఉత్కృష్టమైన సంస్థలను సృష్టించడం ఆయన శైలి. అందుకు తగ్గట్లే, ట్రాంబేలో ఏర్పాటు చేసిన అణుశక్తి సంస్థకు ఆయన పేరు కలిసి వచ్చేలా ‘బార్క్’ (భాభా అణు పరిశోధనా కేంద్రం) అని పేరు పెట్టారు. భారతదేశ అణుశక్తి కార్యక్రమానికి రూపశిల్పి అయిన హోమీ జహంగీర్ భాభా ఇంజనీరింగ్ డిగ్రీ చదవడం కోసం ఇంగ్లండ్ వెళ్లారు. కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. నిజానికైతే విజ్ఞాన శాస్త్రంలో ప్రాథమిక పరిశోధన చేయడం అంటే ఆయనకు పంచప్రాణాలు. 1939 లో భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన నోబెల్ బహుమతి గ్రహీత సర్ సి.వి.రామన్ దగ్గర పని చేశారు. ‘‘ప్రపంచంలో ముందంజలో నిలవదలిచిన ఏ దేశమూ మౌలిక లేదా దీర్ఘకాలిక పరిశోధనను నిర్లక్ష్యం చేయలేదు..’’అని భాభా ఒకసారి అన్నారు. భారతదేశాన్ని అణుశక్తి సంపన్న దేశంగా తీర్చిదిద్దడానికి తొలి చర్యగా ఆయన ‘టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టి.ఐ.ఎఫ్.ఆర్) ను స్థాపించారు. 1945లో ఆరంభమైన ఈ సంస్థ మౌలిక విజ్ఞాన శాస్త్రంలో నైపుణ్యానికి కృషి చేసింది. ఇక, 1948లో భారతదేశ అణుశక్తి కార్యక్రమానికీ ఆయనే రూపకల్పన చేశారు. ఆయన కృషి ఫలితంగా భారతదేశం దాదాపు 50 ఏళ్ల క్రితమే ఓ పరిశోధక అణు రియాక్టర్‌ను డిజైన్ చేసింది. అణుశక్తి కార్యక్రమంతో పాటు తొలినాళ్లలో దేశ అంతరిక్ష కార్యక్రమానికి బీజం వేసి, పెంచి పోషించడంలో కూడా హోమీ భాభా కీలక పాత్ర వహించారు. అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ నుంచి గట్టి మద్దతు, అమోదముద్ర లభించడంతో దేశాన్ని అణుశక్తియుత దేశంగా మార్చాలన్న భాభా కల నెరవేరింది. భాభా బహుముఖ పార్శా్వలున్న వ్యక్తి. సంక్లిష్ట గణితం గురించి ఆయన ఎంత ధారాళంగా మాట్లాడతారో, పాశ్చాత్య సంగీతంలోని సూక్ష్మాతి సూక్ష్మమైన అంశాల గురించీ అంతే ధారాళంగా మాట్లాడతారు. ఆయన స్వతహాగా చిత్రకారుడు, భవన నిర్మాణ శిల్పి కూడా. ఇక ఆయన వేసిన వర్ణ చిత్రాలు టి.ఐ.ఎఫ్.ఆర్., బార్క్ ప్రాంగణాలలో ఎల్లప్పుడూ ప్రదర్శనకు ఉంటాయి. భారత అణుశక్తి కార్యక్రమం కీలకమైన దశలో ఉండగా, విధి ఆయన పట్ల క్రూరంగా వ్యవహరించింది. 1966లో జరిగిన ఓ విమాన ప్రమాదంలో ఈ భరతజాతి ముద్దు బిడ్డ ప్రాణాలు కోల్పోయారు. – శ్రీకుమార్ బెనర్జీ, భాభా అణు పరిశోధనా కేంద్రంలో పూర్వపు డైరెక్టర్ (చదవండి: అడవి నుంచి రేడియో బాణాలు) -
వందేళ్లు పనిచేసే అణువిద్యుత్ బ్యాటరీ
సాక్షి, న్యూఢిల్లీ : సాధారణ సంప్రదాయ కెమికల్ బ్యాటరీ కన్నా పదింతలు అధిక విద్యుత్ ఇవ్వడమే కాకుండా నూరేళ్లపాటు చార్జింగ్ చేయాల్సిన అవసరం లేని అణు విద్యుత్ బ్యాటరీని రష్యా శాస్త్రవేత్తలు తయారు చేశారు. గుండె కొట్టుకోవడానికి అమర్చుకునే పేస్ మేకర్ నుంచి అంగారక గ్రహానికి వెళ్లే వాహనంలో ఉపయోగించుకునేందుకు కూడా ఇది ఎంతో అనువుగా ఉంటుంది. అణు విద్యుత్ బ్యాటరీ ఓ జీవితకాలం పని చేస్తుంది కనుక పేస్‌మేకర్‌ను ఒకసారి అమర్చుకుంటే చాలు, మళ్లీ దాన్ని చార్జి చేసుకోవాల్సిన అవసరమే రాదు. అణు విద్యుత్ ప్రొటోటైప్ తయారీలో సెమీకండక్టర్గా తాము వజ్రాన్ని, రేడియో యాక్టివ్ కెమికల్‌ను ఉపయోగించినట్లు మాస్కోలోని ‘టెక్నాలాజికల్ ఇనిస్టిట్యూట్ ఫర్ సూపర్ హార్డ్ అండ్ నావల్ కార్బన్ మెటీరియల్స్’కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో బీటా రేడియేషన్ ఉండడం వల్ల దాన్ని మానవ శరీరం లోపల ఉపయోగించి ఎలాంటి ప్రమాదం లేదని వారు చెప్పారు. అణు విద్యుత్ బ్యాటరీని తయారు చేయడం ఇదే మొదటిసారి కాదని, ఇంతకుముందు తయారు చేసినవి సైజులో చాలా పెద్దవని, మొట్టమొదటిసారిగా అతి చిన్న బ్యాటరీని తయారు చేయడంలో విజయం సాధించామని శాస్త్రవేత్తలు తెలిపారు. తాము తయారు చేసిన ఈ బ్యాటరీ పరిజ్ఞానం కూడా నాసా శాస్త్రవేత్తలకు ఉపయోగపడుతుందని వారు అన్నారు. అంగారక గ్రహంలో ఏర్పాటు చేయనున్న మానవ కాలనీలకు కొన్నేళ్లపాటు విద్యుత్‌ను అందించేందుకుగాకు నాసా ఇప్పుటికే ‘కిలో పవర్’ అణు విద్యుత్ రియాక్టర్‌ను తయారు చేస్తోంది. -
కీలకం
- అత్యధిక మందికి అందని పోస్టల్ బ్యాలెట్లు - దరఖాస్తు చేయనివారూ ఎక్కువే సాక్షి, సిటీబ్యూరో : హోరాహోరీ పోరు.. పోటాపోటీ ప్రచారం.. ఒకే స్థానం-అభ్యర్థులు అధికం.. స్వపక్షంలోనే విపక్షం.. తిరుగుబాట్లు.. వెన్నుపోట్లు.. వెరసి ఈసారి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రతి ఓటూ కీలకమే. ఈ నేపథ్యంలో నేతల రాతలు మార్చే బుల్లెట్‌గా మారనుంది పోస్టల్ బ్యాలెట్. ఈసారి అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో దీని పాత్ర కీలకం కానుంది. కానీ గ్రేటర్ పరిధిలో దరఖాస్తు చేసుకున్న పలువురికి పోస్టల్ బ్యాలెట్లు అందకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గ్రేటర్ పరిధిలో 28 వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే సుమారు 18 వేల మం దికే అందినట్లు సమాచారం. దీంతో దరఖాస్తు చేసుకున్నా తమకు నేటికీ పోస్టల్ బ్యాలెట్ అందలేదని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. తాము ఓటు హక్కు వినియోగించుకోవద్దా? అని ప్రశ్నిస్తున్నారు. అసలు దరఖాస్తే చేసుకోని వారు కూడా తక్కువేమీ లేరు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎన్నికల విధుల్లోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కావాలని తాము ఏ రిటర్నింగ్ అధికారి పరిధిలో ఎన్నికల విధుల్లో ఉంటారో వారికి ఫారం-12 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును ఉద్యోగి ఓటు హక్కు ఉన్న నియోజకవర్గ రిట ర్నింగ్ అధికారికి పంపిస్తారు. ఓటరు జాబితాలో పేరు తదితరమైనవన్నీ నిర్ధారించుకొని సంబంధిత ఉద్యోగికి పోస్టు ద్వారా ఈ పోస్టల్ బ్యాలెట్‌ను పంపిస్తారు. పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేసే ఉద్యోగి తిరిగి దానిని పోస్టు ద్వారా గాని.. లేక సంబంధిత రిటర్నింగ్ అధికారికి నేరుగా గాని అందజేయవచ్చు. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు జరగనుండగా, 15లోగా కానీ.. లేదా 16న ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడానికి గం ట ముందు గాని అందజేయవచ్చు. అయితే గత నెల 30న పోలింగ్ జరగ్గా.. 28లోగా దరఖాస్తు చేసుకున్న అందరికీ పోస్టల్ బ్యాలెట్లు పంపించామని అధికారులు చెబుతున్నారు. నిర్ణీత వ్యవధిలోగా దరఖాస్తు చేసుకున్నా.. తమకింకా పోస్టల్ బ్యాలెట్ అందలేదని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. దరఖాస్తే చేయని తీరు... కొన్ని నియోజకవర్గాల్లో ఓటు హక్కున్న ఉద్యోగులు చాలామంది అసలు దరఖాస్తే చేసుకోలేదు. ఉదాహరణకు ముషీరాబాద్ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్‌కు అర్హులైనవారు దాదాపు 3 వేల మంది ఉద్యోగులుండగా.. వారిలో 400 మంది మాత్రమే దరఖా స్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన కొన్ని పార్టీల అభ్యర్థులు ఇప్పుడు నాలుక్కరచుకుంటున్నారు. గడువున్నప్పుడే వారు పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తు చేసుకోమని చెప్పలేకపోయామని వాపోతున్నారు. గ్రేటర్ పరిధిలో 28 వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో దాదాపు 18 వేల మంది నుంచి ఓటు చేసిన బ్యాలెట్లు అందాయని సంబంధిత అధికారులు చూచాయగా చెబుతున్నారు. కచ్చితమైన సంఖ్య మాత్రం చెప్పలేకపోతున్నారు. దరఖాస్తు చేసినా.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అటమిక్ ఎనర్జీలో పనిచేస్తున్న నాకు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నికల విధులు అప్పగించారు. గతనెల 25న ఫారం-12 ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇంకా అందలేదు. గతంలో దరఖాస్తు చేసుకున్న చోట వెంటనే ఇచ్చేవారు. ఇప్పుడు అలా ఇవ్వలేదు. పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఇంకా అందకపోవడంతో కొంత ఆందోళనగా ఉంది. - సీవీకే మోహన్ వర్మ