attack in jail
-
‘26/11’ సూత్రధారి హెడ్లీపై జైల్లో దాడి
వాషింగ్టన్ : 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీ (58) ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అమెరికాలోని షికాగోలో మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్ (జైలు)లో శిక్షను అనుభవిస్తున్న హెడ్లీపై ఇద్దరు తోటి ఖైదీలు దాడికి దిగారు. దీంతో తీవ్రంగా గాయపడిన హెడ్లీని అధికారులు ఆస్పత్రికి తరలించారు. జూలై 8న ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)లో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి.. ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పాకిస్తాన్ ఏజెంట్‌గా, ఉగ్రవాదిగా పనిచేసిన హెడ్లీపై జైల్లో దాడి చేసిన వారు పోలీసులను కొట్టిన కేసులో జైల్లో శిక్షననుభవిస్తున్నారు. 26/11 కేసులో అప్రూవర్‌గా మారిన హెడ్లీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముంబైలోని ప్రత్యేక కోర్టు విచారణలకు హాజరయ్యాడు. లష్కరే ఆధ్వర్యంలో ఉగ్రశిక్షణ అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అధికారిగా తరచూ పాకిస్తాన్ సందర్శించిన సమయంలో హెడ్లీకి లష్కరే తోయిబాతో పరిచయం ఏర్పడింది. అనంతరం లష్కరే వద్దే ఉగ్రవాద శిక్షణ పొందిన హెడ్లీ.. ముంబైలో దాడి చేసేందుకు రహస్య ఏజెంటుగా పనిచేశాడు. రెక్కీలు నిర్వహించడంలోనూ సాయం చేశాడు. 168 మంది ప్రాణాలు బలిగొన్న ముంబై ఘటనకు సూత్రధారిగా నిలిచాడు. కోపెన్‌హాగన్‌లో మహ్మద్ ప్రవక్తపై కార్టూన్ వేసిన ఓ డానిష్ దినపత్రికపై దాడి కూడా హెడ్లీయే చేసినట్లు వెల్లడైంది. 2009 అక్టోబర్‌లో షికాగోలోని ఓహేర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాకిస్తాన్‌కు బయలుదేరుతుండగా హెడ్లీని పోలీసులు అరెస్టు చేశారు. 2013లో అమెరికా కోర్టు ముంబై దాడుల కేసులోనే ఈయనకు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అప్పటినుంచి ఈ జైల్లో శిక్షననుభవిస్తున్నాడు. -
శ్రీశాంత్‌పై జైల్లో హత్యాయత్నం!
మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌పై జైల్లో హత్యాయత్నం జరిగిందట! ఈ విషయాన్ని శ్రీశాంత్ బావ బాలకృష్ణన్ తెలిపారు. 2013 మే నెలలో తీహార్ జైల్లో 26 రోజులు గడిపిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పాడని ఆయన అన్నారు. జైలు ప్రాంగణంలో తాను నడిచి వెళ్తుండగా.. ఓ రౌడీ ఉన్నట్టుండి తన ముందుకు దూకాడని, పదునైన కత్తితో తనమీద దాడి చేశాడని చెప్పాడన్నారు. తనకు చేతిమీద గాయమైందని, తర్వాత ఆ రౌడీని జైలు సిబ్బంది తీసుకెళ్లారని బాలకృష్ణన్ అన్నారు. అయితే దీన్ని వివాదం చేయాలని తాము అనుకోవడం లేదని, అందుకే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని వివరించారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతుండగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2013 సంవత్సరంలో శ్రీశాంత్ ఔటయిన విషయం తెలిసిందే. తర్వాత ఇప్పుడు బెయిల్ మీద విడుదలై బయటే ఉన్నాడు. శ్రీశాంత్ మీద ఢిల్లీ పోలీసులు మోకా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీకోర్టులో విచారణ జరుగుతోంది. తీర్పు వచ్చే నెలలో విడుదల అవుతుందని భావిస్తున్నారు.