attractive employers
-
ఉద్యోగులు మెచ్చే సంస్థ ‘మైక్రోసాఫ్ట్’
న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగులు మెచ్చే అత్యంత ఆకర్షణీయ సంస్థగా (అట్రాక్టివ్ ఎంప్లాయర్ బ్రాండ్) మైక్రోసాఫ్ట్ ఇండియా నిలిచింది. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2022 ర్యాంకుల జాబితా విడుదలైంది. ఆర్థిక ఆరోగ్యం విషయంలో మైక్రోసాఫ్ట్ ఇండియా చాలా ఎక్కువ స్కోరు సాధించింది. బలమైన పేరు, గుర్తింపు, ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనాలు, ఇతర ప్రయోజనాలు.. ఈ మూడు అంశాలు మైక్రోసాఫ్ట్‌ను నంబర్ 1 స్థానంలో నిలిపాయి. ఈ జాబితా లోని టాప్–10లో హ్యూలెట్ ప్యాకార్డ్ నాలుగో స్థానంలో, ఇన్ఫోసిస్ ఐదో స్థానంలో ఉన్నాయి. విప్రో, టీసీఎస్, టాటా స్టీల్, టాటా పవర్ కంపెనీ, శామ్సంగ్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాండ్‌స్టాడ్ రీసెర్చ్ సర్వే కోసం 5,944 కంపెనీలకు చెందిన 1,63,000 మంది నుంచి (31 దేశాల వారు) అభిప్రాయాలు తెలుసుకున్నారు. కెరీర్లో పురోగతి కీలకం.. భారత్‌లో ప్రతి 10 మంది ఉద్యోగుల్లో 9 మంది (88%) శిక్షణ, వ్యక్తిగత కెరీర్ పురోగతి తమకు చాలా ముఖ్యమైనవిగా చెప్పారు. అదే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇలా చెప్పిన ఉద్యోగులు 76%. 2021 చివరి ఆరు నెలల్లో భారత్‌లో 24% ఉద్యోగులు తమ కంపెనీని మార్చుకున్నారని రాండ్‌స్టాడ్ తెలిపింది. సంస్థను ఎంపిక చేసుకునే విషయంలో పని–వ్యక్తిగత జీవితం మధ్య బ్యాలన్స్ తమకు ముఖ్యమని 63% మంది తెలిపారు. -
'టాప్' లేపిన గూగుల్!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రొఫెషనల్ డిగ్రీలు, పీజీలు పూర్తిచేసుకున్న విద్యార్థులు తమకు పలానా కంపెనీలో జాబ్ వస్తే ఒక తమకు తిరుగులేదని భావిస్తుంటారు. తాజాగా ఓ బ్రాండింగ్ ఏజెన్సీ సర్వే చేయగా రెండు విభాగాల విద్యార్థులు ఆసక్తి చూపించడంతో గూగుల్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు, ఉద్యోగ అభ్యర్థులపై సర్వే చేసి మోస్ట్ అట్రాక్టివ్ ఎంప్లాయిస్ ఫర్ స్టూడెంట్స్ 2017 పేరిట కొన్ని కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఇతర సాఫ్ట్‌ఫేర్ విద్యార్థులతో పాటు బిజినెస్ స్టూడెంట్స్ (ఎంబీఏ, ఎంకామ్, బీబీఏ గ్రాడ్యుయేట్లు) గూగుల్‌నే తమ ఫెవరెట్ కంపెనీగా భావిస్తున్నారు. భారత్, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా, దక్షిణకొరియా, యూకే, అమెరికా దేశాల్లో యూనివర్సమ్ ఈ సర్వే చేసింది. ఇంజినీరింగ్ నిరుద్యోగులు జాబ్ కోరుకున్న కంపెనీల్లో గూగుల్ తర్వాత మైక్రోసాఫ్ట్, యాపిల్, జనరల్ ఎలక్ట్రిక్, బీఎండబ్ల్యూ గ్రూపు, ఐబీఎం, ఇంటెల్, సీమెన్స్, సోని, శాంసంగ్ కంపెనీలు నిలిచాయి. బిజినెస్ విభాగం విషయానికొస్తే.. గూగుల్ తర్వాత గోల్డ్‌మ్యాన్ సాచ్స్, యాపిల్, ఈవై, పీడబ్ల్యూసీ, డెలాయిట్, మైక్రోసాఫ్ట్, లోరియల్ గ్రూపు, కేపీఎంజీ, జేపీ మోర్గాన్ సంస్థల్లో పనిచేసేందుకు ఈ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంజినీరింగ్/ ఐటీ సెక్టార్ వారు పనిచేయాలనుకుంటున్న విభాగాలివే: సాఫ్ట్వేర్, కంప్యూటర్ సర్వీసెస్, మల్టీ మీడియా డెవలప్మెంట్, డిజిటల్ ఎంటైర్టైన్మెంట్ - 23శాతం ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మ్యానుఫక్చరింగ్ - 21శాతం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ - 20శాతం ఆటోమోటివ్ - 17శాతం ఎనర్జీ - 16శాతం బిజినెస్ స్టూడెంట్స్ ఆసక్తి చూపిస్తున్న విభాగాలివే: మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజీ కన్సల్టెన్సీస్ - 28శాతం బ్యాంకింగ్ - 25శాతం ఫైనాన్షియల్ సర్వీసెస్ - 23శాతం ఆడిటింగ్ అండ్ అకౌంటింగ్ - 19శాతం మీడియా అండ్ అడ్వర్టైజింగ్ - 17శాతం -
పని చేయడానికి క్రేజీ కంపెనీ ఇదేనట..!
బిజినెస్ స్టూడెంట్లకు ఎక్కడ పని చేయాలని ఉందని అడిగితే.. వారి నోటనుంచి వచ్చే మొదటి పేరు గూగుల్ కంపెనీదేనట. గూగుల్ కంపెనీలో జాబ్ అంటే తెగ ఇష్టపడుతున్నారట. గ్లోబల్ రీసెర్చ్, అడ్వయిజరీ సంస్థ యూనివర్సమ్ చేపట్టిన సర్వేలో గూగుల్ అత్యంత ఆకర్షణీయమైన కంపెనీగా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో యాపిల్, ఈవై, గోల్డ్ మ్యాన్ సాక్స్, పీడబ్ల్యూసీలు ఆకర్షణీయమైన కంపెనీలుగా నిలుస్తున్నాయి. డెలాయిట్, మైక్రోసాప్ట్, కేపీఎమ్‌జీ, లోరియల్, జేపీ మోర్గాన్ లు టాప్-10లో స్థానం దక్కించుకున్నాయి. 12 నెలల పాటు మొత్తం ప్రపంచంలోని12 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో యూనివర్సమ్ ఈ సర్వే నిర్వహించింది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, రష్యా, యూకే, అమెరికా దేశాల్లో, మొత్తం 2,67,000 బిజినెస్, ఇంజనీరింగ్, ఐటీ విద్యార్థులపై రీసెర్చ్ సంస్థ ఈ సర్వేను చేపట్టింది. విద్యార్థులు ఎక్కువగా ఏ కంపెనీలో వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారో ఈ సర్వేలో వారిని అడిగి తెలుసుకున్నారు. వర్క్- లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ కంపెనీల్లో ఒత్తిడి తక్కువగా ఉంటుందని విద్యార్థులు చెప్పినట్టు రీసెర్చ్ తెలిపింది. టెక్ కంపెనీలు, బ్యాంకులు, ప్రొఫెషనల్ సేవలు అందించే కంపెనీలు బిజినెస్ స్టూడెంట్లకు ఎక్కువగా ఆకర్షణీయంగా ఉంటున్నాయని ఈ సర్వేలో తేలింది. 24/7 సమయాల్లో ఈ కంపెనీ స్టాప్, ప్రపంచానికి అనుసంధానమై ఉంటున్నారు. అయితే 2014లో సర్వేలో పాల్గొన్న మూడింట రెండువంతుల మంది ఉద్యోగంలో చేరడానికి వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ప్రధాన అడ్డంకుగా నిలుస్తుందని చెప్పారని ఈ రిపోర్టు పేర్కొంది. ప్రస్తుతం ఈ సమస్య కొంత మెరుగైనట్టు వెల్లడించింది. ఇటీవలే ఎకనామిక్ టైమ్స్, గ్రేట్ ప్లేస్ టూ వర్క్ ఇన్ స్టిట్యూట్ భారత్ లో జరిపిన బెస్ట్ వర్క్ ప్లేస్ టెక్పాలజీ కంపెనీల్లో కూడా గూగులే మొదటిస్థానంలో నిలిచింది. ఉద్యోగులకు చక్కని సౌకర్యాలు కల్పిస్తూ.. వారి టాలెంట్ ను విస్తరించేలా గూగుల్ అవకాశం కల్పిస్తోందని ఆ సర్వేలో వెల్లడైంది.