మెయిన్ ‘డ్రా’కు చేరువలో యూకీ
మెల్బోర్న్: మరో మ్యాచ్ గెలిస్తే భారత టెన్నిస్ యువతార యూకీ బాంబ్రీ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. పురుషుల క్వాలిఫయింగ్ సింగిల్స్ రెండో రౌండ్లో యూకీ 7-6 (10/8), 6-3తో యోషిహిటో నిషిఓకా (జపాన్)పై గెలిచాడు. శనివారం జరిగే క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో చేజ్ బుకానన్ (అమెరికా)తో యూకీ తలపడతాడు.