Autoimmune disorder
-
అరుదైన జబ్బుతో అర్జున్ కపూర్ : ఎమోషనల్ కామెంట్స్,అంత ప్రమాదకరమా?
నటి మలైకా అరోరా, బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్(Arjun Kapoor) ఇద్దరూ ఒకరి కోసం ఒకరం అన్నంతగా చెట్టా పట్టాలేసుకుని తిరిగిన ప్రేమజంట. ఏమైందో తెలియదు గానీ, ఇటీవల వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. తాజాగా అర్జున్ కపూర్ తన ఆరోగ్యంపై కీలక విషయాన్ని వెల్లడించాడు. నిద్ర పట్టక ఇబ్బంది పడేవాడినంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. హాషిమోటోస్ థైరాయిడిటిస్ ((Hashimoto's disease) అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో తాను బాధపడుతున్నట్లు అర్జున్ కపూర్ వెల్లడించారు. ఇది థైరాయిడ్ తరువాత స్టేజీ అని, రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నాడు. ఇది బరువు పెరగడానికి అది కూడా కారణం కావచ్చునని అన్నాడు. తాను లావుగా ఉండటం వల్ల మానసిక ఒత్తిడి మరింత పెరిగి అందరికీ దూరంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్ట పడేవాడినని చెప్పాడు.‘‘సింగం ఎగైన్’’ మూవీ సమయంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, మానసికంగా, శారీరకంగా. నేను ఎంత డిప్రెషన్లో ఉన్నానో లేదో నాకు తెలియదు. అసలు ఈ సినిమా చేయాలా వద్దా ? నన్ను జనాలు ఆదరిస్తారా? లేదా? అనే అనుమానం పీడించేది. కానీ నాకు ఈ సినిమా పునర్జన్మ నిచ్చింది’’. కరియర్లో వరుస ఫ్లాప్‌లో ఇబ్బందిపడుతున్న తరుణంలో డైరెక్టర్ రోహిత్ శెట్టి, అర్జున్ కపూర్ కాంబోలో వచ్చిన 'సింగం ఎగైన్' మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రధాన విలన్ "డేంజర్ లంక" పాత్రతో అర్జున్ కపూర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. మలైకా, అర్జున్ 2018లో డేటింగ్ ప్రారంభించారు. 2019లో, వారు సోషల్ మీడియాలో తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు. ఇటీవల ఇద్దరూ విడిపోయినట్టు ధృవీకరించారు. అసలేంటీ హషిమోటో వ్యాధి,ఎలా వస్తుంది?హషిమోటో వ్యాధికి ఖచ్చితమైన కారణాలపై స్పష్టతలేనప్పటికీ, జన్యు, పర్యావరణ , హార్మోన్ల అసమతుల్యత , జీవనశైలి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.ఫ్యామిలీలో థైరాయిడ్ లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధుల ఉంటే రావచ్చు. పురుషుల కంటే స్త్రీలే దీనికి ఎక్కువ గురయ్యే అవకాశ ఉంది. బహుశా హార్మోన్ల ప్రభావాల వల్ల కావచ్చు.ఏ వయసులోనైనా సంభవించవచ్చు, అయితే సాధారణంగా మధ్య వయస్కులలో బయటపడుతుంది.పర్యావరణ కారకాలు: అయోడిన్ అధికంగా తీసుకోవడం, రేడియేషన్‌కు గురికావడం లేదా ఇన్ఫెక్షన్లు.ఒత్తిడి , జీవనశైలి: దీర్ఘకాలిక ఒత్తిడి, పోషకాహారం లోపం లక్షణాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీవక్రియ, గుండె పనితీరు, జీర్ణక్రియలో సమస్యలు, కండరాలపై పట్టు కోల్పోవడం, మెదడు పనితీరులో లోపాలు అలసట,బలహీనత,బరువు పెరుగటం తరచుగా డిప్రెషన్, ఆందోళన , మూడ్ స్వింగ్స్చలిని తట్టుకోలేకపోడం , కండరాలు , కీళ్ల నొప్పులుమలబద్ధకం, ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయిచికిత్ససాధారణ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను పునరుద్ధరించడానికి , అలసట మరియు బరువు పెరగడం వంటి లక్షణాలను తగ్గించడానికి థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని వాడతారు.థైరాయిడ్పనితీరును క్రమం తప్పకుండాపర్యవేక్షించుకోవాలి. అవసరం మేరకు మందుల మోతాదును సర్దుబాటు చేసుకోవాలి.సెలీనియం, జింక్ సమృద్ధిగా ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవాలి.ఒత్తిడికి దూరంగా ఉండేలా మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి.థైరాయిడ్ ఆరోగ్యానికి తోడ్పడతాయి, అయినప్పటికీ అధిక అయోడిన్‌ను నివారించాలి. తగిన వ్యాయామం చేయాలిరోజుకు కనీసం 6 గంటల నిద్రం ఉండేలా జాగ్రత్త పడాలి.నోట్: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. థైరాయిడ్ సమస్య ఉన్నట్టు అనుమానం ఉన్న వారు వెంటనే వైద్యుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి. -
అవును... నాకు బట్టతలే.. అయితే ఏంటి?
ఇటీవల ఆస్కార్ వేడుకలలో నటుడు విల్ స్మిత్ భార్య జాడా స్మిత్ పై వేసిన జోక్ ఎదురు తిరిగింది. స్త్రీలకు వచ్చే అరుదైన సమస్య బట్టతల. జాడా స్మిత్ ఆ సమస్యతో బాధ పడుతోంది. ఇండియాలో కూడా ఈ సమస్యతో బాధ పడుతున్న స్త్రీలు ఉన్నారు. ఆ స్థితిని స్వీకరించి ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతున్న వారు ఉన్నారు. బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల పరోతిమ గుప్తా తమ జీవితం ఎదుటి వాళ్లకు జోక్ కాదని హెచ్చరిస్తున్నారు. ఇది ఆమె కథ. ఆడుతూ పాడుతూ ఉండే పదేళ్ల అమ్మాయి ఉదయాన్నే నిద్ర లేచే సరికి దిండంతా ఆ అమ్మాయి జుట్టుతో నిండిపోయి ఉంటే ఎలా ఉంటుంది? పరోతిమ గుప్తాకు అలా జరిగింది. అప్పుడు ఆమె వయసు పదేళ్లు. డార్జిలింగ్‌లో బోర్డింగ్ స్కూల్లో చదువుకుంటోంది. వాళ్ల నాన్న, అమ్మలది కోల్కటా. నాన్న టీ ప్లాంటేషన్లలో పని చేసేవాడు కాబట్టి ఒక్కోసారి ఒక్కోచోట ఉండాలి కాబట్టి పరోతిమను, ఆమె చెల్లెల్ని బోర్డింగ్ స్కూల్లో ఉంచి చదివించేవారు. పరోతిమ క్లాసులు బాగా చదివేది. డిబేట్లు గెలిచేది. స్టేజ్ మీద భయం లేకుండా ఉండేది. అలాంటిది ఒక ఉదయం ఇలా జరిగే సరికి బెంబేలెత్తిపోయింది. తల్లిదండ్రులు వచ్చారు. డాక్టర్ల దగ్గరకు తిరిగారు. ‘ఇలా టైఫాయిడ్ వల్ల జరుగుతుంది’ అన్నాడో డాక్టరు. కాని అప్పటికి పరోతిమకు టైఫాయిడ్ రాలేదు. మరేంటి? చివరకు సిలిగురిలో ఒక డాక్టరు దీనిని ‘అలోపేసియా అరెటా’ (పేనుకొరుకుడు/ఆటోఇమ్యూన్ డిసీజ్) అని కనిపెట్టి వైద్యం మొదలెట్టాడు. అలా పదేళ్ల వయసు నుంచి పరోతిమ జీవితంలో ఒక పెద్ద యుద్ధం మొదలైంది. మందే లేని జబ్బు అలోపేసియా వల్ల హఠాత్తుగా జుట్టు రాలిపోతుంది. ఇది తల మీద కొన్ని ప్రాంతాల్లో జరగొచ్చు. పూర్తిగా కూడా జరగొచ్చు. కొన్నిసార్లు కొన్నాళ్ల తర్వాత మళ్లీ జుట్టు వస్తుంది. కొందరికి రాదు. ‘పదేళ్ల వయసు నాకు. ఏమీ అర్థం కాలేదు. డాక్టరు ఎన్నో మందులు రాశాడు. లెక్కలేనన్ని ఇంజెక్షన్లు పొడిచాడు. కొందరేమో ఆయుర్వేద తైలాలు అని, హోమియోపతి మందులు అని. ఎప్పుడూ నా తల మీద అల్లం, వెల్లుల్లి గుజ్జు రాసి ఉండేవారు. ఇంకేవో కంపు కొట్టే నూనెలు. ఎప్పుడూ వాసన కొడుతూ ఉండేదాన్ని. కొన్నాళ్లకు స్కూలుకు వెళ్లాను. అది ఇంకా ఘోరమైన అనుభవం. పిల్లలు నన్ను వెక్కిరించేవారు. కొందరు నాకొచ్చింది అంటువ్యాధి ఏమోనని దగ్గరకు వచ్చేవారు కాదు. స్టేజ్ ఎక్కి నేను ఏదైనా మాట్లాడాలంటే వెళ్లలేకపోయేదాన్ని. మగపిల్లలు నాతో అసలు మాట్లాడేవాళ్లు కాదు. ఇంట్లో బాత్రూమ్లో దూరి గంటలు గంటలు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కొందరు ఫ్రెండ్స్, టీచర్లు నాకు గట్టి ధైర్యం చెప్పారు. వాళ్ల వల్ల నిలబడ్డాను’ అంటుంది పరోతిమ. ఇంటర్లో వెలుగు అయితే పరోతిమ ఇంటర్‌కు వచ్చేసరికి జుట్టు మళ్లీ రావడం మొదలెట్టింది. లోపల ఒకటి రెండు పాచెస్ ఉన్నా కొంచెం కవర్ చేసుకునే విధంగా ఉండేది. పరోతిమ కోల్కటాలో డిగ్రీ, పి.జి. చేసింది అక్కడే ఒక డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ. ఆ వైద్యం కఠినతరంగా ఉండేది. ఇంజెక్షన్లు ఉండేవి. వాటన్నింటిని ఆమె భరించింది. ఇప్పుడు ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చింది. మార్కెటింగ్ ప్రొఫెషనల్‌గా మారింది. కొత్త ఉద్యోగం. స్ట్రెస్. 2007లో మళ్లీ పూర్తిగా జుట్టు రాలడం మొదలయ్యింది. ‘ఇక ఈ హింస చాలు. నాకు జట్టు లేదు... రాదు అనే స్థితిని నేను స్వీకరించి మిగిలిన జీవితం సాధారణం గా గడపడానికి నిశ్చయించుకున్నాను’ అంటుంది పరోతిమ. ‘నేను నా చెల్లెల్ని తోడు పిలిచాను. పద నేను గుండు గీయించుకోవాలి అన్నాను. శిరోజాలు లేని నా ముఖాన్ని చూసి తట్టుకోవడానికే నా చెల్లెల్ని తోడు చేసుకున్నాను. కాని శిరోముండనం అయ్యాక నాకు హాయిగా అనిపించింది. ఇక మీదట ఇలాగే ఉండాలని నిశ్చయించుకున్నాను.’ అందామె. అయితే ఈ ఆకారాన్ని చూసి సానుభూతి, అనవసర ప్రశ్నలు రాకుండా ఉండేందుకు తాను పని చేసే చోటులో అందరికీ ఈమెయిల్ ద్వారా తన అరుదైన జబ్బు గురించి తెలిపి ఆ చర్చను ముగించింది. ‘ఇప్ప టికీ కొందరు వింతగా చూస్తారు. గాంధీలా ఉన్నావ్ అంటారు. ఇలా ఉన్నా నీ లుక్స్ బాగున్నాయి అంటారు. కొందరు నీ తల తాకి చూడమంటావా అంటారు. అందరికీ తగిన సమాధానం చెప్పి ముందుకు పోతుంటాను’ అంటుంది పరోతిమ. ఆస్కార్ అవార్డ్స్‌లో జాడా స్మిత్ మీద జోక్ వేయడాన్ని ఆమె తప్పు పట్టింది. ‘మా జీవితం ఏ మాత్రం జోక్ కాదు’ అంది. ఎదుటి వాళ్ల వెలితిని హాస్యం చేయకూడని సంస్కారం అందరం అలవర్చుకోవాలి. -
అందుకే బ్రేక్ తీసుకున్నా!
ఐశ్వర్యా రాయ్‌కి సిస్టర్ ఏమో అన్నట్లుగా స్నేహా ఉల్లాల్ ఉంటారు. అయితే ఐష్‌కీ, తనకూ ఎలాంటి రిలేషన్ లేదని ఈ తేనెకళ్ల సుందరి తెలుగులో తొలి సినిమా ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చేసినప్పుుడే క్లారిఫై చేశారనుకోండి. ఆ తర్వాత టాలీవుడ్లో పలు చిత్రాల్లో నటించిన స్నేహా మూడేళ్లుగా కనిపించడంలేదు. ఎలాగూ హిందీ అమ్మాయి కాబట్టి, అక్కడ సినిమాలు చేస్తున్నారేమోనని చాలామంది అనుకున్నారు. కానీ, స్నేహా ఉల్లాల్ కెమెరా జోలికి వెళ్లలేదు. విషయం ఏంటంటే... అనారోగ్యం బారిన పడ్డారట. దీని గురించి స్వయంగా స్నేహా ఉల్లాలే చెప్పారు. ‘‘ఒంట్లో బాగా లేకపోవడంతో ఆస్పత్రికి వెళ్లి, చెక్ చేయించుకున్నా. టెస్టులన్నీ చేశాక నేను ‘ఆటోఇమ్యూన్ డిజార్డర్’తో బాధపడుతున్నానని డాక్టర్లు చెప్పారు. నా రోగ నిరోధక శక్తే నాకు ప్రతికూలంగా మారేలా చేసే రుగ్మత అన్నమాట. ఇది రక్తానికి సంబంధించిన జబ్బు’’ అని స్నేహా ఉల్లాల్ అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘ఈ రుగ్మత వల్ల నేను బలహీనమైపోయా. కంటిన్యూస్‌గా అరగంట నిలబడలేని పరిస్థితి. అయినా సినిమాలు చేశా. దాంతో ఇంకా వీక్ అయిపోయాను. ఒకానొక దశలో పరిగెత్తడం, డ్యాన్స్ చేయడం... ఇవన్నీ చేయలేకపోయా. దాంతో బ్రేక్ తీసుకుని, మందులు వాడుతూ, తగినంత విశ్రాంతి తీసుకున్నా. ఫైనల్‌గా నా ఆరోగ్య సమస్య సాల్వ్ అయింది. ఇక సినిమాలు చేయాలనుకుంటున్నా. అయితే ‘కమ్‌బ్యాక్’ అంటే ఇష్టపడను. ఎందుకంటే, కావాలని సినిమాలను వదిలేసి, మళ్లీ వస్తే అది ‘కమ్‌బ్యాక్’ అవుతుంది. నేను జస్ట్ బ్రేక్ తీసుకున్నా’’ అన్నారు.