automotive segment
-
రూ.1,16,200 కోట్లకు వాహన విడిభాగాల విపణి
న్యూఢిల్లీ: వాహన విక్రయానంతర విడిభాగాల మార్కెట్ దేశీయంగా 2028 నాటికి రూ.1,16,200 కోట్లకు చేరుకుంటుందని ఒక నివేదిక వెల్లడించింది. వాహన విక్రయాల్లో భారీ వృద్ధి ఇందుకు కారణమని తెలిపింది. 2023లో ఇది రూ.83,000 కోట్లు ఉంది. ఎర్నెస్ట్ అండ్ యంగ్ భాగస్వామ్యంతో ఆటోమోటివ్ కంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) ఈ నివేదిక రూపొందించింది. ‘ప్రస్తుతం భారతీయ రోడ్లపై 34 కోట్ల వాహనాలు పరుగెడుతున్నాయి. ఈ సంఖ్య వచ్చే అయిదేళ్లలో ఏటా వార్షిక సగటు వృద్ధి 8 శాతం నమోదు కానుంది. 2028 నాటికి ద్విచక్ర వాహనాలు 25.7 కోట్ల నుంచి 36.5 కోట్లకు, ప్యాసింజర్ వాహనాలు 4.7 కోట్ల నుంచి 7.2 కోట్లకు చేరనున్నాయి. ప్రీ–ఓన్డ్ కార్ల విక్రయాల సగటు వృద్ధి 2027–28 నాటికి ఏటా 17.5 శాతం ఉంటుంది. వాణిజ్య వాహనాల సంఖ్య 1.3 కోట్ల నుంచి 1.9 కోట్లను తాకనుంది. ట్రాక్టర్లు 1.4 కోట్ల నుంచి 1.9 కోట్లకు చేరనున్నాయి. ఇక్కడి కంపెనీలకు టాప్–10 అంతర్జాతీయ మార్కెట్లకు రూ.2,90,500 కోట్ల విలువైన ఎగుమతి అవకాశాలు లభిస్తాయి. ఇంజన్, సస్పెన్షన్, బ్రేకింగ్, ట్రాన్స్మిషన్ పార్ట్స్, రబ్బర్ విడిభాగాలు, కూలింగ్ సిస్టమ్స్, ఫిల్టర్స్‌కు ప్రధానంగా డిమాండ్ ఉంటుంది’ అని నివేదిక వివరించింది. టైర్లు, లూబ్రికెంట్స్, కూలెంట్స్, బ్యాటరీలను నివేదికలో పొందుపర్చలేదు. -
భారత్‌లో తయారీ పెంచుతున్న టయోటా
టోక్యో: వాహన తయారీలో ఉన్న జపాన్ దిగ్గజం టయోటా మోటార్ కార్పొరేషన్.. భారత్‌లో పూర్తి సామర్థ్యంతో ప్లాంట్లు నడుస్తుండడంతో తయారీని పెంచే ప్రక్రియను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా టయోటా మోటార్ కంపెనీ, కిర్లోస్కర్ గ్రూప్ సంయుక్త భాగస్వామ్య కంపెనీ అయిన టయోటా కిర్లోస్కర్ మోటార్‌కు బీదడి వద్ద రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఈ కేంద్రాల స్థాపిత సామర్థ్యం ఏటా 3.42 లక్షల యూనిట్లు. ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చూనర్, లెజెండర్, కామ్రీ హైబ్రిడ్, అర్బన్ క్రూజర్ హైరైడర్, హైలక్స్ మోడళ్లను తయారు చేస్తోంది. సుజుకీ కార్పొరేషన్‌తో ఉన్న భాగస్వామ్యంలో భాగంగా గ్లాంజా, రూమియన్ మోడళ్లను సైతం ఉత్పత్తి చేస్తోంది. పూర్తిగా తయారైన వెల్ఫైర్, ఎల్సీ 300 మోడళ్లను దిగుమతి చేసుకుంటోంది. కొన్ని మోడళ్లకు ఎక్కువ కాలం వెయిటింగ్ పీరియడ్ ఉంది. దీంతో మెరుగైన డిమాండ్ కారణంగా భారత్‌లో మూడవ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తోంది. 2023 ప్రారంభంలో కొన్ని మోడళ్ల కోసం వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి ఉత్పత్తి సామర్థ్యాన్ని సుమారు 30 శాతం పెంచడానికి బీదడిలో మూడవ షిఫ్ట్‌ని ప్రారంభించింది. 2023 ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కంపెనీ 1,23,939 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 35 శాతం ఎక్కువ. డిమాండ్ బలంగా ఉంది.. భారత్‌లో పూర్తి ప్లాంట్ సామర్థ్యాన్ని వినియోగిస్తున్నట్టు టయోటా మోటార్ కార్పొరేషన్ బోర్డు సభ్యుడు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యోయిచి మియాజాకి జపాన్ మొబిలిటీ షో సందర్భంగా తెలిపారు. దేశంలో సామర్థ్య పెంపుపై తాజా పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చలు మొదలయ్యాయని వెల్లడించారు. ‘కోవిడ్ తర్వాత భారత ఆటోమొబైల్స్ రంగంలో ముఖ్యంగా పెద్ద కార్లకు డిమాండ్ పెరిగింది. కోవిడ్ తర్వాత ఇతర దేశాలతో పోలిస్తే మార్కెట్ రికవరీ భారత్‌లో చాలా బలంగా ఉంది. కాబట్టి డిమాండ్ కూడా బలంగా ఉందని మేము నమ్ముతున్నాము. మార్కెట్లో పెద్ద కార్ల పట్ల ఆసక్తి క్రమంగా పెరగడం కంపెనీకి మంచి సంకేతం’ అని వివరించారు. భారతీయ కార్ల విపణి చిన్న కార్ల నుండి పెద్ద కార్ల విభాగాలకు మారడం వల్ల మార్కెట్‌ను టయోటా మరింత ఆకర్షణీయంగా మారుస్తుందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. టయోటాకు సమయం ఆసన్నమైందని అన్నారు. -
అమెరికా కంపెనీలకు మహీంద్రా సాయం
న్యూఢిల్లీ: వాహన రంగంలో ఉన్న కంపెనీలకు సాయం చేసేందుకు మహీంద్రా గ్రూప్ ఒక ప్రత్యేక వేదికను యూఎస్‌లో ఏర్పాటు చేసింది. యూఎస్ కంపెనీలు భారత్‌లో తయారీని విస్తరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహీంద్రా గ్రూప్ ఎండీ, సీఈవో అనీష్ షా సోమవారం తెలిపారు. నియంత్రణ, విధానపర అంశాల్లో తమకు అపార అనుభవం ఉందని ఆయన చెప్పారు. అమెరికన్ కంపెనీలు భారత్‌లో తయారీ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు.. సంస్థకు చెందిన నిపుణుల బృందం తయారీ మౌలిక వసతులు, సరఫరా వ్యవస్థ, సాంకేతిక వంటి అంశాల్లో తమ నైపుణ్యాన్ని అందజేస్తారని మహీంద్రా వెల్లడించింది. -
ఎల్లీసియం మేడిన్ ఇండియా ‘ఈవీయం ఈ-స్కూటర్లు’ త్వరలోనే
సాక్షి, ముంబై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆధారిత మెటా4కి చెందిన ఆటో విభాగం ఎల్లీసియం ఆటోమోటివ్స్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు బుధవారం ప్రకటించింది. ‘ఈవీయం’ అనే బ్రాండ్ పేరుతో మూడు మేడ్ ఇన్ ఇండియా ఈ-స్కూటర్లను తీసుకొస్తున్నట్టు వెల్లడించింది. 250 ఏకరాల్లో తెలంగాణలోని జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లోనే వీటిని తయారు చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. భారత ప్రభుత్వ పంచామృత విజన్‌తో ఇ-మొబిలిటీ మిషన్‌లో ఎల్లీసియం ఆటోమోటివ్స్ 100 శాతం భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ వెంచర్‌ను లాంచ్ చేశామని వెల్లడించింది. అలాగే EVeium సొంత టెలిమాటిక్స్ యాప్ అందజేస్తుందని, ఇది డీజీ-లాకర్, సమీప ఛార్జింగ్ స్టేషన్ లొకేషన్, జియో-ఫెన్సింగ్ లాంటి ఫీచర్లను అందిస్తుందని పేర్కొంది. గ్లోబల్ ఇంధన ధరల సంక్షోభం, పర్యావరణ పరిరక్షణ అవగాహనతో దేశీయ మార్కెట్లో మూడు ఈ-స్కూటర్లను పరిచయం చేస్తున్నామని సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య రెడ్డి తెలిపారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు, సైకిళ్లు, ఎలక్ట్రిక్ బైక్‌లతో సహా అత్యుత్తమ EV ఆఫర్లను అందించడానికి పని చేస్తుందన్నారు. భారత ప్రహుత్వ ఫేమ్-II నిబంధనలకనుగుణంగా భారతీయ వినియోగదారుల కోసం సరసమైన ధర, నాణ్యతతో ఈవీలను తీసుకురావాలని భావిస్తున్నట్టు META4 గ్రూప్ సీఈవో ముజమ్మిల్ రియాజ్ అన్నారు. తెలంగాణలో ఈ-వెహికల్స్ తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా స్మార్ట్ గ్రీన్ మొబిలిటీలోవోల్ట్లీ ఎనర్జీ ద్వారా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. 15ఎకరాల సబ్సిడీ భూమిని అందిస్తున్న ఈ ప్లాంట్ కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
ఎంట్రీ, స్పోర్ట్స్ వాహన విభాగాల్లో
బజాజ్ మోటార్‌సైకిల్స్ హవా హైదరాబాద్: ఎంట్రీ, స్పోర్ట్స్ వాహన మార్కెట్ విభాగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు ప్రముఖ దేశీ వాహన తయారీ కంపెనీ బజాజ్ మోటార్‌సైకిల్స్‌ప్రకటించింది. సీటీ-100, ప్లాటినం వంటి బైక్స్ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది మాసాల్లో తమ ఎంట్రీ విభాగం మార్కెట్ వాటా 23 శాతం నుంచి 36 శాతానికి పెరిగిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త అవెంజర్, పల్సర్ ఆర్ఎస్ 200, పల్సర్ ఏఎస్ 200 వంటి తదితర బైక్స్ ఆవిష్కరణ వల్ల నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో కంపెనీ మార్కెట్ వాటా రూ.లక్ష లోపు స్పోర్ట్స్ వాహన విభాగంలోనూ 53 శాతానికి చేరినట్లు పేర్కొంది. ఎంట్రీ, స్పోర్ట్స్ విభాగాల వాటా మొత్తం పరిశ్రమలో 43 శాతంగా ఉందని, ఇందులో తమ కంపెనీ 36 శాతం వాటాతో అగ్రపథంలో దూసుకెళ్తోందని బజాజ్ ఆటో (మోటార్‌సైకిల్స్ బిజినెస్) ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ తెలిపారు. టూవీలర్ మార్కెట్లో ఎంట్రీ, ఎగ్జిక్యూటివ్, స్పోర్ట్స్ అనే మూడు విభాగాలు ఉంటాయి.