Award winners
-
రూట్స్ అఫ్ లైఫ్ ఫోటో గ్యాలరీ
-
పరిష్కార సామర్థ్యం పెంచుకోండి
న్యూఢిల్లీ: సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేలా సామర్థ్యాలు పెంచుకోవాలని బాలలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. ఆయన మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ విజేతలతో సమావేశమయ్యారు. పిల్లల మానసిక ఆరోగ్యం, వారికి ఎదురయ్యే సమస్యలపై చర్చించారు. జీవితంలో ముందుకు వెళ్లడానికి తొలుత చిన్న సమస్యలను పరిష్కరించుకోవడం ప్రారంభించాలని, ఆ పెద్ద సమస్యలను సైతం సులువుగా పరిష్కరించుకొనేలా సామర్థ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా పెంపొందించుకోవాలని సూచించారు. చదరంగం ఆడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. కళలు, సంస్కృతి, పరిశోధనలు, ఆవిష్కరణలు, ఆధ్యాత్మికతను కెరీర్‌గా మార్చుకోవాలని చెప్పారు. బాల పురస్కార్ గ్రహీతల అనుభవాలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. అవార్డు గ్రహీతలు పలు అంశాలపై మోదీ సలహాలు సూచనలు తీసుకున్నారు. బాల పురస్కారాలకు ఈసారి 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మొత్తం 11 మంది ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురు బాలలు, ఐదుగురు బాలికలు ఉన్నారు. బాల పురస్కార్ విజేతలు ఎం.గౌరవీరెడ్డి, కోలగట్ల అలనా మీనాక్షి తదితరుల ఘనతలను ప్రధాని మోదీ ట్విట్టర్లో ప్రశంసించారు. ‘పరీక్షా పే చర్చ’లో 38 లక్షల మంది! ప్రధాని మోదీ ఏటా స్వయంగా పాల్గొని, విద్యార్థులతో సంభాషించే ‘పరీక్షా పే చర్చ’ కోసం ఈ ఏడాది ఏకంగా 38 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. గత ఏడాది కంటే ఈసారి అధికంగా 15 లక్షల మంది పాల్గొనబోతున్నారు. 155 దేశాల నుంచి రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. 27న ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో జరుగనుంది. కొందరు స్టేడియంలో, మిగతావారు ఆన్లైన్లో పాల్గొంటారు. పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనే విషయంలో మోదీ మార్గనిర్దేశం చేస్తారు. -
విధులను పాటించాలి
న్యూడిల్లీ: విధులను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా నవభారత నిర్మాణం జరుగుతుందని, అప్పుడు హక్కులకోసం పోరాడాల్సిన అవసరం ఉండదని ప్రధాని మోదీ యువతకు సందేశమిచ్చారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న యువతను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భిన్నత్వంలో ఏకత్వమే భారత్ గొప్పదనం. భారత్‌లోని ప్రాంతాలుగానీ, ప్రజలుగానీ తాము వివక్షకు గురయ్యామన్న భావన రాకుండా మనమే చూసుకోవాలి. గత 70 ఏళ్లుగా ప్రపంచం ముందు మనం గొప్పగా నిలబడ్డాం. విధులు సక్రమంగా పాటించడం ద్వారా దీన్ని నిలుపుకోగలం. ఇదే గణతంత్ర దినోత్సవ పరేడ్ వెనుక ఉన్న అసలు లక్ష్యం’ అంటూ ప్రధాని మోదీ యువతకు పిలుపునిచ్చారు. రాజ్‌పాత్‌లో జరుగుతున్న కార్యక్రమం భారత శక్తిని ప్రపంచానికి చూపుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. విలువలు, ఆలోచనలు కలిగిన నవభారత్ను నిర్మించేందుకు శ్రమించాలని యువతకు సందేశం ఇచ్చారు. మీ నుంచి స్ఫూర్తి పొందుతాను.. ‘వివిధ రంగాల్లో మీరు సాధించిన విజయాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇంత చిన్న వయసులో మీరు సాధించిన విజయాలు అమోఘం’ అంటూ ప్రధాని మోదీ.. ‘ప్రధానమంత్రి బాల్ పురస్కార్’ అవార్డు పొందిన పిల్లలతో ముచ్చటించారు. శుక్రవారం మోదీ తన నివాసంలో అవార్డు పొందిన పిల్లలను కలిశారు. ‘మీరు చేసిన పనుల గురించి వింటున్న సమయంలో, మీతో మాట్లాడుతున్న సమయంలో.. నేను కూడా స్ఫూర్తిని, శక్తిని పొందుతాను’ అని వ్యాఖ్యానించారు. -
‘అవతరణ’ అవార్డు గ్రహీతలు
22 రంగాల్లో 30 మందికి.. నేడు మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీద ప్రదానం నల్లగొండ తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణ ఉత్సవాల్లో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని మంగళవారం జిల్లాకేంద్రంలో జరగనున్న కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి ఘనంగా సత్కరించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 22 రంగాల్లో నిష్ణాతులైన 30 మంది ప్రతిభావంతులు, సంస్థలను ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలో పరేడ్ మైదానం లో నిర్వహించే అవతరణ వేడుకల్లో వారిని సత్కరించనున్నారు. అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.51, 116లు నగదు బహుమతి అందజేస్తారు. ఉత్తమ రైతు : గాజుల సత్యనారాయణ, భువనగిరి ఉత్తమ ఉపాధ్యాయులు : సురసుర పరుశురాం, గుండెపురి : టి. పరమేష్, కతాల్‌గూడ, నల్లగొండ ఉత్తమ అంగన్ వాడీ కార్యకర్త : జి.పద్మావతి, పాల్వాయి, చింతపల్లి మం. ఉత్తమ సామాజిక కార్యకర్త : కె.సుభాష్, మర్రిగూడ మం. ఉత్తమ వైద్యుడు : దామెర యాదయ్య, నల్లగొండ ఉత్తమ ఎన్జీవో : లెప్రసీ హెల్త్ సెంటర్, నల్లగొండ ఉత్తమ క్రీడాకారిణి : బి.మనెమ్మ, వాలీబాల్, కర్మెల చెరువు, మిర్యాలగూడ ఉత్తమ సాహితీ వేత్త : కూరెళ్ల విఠలాచార్యలు, రామన్నపేట ఉత్తమ కళాకారుడు : కూరెళ్ల శ్రీనివాస్, చింతపల్లి, పామర్తి శంకర్, మిర్యాలగూడ, కొత్త వెంకన్న, సూర్యాపేట, వేముల నరేష్, ఉట్కూరు, బొమ్మగాని మల్లేషం, ఆజీంపేట, మోత్కూరు మండలం ఉత్తమ వేద పండితుడు : గుండ్లపల్లి వెంకటసూర్యానారాయణ,గణాపాటి, యాదిగిరిగుట్ట ఉత్తమ అలీం : మౌలానా ఎహాసానోద్దీన్, నల్లగొండ ఉత్తమ అర్చకుడు : ఎన్సీహెచ్ వేణుగోపాలాచార్యులు, సూర్యాపేట ఉత్తమ పాస్టర్ : బ్రదర్ ప్రతి ప్రియరాజ్ డేవిడ్, నల్లగొండ ఉత్తమ జానపద కళాకారుడు : భిక్షు నాయక్, భువనగిరి ఉత్తమ ఫొటోజర్నలిస్టు : శ్రీరంగం వెంకన్న, సాక్షి దినపత్రిక, అర్వపల్లి ఉత్తమ జర్నలిస్టు : దోస్త్ మహ్మద్, మున్సిఫ్, నల్లగొండ ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగి : బి. రాఘవేంద్రరావు, ఎంపీడీఓ చిట్యాల. ఉత్తమ మండలం : చిలుకూరు ఉత్తమ మున్సిపాలిటీ : సూర్యాపేట ఉత్తమ గ్రామ పంచాయతీ : ఎం.యెడవెల్లి, నార్కట్‌పల్లి ఇతర రంగాలు ఉత్తమ న్యాయవాది : జి.జవహర్లాల్, నల్లగొండ ఉత్తమ క్రీడాకారుడు : డి. క్రాంతి కుమార్రె డ్డి, పుట్టపాక,సంస్థాన్నారాయణ్పూర్ మం. ఉత్తమ కళాకారిణి : మేడి ఇందిర, నకిరేకల్ ఉత్తమ టెక్నికల్ అధికారి : శ్రీనివాస్, డీఇ ఎలక్ట్రికల్, సూర్యాపేట ఉత్తమ పోలీస్ : పి. పరమేష్ (2474), ట్రాఫిక్ కానిస్టేబుల్, సూర్యాపేట