22 రంగాల్లో 30 మందికి..
నేడు మంత్రి జగదీశ్‌రెడ్డి చేతుల మీద ప్రదానం
నల్లగొండ
తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణ ఉత్సవాల్లో భాగంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని మంగళవారం జిల్లాకేంద్రంలో జరగనున్న కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి ఘనంగా సత్కరించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 22 రంగాల్లో నిష్ణాతులైన 30 మంది ప్రతిభావంతులు, సంస్థలను ఎంపిక చేశారు. జిల్లా కేంద్రంలో పరేడ్ మైదానం లో నిర్వహించే అవతరణ వేడుకల్లో వారిని సత్కరించనున్నారు. అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.51, 116లు నగదు బహుమతి అందజేస్తారు.
ఉత్తమ రైతు : గాజుల సత్యనారాయణ, భువనగిరి
ఉత్తమ ఉపాధ్యాయులు : సురసుర పరుశురాం, గుండెపురి
: టి. పరమేష్, కతాల్‌గూడ, నల్లగొండ
ఉత్తమ అంగన్ వాడీ కార్యకర్త : జి.పద్మావతి, పాల్వాయి, చింతపల్లి మం.
ఉత్తమ సామాజిక కార్యకర్త : కె.సుభాష్, మర్రిగూడ మం.
ఉత్తమ వైద్యుడు : దామెర యాదయ్య,
నల్లగొండ
ఉత్తమ ఎన్‌జీవో : లెప్రసీ హెల్త్ సెంటర్,
నల్లగొండ
ఉత్తమ క్రీడాకారిణి : బి.మనెమ్మ, వాలీబాల్, కర్మెల చెరువు, మిర్యాలగూడ
ఉత్తమ సాహితీ వేత్త : కూరెళ్ల విఠలాచార్యలు, రామన్నపేట
ఉత్తమ కళాకారుడు : కూరెళ్ల శ్రీనివాస్, చింతపల్లి, పామర్తి శంకర్, మిర్యాలగూడ, కొత్త వెంకన్న, సూర్యాపేట, వేముల నరేష్, ఉట్కూరు, బొమ్మగాని మల్లేషం, ఆజీంపేట, మోత్కూరు మండలం
ఉత్తమ వేద పండితుడు : గుండ్లపల్లి వెంకటసూర్యానారాయణ,గణాపాటి, యాదిగిరిగుట్ట
ఉత్తమ అలీం : మౌలానా ఎహాసానోద్దీన్, నల్లగొండ
ఉత్తమ అర్చకుడు : ఎన్‌సీహెచ్ వేణుగోపాలాచార్యులు, సూర్యాపేట
ఉత్తమ పాస్టర్ : బ్రదర్ ప్రతి ప్రియరాజ్ డేవిడ్, నల్లగొండ
ఉత్తమ జానపద కళాకారుడు : భిక్షు నాయక్, భువనగిరి
ఉత్తమ ఫొటోజర్నలిస్టు : శ్రీరంగం వెంకన్న, సాక్షి దినపత్రిక, అర్వపల్లి
ఉత్తమ జర్నలిస్టు : దోస్త్ మహ్మద్, మున్సిఫ్, నల్లగొండ
ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగి : బి. రాఘవేంద్రరావు, ఎంపీడీఓ చిట్యాల.
ఉత్తమ మండలం : చిలుకూరు
ఉత్తమ మున్సిపాలిటీ : సూర్యాపేట
ఉత్తమ గ్రామ పంచాయతీ : ఎం.యెడవెల్లి, నార్కట్‌పల్లి
ఇతర రంగాలు
ఉత్తమ న్యాయవాది : జి.జవహర్‌లాల్,
నల్లగొండ
ఉత్తమ క్రీడాకారుడు : డి. క్రాంతి కుమార్‌రె డ్డి, పుట్టపాక,సంస్థాన్‌నారాయణ్‌పూర్ మం.
ఉత్తమ కళాకారిణి : మేడి ఇందిర, నకిరేకల్
ఉత్తమ టెక్నికల్ అధికారి : శ్రీనివాస్, డీఇ ఎలక్ట్రికల్, సూర్యాపేట
ఉత్తమ పోలీస్ : పి. పరమేష్ (2474), ట్రాఫిక్ కానిస్టేబుల్, సూర్యాపేట