awareness fail
-
హృదయమా.. కుశలమా!
సాక్షి, లబ్బీపేట (విజయవాడ) : మూడు దశాబ్ధాల కిందట 55–60 ఏళ్ల వయస్సు వారిలో గుండెపోటు రావడం చూసే వాళ్లం. ఇప్పుడు 35–40 సంవత్సరాల వయస్సు వాళ్లు గుండెపోటుకు గురవుతున్నారు. అంటే 15 ఏళ్ల ముందే గుండె జబ్బులకు గురవుతున్నారు. అందుకు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు, జన్యుపరమైన లక్షణాలు ప్రధాన కారణాలని సీనియర్ కార్డియాలజిస్టులు చెబుతున్న మాట. గుండెజబ్బులపై సరైన అవగాహనతోనే నివారించగలమని వారు సూచిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో గణాంకాలు ఇలా (ఏడాదిలో అంచనా) ⇒ 14 వేల మంది రక్తపోటు కారణంగా.. ⇒ 12 వేల మందిమధుమేహం కారణంగా.. ⇒ 40 వేలు గుండె జబ్బుల బారిన పడుతున్న వారు ⇒ 3 వేలుగుండెపోటు మరణాలు ⇒ 10 వేల మంది గుండెపోటుకు గురవుతున్నవారు గుండెపోటుపై అవగాహన అవసరం గుండెపోటు విషయంలో సరైన అవగాహన లేక పోవడంతో అధిక శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటుకు గురైన వారు గ్యాస్‌ట్రబుల్‌గా భావించి సకాలంలో వైద్యం చేయించుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈసీజీ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో గుండెపోటును సకాలంలో నిర్ధారించడం కష్టతరంగా మారుతోంది. పట్టణ ప్రాంత ప్రజలు సైతం గుండెజబ్బుల విషయంలో అశ్రద్ధ చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► రక్తపోటుకు గురికాకుండా ఉండేందుకు ఆహారంలో ఉప్పు తగ్గించి తీసుకోవాలి. ఒకరు రోజుకు 2 గ్రాములకు మించి తీసుకోరాదు. అయితే ప్రస్తుతం 5 నుంచి 8 గ్రాములు వాడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. వారు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంది. ► ప్రతి ఒక్కరూ అఆఇ (ఏబీసీ) మెయిన్‌టెన్ చేయాలి. అ హెచ్‌బీఎ1సీ 6.5 శాతానికి మించకూడదు. ఆ బీపీ 130/80, చెడు కొలస్ట్రాల్ 70 కన్నా మించకుండా చూసుకోవాలి. 1 శాతం హెచ్‌బీఏ1సీని అదుపుచేసుకోవడం ద్వారా హార్ట్ ఎటాక్ అవకాశాలు 14 శాతం తగ్గించుకోవచ్చు. ► అధిక క్యాలరీలు కలిగిన ఆహార పదార్థాలు, కొవ్వుశాతం అధికంగా ఉండే ఆహారం, నెయ్యి, నూనెలు అధికంగా ఉన్నవి తీసుకోకూడదు. పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ► మధుమేహం, రక్తపోటు ఉన్న వారు ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా హార్ట్ చెకప్ చేయించుకోవాలి. ► రక్తపోటు 120/80 నార్మల్ కాగా, 120–139, 80–89 ఉంటే రక్తపోటు వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. ► రోజుకు 45 నిమిషాలు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఛాతీలో నొప్పిని నిర్లక్ష్యం చేయరాదు ఛాతీలో నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి ఈసీజీ తీయించుకోవడం అవసరం. నొప్పి వచ్చినప్పుడు అశ్రద్ధ చేయడం ద్వారా ఒక్కో సమయంలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం చిన్న వయస్సులోనే గుండెజబ్బుల బారిన పడుతున్నారు. జబ్బు వచ్చిన తర్వాత చికిత్స పొందడం కన్నా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వంటివి చేయాలి. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు తరచూ గుండె పరీక్షలు చేయించుకుంటే మంచిది. సీటీ కార్డియాక్ యాంజియోతో ఐదేళ్ల ముందుగానే గుండెపోటు నిర్ధారించవచ్చు. – డాక్టర్ పర్వతనేని నాగ శ్రీహరిత, సీనియర్ కార్డియాలజిస్టు -
అందని చంద్రన్న పెళ్లికానుక
లక్కవరపుకోట : సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెడుతుందే తప్ప ఆచరణలో మాత్రం విఫలమవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లలో 114 పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఇందులో చాలా పథకాల పేర్లు అటు అధికారులకు గాని ఇటు పాలకులకు గాని తెలియవంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన పథకాల్లో కనీసం 20 శాతం కూడా అమలు కాలేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. పథకాలపై ప్రజలను చైతన్యపరచాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సంక్షేమ పథకాలు అర్హులకు అందని ద్రాక్షగా మిగులుతోంది. ఈ సరసన ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టిన ‘చంద్రన్న పెళ్లికానుక’ చేరింది. చంద్రబాబునాయుడు ఇప్పటివరకు తన బూటకపు హామీలతో కర్షక, కార్మిక, ఉద్యోగస్తులు, నిరుద్యోగులను మోసం చేశారు. ఇప్పుడు నవ వధువులను సైతం మోసం చేసేందుకు సిద్ధపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. దారిద్య్రరేఖకు దిగువున ఉన్న యువతుల కుటుంబాల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం చంద్రన్న పెళ్లికానుక అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం నిర్వహణకు బడ్జెట్లో వంద కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ పథకాన్ని ఏప్రిల్ 20వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. ఎంతో ప్రచార ఆర్భాటలతో తీసుకొచ్చిన ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. దీనికి తోడు ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు విధించడంతో లబ్ధిదారులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు వెనకడుగువేస్తున్నారు. 1193 దరఖాస్తులు పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో గల 34 మండలాల నుంచి 1193 మంది వధువులు దరఖాస్తు చేసుకున్నారు. గరివిడి మండలం నుంచి అత్యధికంగా 56 మంది దరఖాస్తు చేసుకోగా.. అత్యల్పంగా గుమ్మలక్ష్మీపురం నుంచి కేవలం ముగ్గురు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ప్రోత్సాహకంలో 20 శాతం సొమ్మును ముందుగా వధువు బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని.. మిగిలిన మొత్తాని పెళ్లి అయిన తర్వాత అన్ని ధ్రువపత్రాలు సమర్పిస్తే బ్యాంక్ ఖాతకు జమ చేస్తామని అధికారులు ప్రకటించారు. అయితే ఇంతవరకు లబ్ధిదారులెవ్వరికీ ఒక్క పైసా కూడా మంజూరు కాలేదు. దీంతో పథకం అమలు తీరుపై నూతన వధూవరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హంగు ఆర్భాటాలే... ఎంతో అట్టహాసంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ముఖ్య లక్ష్యం.. వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాల్లో బాల్యవివాహాలను నిరోధిచడం. ఆయా కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లుల్లు భారం కాకూడదనే ఉద్దేశంతో పాటు పెళ్లైన వారు తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేశారు. ఇందులో భాగంగా కులాంతర వివాహం చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు రూ. 75వేలు.. తమ కులంలోనే వివాహ చేసుకునే ఎస్సీలకు రూ. 40వేలు, ఎస్టీలకు రూ. 50 వేలు అందిస్తామని పథకంలో పేర్కొన్నారు. అలాగే కులాంతర వివాహాలు చేసుకునే బీసీలకు రూ. 50 వేలు..తమ కులస్తులనే వివాహం చేసుకుంటే రూ. 35 వేలు అందజేస్తారు. దుల్హన్ పథకం కింద మైనారిటీలకు రూ. 50 వేలు, దివ్యాంగులకు రూ. లక్ష, ఓసీలకు రూ. 20 వేలు చొప్పున అందజేస్తారు. అవగాహన కరువు చంద్రన్న పెళ్లికానుక పథకంపై గ్రామీణులకు అవగాహన కరువైంది. అబ్బాయికి 21 సంవత్సరాలు.. అమ్మాయికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే వరుడికి తొలివివాహం, వధువుకి రెండో వివాహం (వితంతువు) అయినా ఈ పథకానికి అర్హులే. ముఖ్యంగా రెండో సంబంధం మహిళకు తొలి సంబంధం వరుడు లభించాలని నిబంధన విధించారు. ఇది సాధ్యమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. వివాహం చేసుకునే ఇరుకుటుంబాలు తెలుపు రేషన్‌కార్డు కలిగి ఉండి, ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలి. అలాగే ఇరువురూ ఒకే రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. వివాహానికి 15 రోజుల ముందు మీసేవా కేంద్రాల్లో గాని మండల సమైక్య ద్వారా గాని 1100 కాల్ సెంటర్లో గాని పేర్లు నమోదు చేసుకోవాలి. పైసా రాలేదు.. నాకు మే రెండో తేదీన వివాహం జరిగింది. ఇప్పటివరకు ఒక్క పైసా కూడా మంజూరు కాలేదు. అధికారులు ఒక అభినందన పత్రం మాత్రమే ఇచ్చారు. అధికారులను అడిగితే ఇదుగో వస్తాయి.. అదుగో వస్తాయని చెబుతున్నారు. – నెక్కల దీపిక, మార్లాపల్లి గ్రామం,లక్కవరపుకోట మండలం ఆన్లైన్ చేసాం మాకు వచ్చిన దరఖాస్తులన్నీ ఆన్లైన్లో పొందుపరిచాం. త్వరలోనే లబ్ధిదారుల ఖాతాలకు సొమ్ము జమవుతుంది. అలాగే ఈ పథకంపై గ్రామాల్లో చంద్రన్న పెళ్లికానుక మిత్రల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. – రొంగళి శ్రీనివాసరావు, వెలుగు ఏపీఎం, లక్కవరపుకోట మండలం. -
మద్దతు ధరపై ప్రచారం శూన్యం !
ఖరీఫ్ ఉత్పత్తులకు కనీస మద్ధతు ధరలు – వేరుశనగ క్వింటా రూ.4,220, పత్తి రూ.4,100 – ప్రచారం కల్పించని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్–2016లో పండించిన వ్యవసాయోత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలు (మినిమం సపోర్ట్ ప్రైసెస్–ఎంఎస్పీ) పంటల వారీగా ఇది వరకే ప్రకటించారు. వేరుశనగ, కంది, పత్తి, మొక్కజొన్న, పెసలుతో పాటు కొద్దిగా చిరుధాన్యాలకు సంబంధించిన పంటలు జిల్లాలో అధికంగా పండిస్తున్న విషయం తెలిసిందే. పంట పెట్టుబడులు, దిగుబడుల ఆధారంగా ఏటా ఎంఎస్పీ ప్రకటిస్తున్నారు. గతేడాదితో పోల్చిచూస్తే ఈ సారి మద్దతు ధరలు స్వల్పంగా పెరిగాయి. వేరుశనగ పంటకు మద్దతు ధర రూ.4,220గా నిర్ణయించారు. గతేడాదితో పోల్చితే క్వింటాపై రూ.250 పెంచారు. ఇందులో రూ.100 బోనస్‌గా చేర్చారు. అలాగే కందికి కూడా బోనస్ కింద 425 ప్రకటించారు. ప్రచారం నిల్ : అయితే మద్దతు ధరల (ఎంఎస్పీ)పై మార్కెటింగ్, వ్యవసాయశాఖలు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో అరకొరగా పండిన వేరుశనగను తక్కువ ధరకే అమ్ముకునే పరిస్థితి నెలకొంది. దళారులు, వ్యాపారులు ఇష్టారాజ్యంగా రైతుల్ని మోసం చేస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 20 శాతం పంట దిగుబడులు సాధించిన రైతులు పెట్టుబడులు కూడా దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది. వచ్చిన పంటకు సరైన ధరకు అమ్ముకుందామనుకున్నా కొనేవారు కరువయ్యే పరిస్థితి కల్పించారు. నాణ్యత లేదనే సాకుతో క్వింటా రూ.3,800 నుంచి రూ.4 వేల లోపు అమ్మేస్తున్నారు. అందులోనూ తూకాల్లో మోసం జరుగుతుండటంతో రైతులు నష్టపోతున్నారు. బహిరంగ మార్కెట్లో ఎంఎస్పీ కన్నా ధరలు తక్కువగా ఉన్నపుడు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ.. జిల్లాలో మొక్కజొన్న, రాగులు, సజ్జలు, కొర్రలకు మాత్రమే నాలుగైదు చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేసి అరకొరగా సేకరిస్తోంది. పంటల వారీగా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఇలా ఉన్నాయి. పంట ఈ ఏడాది ధరలు గతేడాది ధర –––––––––––––––––––––––––––––––––– వేరుశనగ 4,220 4,030 వరి (ఏ–గ్రేడ్) 1,510 1,450 వరి (సాధారణ రకం) 1,470 1,410 మొక్కజొన్న 1,365 1,325 ప్రత్తి –మీడియంరకం 3,860 3,800 ప్రత్తి– పొడవు రకం 4,160 4,100 మినుములు 5,050 4,625 పెసలు 5,000 4,850 కందులు 5,050 4,625 జొన్నలు (హైబ్రీడ్) 1,625 1,570 జొన్నలు (మాల్దండి) 1,650 1,590 రాగులు 1,725 1,650 సజ్జలు 1,330 1,275 సోయాబీన్ 2,775 2,600 పొద్దుతిరుగుడు 3,950 3,800 నువ్వులు 4,700 5,000