Ayyannapatradu
-
డ్రైవర్ లేని కారులా ‘జీరో అవర్’
సాక్షి, అమరావతి: ‘జీరో అవర్.. డ్రైవర్‌లేని కారులా ఉంది.. సభ్యులు ప్రస్తావించే సమస్యలు ఎవరు రాసుకుంటున్నారో... ఎవరు చర్యలు తీసుకుంటున్నారో తెలియడం లేదు..’ అని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌ను ఉద్దేశించి రవికుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చను వేడెక్కించాయి. దీనిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందిస్తూ నిండు సభలో అసత్యాలు మాట్లాడొద్దని రవికుమార్‌కు హితవు పలికారు. కొండవీటి వాగుపై బ్రిడ్జి కట్టాలి అమరావతికి కొండవీటి వాగు పెద్ద సమస్యగా మారింది. 2014–19 మధ్య దీనిపై బ్రిడ్జి మంజూరు చేశారు. కానీ కట్టలేదు. ఈ వాగు పొంగితే రాకపోకలు నిలిచిపోతున్నాయి. తక్షణమే బ్రిడ్జి కట్టాలి. అలాగే కోటేరు వాగుపై కూడా బ్రిడ్జి నిరి్మంచేలా చర్యలు చేపట్టాలి. – తెనాలి శ్రావణ్‌కుమార్, తాడికొండ ఎమ్మెల్యే ఏపీఎస్పీ పోలీసులకు పదోన్నతుల్లేవ్ ఏపీఎస్పీ పోలీసులు ఏళ్ల తరబడి పదోన్నతులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. సివిల్ పోలీసులుగా కన్వర్షన్ చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి కన్వర్షన్ అయినా ఇవ్వండి... లేకుంటే పదోన్నతులు, ఇంక్రిమెంట్లయినా ఇప్పించండి. – పెన్మెత్స విష్ణుకుమార్‌రాజు, ఎమ్మెల్యే, విశాఖ ఉత్తరం తుంగభద్ర 33 గేట్లు మార్చాలి 75 ఏళ్ల చరిత్రగల తుంగభద్ర ఈ ఏడాది నీటితో కళకళలాడుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తుంగభద్ర డ్యాం 33 గేట్లు మార్చాలని సిఫారసు చేసింది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఖర్చును ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు భరించాలి. – కాలవ శ్రీనివాసులు, రాయదుర్గం ఎమ్మెల్యే లో వోల్టేజీ సమస్య పరిష్కరించండి విద్యుత్ లో వోల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తగిన చర్యలు తీసుకుని లోవోల్టేజీ సమస్య పరిష్కరించాలి. – పూసపాటి అదితి, ఎమ్మెల్యే, విజయనగరం -
సర్వేచేసి పింఛన్లు తొలగిస్తాం
టెక్కలి : ‘గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారు. ఇప్పుడు అధికారులతో సర్వే చేయించి అనర్హుల పింఛన్లు తొలగిస్తాం’.. అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో శనివారం గ్రామ సచివాలయం, రైతుసేవా కేంద్రం, వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవంతో పాటు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నీ ఇవ్వాలంటే తమ దగ్గర అక్షయపాత్ర లేదని.. చెట్లకు డబ్బులు పండడంలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నంగా ఉందని.. సొంత డబ్బులతో అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రావివలస ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అనంతరం టెక్కలి జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అర్హత లేని వారి పెన్షన్లు తొలగిస్తాం :స్పీకర్ అయ్యన్నపాత్రుడునర్సీపట్నం: అర్హత లేని వారి పెన్షన్లు తొలగిస్తామని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మండలం, ధర్మసాగరంలో శనివారం ఆయన వృద్ధాప్య, వితంతు పింఛను సొమ్ము స్వయంగా అందజేశారు. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేపట్టామని తెలిపారు. అక్టోబర్2 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని పేర్కొన్నారు. -
స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు?
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి అసెంబ్లీ స్పీకర్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. పార్టీలో సీనియర్ నాయకుడు అవడంతోపాటు గతంలో పలుసార్లు మంత్రిగా పని చేసిన అయ్యన్నకు మంత్రివర్గంలో కచ్చితంగా చోటు దక్కుతుందని అంతా భావించారు. అయితే సీఎం చంద్రబాబు ఆయనకు పదవి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం ఆయన చంద్రబాబును కలిశారు. ఈ సమయంలో స్పీకర్ పదవి ఇస్తానని చంద్రబాబు ఆయనకు చెప్పినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. టీడీపీ నేతలకు గవర్నర్ పదవులు? ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఉండడంతో ఒకటి, రెండు గవర్నర్ పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం. టీడీపీలో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడి పేర్లను గవర్నర్ పదవుల కోసం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యనమల రామకృష్ణుడు శుక్రవారం చంద్రబాబును కలవగా ఈ విషయం చెప్పి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి పదవి ఆశించిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను శాసన సభలో చీఫ్ విప్ పదవికి పరిశీలిస్తున్నట్లు తెలిసింది.ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నీటి పారుదల శాఖపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్ష చేశారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన సమీక్షలో పోలవరం సహా వివిధ ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో చర్చించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని, ఆ తర్వాత మంత్రివర్గ , అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆరుద్ర కుమార్తె వైద్యానికి రూ.5 లక్షలు! శుక్రవారం సచివాలయంలో కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ తన కుమార్తెతో కలిసి సీఎం చంద్రబాబును కలిసి న్యాయం చేయాలని కోరింది. స్పందించిన చంద్రబాబు ఆమె కుమార్తె ఆరోగ్య ఖర్చుల కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం, ప్రతి నెలా రూ.10 వేల పింఛను ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. -
వేలు చూపించి అయ్యన్న భార్య బెదిరింపులు
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా సాగింది. వైఎస్సార్సీపీ సభ్యులపైకి టీడీపీ సభ్యులు దాడికి దిగారు. వైఎస్సార్సీపీ సభ్యులపై అయ్యన్న సతీమణి పద్మావతి, కుమారుడు రాజేష్ బెదిరింపులకు దిగారు. వైఎస్సార్సీపీ సభ్యుల పొడియం వైపు వెళ్లి టీడీపీ కౌన్సిలర్లు దౌర్జన్యం చేశారు. వేలు చూపిస్తూ.. అయ్యన్న సతీమణి పద్మావతి బెదిరించారు. వైఎస్సార్సీపీ సభ్యులపైకి కుమారుడు రాజేష్ దూసుకెళ్లాడు. దౌర్జన్యంగా కౌన్సిల్ సమావేశంలోకి టీడీపీ కార్యకర్తలు, నాయకులు ప్రవేశించారు. -
బాబుపై మంట..అయ్యన్న షాకుల మీద షాకులు
-
సీనియర్ల మౌనం.. సందేహం!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కొందరు ఎన్నికల సమయంలో స్తబ్దుగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. కీలకంగా పని చేయాల్సిన తరుణంలో ముఖం చాటేయడం, పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనకపోవడంతో టీడీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు తదితరులు అధిష్టానం తీరుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వారు పార్టీ వీడే ఆస్కారమూ ఉందనే వాదన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పూర్తి దూరంగా పుల్లారావు టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఆ పార్టీ ముఖ్యనేత ప్రత్తిపాటి పుల్లారావు కొద్దికాలంగా పార్టీపై అసంతృప్తితో బయటకు రావడంలేదు. ఆయన ఇన్చార్జిగా ఉన్న చిలకలూరిపేట సీటును వేరే వారికి ఇచ్చేందుకు యత్నించడంతో ఆయన అడ్డుకున్నారు. ఆ తర్వాత అడపాదడపా పార్టీ సమావేశాల్లో పాల్గొన్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా సైలెంట్ అయ్యారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయానికీ రావడంలేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీపైనా స్పష్టత లేదు. గతంలో ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. పరపతి తగ్గిన యరపతినేని! పల్నాడుకు చెందిన మరో కీలక నేత యరపతినేని శ్రీనివాసరావుకు పార్టీలో పరపతి పూర్తిగా తగ్గిందని సమాచారం. ఫలితంగా పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్నారని తెలుస్తోంది. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించడంలేదు. తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గురజాల నుంచి పోటీ చేస్తారో లేదో అనే సందిగ్ధం నెలకొంది. అయ్యో.. ‘చింత’కాయల ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అప్పుడప్పుడు మీడియాలో మాట్లాడుతున్నా పార్టీ వ్యవహారాల్లో గతంలో ఉన్నంత చురుగ్గా లేరని చర్చ జరుగుతోంది. ఆయన కుమారుడు విజయ్ కూడా ఇప్పుడు అంత క్రియాశీలకంగా లేరని సమాచారం. గతంలో టీడీపీ సోషల్ మీడియా వింగ్‌కు ఇన్చార్జిగా ఉన్న విజయ్ను తప్పించి ఆ బాధ్యతలను పయ్యావుల కేశవ్‌కు అప్పగించారు. అప్పటి నుంచి టీడీపీకి, అయ్యన్న కుటుంబానికి దూరం పెరిగినట్లు తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా వారికి నచ్చడంలేదని చెబుతున్నారు. లోకేశ్ తీరే కారణమా..? ఇలా సీనియర్లంతా పార్టీపై అసంతృప్తితో మౌనంగా ఉండడానికి చినబాబు లోకేశ్ తీరే కారణంగా తెలుస్తోంది. ఆయన సీనియర్లను దూరం పెట్టడంతోపాటు వారికి వ్యతిరేకంగా జూనియర్లను ఎగదోయడం అసంతృప్తి జ్వాలలను పెంచిందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రత్తిపాటి, యరపతినేని తదితర సీనియర్ నేతలు పార్టీని వీడే ఆస్కారం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. లోలోన రగులుతున్న మరింత మంది మరింత మంది సీనియర్లు లోకేశ్ తీరు కారణంగా లోలోన రగిలిపోతున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన దేవినేని ఉమామహేశ్వరరావు అప్పుడప్పుడూ మీడియాలో ఘీంకరించడం తప్ప నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉండడం లేదు. ఆయన్ను పార్టీ క్యాడర్ పట్టించుకోవడంలేదు. అసమ్మతి పెరిగిపోవడంతో ఈసారి ఆయనకు సీటు లేదని లోకేశ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో ఆయన మిన్నకుండిపోయారు. ఏలూరు జిల్లాలో కీలక నేత చింతమనేని ప్రభాకర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నిమ్మకాయల చినరాజప్ప, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కేఈ ప్రభాకర్ వంటి నేతలూ చురుగ్గా ఉండడంలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడూ మొక్కుబడిగానే వ్యవహరిస్తున్నట్టు సమాచారం. లోకేష్ కోసం ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడమే కాకుండా తరచూ మీడియా సమావేశాలు కూడా నిర్వహించనీయడం లేదని తెలుస్తోంది. అందుకే ఆయన పత్రికా ప్రకటనలతో అచ్చెన్న సరిపెట్టుకుంటున్నారు. పేరుకు అధ్యక్షుడైనా లోకేష్ ఆయన్ను అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదని లోలోపల ఆవేదన చెందుతున్నారని సమాచారం. ఇంకా చాలామంది సీనియర్లు ఇలాగే స్తబ్దుగా ఉండడంతో పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకోకపోవడం, లోకేశ్ వ్యవహార శైలితో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
‘అయ్యన్న పాత్రుడితో అలా మాట్లాడించింది బాబే’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు గురించి అయ్యన్న పాత్రుడితో మాట్లాడించింది చంద్రబాబు నాయుడే అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య ఆరోపించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మరో 30 ఏళ్లు వైఎస్సార్సీపీనే అధికారంలో ఉంటుందని చంద్రబాబుకు అర్థమయ్యింది. అందుకే అయ్యన్న పాత్రుడి ద్వారా టీడీపీ.. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తుందని చెప్పించారన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యింది.. అలానే ఏపీలో కూడా త్వరలోనే టీడీపీ ఖాళీ అవుతుందని ఆయన జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 100 రోజుల పాలనలో చంద్రబాబు వంద అబద్ధాలు.. 101 కుట్రలు చేశారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగిన మాట వాస్తవమే ఐతే.. నిజంగానే 8మందిని హత్య చేస్తే.. ఎందుకు మీడియాలో రాలేదు.. ఎందుకు పోలీస్ రికార్డుల్లోకి ఎక్కలేదని ఆయన ప్రశ్నించారు. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న గొడవలను తన రాజకీయ ప్రయోజనాల కోసం బాబు పెద్దవిగా చూపుతూ రాద్ధాంతం చేస్తున్నారని రామచంద్రయ్య మండి పడ్డారు. పార్టీ కార్యక్రమాలకు ఎవరూ రాకపోవడంతో చంద్రబాబు డబ్బులిచ్చి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని రామచంద్రయ్య ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్ట్‌లను తీసుకొచ్చి జగన్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం పాలనలో ప్రభుత్వ అధికారుల మీద టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు దాడి చేస్తే బాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కోడెల అరాచకాలపై సిట్ ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే.. చంద్రబాబు ఎందుకు మాట్లాడలేక పోతున్నారని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఆంబోతుల్లా తయారై రాష్ట్రాన్ని దోచుకున్నారని మండి పడ్డారు. చంద్రబాబుకు నచ్చిన 10 గ్రామాలను ఎంచుకుని.. జన్మభూమి కమిటీల వలన జరిగిన అన్యాయాలపై.. జగన్ ప్రభుత్వం వలన జరిగిన మేలుపై చర్చ పెడదాం. అందుకు బాబు సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. జగన్ సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎడముఖం పెడముఖం
బాబు సమక్షంలోనూ మారని మంత్రుల తీరు సీఎం పర్యటనలోనూ కొనసాగిన విభేదాలు సాక్షి, విశాఖపట్నం : జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రడు,గంటాశ్రీనివాసరావుల విభేదాలు సాక్షాత్తు సీఎం చంద్రబాబు పర్యటనలోనూ బయటపడ్డాయి. కలిసి పనిచేసుకోవాలని గతంలో చంద్రబాబు వీరిద్దరికి హితవు పలికినా.. తమ పద్ధతి ఇంతేనని చాటుకుంటున్నారు. సీఎం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న దగ్గర నుంచి తొలిరోజు పర్యటన ముగిసేవరకు అక్కడక్కడా చిన్న పలకరింపు మినహా అసలు మాట్లాడుకోలేదు. చివరకు ప్రసంగించే వాహనంపైకి బాబు ఎక్కి మాట్లాడుతున్నా వెనుక ఇద్దరూ దూరందూరంగా నిల్చున్నారు. ఆ తర్వాత గంధవరంలో అయ్యనపాత్రుడు కాన్వాయ్‌ను వదిలి చోడవరం బహిరంగ సభ వద్దకు ముందుగానే వెళ్లిపోయారు. చాలామంది ప్రజాప్రతినిధులు కలిసి భోజనం చేయగా, వీరు మాత్రం విడివిడిగా తమ పని కానిచ్చారు. చోడవరం బహిరంగ సభ వేదికపైనా ఇద్దరూ వేర్వేరుగా కూర్చున్నారు. గంటా,వ్యవసాయ మంత్రి పుల్లారావు పక్కపక్కన కూర్చుని ఇద్దరూ అదేపనిగా మాట్లాడుకుంటే అయ్యన్న మౌనంగా కూర్చున్నారు. కనీసం బాబు సమక్షంలోనూ పలకరించుకునే ప్రయత్నం చేయలేదు. ఇలా ఇద్దరి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వాస్తవానికి సీఎం జిల్లా పర్యటన తొలుత ఖరారైనప్పుడు అధికారులు ఇద్దరు మంత్రులను సమీక్షకు ఆహ్వానించారు. దీనికి అయ్యన్న ముందుహాజరవ్వగా, గంటా ఆలస్యంగా వచ్చారు. దీంతో అయ్యన్న గంటాను ఉద్దేశించి ఎంత సేపు వెయిట్ చేయించావేంటి అని ఆగ్రహించారు. దీనికి గంటా కూడా గతంలో నువ్వుకూడా అలాగే చేశావు కదా అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు అనకాపల్లిలో రాత్రి బస విషయంలోనూ ఇద్దరి మధ్య పంతాలు నడిచాయి. అనకాపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాత్రి బస ఉండాలని గంటా పట్టుబట్టగా, అయ్యన్న మాత్రం స్థానిక వ్యవసాయ పరిశోధన కేంద్రలోనే బస ఉండాలని పట్టుబట్టి చివరకు మాట నెగ్గించుకున్నారు. చివరకు ఇలా సీఎం పర్యటనలోనూ ఇద్దరు దూరందూరంగానే ఉండడంతో జిల్లా ఎమ్మెల్యేలు సైతం ఇద్దరిలో ఎవరిని ముందుగా పలకరించాలో తెలియక దూరంగా వెళ్లిపోయారు.