Ayyappa devotees died
-
బాపట్ల: ఘోర రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప భక్తుల మృతి
సాక్షి, బాపట్ల: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వాహనం బోల్తా పడిన ఘటనలో నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. వేమూరు మండలం జంపని వద్ద సోమవారం వేకువ ఝామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మరో 16మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని తెనాలి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో కన్నుమూశారు. మృతులను బొల్లిశెట్టిపండురంగారరావు, బుద్దన పవన్ కుమార్, బార్డటి రమేష్, పాశంరమేష్గా గుర్తించారు. మృతులది కృష్ణా జిల్లా,పెడన నియోజకవర్గం,నిలపూడి గ్రామంగా గుర్తించారు. ఘటన సమయంలో వాహనంలో 22 మంది ఉన్నారని, పొగ మంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు పోలీసులు. -
ఇద్దరు అయ్యప్ప మాలధారుల దుర్మరణం
-
ఇద్దరు అయ్యప్ప మాలధారుల దుర్మరణం
గుమ్మడిపూండి (చెన్నై)/తడ (నెల్లూరు): అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లొస్తూ కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు భక్తులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఎనిమిదేళ్ల బాలుడు. మరో ఐదుగురు గాయపడ్డారు. తమిళనాడు గుమ్మడిపూండి సమీపంలోని పన్నంగాడు గ్రామం వద్ద సోమవారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన పల్లంపాటి రామాంజనేయులు (31), అతని తమ్ముడు దుర్గాప్రసాద్, కోమటిపల్లి శివ, పోలా త్రినాథ్నాయుడు, బాని శ్రీనివాసరావు, గొట్టపు తవిటినాయుడు, సి.రాంబాబు, గద్దె శివకుమార్, అతని కుమారుడు రాహుల్ (8) కలసి అయ్యప్పస్వామి మాల ధరించి శనివారం కారులో శబరిమలకు వెళ్లారు. మొక్కు చెల్లించుకుని వెనుదిరిగారు. సోమవారం తమిళనాడు–ఆంధ్రా సరిహద్దు గ్రామమైన కన్నంగాడు వద్దకు చేరుకుంది. ఆ సమయంలో కారు వేగంగా నడుపుతుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని ఢీకొంది. దీంతో కారులో ఉన్న రామాంజనేయులు, రాహుల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆరంబాక్కం పోలీసులు గాయపడిన ఐదుగురిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
టవేరా బోల్తా:నలుగురు అయ్యప్ప భక్తుల మృతి
-
టవేరా బోల్తా:నలుగురు అయ్యప్ప భక్తుల మృతి
పొద్దుటూరు: వైఎస్ఆర్ జిల్లా దువ్వూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలుకు చెందిన అయ్యప్ప భక్తులు టవేరా వాహనంలో శబరిమలై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దువ్వూరు సమీపంలోకి వచ్చిన తరువాత వారు ప్రయాణిస్తున్న టవేరా వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గాయపడిన ఇద్దరిని పొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.