
మృతులు రాహుల్, రామాంజనేయులు
గుమ్మడిపూండి (చెన్నై)/తడ (నెల్లూరు): అయ్యప్ప దర్శనానికి శబరిమల వెళ్లొస్తూ కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు భక్తులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఎనిమిదేళ్ల బాలుడు. మరో ఐదుగురు గాయపడ్డారు. తమిళనాడు గుమ్మడిపూండి సమీపంలోని పన్నంగాడు గ్రామం వద్ద సోమవారం వేకువజామున ఈ ప్రమాదం జరిగింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలుకు చెందిన పల్లంపాటి రామాంజనేయులు (31), అతని తమ్ముడు దుర్గాప్రసాద్, కోమటిపల్లి శివ, పోలా త్రినాథ్‌నాయుడు, బాని శ్రీనివాసరావు, గొట్టపు తవిటినాయుడు, సి.రాంబాబు, గద్దె శివకుమార్, అతని కుమారుడు రాహుల్ (8) కలసి అయ్యప్పస్వామి మాల ధరించి శనివారం కారులో శబరిమలకు వెళ్లారు.
మొక్కు చెల్లించుకుని వెనుదిరిగారు. సోమవారం తమిళనాడు–ఆంధ్రా సరిహద్దు గ్రామమైన కన్నంగాడు వద్దకు చేరుకుంది. ఆ సమయంలో కారు వేగంగా నడుపుతుండగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని ఢీకొంది. దీంతో కారులో ఉన్న రామాంజనేయులు, రాహుల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఆరంబాక్కం పోలీసులు గాయపడిన ఐదుగురిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment