Ayyappa shrine
-
‘51 కాదు 17 మంది మాత్రమే’
తిరువనంతపురం : సుప్రీం కోర్టు తీర్పుకనుగుణంగా దాదాపు 51 మంది 50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించారంటూ కేరళ ప్రభుత్వం కోర్టుకు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నివేదికలో మగవారి పేర్లు రావడం, 50 ఏళ్ల పైబడిన మహిళలర్లు కూడా ఉండటంతో విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కొత్త నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది. 50 ఏళ్లలోపు వయసున్న మహిళలు కేవలం 17 మంది మాత్రమే శబరిమల ఆలయంలోకి ప్రవేశించారని ఈ నివేదికలో తెలిపింది. ఈ విషయం గురించి అధికారులు మాట్లాడుతూ.. ‘ఇంతకు ముందు సమర్పించిన నివేదికలో నలుగురు పురుషులు ఉన్నట్లు గుర్తించాము. వారితో పాటు 30 మంది మహిళలు 50 ఏళ్ల వయసు పైబడిన వారిగా గుర్తించి ఆ పేర్లను నివేదిక నుంచి తొలగించినట్లు’ తెలిపారు. ఈ క్రమంలో చివరకూ 50 ఏళ్ల లోపు వయసున్న మహిళలు కేవలం 17 మంది మాత్రమే ఆయంలోకి ప్రవేశించినట్లు కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీం కోర్టు గతేడాది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 2న బిందు, కనక దుర్గ అనే ఇద్దరు 50 ఏళ్లలోపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు. దీంతో కేరళలోని హిందూ నిరసనకారులు తీవ్ర ఆందోళనలు చేపట్టారు. -
‘నేను కళావతిని కాదు..’
శబరిమల : నేను మగాడినండి బాబు.. అంటూ రిపోర్టర్ల ముందు మొరపెట్టుకుంటున్నాడు తమిళనాడుకు చెందిన 47 ఏళ్ల పరంజ్యోతి. పాపం ఈ పేరే అతన్నిప్పుడు ఇబ్బందుల్లో పడేసింది. విషయం ఏంటంటే.. శుక్రవారం కేరళ ప్రభుత్వం 51 మంది.. 50 ఏళ్ల లోపు మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించారంటూ సుప్రీం కోర్టుకు నివేదిక అందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో కొందరు మగవారి పేర్లను కూడా చేర్చడంతో ప్రస్తతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. పాపం ఈ లిస్ట్‌లో పరంజ్యోతి పేరు కూడా వుంది. దాంతో నేను మగాడినండి బాబు అంటూ రిపోర్టర్ల ముందు వాపోతున్నాడు పరంజ్యోతి. పాండిచ్చేరికి చెందిన శంకర్ పరిస్థితి మరి దారుణం. ఆలయంలోకి ప్రవేశించిన 51 మంది మహిళల పేర్లలో ‘కళావతి’ అనే ఆమె ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ‘కళావతి’ పేరు పక్కన ట్యాక్సీ డ్రైవర్ శంకర్ ఫోన్ నంబర్‌ను రాశారు. దాంతో గత రెండు రోజులుగా అతని ఫోన్ నిరంతరాయంగా మొగుతూనే ఉందంట. తమిళనాడుకు చెందిన గృహిణి షీలాది మరోక కథ. ఆమె వయసు 52 సంవత్సరాలు. కానీ కోర్టుకిచ్చిన లిస్ట్‌లో షీలా పేరు కూడా ఉంది. షీలాతో పాటు మరి కొంతమంది మహిళలు లిస్ట్‌లో తమ పేర్లు కూడా ఉన్నాయంటూ మీడియా ముందుకు వచ్చారు. తమ వయసు 50 సంవత్సరాలకు పైనే అని .. కానీ కోర్టుకిచ్చిన లిస్ట్‌లో తమ పేర్లు చేర్చారని సదరు మహిళలు తెలిపారు. అయితే లిస్ట్‌లో జరిగిన అవకతవకల గురించి కాంగ్రెస్ నాయకులు మండి పడుతున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నిస్తున్నారు. తప్పుడు సమాచారంతో కేరళ ముఖ్యమంత్రి సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. -
మగవారిలా వేషం మార్చి..
తిరువనంతపురం : శబరిమల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పటికి ఆందోళనకారులు మాత్రం దీన్ని ఖాతరు చేయటం లేదు. మహిళలను ఆలయ ప్రాంగణంలోకి కూడా రానివ్వడంలేదు. అయితే ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా కొందరు మహిళలు ఎలాగోలా ఆలయంలోకి ప్రవేశించి ఇప్పటికే అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరు మహిళలు, మగవారిలా వేషం ధరించి ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. తొమ్మిది మంది అయ్యప్ప భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తుండగా అనుమానం వచ్చిన ఆందోళనకారులు వారిని అడ్డుకున్నారు. ఈ అయ్యప్ప భక్తుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని తెలింది. దాంతో ఆందోళనకారులు సదరు మహిళల్ని ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో వారు వెనుతిరగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఈ నెల 2న అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన కనకదుర్గ అనే మహిళపై ఆమె అత్త, బంధువులు మంగళవారం దాడి చేశారు. -
‘తలకు రంగేసుకుని ఆలయంలోకి వెళ్లాను’
తిరువనంతపురం : అన్ని వయసుల మహిళల్ని అయ్యప్ప ఆలయంలోనికి అనుమతించాలంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు నేలకొన్న సంగతి తెలిసిందే. అనేక ఆందోళనల నడుమ ఇప్పటికే ఎనిమిది మంది మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు. వీరేకాక కేరళకు చెందిన మంజు అనే 36 ఏళ్ల మహిళ కూడా ఆలయంలోకి ప్రవేశించానని తెలిపారు. తలకు తెల్లరంగు వేసుకుని అయ్యప్ప దర్శనం చేసుకున్నాని తెలిపారు మంజు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాంతోపాటు ఎలా తాను అయ్యప్ప సన్నిధిలోకి వెళ్లిందనే వివరాలను కూడా షేర్ చేశారు మంజు. మంజు చెప్పిన వివరాలు.. ‘త్రిస్సూర్ నుంచి జనవరి 8న నా శబరిమల యాత్ర ప్రారంభించాను. అయితే ఆందోళనకారుల నుంచి వ్యతిరేకత ఎదురవకుండా ఉండాలనే ఉద్దేశంతో తలకు తెల్లరంగు వేసుకున్నాను. దాంతో నేను పెద్దవయసు స్త్రీలా కనిపించాను. ఈ ప్రయత్నం నాకు మంచే చేసింది. నన్ను చూసిన ఆందోళనకారులు పెద్దవయసు స్త్రీగా భావించి.. ఆలయంలోకి వెళ్లేందుకు అడ్డు చెప్పలేదు. దాంతో పోలీసుల సాయం లేకుండానే నేను అయ్యప్పను దర్శించుకున్నాను. ఆలయంలోకి ప్రవేశించిన నేను దాదాపు 2 గంటలపాటు సన్నిధానంలో గడిపానం’టూ చెప్పుకొచ్చారు మంజు. ఈ సమయంలో అఖిల భారత అయ్యప్ప సంఘం సభ్యులు తనకు చాలా సాయం చేశారన్నారు మంజు. అయితే గత ఏడాది అక్టోబరులోనే తాను అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించి.. విఫలమయ్యానని చెప్పారు మంజు. కానీ ఈ సారి మాత్రం దర్శనం చేసుకోగలిగానని సంతోషం వ్యక్తం చేశారు. -
‘అతడు బ్రాహ్మణుడు కాదు.. రాక్షసుడు’
శబరిమల : అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రం రణరంగంగా మారింది. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కనక దుర్గ, బిందు అనే ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలో ప్రవేశించి.. అయ్యప్ప దర్శనం చేసుకున్న సంగతి తెలిసిందే. మహిళలు ఆలయంలో ప్రవేశించడంతో.. పూజారి కందరు రాజీవేరు ఆలాయాన్ని మూసి వేసి శుద్ధి కార్యక్రమాలు జరిపారు. ఇవి కాస్తా వివాదాస్పందగా మారాయి. దీని గురించి కేరళ మంత్రి జీ సుధాకరన్ మాట్లాడుతూ.. ‘ఎవరైనా తమ సోదరిని అపవిత్రురాలిగా భావిస్తారా’ అంటూ ప్రశ్నించారు. శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన బ్రాహ్మణున్ని రాక్షసుడంటూ విమర్శించారు. ఈ పూజలు నిర్వహించిన వ్యక్తి అసలైన బ్రాహ్మణుడు కాదు. అతనికి అయ్యప్ప పట్ల ఎటువంటి భక్తి, మర్యాద లేవు. ఇతను బ్రాహ్మణుడు కాదు.. బ్రాహ్మణ రాక్షసుడు. ఇలాంటి వాడు తీవ్రవాదిగా కూడా మారతాడన్నారు. -
శబరిమల ప్రవేశం : అపచారం.. అపచారం
శబరిమల : సాక్షాత్తు సుప్రీం కోర్టే అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ తీర్పు ఇచ్చినప్పటికి భక్తులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. గత నెలలో శబరిమలలో పూజల సందర్భంగా.. నేడు జరిగే ప్రత్యేక పూజల సందర్భంగా స్వామి వారి దర్శనం కోసం మహిళలు వచ్చారు. కానీ 10 - 50 ఏళ్లలోపు బాలికలను, మహిళలను ఆలయంలోకి రాకుండా హిందూ సంఘాలు అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలో నేడు దాదాపు 200 మంది అయ్యప్ప భక్తులు గుంపుగా వెళ్లి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ మహిళను అడ్డున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా ఒక అపరాధం చోటు చేసుకుంది. మహిళను అడ్డుకునేందుకు వెళ్లిన సదరు అయ్యప్ప భక్తుల గుంపుకు నాయకత్వం వహిస్తోన్న ఆర్ఎస్ఎస్ నాయకుడు వల్సన్ థిల్లంకెరి ఓ అపచారం చేశారు. అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రంగా భావించే బంగారు మెట్ల మీద వల్సన్ నిల్చున్నాడు. అయ్యప్ప దర్శనం చేసుకోవాలని భావించే భక్తులు ఎవరైనా సరే వయసుతో సంబంధం లేకుండా తల మీద ఇరుముడి కెట్టును ధరించాల్సి ఉంటుంది. అలా ఉన్న వారిని మాత్రమే బంగారు మెట్ల మీద నడిచి.. స్వామి వారిని దర్శించుకునేందుకు అనుమతిస్తారు. కానీ వల్సన్ సాధరణ వ్యక్తిలాగా శబరిమల వచ్చారు. కేవలం మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా చూడ్డం కోసమే వచ్చిన వల్సన్ ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న మహిళను అడ్డగించే క్రమంలో ‘ఇరుముడి కెట్టు’ లేకుండానే పవిత్ర బంగారు మెట్ల మీద నిల్చున్నాడు. అయితే మహిళలను అడ్డుకునే విషయంలో అత్యుత్సాహంగా ఉన్న భక్తులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. -
శబరిమలలో రష్యన్ భక్తుల శరణుఘోష!!
వాళ్లంతా నల్లటి దుస్తులు వేసుకున్నారు.. తలపై ఇరుముడులు పెట్టుకున్నారు. శబరిమల వెళ్లారు. శరణమయ్యప్పా.. అంటూ శరణుఘోష చేస్తున్నారు. ఇందులో వింతేముంది, ప్రతియేటా భక్తులు శబరిమలకు వెళ్తూనే ఉంటారు కదా అంటారా? కానీ వాళ్లంతా రష్యన్లు కావడమే ఇక్కడ విశేషం. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 14 మంది రష్యన్ భక్తులు అయ్యప్ప దేవాలయంలో పూజలు చేశారు. అంతకుముందు 41 రోజుల పాటు నిష్ఠగా దీక్ష పాటించి మండలపూజలు కూడా వాళ్లు పూర్తి చేసుకోవడం గమనార్హం. సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి వచ్చిన పదుకోవా అలియాస్ 'ఇందుచోడన్' ఈ బృందానికి నాయకత్వం వహించారు. ఆయనో ఆయుర్వేద వైద్యుడు, రష్యాలో ఉపాధ్యాయుడు. ఆయన వరుసగా 15వ ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకుంటున్నారు. ఈ బృందంలో పలువురు వ్యాపారవేత్తలు, విద్యార్థులు ఉన్నారు. వీళ్లు కూడా ఇంతకుముందు శబరిమలలో అయ్యప్ప దర్శనం చేసుకున్నవాళ్లే. వీళ్లలో ఓ చిన్నారి తన నాయనమ్మతో కలిసి వచ్చింది. వాళ్లిద్దరూ మాత్రం తొలిసారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ పర్యటన అనుభవం చాలా అద్భుతంగా ఉందని వాళ్లు అంటున్నారు. మొత్తం బృంద సభ్యులు మాస్కోలో బయల్దేరి ఇడుక్కిలోని పాంచాలిపీడ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడినుంచి ఇరుముడి తీసుకుని శబరిమల బయల్దేరారు.