Aziz Pasha
-
‘తగ్గేదే లేదు..5 స్థానాల్లో పోటీకి దిగుతాం’
సాక్షి, హైదరాబాద్ : కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, మునుగోడు, బెల్లంపల్లి స్థానాల్లో పోటీ చేస్తామని సీపీఐ ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్లో శుక్రవారం సమావేశమైన రాష్ట్ర కార్యవర్గం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజాకూటమిలో భాగమైన సీపీఐ 9 సీట్లు డమాండ్ చేస్తుండగా.. కాంగ్రెస్ పెద్దలు 3 సీట్లు మాత్రమే ఇస్తాననడం దారుణమని పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా, గోదా శ్రీరాములు వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ను ఓడించే ప్రధాన లక్ష్యంతోనే సీపీఐ పనిచేస్తుందని ఉద్ఘాటించారు. (‘సీట్ల కేటాయింపు మింగుడుపడటం లేదు’) ఎటువంటి సంప్రదింపులు లేకుండానే ఏకపక్షంగా కాంగ్రెస్ సీట్ల కేటాయింపులు చేస్తోందని ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో నియంతృత్వ టీఆర్ఎస్ను, వారితో లాలూచీ దోస్తీలో ఉన్న బీజేపీని ఓడించే లక్ష్యం నెరవేరాలంటే భాగస్వామ్య పార్టీల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండాలని నేతలు ఆకాక్షించారు. ఉమ్మడి రాజకీయ లక్ష్యం కంటే గ్రూపులను సంతృప్తి పరిచే సంకుచిత ధోరణితో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించడం సరికాదని హితవుపలికారు. -
క్యాబ్ డ్రైవర్లపై వేధింపులు ఆపాలి
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే క్యాబ్ డ్రైవర్లపై ఎయిర్‌పోర్టు ట్రాఫిక్ పోలీసులు అక్రమంగా కేసులు బనాయించి వేధింపులకు పాల్పడడం తగదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ అజీజ్‌పాషా హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ముదిరాజ్ భవనంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కుటుంబాలను పోషిస్తున్న వారి జీవనోపాధికి అడ్డుతగలడం న్యాయం కాదన్నారు. ఓ వైపు ప్రభుత్వాలు ఉపాధి కల్పించడంలో విఫలమవుతుండడంతో స్వయం ఉపాధితో బతుకుతున్న వారిని ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదన్నారు. పోలీసుల ఆగడాలు ఆపకపోతే పెద్ద ఎత్తున నిరసన చేపడతామన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి చంద్రయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య, జిల్లా కార్యదర్శి పానుగంటి పర్వతాలు, క్యాబ్డ్రైవర్లు పాల్గొన్నారు. -
యూపీలో బీజేపీ గెలిచే పరిస్థితులు స్వల్పమే!
సాక్షితో సీపీఐ నేత అజీజ్ పాషా సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిచే పరిస్థితులు స్వల్పం గానే ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ అజీజ్ పాషా అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, దాని పర్యవసానాల ప్రభావం ఈ ఎన్ని కలపై తప్పక పడుతుందని పేర్కొన్నారు. తమ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా యూపీలో పర్యటిస్తున్న అజీజ్ పాషా అక్కడి నుంచే సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. వామపక్షాలుగా సీపీఐ 69 సీట్లలో, సీపీఎం 31 సీట్లలో, ఎస్‌యూసీఐ, ఇతర పక్షాలు మరో 30 సీట్లు కలుపుకుని మొత్తం 130 సీట్లలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో సీపీఐకి 7, 8 సీట్లలో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. -
గోరక్ష పేరుతో దాడులు హేయమైన చర్య
వినాయక్‌నగర్ : గోరక్ష పేరుతో దేశంలో జరుగుతున్న దాడులు సభ్య సమాజం తలదించుకునే విదంగా ఉన్నయని, దళితులపై దాడులకు పాల్పడటం హేయమైన చర్య అని మాజీ రాజ్యసభ సభ్యులు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ పాషా అన్నారు. సెప్టెంబర్ 2న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయడానికి పిలుపు నివ్వడంలో భాగంగా గురువారం నిజామాబాద్ జిల్లాకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల దృష్ట్యా ప్రధాని మోదీ ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఆ ప్రకటనలు రెండు నెలల క్రితం చేసి ఉంటే దళితులపై దాడులు ఆగేవి కదా..? అని అన్నారు. కశ్మీర్ సమస్య చాల సున్నితమైందని, సమస్యపరిష్కారాన్నిప్రతిష్టాత్మకంగా తీసుకుని వాజ్‌పేయ్ విధానాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య తదితరులు పాల్గొన్నారు.