యూపీలో బీజేపీ గెలిచే పరిస్థితులు స్వల్పమే! | CPI leader Aziz Pasha sakshi | Sakshi
Sakshi News home page

యూపీలో బీజేపీ గెలిచే పరిస్థితులు స్వల్పమే!

Published Mon, Feb 20 2017 12:34 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

యూపీలో బీజేపీ గెలిచే పరిస్థితులు స్వల్పమే! - Sakshi

యూపీలో బీజేపీ గెలిచే పరిస్థితులు స్వల్పమే!

సాక్షితో సీపీఐ నేత అజీజ్‌ పాషా

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ గెలిచే పరిస్థితులు స్వల్పం గానే ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ అజీజ్‌ పాషా అభిప్రాయపడ్డారు. మోదీ ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, దాని పర్యవసానాల ప్రభావం ఈ ఎన్ని కలపై తప్పక పడుతుందని పేర్కొన్నారు. 

తమ పార్టీ ఎన్నికల పరిశీలకుడిగా యూపీలో పర్యటిస్తున్న అజీజ్‌ పాషా అక్కడి నుంచే సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. వామపక్షాలుగా సీపీఐ 69 సీట్లలో, సీపీఎం 31 సీట్లలో, ఎస్‌యూసీఐ, ఇతర పక్షాలు మరో 30 సీట్లు కలుపుకుని మొత్తం 130 సీట్లలో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో సీపీఐకి 7, 8 సీట్లలో విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement