Baba Atomic Research Centre
-
ఇంటర్వ్యూ తేదీలు
* ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) హాస్పిటల్లో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు: జూన్ 20 * హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) మెడికల్ కాలేజీ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్స్ పోస్టులకు: జూన్ 27 * రూర్కీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రాజెక్ట్ అటెండెంట్ (టెక్నికల్) పోస్టులకు: జూన్ 27 -
ఎకరానికి 85 బస్తాల వేరుశనగ!
రూ.50 వేల నికరాదాయం పొందిన యువ రైతు ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) రూపొందించి విడుదల చేసిన వేరుశనగ వంగడం వేసవి పంటగా అధిక దిగుబడినివ్వడం విశేషం. ఈ వంగడం పేరు టీఎల్జి-45. కడప జిల్లా చెన్నూరు మండలం బాలసింగాయపల్లికి చెందిన రైతు వెంకటేశ్వర్‌రెడ్డి(92474 36849) ‘బార్క్’ శాస్త్రవేత్తల నుంచి ఈ వంగడాన్ని తీసుకొచ్చి కొన్నేళ్ల నుంచి సాగు చేస్తున్నారు. ఆయన వద్ద నుంచి కడప నగర పరిధిలోని చలమారెడ్డిపల్లెకు చెందిన యువరైతు శిరిగిరెడ్డి పురుషోత్తమరెడ్డి గత ఏడాది ఈ విత్తన కాయలు కొన్నారు. ఆ విత్తన కాయల్లో నుంచి మేలైన కాయలను ఏరి.. గత ఏడాది విత్తనోత్పత్తి చేశారు. ఆ విత్తనంతో ఈ ఏడాది మార్చిలో తన ఎకరం 30 సెంట్లలో సాగు చేశారు. ఎకరంలో ఇటీవల నూర్పిడి చేయగా.. 85 బస్తాల పచ్చి కాయల(బస్తా 40 కిలోలు) దిగుబడి వచ్చిందని పురుషోత్తమరెడ్డి తెలిపారు. మిగతా 30 సెంట్లలో పంటను విత్తనాల కోసం ఉంచానన్నారు. తమ ప్రాంతంలో 65-70 బస్తాల వరకు పచ్చి కాయల దిగుబడి వస్తుంటుందని, అయితే, మేలైన విత్తన కాయలు వాడటం, శ్రద్ధగా సాగు చేయడం వల్ల తనకు అధిక దిగుబడి వచ్చిందని పురుషోత్తమరెడ్డి తెలిపారు. వేరు పురుగు, అడవి పందుల బెడద లేకపోతే మరో 5-10 బస్తాల పచ్చి కాయలు అదనంగా దిగుబడి వచ్చేదన్నారు. మార్చి 28న విత్తనం వేశానని, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో జాగ్రత్తగా నీటి తడులు ఇస్తూ కంటికి రెప్పలా పంటను కాపాడి అధిక దిగుబడి సాధించానని పురుషోత్తమరెడ్డి (77948 85686) సంతోషంగా చెప్పారు. పుష్కలంగా పశువుల ఎరువు, ఆముదం పిండి, జీవన ఎరువులతోపాటు తగుమాత్రంగా రసాయనిక ఎరువులు వాడి, శ్రద్ధగా సస్యరక్షణ చర్యలు చేపట్టానని తెలిపారు. ఒకసాలు అదనంగా లోతు దుక్కి చేయడం కూడా కలసివచ్చిందన్నారు. ఈ రకం కాయలు, విత్తనాలు పెద్దగా ఉంటాయి. నూనె దిగుబడి శాతం ఇతర వంగడాల మాదిరిగానే ఉంటుంది. మూడు, నాలుగు విత్తనాల కాయలు కూడా అధికంగా ఉంటాయి. ఉడకబెట్టి తినడానికి, చెట్నీలకు ఈ వంగడం అనుకూలంగా ఉంటుంది. దీంతో పురుషోత్తమరెడ్డి వద్ద నుంచి వ్యాపారులు పచ్చి కాయల బస్తాను రూ.1,160 వరకు ధర చెల్లించి కొన్నారు. ఎకరానికి రూ. 47 వేల వరకు ఖర్చయ్యింది. ఖర్చులు పోను రూ. 50 వేలకు పైగా నికరాదాయం వచ్చింది. టీఎల్జి-45 వంగడం ఈ స్థాయిలో దిగుబడినివ్వడం స్థానిక వ్యవసాయాధికారులతో పాటు ‘బార్క్’ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరచింది. వేసవి పంటగా సాగు చేసి ఇంత దిగుబడి తీయడం మరో విశేషం. - ప్రభాకర్‌రెడ్డి, కడప అగ్రికల్చర్ -
ఉద్యోగాలు
బాబా అటామిక్ సెంటర్ ఫెసిలిటీస్ కల్పక్కంలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఫెసిలిటీస్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెక్నీషియన్ అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు బాయిలర్ అటెండెన్స్ సర్టిఫికెట్ ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబరు 19 వెబ్సైట్: www.barc.gov.in ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎకనామిస్ట్ అర్హతలు: ఎకనామిక్స్‌లో పీజీతో పాటు పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 40 ఏళ్లు దాటకూడదు. చీఫ్ ఎకనామిస్ట్ అర్హతలు: ఎకనామిక్స్‌లో పీజీ ఉండాలి. మనీ/ బ్యాంకింగ్/ ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌లో పీహెచ్డీ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు: 45 నుంచి 62 ఏళ్ల మధ్య ఉండాలి. చార్టర్డ్ అకౌంటెంట్ అర్హతలు: సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 62 ఏళ్లు దాటకూడదు. చీఫ్ కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ అర్హతలు: ఏదైనా బ్యాంకులో జనరల్ మేనేజర్‌గా రిటైర్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: 60 ఏళ్లు దాటకూడదు. దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 30 వెబ్సైట్: www.iob.in రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ రీసెర్చ్ ఫెలో: 8 అర్హతలు: కెమికల్ సెన్సైస్/ లైఫ్ సెన్సైస్/ బయోటెక్నాలజీ/ అగ్రికల్చరల్ సెన్సైస్/ మెడికల్ సెన్సైస్/ ఫార్మా స్యూటికల్ సెన్సైస్/ వెటర్నరీ సెన్సైస్‌లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 28 ఏళ్లు దాటకూడదు. టెక్నికల్ ఆఫీసర్ (హ్యూమన్ రిసో ర్సెస్): 2 అర్హతలు: హెచ్ఆర్ఎం/ పబ్లిక్ రిలేషన్స్/ ఫైనాన్స్/ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 35 ఏళ్లు దాటకూడదు. టెక్నికల్ ఆఫీసర్: 6 అర్హతలు: కెమికల్ సెన్సైస్/ బయోటెక్నాలజీ/ బయో మెడికల్ సెన్సైస్/ కంప్యూటర్ అప్లికేషన్స్‌ల్లో పీజీ ఉండాలి. వయసు: 35 ఏళ్లు దాటకూడదు. టెక్నికల్ అసిస్టెట్: 8 అర్హతలు: కెమికల్ సెన్సైస్/ లైఫ్ సెన్సైస్‌లో డిగ్రీ ఉండాలి. వయసు: 35 ఏళ్లు దాటకూడదు. దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 27 వెబ్సైట్: www.rgcb.res.in -
బార్క్‌లో టెక్నికల్ ఆఫీసర్లు
ప్రవేశాలు లాంగ్వేజ్ పండిట్ సెట్- 2014 లాంగ్వేజ్ పండిట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాంగ్వేజ్ పండిట్ కామన్ ఎంట్రన్స టెస్ట్(ఎల్పీ సెట్)- 2014కు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులు: * తెలుగు పండిట్ * హిందీ పండిట్ * ఉర్దూ పండిట్ అర్హత: నోటిఫికేషన్లో నిర్దేశించిన అర్హతలు ఉండాలి. దరఖాస్తులు: ఆన్లైన్లో లభిస్తాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మే 9 ప్రవేశ పరీక్ష తేది: జూన్ 22 వెబ్సైట్: http://lpcet.cgg.gov.in/ ఉద్యోగాలు బార్క్‌లో టెక్నికల్ ఆఫీసర్లు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్), ముంబై... కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: * టెక్నికల్ ఆఫీసర్/సి(ఎలక్ట్రికల్): 3 * టెక్నికల్ ఆఫీసర్/సి(ఎలక్ట్రానిక్స్): 3 * టెక్నికల్ ఆఫీసర్/సి(మెకానికల్): 2 అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ * టెక్నికల్ ఆఫీసర్/సి(ఫిజిక్స్): 10 * టెక్నికల్ ఆఫీసర్/సి(కెమిస్ట్రీ): 9 అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఎంఎస్సీ దరఖాస్తులు: ఆన్లైన్లో లభిస్తాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: మే 30 వెబ్సైట్: www.barcrecruit.gov.in