baby dead body
-
శై'శవ' గీతం!
జీడిమెట్ల: బతికున్నంత కాలం మనిషిని డబ్బే నడిపిస్తుంది. చనిపోయినా అది లేకుంటే మృతదేహం కూడా ‘కదలదు’. ఆ డబ్బు లేక తమ కొడుకు మృతదేహాన్ని ఖననం చేయడానికి ఓ బెంగాలీ కుటుంబం నరకయాతన అనుభవించింది. ఓ వైపు శిశువు చనిపోయిన దుఃఖం... మరోవైపు మృతదేహాన్ని ఖననం కూడా చేయలేని అయోమయ పరిస్థితి. ఇదిగో పై చిత్రంలో చనిపోయిన బిడ్డను మోసుకుంటూ వస్తున్న ఇతని పేరు విప్లవ్. పశ్చిమ బెంగాల్ నుంచి బతుకుదెరువు కోసం ఇక్కడికి వచ్చాడు. సోమాజీగూడలో ఉంటూ సెంట్రింగ్ పని చేసుకుంటున్నాడు. ఇతని నాలుగు నెలల బాబు తకోష్ న్యూమోనియాతో బాధపడుతూ బుధవారం చనిపోయాడు. అంత్యక్రియలు చేసే ఆర్థిక స్థోమత లేక కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం ఎదురుగా ఉన్న హెచ్ఎంటీ ఖాళీ స్థలంలో ఖననం చేయడానికి ప్రయత్నించాడు. ఇది గమనించిన కొందరు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. విప్లవ్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు బీరప్ప నగర్ శ్మశాన వాటికలో పూడ్చేందుకు తీసుకెళ్లారు. అది ఓ వర్గానికి చెందినది కావడంతో అక్కడ ఖననం చేసేందుకు వారు నిరాకరించారు. దీంతో పోలీసులు చెన్నప్ప, సుధాకర్ వారి ని భగత్‌సింగ్‌నగర్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ వారు ఖననం చేసేందుకు పోలీసులు రూ.1,500కు ఒప్పించారు. ఏ రోజు కూలీతో ఆ రోజు పొట్టపోసుకునే విప్లవ్ కుటుంబం ఆ మొత్తం చెల్లించి కొడుకు మృతదేహాన్ని ఖననం చేశారు. -
పసికందు మృతదేహం కుక్కలపాలు
శంషాబాద్: ఓ పసికందు మృతదేహాన్ని వీధికుక్కలు పీక్కుతిన్న సంఘటన శంషాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో గురువారం కలకలం రేపింది. బతికున్న పసి కందునే గుర్తు తెలియని వ్యక్తులు పడేసి ఉం డొచ్చని భావించిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వీధి కుక్కలను పసికందు మృతదేహం వద్ద నుంచి తరిమేసిన స్థానికులు అక్కడి నుంచి స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి వాకబు చేయగా అసలు విషయం బయటపడింది. ఈనెల 15న మధ్యాహ్నం రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి బస్తీ నుంచి గర్భిణి సునిధికుమార్ ఆమె భర్త రజనిసుమన్ శంషాబాద్ ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. నొప్పులు వస్తున్న ఆమెను పరిశీలించిన ఆస్పత్రి వైద్యులు.. గర్భంలో ఉన్న శిశువు మృతిచెందినట్లుగా గుర్తించారు. సాయంత్రం ఆరుగంటలకు ఆడ మృతశిశువును బయటికి తీసి వారికి అప్పగించారు. అయితే, భార్యాభర్తలు మాత్రం ఆ శిశువును ఆస్పత్రికి సంబంధించిన కొందరు సిబ్బందికి డబ్బులు ఇచ్చి ఖననం చేయాల్సిందిగా చెప్పి వెళ్లిపోయారు. దీంతో సిబ్బంది ఆస్పత్రి సమీపంలో మాములుగా గుంత తీసి అక్కడే పూడ్చిపెట్టారు. అయితే, సిబ్బంది సరిగా పూడ్చకపోవడంతో గురువారం ఉదయం కుక్కలు పసికందు మృతదేహాన్ని బయటకు లాగి నోటకరుక్కొని వీకర్ సెక్షన్ కాలనీకి పరుగులు పెట్టాయి. మృతదేహాన్ని తింటుండగా స్థానికులు వాటిని తరిమివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రి సిబ్బంది, వైద్యులను విచారించారు. మృతదేహానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పసికందు మృతదేహాన్ని వదిలేసి వెళ్లపోయిన వారు కూడా కేవలం పేర్లు మాత్రమే చెప్పారని, ఎలాంటి గుర్తింపు పత్రాలు కూడా ఇవ్వలేదని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న ఎలుకలు
-
శిశువు మృతదేహాన్నికొరికిన ఎలుకలు
నర్సాపూర్: పోస్టుమార్టం గదిలో ఉన్న మూడు నెలల శిశువు మృతదేహాన్ని ఎలుకలు కొరికాయి. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. కౌడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బతుకమ్మ తండాకు చెందిన సురేఖ, కిషన్ దంపతుల కూతురు పుట్టిన కొన్ని రోజులæ నుంచి అనారోగ్యంతో ఉంది. గురువారం ఉదయం మరోసారి అస్వస్థతకు గురవడంతో వైద్యం చేయించేందుకు సురేఖ మెదక్‌కు వెళుతుండగా పాప మార్గమధ్యంలో మృతి చెందింది. శిశువు తండ్రి కిషన్‌తోపాటు అతడి తరఫువారు గురువారం సాయంత్రం వరకు రానందున మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో పెట్టి తాళం వేశారు. శుక్రవారం ఉదయం మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు వైద్య సిబ్బంది వెళ్లి చూసేసరికి శిశువు మృతదేహంపై పలు చోట్ల గాయాలు కనిపించాయి. ఎలుకలు కొరికిన విషయాన్ని శిశువు కుటుంబీకులకు చెప్పకుండా పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని వారికి అప్పచెప్పారు. అయితే శిశువు మృతదేహంపై కుడి వైపు పెదవిని, చెంపతోపాటు ఎడమ చేయి వేలును కొరికాయి. అంతేగాక కుడికాలు తొడపై సైతం గాయమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కౌడిపల్లి ఎస్ఐ శ్రీనివాస్ చెప్పారు. -
పసికందు మృతదేహం లభ్యం
పొందూరు : స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వెనుక బోరును ఆనుకుని ఉన్న కాలువలో నెలలు నిండని పసికందు మృతదేహం శుక్రవారం బయటపడింది. బోరునీటి కోసం ఉదయం 8 గంటలకు వెళ్లినప్పుడు ఏమీ కనిపించలేదని, 8.30 గంటల సమయంలో మాత్రం కాలువలో పసికందు మృతదేహం బయటపడిందని స్థానికులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల తర్వాతే ఎవరైనా వచ్చి పడేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
మృత శిశువు కలకలం
కర్నూలు : నగరంలోని ఉడ్‌ల్యాండ్ సమీపంలోని హంద్రీనదిలో బయటపడిన శిశువు శవం కలకలం రేపింది. పసిపిల్లను హత్య చేసి పూడ్చి పెట్టారని ప్రచారం జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన ఆలిబాషా భార్య నమ్మిబీ శుక్రవారం కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డను ప్రసవించింది. శ్వాస సరిగా తీసుకోకపోవడంతో తల్లిని అక్కడే వదిలి శిశువును కర్నూలు ఆసుపత్రికి తీసుకువచ్చి వైద్యచికిత్సలు చేయించారు. శనివారం ఉదయం కోలుకోలేక మృతి చెందింది. కుటుంబ సభ్యులు శిశువు మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లడానికి ఇష్టం లేక ఆసుపత్రి సమీపంలోని హంద్రీలో పూడ్చిపెట్టారు. అక్కడి నుంచి బస్టాండ్‌కు చేరుకుకునేందుకు ఆటో ఎక్కారు. వీరి చేతికి మట్టి ఉండటంతో ఆటో డ్రైవర్ అడగడంతో జరిగిన విషయాన్ని చెప్పారు. మధ్యాహ్నం సమయంలో మృతదేహం పూడ్చిన చోట కుక్కలు తవ్వడంతో బయటపడింది. గమనించిన ప్రజలు గుమిగూడి పరిశీలిస్తుండగా అదే మార్గం మీదుగా వెళ్తున్న ఎస్పీ రవి కృష్ణ వెళూ సంఘటనపై ఆరా తీశారు. శిశువు హత్య చేసి పూడ్చిపెట్టినట్లు కొంతమంది ఫిర్యాదు చేయడంతో కర్నూలు డీఎస్పీ రమణమూర్తితో కలసి మృతదేహంతో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆరా తీశారు. ఆసుపత్రిలోనే శిశువు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ మూడవ పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ చేత సాయంత్రంలోగా పూర్తిస్థాయి విచారణ జరిపించారు. ఈ క్రమంలో శిశువు హత్య అంటూ వచ్చిన పుకార్లు విన్న ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు తన ఆటోలో ఉదయం ఎక్కిన వారి గురించి పోలీసులకు వివరించారు. అనారోగ్యం కారణాలతోనే ఆసుపత్రిలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు కూడా పోలీసుల విచారణలో తెలిపారు. ఆటోడ్రైవర్, పాటు కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. దీంతో కథ సుఖాంతమయ్యింది. -
అయ్యో పాపం..
బ్యాగులో శిశువు మృతదేహం గాంధీ ఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సమీపంలో బ్యాగులో మృత శిశువును వదిలివెళ్లారు. చిలకలగూడ పోలీసుల కథనం మేరకు.. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు శనివారం గాంధీ ఆస్పత్రి ఎదుటశుభ్రం చేస్తున్నారు. పక్కనే ఉన్న సంచిని గుర్తించి తెరిచి చూడగా చీరలో చుట్టి ఉన్న మగ మృత శిశువు కనిపించింది. వెంటనే అవుట్‌పోస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృత శిశువును గాంధీ మార్చురీకి తరలించారు. ఆ సంచిలో గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోని మెడికల్ షాపులో మందులు కొన్నట్లు రశీదు లభించింది. వారం రోజుల వయసుగల శిశువు మృతి చెందితే ఖననం చేసేందుకు తగిన ఆర్థిక స్థోమత లేక బస్టాప్‌లో వదిలి వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.