పసికందు మృతదేహం
పొందూరు : స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వెనుక బోరును ఆనుకుని ఉన్న కాలువలో నెలలు నిండని పసికందు మృతదేహం శుక్రవారం బయటపడింది. బోరునీటి కోసం ఉదయం 8 గంటలకు వెళ్లినప్పుడు ఏమీ కనిపించలేదని, 8.30 గంటల సమయంలో మాత్రం కాలువలో పసికందు మృతదేహం బయటపడిందని స్థానికులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల తర్వాతే ఎవరైనా వచ్చి పడేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.