అయ్యో పాపం.. | in carry bag a baby dead body | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం..

Published Sun, Jun 14 2015 1:04 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

అయ్యో పాపం.. - Sakshi

అయ్యో పాపం..

బ్యాగులో శిశువు మృతదేహం
గాంధీ ఆస్పత్రి :
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సమీపంలో బ్యాగులో మృత శిశువును వదిలివెళ్లారు. చిలకలగూడ పోలీసుల కథనం మేరకు.. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు శనివారం గాంధీ ఆస్పత్రి ఎదుటశుభ్రం చేస్తున్నారు. పక్కనే ఉన్న సంచిని గుర్తించి తెరిచి చూడగా చీరలో చుట్టి ఉన్న మగ మృత శిశువు కనిపించింది.

వెంటనే అవుట్‌పోస్ట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృత శిశువును గాంధీ మార్చురీకి తరలించారు. ఆ సంచిలో గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలోని మెడికల్ షాపులో మందులు కొన్నట్లు రశీదు లభించింది. వారం రోజుల వయసుగల శిశువు మృతి చెందితే ఖననం చేసేందుకు తగిన ఆర్థిక స్థోమత లేక బస్టాప్‌లో వదిలి వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement