బీసీలకు సబ్‌ప్లాన్ అమలు చేయాలి
అనంతపురం సప్తగిరిసర్కిల్ : బీసీలకు సబ్‌ప్లాన్‌ను అమలు చేయాలని బీసీ ఐక్య సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షుడు నారగోని డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లను 25 శాతం నుంచి 44 శాతానికి పెంచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బండి శివ, ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్, ప్రచార కార్యదర్శి మహేష్, జిల్లా నాయకులు రఘు, మల్లేష్, శీనా, శంకరయ్య, బాలకృష్ణ, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.