షహబుద్దీన్ ను మళ్లీ జైలుకు పంపాలని యోచన!
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్జేడీ నేత షహబుద్దీన్ తిరిగి జైలుకు పంపేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. సాక్ష్యులను ప్రభావితం చేసే అంశం మీద షహబుద్దీన్ పై క్రైమ్ కంట్రోల్ యాక్ట్(సీసీఏ)ను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. 2004 ఇద్దరు సోదరులను హత్య చేసిన కేసులో షహబుద్దీన్ 11 ఏళ్ల జైలు శిక్ష అనంతరం గత వారమే బెయిలుపై విడుదలైన విషయం తెలిసిందే.
షహబుద్దీన్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆర్జేడీ నేతలు తనపై చేసిన విమర్శలను నితీశ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ నేతలు చేసిన కామెంట్లు కూటమిలో అనారోగ్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయని జేడీ(యూ) మంత్రి బిజేంద్ర యాదవ్ అన్నారు. ఈ విషయంలో లాలూ జోక్యం అవసరమని, ఆర్జేడీ నేతలపై జేడీ(యూ) నేతలు ఎలాంటి విమర్శలు చేయలేదని చెప్పారు.